News

HC on Suicide Abetment: పెళ్లయిన ఏడేళ్లలోపు భార్య ఆత్మహత్య, భర్తపై క్రూరత్వానికి సంబంధించిన అపోహను ప్రేరేపించదంటూ జమ్మూ కాశ్మీర్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

Hazarath Reddy

కేవలం ఒక మహిళ తన పెళ్లయిన ఏడేళ్లలోపు ఆత్మహత్యకు పాల్పడిందనే వాస్తవం సాక్ష్యాధారాల చట్టంలోని సెక్షన్ 113-A ప్రకారం స్వయంచాలకంగా ఊహించబడదని పేర్కొంది. 1872 నాటి భారతీయ సాక్ష్యాధారాల చట్టంలోని సెక్షన్ 113A, వివాహిత అయిన స్త్రీ యొక్క భర్త లేదా బంధువు ఆత్మహత్యకు ప్రేరేపించే ఊహతో వ్యవహరిస్తుందని గమనించాలని తెలిపింది

Dog Attack in Srikakulam: శ్రీకాకుళంలో పిచ్చి కుక్క దాడి, 24 మందికి తీవ్ర గాయాలు...వీడియో ఇదిగో

Arun Charagonda

శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస నియోజకవర్గం పొందూరులో దారుణం చోటు చేసుకుంది. 24 మందిపై పిచ్చికుక్క దాడి చేసి గాయపర్చగా కొందరికి తీవ్ర గాయాలు.. మరికొందరికి స్వల్ప గాయాలు అయ్యాయి.

MLA Gali Banu Prakash: రోజా జైలుకు వెళ్లడం ఖాయం, ఆడుదాం ఆంధ్రా పేరుతో కోట్ల రూపాయలు తినేసిందని ఎమ్మెల్యే భాను ప్రకాష్ సంచలన కామెంట్

Arun Charagonda

మాజీ మంత్రి రోజా జైలుకెళ్లడం ఖాయం అన్నారు ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్. మంత్రిగా ఆమె చేసిన అవినీతి ఒక్కొకటిగా బయటకు వస్తోందని..ఆధారాలతో త్వరలో రోజా జైలుకు వెళ్ళబోతున్నారు అన్నారు. ఎన్డీయే పాలనలో రోజాకు చిప్పకూడు ఖాయం..ఆడుదాం ఆంధ్ర అంటూ కోట్ల రూపాయలు తినేశారన్నారు.

AP CM Chandrababu: సీఎం చంద్రబాబుకు తృటిలో తప్పిన ప్రమాదం, చంద్రబాబుకు సమీపంలో వచ్చిన రైలు, వెంట్రుక వాసిలో తప్పిన ప్రమాదం

Arun Charagonda

ఏపీ వరద సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు సీఎం చంద్రబాబు. ఇందులో భాగంగా ఇ వాళ నిడమానూరు ప్రాంతంలో బుడమేరుకు పడిన గండిన పరిశీలించేందుకు వెళ్లారు. బుడమేరు ప్రవాహాన్ని పరిశీలించేందుకు రైలు వంతెనపైకి కాలి నడకన వెళ్లారు. భద్రతా సిబ్బంది వారించినా వినలేదు.

Advertisement

Hyderabad Shocker: జగద్గిరిగుట్టలో మహిళా దొంగల ముఠా అరెస్ట్, నలుగురు మహిళలను అరెస్ట్ చేసిన పోలీసులు, కస్టమర్లలాగ వచ్చి దోపిడి

Arun Charagonda

హైదరాబాద్ జగద్గిరిగుట్టలో మహిళా దొంగల ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు. బంగారు దుకాణాల్లో యజమాని,షాప్ సిబ్బంది దృష్టి మళ్లించి చోరీలకు పాల్పడుతున్నారు మహిళలు. కార్లలో వచ్చి కస్టమర్ల లాగా నటిస్తూ దోపిడీ చేస్తున్న ఆరుగురు మహిళలను అరెస్ట్ చేశారు. జోడిమెట్ల, చైతన్యపూరి ,జగద్గిరిగుట్టలో ఈ ముఠా చోరీలకు పాల్పడినట్లు గుర్తించారు పోలీసులు.

MLA Koneti Adimulam: చెల్లి చెల్లి అంటూనే మూడు సార్లు ఎమ్మెల్యే అత్యాచారం, ఏకాంత వీడియోలతో మూగబోయిన వైనం, ఎమ్మెల్యే ఇంటిదగ్గర నిశ్శబ్ద వాతావరణం!

Arun Charagonda

ఆయనో ప్రజా ప్రతినిధి. సమాజంలో అందరికి ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తి. కానీ బుద్ది వక్రీకరించింది. ఫలితం సమాజంలో అందరిలో దోషిగా నిలబడాల్సిన పరిస్థితి నెలకొంది. అవును తిరుపతి జిల్లా సత్యవేడు కోనేటి ఆదిమూలం వ్యవహార తీరు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది.

Telangana: ఆదివాసి యువతిపై అత్యాచారయత్నం, గాయపడ్డ బాధితురాలిని పరామర్శించిన మంత్రి సీతక్క, వీడియో ఇదిగో..

