వార్తలు
Telangana Rains: తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్, వచ్చే 5 రోజుల పాటు అతిభారీ వర్షాలు కురిసే అవకాశం, ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం..
Hazarath Reddyతెలంగాణలో రానున్న ఐదురోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ క్రమంలో పలు జిల్లాలకు ఆరెంజ్, మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.
Rahul Gandhi On Bharat Dojo Yatra : త్వరలో రాహుల్ గాంధీ భారత్ 'డోజో' యాత్ర..క్రీడా దినోత్సవం సందర్భంగా రాహుల్ కీలక ప్రకటన, స్పెషల్ వీడియో రిలీజ్
Arun Charagondaక్రీడా దినోత్సవం సందర్భంగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కీలక ప్రకట చేశారు. త్వరలో భారత్ డోజో యాత్ర చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఇవాళ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక వీడియోను షేర్ చేస్తూ కీలక ప్రకటన చేశారు. గతంలో ‘భారత్ జోడో యాత్ర’ సమయంలో తమ శిబిరాల వద్ద జరిగిన ప్రాక్టీస్ సెషన్‌కు సంబంధించిన వీడియోను ఎక్స్ వేదికగా పంచుకున్నారు.
Reliance AGM 2024: జియో యూజర్లకు 100 జీబీ ఉచిత స్టోరేజీ, కీలక ప్రకటన చేసిన ముఖేష్ అంబానీ, తక్కువ ధరకే ఏఐ మోడల్ సర్వీసులు అందిస్తామని వెల్లడి
Hazarath Reddyరిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సంస్థ చైర్మెన్ ముకేశ్ అంబానీ(Mukesh Ambani ) రిలయన్స్ 47వ వార్షిక సాధారణ సమావేశంలో కీలక ప్రకటన చేశారు. జియో ఏఐ-క్లౌడ్ వెల్కమ్ ఆఫర్‌ను ఆయన వెల్లడించారు. ఈ ఆఫర్ ద్వారా జియో యూజర్లకు 100 జీబీ ఫ్రీ క్లౌడ్ స్టోరేజ్ ఇవ్వనున్నారు.
Telugu Language Day 2024: తెలుగు భాష చాలా గొప్పదంటూ ప్రధాని మోదీ తెలుగులో ట్వీట్, తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన పీఎం
Hazarath Reddyతెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన తెలుగులో స్పెషల్ ట్వీట్ చేశారు. "తెలుగు నిజంగా చాలా గొప్ప భాష
CM Revanth Reddy Brother On Hydra Notices: అక్రమమైతే కూల్చేయండి..సీఎం రేవంత్ సోదరుడు తిరుపతిరెడ్డి క్లారిటీ, బీఆర్ఎస్ వాళ్లు రాజకీయాలు చేస్తున్నారని మండిపాటు
Arun Charagondaతన ఇల్లు అక్రమ నిర్మాణమైతే కూల్చేయాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి. నాకు సమయం ఇస్తే ఇంట్లో ఉన్న సామాన్లు తీసుకుని బయటకి వెళ్తానన్నారు. శేర్లింగంపల్లి రెవెన్యూ అధికారులు నాకు నోటీసులు ఇచ్చారని..ఇప్పటివరకు నన్ను ఏ అధికారి కలువలేదు అన్నారు. తాను ఇల్లు కొనే సమయంలో అది ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉందో లేదో తెలియదన్నారు.
