వార్తలు

Paris Paralympics 2024 Shooting:  పారిస్ పారాలింపిక్స్‌ భారత్‌కు రెండు పతకాలు, 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో స్వర్ణ పతకం సాధించిన అవనీ లేఖరా, కాంస్య పతకంతో మెరిసిన మోనా అగర్వాల్

Hazarath Reddy

పారిస్ పారాలింపిక్స్‌లో శుక్రవారం భారత్ పతకాల వేటను మొదలుపెట్టింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్ (SH1)లో మోనా అగర్వాల్ కాంస్య పతకం సాధించగా.., అవనీ లేఖరా తన బంగారు పతకాన్ని మళ్లీ కాపాడుకుంది. పారిస్ పారాలింపిక్స్ రెండో రోజు భారత్‌ రెండు పతకాలతో మెరిసింది.

Robert Vadra At Hyderabad: హైదరాబాద్‌లో రాబర్ట్ వాద్రా, ఘనస్వాగతం పలికిన కాంగ్రెస్ నేతలు, ప్రజా సమస్యలు పరిష్కరిస్తానని వెల్లడించిన వాద్రా

Arun Charagonda

కాంగ్రెస్ నేత రాబర్ట్ వాద్రా హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న వాద్రాకు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఘనస్వాగతం పలికారు. రెండు రోజుల పాటు హైదరాబాద్‌లో పర్యటించనున్నారు వాద్రా. ఈ సందర్భంగా తెలంగాణలోని వివిధ ప్రాంతాలను సందర్శించనున్నారు వాద్రా. ప్రజలకు జరుగుతున్న ఇబ్బందులు, సమస్యలు అడిగి తెలుసుకుంటానని చెప్పారు.

Avani Lekhara Wins Gold: పారిస్ పారాలింపిక్స్‌, 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో స్వర్ణ పతకం సాధించిన అవనీ లేఖరా, కాంస్య పతకంతో మెరిసిన మోనా అగర్వాల్

Hazarath Reddy

పారిస్ పారాలింపిక్స్‌లో శుక్రవారం భారత్ పతకాల సంఖ్య మొదలయింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్ (SH1)లో మోనా అగర్వాల్ కాంస్యంతో ముగియగా, అవనీ లేఖరా తన బంగారు పతకాన్ని కాపాడుకుంది. పారిస్ పారాలింపిక్స్ రెండో రోజు భారత్‌కు ప్రస్తుతం రెండు పతకాలు ఉన్నాయి.

V. Vijayasai Reddy: నేను జగన్ సైనికుడిని, పార్టీ మార్పు రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చిన విజయసాయి రెడ్డి, వైఎస్‌ఆర్సీపీలోనే ఉంటానని స్పష్టం చేసిన వైసీపీ రాజ్యసభ ఎంపీ

Hazarath Reddy

వైసీపీ రాజ్యసభ సభ్యుల పార్టీ మార్పు వ్యవహారం ఇప్పుడు ఏపీ దుమారం రేపుతోంది. ఇప్పటికే ఇద్దరు ఎంపీ రాజీనామాలు చేశారు.ఈ నేపథ్యంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తనకు తానే ఓ క్లారిటీ ఇచ్చారు. తాను కూడా పార్టీ మారుతున్నానంటూ కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ట్విట్టర్లో మండిపడ్డారు. తాను ఎక్కడికీ వెళ్లట్లేదంటూ క్లారిటీ ఇచ్చారు.

Advertisement

Telangana Rain Update: తెలంగాణకు వర్షాలే వర్షాలు, నాలుగు రోజుల పాటు కుండపోత వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక, రేపు భారీ వర్షం కురిసే అవకాశం

Arun Charagonda

రానున్న నాలుగు రోజులు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతున్న నేపథ్యంలో నాలుగు రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే రేపు అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారే ఛాన్స్ ఉందని దీని ఫలితంగా పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. పలు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.