Hazarath Reddy

ప్రస్తుతం బాధితురాలికి హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మంత్రి సీతక్క బాధితురాలి వద్దకు వెళ్లి పరామర్శించారు. నిందితులు ఎవరైనా సరే ఉపేక్షించేది లేదని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు.

Andhra Pradesh Rains: వీడియో ఇదిగో, అల్లూరి జిల్లాలో ఉగ్రరూపం దాల్చిన సోకిలేరు వాగు, 40 గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు

Hazarath Reddy

అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చింతూరు మండలంలో సోకిలేరు వాగు పొంగిపొర్లుతోంది. దీంతో సుమారు 40 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గోదావరి, శబరి నదులకు భారీగా వరద నీరు రావడంతో సోకిలేరు ప్రమాదకరంగా ప్రవహిస్తోంది.

Advertisement

Andhra Pradesh: వీడియో ఇదిగో, టోల్ ప్లాజా ఫీజు కట్టలేదని స్థానికులను చితకబాదిన టోల్ ప్లాజా సిబ్బంది

Hazarath Reddy

సత్యసాయి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని రోళ్ళ మండలం టోల్ ప్లాజా వద్ద టోల్ ప్లాజా ఫీజు కట్టలేదని స్థానికులను టోల్ ప్లాజా సిబ్బంది చితకబాదారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. వీడియోలో టోల్ ప్లాజా సిబ్బంది ఇద్దరు ముగ్గురిపై దాడి చేయడం చూడవచ్చు. ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Sexual Harassment Caught on Camera: వృధ్దుడు కాదు కామాంధుడు, చిన్నారి ప్రైవేట్ పార్టును నొక్కుతూ లైంగిక వేధింపులు, నిందితుడిని అరెస్ట్ చేసిన యూపీ పోలీసులు

Hazarath Reddy

ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్‌లో ఆందోళన కలిగించే సంఘటనలో, మైనర్ గిరిజన బాలికపై వేధింపులకు పాల్పడినందుకు 70 ఏళ్ల మహ్మద్ అన్వర్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. సెప్టెంబరు 3న బాలిక ఇంటికి సంబంధించిన వస్తువులను కొనుగోలు చేసేందుకు అన్వర్ దుకాణానికి వచ్చినప్పుడు ఈ సంఘటన జరిగింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది

Vijayawada Floods: హ్యాట్సాఫ్‌..వరదల్లో నలుగురిని కాపాడి చనిపోయిన వ్యక్తి, భార్య 8 నెలల గర్భవతి, విజయవాడ వరదల్లో పెను విషాదం

Arun Charagonda

విజయవాడ వరదల్లో పెను విషాదం చోటు చేసుకుంది. నలుగురిని కాపాడి.. వరదల్లో కొట్టుకుపోయి చనిపోయాడు ఓ వ్యక్తి. విజయవాడకు చెందిన చంద్రశేఖర్(32) సింగ్ నగర్‌లో డెయిరీఫాంలో పనిచేస్తుండగా వరద పోటెత్తింది. తనతో పనిచేస్తున్న తన ఇద్దరు సోదరులు, మరో ఇద్దరిని కాపాడి షెడ్డు పైకప్పు మీదకు ఎక్కించి, తాళ్లతో కట్టేసిన ఆవులనూ వదిలేశాడు.

Uttar Pradesh Horror: యూపీలో దారుణం, అంబులెన్స్‌లో మహిళపై సిబ్బంది లైంగికదాడి, పక్కన భర్త కొనఊపిరితో ఉన్నా పట్టించుకోకుండా వేధింపులు

Hazarath Reddy

యూపీలో ఘాజీపూర్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. అత్యవసర సమయంలో ప్రాణాలు కాపాడే అంబులెన్స్ సిబ్బందే ఓ మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. వెనుక సీట్లో భర్ ప్రాణాపాయ స్థితిలో ఉంటే ముందుసీట్లో ఆ రోగి భార్యను (Woman Molested In Ambulance) సిబ్బంది వేధించారు

Advertisement

Gold Hits Two-Week Low: గుడ్ న్యూస్, రెండు వారాల కనిష్ఠానికి పడిపోయిన బంగారం ధరలు, ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల ధరపై రూ. 170 తగ్గుదల

Hazarath Reddy

ఈ నెలలో US ఫెడరల్ రిజర్వ్ పాలసీ సమావేశానికి చిన్న రేట్ల-కట్ బెట్‌లలో మార్కెట్‌లు ధరలను తగ్గించడంతో బంగారం ధరలు బుధవారం దాదాపు రెండు వారాల్లో కనిష్ట స్థాయికి పడిపోయాయి, ఇది నాలుగో వరుస సెషన్‌కు క్షీణించింది. ఫలితంగా పుత్తడి ధరలు రెండు వారాల కనిష్ఠానికి పడిపోయాయి.