Hurun India Rich List 2024: అత్యంత ధనవంతుల జాబితా, బెంగుళూరును వెనక్కినెట్టిన హైదరాబాద్, నగరంలో అత్యంత ధనవంతుడిగా దివీస్ లాబొరేటరీస్ అధినేత మురళీ దివి
Hazarath Reddy2024 హురున్ ఇండియా రిచ్ లిస్ట్ ప్రకారం, భారతదేశంలో అత్యధిక సంఖ్యలో బిలియనీర్లు ఉన్న నగరంగా హైదరాబాద్ మూడో స్థానంలో నిలిచింది. 104 మంది వ్యక్తులు ఈ జాబితాలో ఉన్నారు. జాబితాలో ముంబై ఆధిపత్యం కొనసాగుతోంది, ఈ సంవత్సరం కొత్తగా 66 మందిని ధనవంతుల లిస్టులో చేర్చారు,
Telangana: లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికిపోయిన ప్రభుత్వ అధికారి, అరెస్టు చేసి నాంపల్లి కోర్టులో హజరుపరిచిన అధికారులు
Hazarath Reddyమేడ్చల్ జిల్లా కలెక్టరేట్‌లో అవినీతి తిమింగిలం పట్టుబడింది. కో-ఆపరేట్ డిపార్ట్మెంట్‌లో లంచం తీసుకుంటుండగా డిప్యూటీ రిజిస్ట్రార్ కార్యాలయంలో అసిస్టెంట్ రిజిస్ట్రార్, ఆర్బిట్రేటర్ బొమ్మల శ్రీనివాసరాజుని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
SC on CM Revanth Reddy's Remarks: సీఎం హోదాలో ఉన్న వ్యక్తి ఇలాగే మాట్లాడుతారా ? రేవంత్ రెడ్డిపై మండిపడిన సుప్రీంకోర్టు
Hazarath Reddyతెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై జస్టిస్ బీఆర్ గవాయి నేతృత్వంలోని సుప్రీం బెంచ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గురువారం ఓటుకు నోటు కేసు విచారణ సందర్భంగా.. కవిత బెయిల్ తీర్పుపై రేవంత్ చేసిన వ్యాఖ్యలను ధర్మాసనం ప్రస్తావించింది.
Harishrao: సీఎం రేవంత్ రెడ్డి గజదొంగ, దమ్ముంటే హైడ్రా ఆఫీస్ కూల్చండి హరీశ్ సవాల్, రుణమాఫీపై తప్పుదారి పట్టించేందుకేనని కామెంట్
Arun Charagondaరుణమాఫీపై ప్రజలను సీఎం రేవంత్ రెడ్డి తప్పుదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి హరీశ్ రావు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 10 ఏళ్లు కష్టపడి నిర్మించిన హైదరాబాద్ బ్రాండ్ ని కూల్చేశారు అని దుయ్యబట్టారు హరీశ్. బుద్ధా భవనములోనే హైడ్రా ఆఫీస్ ఉంది, దమ్ముంటే దానిని కూల్చండని సవాల్ విసిరారు. జీహెచ్ ఎంసి బిల్డింగ్ కూడా నాలాపైనే ఉందని దానిని కూలగొట్టాలన్నారు. జలవిహార్, నెక్లెస్ రోడ్, నెక్లెస్ రోడ్ లో ఉన్న బోట్స్ క్లబ్ అన్నింటిని కూలగొట్టాలన్నారు హరీశ్.
Vadodara Rains: షాకింగ్ వీడియోలు ఇవిగో, భారీ వరదలకు ఇళ్లల్లోకి వచ్చిన భారీ మొసళ్లు, భయంతో పరుగులు పెడుతున్న ప్రజలు, గుజరాత్‌లో వరదలు బీభత్సం
Hazarath Reddyగుజరాత్‌లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. గడిచిన మూడు రోజుల్లోనే 28 మంది వరదలతో మృతిచెందారు. వరసగా నాలుగోరోజైన బుధవారం వర్షాల తీవ్రత తగ్గలేదు. దేవ్‌భూమి ద్వారకా జిల్లాలోని ఖంభాలియాలో 24 గంటల్లో 454 మి.మీ, జామ్‌నగర్‌లో 387 మి.మీ, అత్యధిక తాలూకాల్లో 200 మి.మీ.పైగా వర్షం కురిసింది.