Telangana: వీడియో ఇదిగో, సెల్ఫీ దిగుతూ కాలుజారి నాగార్జున సాగర్ ఎడమ కాలువ‌లో పడిన యువతి, తాళ్ల సాయంతో ఆమెను పైకి లాగి కాపాడిన స్థానికులు

Hazarath Reddy

నల్గొండ జిల్లాలో సెల్ఫీ మోజు ఓ యువతి ప్రాణాల‌మీద‌కు తెచ్చింది. సెల్ఫీ దిగే క్ర‌మంలో ప్ర‌మాద‌వ‌శాత్తు కాలుజారి నాగార్జున సాగర్ ఎడమ కాలువ‌లో ప‌డింది. న‌ల్గొండ జిల్లా వేముల‌ప‌ల్లి మండ‌ల కేంద్రంలోని నాగార్జున సాగ‌ర్ ఎడ‌మ కాలువ వ‌ద్ద శుక్ర‌వారం ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.

Allahabad High Court: భర్తను భార్య రూంలోకి రానివ్వకుండా వేరే రూంలో పడుకోమనడం క్రూరత్వమే, కేసులో భర్తకు విడాకులు మంజూరు చేసిన అలహాబాద్ హైకోర్టు

Hazarath Reddy

భర్తతో కాపురం చేయడానికి భార్య నిరాకరించి, అతడిని ప్రత్యేక గదిలో నివసించమని బలవంతం చేస్తే, ఆమె అతని వైవాహిక హక్కులను హరించివేస్తుందని, అదే క్రూరత్వానికి సమానమని అలహాబాద్ హైకోర్టు ఇటీవల పేర్కొంది.

Uttar Pradesh: వీడియో ఇదిగో, నూరేళ్ల ఆయుష్షు ఈ తాగుబోతుకు, నడిరోడ్డు మీద కుర్చీలో కూర్చుని ఉండగా వెనక నుంచి ఢీకొట్టిన లారీ, తృటిలో ప్రాణాలతో బయటపడ్డ మందుబాబు

Hazarath Reddy

ప్రతాప్‌గఢ్‌లోని చిల్‌బిలా కూడలిలో రద్దీగా ఉండే రహదారి మధ్యలో తాగిన వ్యక్తి కుర్చీపై కూర్చొని, ట్రక్కు ఢీకొనడంతో తృటిలో తప్పించుకున్నట్లు చూపించే షాకింగ్ వీడియో వైరల్‌గా మారింది. ట్రక్.. కుర్చీని ఢీకొన్న క్షణాన్ని క్లిప్ సంగ్రహిస్తుంది, అయితే తాగుబోతును ఢీకొట్టిన తరువాత ప్రమాదాన్ని పట్టించుకోకుండా లారీ వెళ్లిపోయింది

Advertisement

UK Horror: యూకేలో దారుణం, స్కూలు నుంచి ఇంటికి వెళుతున్న బాలికను 17 సార్లు కత్తితో పొడిచిన బాలుడు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

జనవరి 27, 2023న 15 ఏళ్ల పాఠశాల విద్యార్థిని హోలీ న్యూటన్‌ను కత్తితో పొడిచి చంపినందుకు 17 ఏళ్ల బాలుడిని న్యూకాజిల్ క్రౌన్ కోర్టు దోషిగా నిర్ధారించింది. ఈ సంఘటన UKలోని హెక్సామ్, నార్తంబర్‌ల్యాండ్‌లో జరిగింది. దాడి జరిగిన రోజున స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 5 గంటలకు ఆమె తన పాఠశాల అయిన క్వీన్ ఎలిజబెత్ హైస్కూల్‌ను విడిచిపెట్టిన తర్వాత నిందితుడు హోలీ న్యూటన్‌ను వెంబడించారు.