Budameru River Flood: బుడమేరుకు మళ్లీ పెరుగుతున్న వరద, నీట మునిగిన పలు కాలనీలు, ఇళ్లు ఖాళీ చేసి వెళుతున్న ప్రజలు

Hazarath Reddy

విజయవాడను ముంచెత్తిన వరదలు కాస్త తగ్గుముఖం పడుతుండగానే గురువారం మరోసారి భారీ వర్షం కురిసింది. దీంతో బుడమేరుకు వరద తాకిడి పెరుగుతోంది. విజయవాడ వీధుల్లోకి మరోసారి నీళ్లు చేరుతున్నాయి.

TDP Suspends MLA Koneti Adimulam: రాసలీలల ఎఫెక్ట్, టీడీపీ నుండి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సస్పెండ్, ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు!

Arun Charagonda

రాసలీలల ఎఫెక్ట్ పార్టీ నుండి సస్పెండ్ అయ్యారు సత్యవేడు ఎమ్మెల్యే, టీడీపీ నేత కోనేటి ఆదిమూలం. ఈ మేరకు ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. లైంగిక ఆరోపణలను తీవ్రంగా పరిగణిస్తూ సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు తెలిపారు.

Hyderabad: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో గోవా లిక్కర్ స్వాధీనం, 12 లక్షల విలువ చేసే 415 బాటిళ్లు సీజ్

Arun Charagonda

గోవా నుంచి విమానం ద్వారా హైదరాబాద్ కు తరలిస్తున్న నాన్ డ్యూటీ మద్యంను స్వాధీనం చేసుకున్నారు శంషాబాద్ ఎయిర్‌పోర్టు కస్టమ్స్ అధికారులు. 12 లక్షల విలువ చేసే 415 మద్యం బాటిల్ ను స్వాధీనం చేసుకున్నారు అధికారులు.నాన్ డ్యూటీ మద్యాన్ని తరిలిస్తున్న12 మందిపై కేసు నమోదు చేశారు.

Advertisement

Communal Tensions Erupt in Asifabad: ఆదివాసీ యువతిపై అత్యాచారయత్నం, ఆసిఫాబాద్ జిల్లాలో బంద్‌కు పిలుపునిచ్చిన ఆదివాసీలు, 144వ సెక్షన్ విధింపు

Hazarath Reddy

కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని జైనూర్ మండలంలో ఆదివాసీ యువతిపై షేక్ మగ్ధూం అనే ఆటో డ్రైవర్ లైంగిక దాడికి యత్నించిన ఘటనపై స్థానికంగా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఆదివాసీ యువతిపై జరిగిన అఘాయిత్యాన్ని నిరసిస్తూ జైనూర్ పట్టణంలో ఈరోజు ఆదివాసీలు బంద్‌కు పిలుపునిచ్చారు.

HC on Poker and Rummy: పేకాట, రమ్మీ జూదం కాదు, నైపుణ్యానికి సంబంధించిన ఆటలు, అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు ఇదిగో..

Hazarath Reddy

పేకాట మరియు రమ్మీ నిర్వహణకు కంపెనీకి అనుమతిని నిరాకరిస్తూ ఆగ్రా సిటీ కమిషనరేట్ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ DM గేమింగ్ ప్రైవేట్ లిమిటెడ్ దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం జస్టిస్ శేఖర్ బి సరాఫ్ మరియు జస్టిస్ మంజీవ్ శుక్లాలతో కూడిన డివిజన్ బెంచ్ ఈ తీర్పును వెలువరించింది.

Andhra pradesh: ఫార్చునర్ కారులో వచ్చి చోరి, బంగారం షాపులో 38 కిలోల వెండి ఆబరణలు అపహరణ, దొంగల్లో ఒకరిని పట్టుకున్న స్థానికులు..వీడియో

Arun Charagonda

ఖరీదైన కారులో వచ్చి చోరీ చేసి దొరికిపోయిన సంఘటన గుంటూరు జిల్లా పొన్నూరులో చోటు చేసుకుంది. ఫార్చునర్ కారులో వచ్చి బంగారం షాపులో 38 కిలోల వెండి ఆభరణాలు చోరీ చేశారు. పారిపోతున్న దొంగల్లో ఒకడిని పట్టుకున్న స్థానికులు చితకబాది పోలీసులకు అప్పగించారు. నిందితులది రాజస్థాన్‌గా భావిస్తున్నారు పోలీసులు.

TDP MLA Koneti Adimulam Episode: టీడీపీ ఆఫీస్ ముందే ఆత్మహత్య చేసుకుంటా..ఎమ్మెల్యే లైంగిక వేధింపులపై బాధితురాలు, పలు న్యూడ్ వీడియోలు రిలీజ్

Arun Charagonda

సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం వివాదంలో చిక్కుకున్నారు. ఓ మహిళతో ఉన్న న్యూడ్ వీడియో వైరల్‌గా మారగా హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో బాధితురాలు పలు న్యూడ్ వీడియోలను రిలీజ్ చేసింది. ఈ అంశాన్ని గతంలో సీఎం చంద్రబాబు, నారా లోకేశ్ దృష్టికి తీసుకెళ్లానని వెల్లడించింది.

Advertisement
Advertisement