AP DY CM Pawan Kalyan: పిఠాపురం మహిళలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గిఫ్ట్, ఆగస్టు 30న సామూహిక వరలక్ష్మీ వ్రత పూజ, 12 వేల చీరలు పంపిణీ చేయనున్న జనసేనాని
Arun Charagondaఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనదైన శైలీలో దూసుకుపోతున్నారు. ఓ వైపు పాలనలో తన మార్క్ చూపిస్తున్న పవన్...తాజాగా తనను గెలిపించిన పిఠాపురం నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా పిఠాపురం మహిళలకు శ్రావణమాసం గిఫ్ట్‌ను అందించనున్నారు. ఈ నెల 30న పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఉచిత వరలక్ష్మి వ్రత పూజా కార్యక్రమం, వరలక్ష్మీ వ్రతం చేసుకునే ఆడపడుచులకు 12 వేల చీరలు పంపిణి చేయనున్నారు.
Uttar Pradesh: యూపీలో దారుణం, పెళ్లి వేడుకలో యువతిపై బంధువులు సామూహిక అత్యాచారం, నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
Hazarath Reddyహర్యానాలోని యమునానగర్‌లో ప్రారంభమైన వివాహ ఊరేగింపులో భాగమైన నిందితులు, ఊరేగింపు సమయంలో వారు నేరం చేసినప్పుడు మహిళ ఇంట్లో ఒంటరిగా అత్యాచారానికి గురై ప్రాణాలతో బయటపడినట్లు గుర్తించారు. మహిళపై అత్యాచారం చేసిన తర్వాత, నిందితుడు పట్టుబడకుండా తప్పించుకోవడానికి హర్యానాకు పారిపోయినట్లు సమాచారం.
Rape Case Against MLA Mukesh: ఆ ఎమ్మెల్యే రూంకి పిలిచి నన్ను రేప్ చేశాడు, పోలీసులకు ఫిర్యాదు చేసిన ప్రముఖ నటి, నటుడు ముకేశ్‌పై అత్యాచారం కేసు నమోదు చేసిన పోలీసులు
Hazarath Reddyప్రముఖ నటుడు, కేరళలోని అధికార పార్టీ సీపీఐ(ఎం) ఎమ్మెల్యే ఎమ్ ముకేశ్‌పై పోలీసులు అత్యాచారం కేసు నమోదు చేశారు. కొన్నేళ్ల క్రితం తనను ముకేశ్ లైంగిక వేధించాడంటూ ఓ నటి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
Mamata Banerjee: డాక్టర్లను బెదిరించలేదు..బెంగాల్‌లో అరాచకం సృష్టిస్తోన్న బీజేపీ అని మండిపడ్డ సీఎం మమతా బెనర్జీ,డాక్టర్ల పోరాటం న్యాయమైనదే అని కామెంట్
Arun Charagondaతనపై జరుగుతున్న విషప్రచారాన్ని ఖండించారు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడానని, ఆ పార్టీ నేతలు కేంద్ర ప్రభుత్వ సాయంతో విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నిరసన చేపడుతున్న డాక్టర్లను బెదిరించినట్లు బీజేపీ ఆరోపణలు చేసిన ఆరోపణల్లో నిజం లేదన్నారు మెడికో విద్యార్థులు కానీ, వాళ్ల ఉద్యమం గురించి తానేమీ మాట్లాడలేదన్నారు.
Kakani Govardhan Reddy on MPs Resignation: పార్టీ మారిన వారు కాలగర్భంలో కలిసిపోవాల్సిందే, ఎవరు వెళ్లినా జగన్‌కు నష్టమేమి లేదని తెలిపిన కాకాణి
Hazarath Reddyవైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజ్యసభ ఎంపీ మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు రాజీనామా చేసిన సంగతి విదితమే. రాజ్యసభ సభ్యులు పార్టీ మార్పుపై స్పందించిన మాజీమంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రజల దృష్టి మరల్చేందుకే రాజ్యసభ సభ్యులను పార్టీలోకి చేర్చుకోవాలని చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.