Meda Raghunadha Reddy on Party Change Rumors: రాజకీయాల్లో ఉన్నంత వరకు జగన్‌తోనే నా ప్రయాణం, పార్టీ మారడంపై క్లారిటీ ఇచ్చిన వైసీపీ ఎంపీ మేడా రఘునాథ్ రెడ్డి

Hazarath Reddy

ఏపీ రాజకీయాల్లో ఎన్నికల్లో ఓటమి చెందిన వైసీపీ నుంచి నేతలు ఒకరొకరుగా రాజినామా చేస్తున్నారు. వైసీపీకి రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథ్ రెడ్డి రాజీనామా చేయనున్నట్లు గత కొన్ని రోజులుగా ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీ మారడంపై క్లారిటీ ఇస్తూ.. తాను పార్టీ మారడం లేదని తేల్చి చెప్పారు. పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు.

Chandrababu On NBK 50 Years: బాలకృష్ణ కెరీర్‌ అన్‌స్టాపబుల్‌..చంద్రబాబు ప్రశంసలు, కథానాయకుడే కాదు ప్రజా నాయకుడు అంటూ కితాబు

Arun Charagonda

బాలయ్య 50 ఏళ్ల సినీ ప్రస్థానంపై ఎక్స్ వేదికగా స్పందించారు సీఎం చంద్రబాబు. ఆంధ్రుల అభిమాన కథానాయకుడు నందమూరి బాలకృష్ణ తన యాభై ఏళ్ళ నట ప్రస్థానాన్ని విజయవంతంగా పూర్తిచేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు.

R. Krishnaiah on Party Change Rumors: చివరి వరకు వైసీపీలోనే ఉండి బీసీల కోసం కొట్లాడతా, పార్టీ మార్పు రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చిన వైసీపీ ఎంపీ ఆర్ కృష్ణయ్య

Hazarath Reddy

వైసీపీకి, ఆ పార్టీ రాజ్యసభ సభ్యత్వాలకు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు రాజీనామా చేసిన సంగతి విదితమే. ఇక తెలంగాణకు చెందిన బీసీ సంఘం నేత ఆర్. కృష్ణయ్య కూడా వైసీపీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సంగతి తెలిసిందే. ఆయన కూడా వైసీపీకి గుడ్ బై చెపుతారనే ప్రచారం జరుగుతోంది.

Advertisement

Andhra Pradesh Shocker: పాలకొల్లులో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం, ప్రియుడు మృతి, ప్రియురాలికి తీవ్ర గాయాలు

Arun Charagonda

పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు రైల్వే స్టేషన్ సమీపంలో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటనలో ప్రియుడు రాజేష్ మృతి చెందగా ప్రియురాలు సత్య శ్రావణికి తీవ్రగాయాలు అయ్యాయి. వెంటనే శ్రావణిని ఆస్పత్రికి తరలించి చికిత్ర అందిస్తున్నారు.

CM Revanth Reddy responds On Supreme Court Comments: న్యాయ వ్యవస్థపై అపారమైన నమ్మకం ఉంది, తన వ్యాఖ్యలు వక్రీకరించారన్న సీఎం రేవంత్‌ రెడ్డి, పత్రికల్లో వచ్చిన వార్తలపై విచారం వ్యక్తం చేస్తున్నట్లు వెల్లడి

Arun Charagonda

దేశ సర్వోన్నత న్యాయస్థానం..తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎక్స్ వేదికగా స్పందించిన రేవంత్.. పత్రికల్లో వచ్చిన వార్తలపై బేషరతుగా విచారం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు.

YSRCP MLCs Resign: వైసీపీకి మరో షాక్, పార్టీకి - ఎమ్మెల్సీకి రాజీనామా చేసిన పద్మ శ్రీ, కళ్యాణ చక్రవర్తి, వీరిబాటలోనే మరికొంతమంది ఎమ్మెల్సీలు!

Arun Charagonda

వైసీపీకి మరో షాక్ తగిలింది. ప్రజాప్రతినిధులు వరుస రాజీనామాలతో ఆ పార్టీ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. తాజాగా పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవులకు కర్రి పద్మశ్రీ, బల్లి కళ్యాణ చక్రవర్తి రాజీనామా చేశారు. కాసేపట్లో మండలి చైర్మన్ కు రాజీనామా లేఖలు అందజేయనున్నారు కర్రి పద్మశ్రీ, బల్లి కళ్యాణ చక్రవర్తి.

Andhra Pradesh: సీఎం చంద్రబాబు మరో సంచలనం, ఏపీలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు YSR పేరు తొలగింపు

Arun Charagonda

ఏపీ సీఎం చంద్రబాబు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు వైఎస్‌ఆర్ పేరును తొలగిస్తు నిర్ణయం తీసుకున్నారు. గత వైఎస్ జగన్ ప్రభుత్వం 2023-24లో ప్రారంభించిన ఐదు, 2024-25లో ప్రారంభించాలని నిర్ణయించిన మరో 5 కాలేజీలకు పెట్టిన YSR పేరును తొలగిస్తూ వైద్య ఆరోగ్యశాఖ ఉత్తర్వులు ఇచ్చింది.

Advertisement

Hidden Cameras In Girls Hostel Washroom: గుడివాడలో దారుణం, గర్ల్స్ హాస్టల్ వాష్‌ రూమ్‌లలో సీక్రెట్ కెమెరాలు, 100 వీడియోలను అమ్మిన దుర్మార్గులు!,లాంటి కెమెరాలు లేవని పోలీసుల వెల్లడి

Arun Charagonda

గుడివాడలో దారుణం చోటు చేసుకుంది. గర్ల్స్ హాస్టల్ వాష్ రూంలలో సీక్రెట్ కెమెరాలు పెట్టి 300 పైగా వీడియోలు రికార్డ్ చేసిన సంఘటన గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో చోటు చేసుకుంది. సీక్రెట్ కెమెరాల ద్వారా వీడియోలను చిత్రీకరించి అమ్ముతున్నాడంటూ బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థిపై దాడికి యత్నించారు సహచర విద్యార్థులు.

Telangana Shocker: సిద్దిపేటలో ఓ వ్యక్తి ఆత్మహత్యయత్నం, కత్తితో గొంతులో పొడుచుకున్న 60 సంవత్సరాల వ్యక్తి, ఆస్పత్రికి తరలింపు

Arun Charagonda

సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కొడకండ్ల శివారులో కత్తితో గొంతులో పొడుచుకొని ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశారు. భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం మాదాపూరానికి చెందిన ఎరుకల రాజయ్య గౌడ్ (60) గా గుర్తించారు పోలీసులు. చికిత్స నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు కుకునూరుపల్లి పోలీసులు.

Delhi: వివాదంలో ఇన్‌స్టాగ్రామ్ ఫేమ్ రజత్ దలాల్, రాష్ డ్రైవింగ్ చేస్తే బైక్‌ను ఢీకొట్టిన రజత్ కారు, రోజు తనకు ఇదే పని అంటూ నిర్లక్ష్య సమాధానం ..నెటిజన్ల మండిపాటు

Arun Charagonda

ఇన్‌స్టాగ్రామ్ ఫేమ్ రజత్ దలాల్ వివాదంలో చిక్కుకున్నారు. ఢిల్లీలోని ఫరీదాబాద్ - బదర్‌పూర్ రోడ్డుపై 143 కిలోమీటర్ల వేగంతో రాష్ డ్రైవింగ్ చేసి బైక్‌ను ఢీకొట్టారు రజత్. బైక్‌ను ఢీకొట్టగానే ఏం పర్లేదు రోజూ నాకు ఇదే పని అంటూ నిర్లక్ష్యంగా మాట్లాడి వివాదంలో చిక్కుకున్నారు.

Pilli Subhash Chandra Bose On Party Change: వైసీపీని వీడను, జగన్‌కు వెన్నుపోటు పొడవను క్లారిటీ ఇచ్చిన ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్, వైసీపీలోనే ఉంటానని స్పష్టం

Arun Charagonda

వైసీపీకి ,ఎంపీ పదవులకు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ త్వరలో టీడీపీలో చేరనుండగా తాజాగా మరో ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ సైతం రాజీనామా చేస్తారని వార్తలు వెలువడుతున్నాయి.

Advertisement
Advertisement