Telangana: వీడియో ఇదిగో, పెళ్లిలో మటన్ కోసం తలలు పగలగొట్టుకున్నారు, పెళ్లికొడుకు తరపు వారికి మటన్ తక్కువ వేశారని కర్రలు, రాళ్లతో దాడి
Hazarath Reddyనిజామాబాద్ జిల్లా నవీపేట్లో జరిగిన ఓ వివాహ వేడుకలో పెళ్లికొడుకు తరపు వారికి మటన్ తక్కువ వేశారని కర్రలు, రాళ్లతో దాడి చేసుకున్నారు. దీంతో ఫంక్షన్ హాల్ రణరంగాన్ని తలపించింది. రాళ్లతో, కర్రలతో దాడి చేసుకోవడంతో చాలామందికి తలలు పగిలి గాయాలయ్యాయి. ఈ ఘటనలో పలువురు గాయపడగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
CM Revanth Reddy On Hydra: హైడ్రా పేరుతో బెదిరింపులు, సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్, హైడ్రా పేరుతో అవినీతి చేస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరిక
Arun Charagondaహైదరాబాద్ లో హైడ్రా పేరు చెప్పి భయపెట్టి,బెదిరించి అవినీతికి పాల్పడితే సహించేది లేదని తేల్చిచెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. కొందరు కిందిస్థాయి అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని వచ్చిన ఫిర్యాదులపై స్పందించారు రేవంత్.
Andhra Pradesh Politics: వైసీపీకి, రాజ్యసభ పదవులకు రాజీనామా చేసిన మోపిదేవి వెంకట రమణ, బీద మస్తాన్ రావు, టీడీపీలో చేరునున్న మోపిదేవి
Hazarath Reddyరాజ్యసభ పదవికి, వైసీపీకి మోపిదేవి వెంకట రమణ, బీద మస్తాన్ రావులు రాజీనామా చేశారు. పార్లమెంట్‌లో రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్‌కు రాజీనామా పత్రాలను ఇరువురూ అందజేశారు. స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా పత్రాలను అందజేశారు. అనంతరం వైసీపీకి సైతం రాజీనామా చేశారు.
Gautam Adani Richest Indian: హిండెన్ బర్గ్ వివాదం వెంటాడినా తగ్గేదేలే, దేశంలోనే అత్యంత ధనవంతుడిగా అవతరించిన గౌతమ్ అదానీ, రెండో స్థానానికి పడిపోయిన ముకేష్ అంబానీ,
Hazarath Reddyబిలియనీర్ గౌతమ్ అదానీ దేశంలోనే అత్యంత ధనవంతుడిగా అవతరించారు. హిండెన్ బర్గ్ రిపోర్ట్ వివాదం వెంటాడినా తగ్గేదేలే అని నిరూపించారు అదానీ. తాజాగా వెలువడిన 2024 హురున్ ఇండియా ధనవంతుల జాబితాలో రూ. 11.6 లక్షల కోట్ల సంపదతో ముఖేశ్ అంబానీని వెనక్కి నెట్టి అగ్రస్థానంలో నిలిచారు
SC On Note For Vote Case: ఓటుకు నోటు కేసు..బీఆర్ఎస్ మాజీ మంత్రికి షాక్, కేసును భోపాల్‌కు బదిలీ చేయాలన్న జగదీశ్ రెడ్డి పిటిషన్‌ను తోసిపుచ్చిన ధర్మాసనం, అలా చేస్తే న్యాయవ్యవస్థపై నమ్మకం లేనట్లేనని వ్యాఖ్య
Arun Charagondaఢిల్లీ ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు విచారణను తెలంగాణ నుంచి భోపాల్‌కు బదిలీ చేయాలంటూ బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి వేసిన పిటిషన్‌ను జస్టిస్ బీఆర్ గవై ధర్మాసనం తోసిపుచ్చింది. కేవలం అపోహలతో విచారణను బదిలీ చేస్తే న్యాయవ్యవస్థపై నమ్మకం లేదట్లే అవుతుందని ధర్మాసనం స్పష్టం చేసింది. అంతేగాదు ఈ కేసులో విచారణకు ప్రత్యేక ప్రాసిక్యూటర్‌ను నియమిస్తున్నట్లు సుప్రీంకోర్టు వెల్లడించింది.