News
Mpox Outbreak: ప్రపంచదేశాలకు మరో వైరస్ ముప్పు, వేగంగా వ్యాప్తి చెందుతున్న మంకీపాక్స్ వైరస్ పై డబ్లూహెచ్ వో ఆందోళన, ఇంతకీ మంకీ పాక్స్ అంటే ఏంటి? లక్షణాలు ఎలా ఉంటాయి?
VNSఆఫ్రికా దేశాల్లో కలకలం సృష్టిస్తున్న మంకీ పాక్స్ (Mpox) మహమ్మారిని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) ప్రపంచ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది. ఎంపాక్స్ (Mpox Alert) సుమారు 70 దేశాలకు పాకింది. ఇప్పటివరకు 100 మంది ఎంపాక్స్‌తో మృతి చెందినట్లు అధికారులు పేర్కొన్నారు.
Rain in Hyderabad: హైదరాబాద్ లో ఒక్కసారిగా మారిన వాతావరణం, పలు ప్రాంతాల్లో కుండపోత వాన
VNSహైదరాబాద్ లో వాతావరణం (Hyderabad rain) ఒక్కసారిగా మారిపోయింది. పలు ప్రాంతాల్లో భారీ వర్షం (Heavy Rain) కురుస్తోంది. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. బోయిన్ పల్లి, సికింద్రాబాద్ (Rain), అల్వాల్, పటాన్ చెరు, ఆర్సీపురం, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అమీన్ పూర్, అమీర్ పేట్, హైటెక్ సిటీ లో వర్షం దంచికొడుతోంది.
Texas Road Accident: షాకింగ్ వీడియో ఇదిగో, రోడ్డు ప్రమాదంలో కారు పల్టీలు కొట్టినా క్షేమంగా బయటపడ్డ ఇద్దరు పసిబిడ్డలు, టెక్సాస్‌లో ఘోర రోడ్డు ప్రమాదం
Hazarath Reddyమంగళవారం జరిగిన ఒక షాకింగ్ సంఘటనలో, టెక్సాస్‌లోని ఫ్రీపోర్ట్‌లోని ఇంటర్‌స్టేట్ 10 ఈస్ట్ ఫ్రీవే మధ్యలో చాలాసార్లు పల్టీలు కొట్టిన కారు నుండి బయటకు తీయబడిన తర్వాత ఇద్దరు పసిబిడ్డలు అందులో చిక్కుకుపోయారు.
KTR Slams CM Revanth Reddy: రైతుబంధు ఎగ్గొట్టి రుణమాఫీ అంటూ బిల్డప్, కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడిన కేటీఆర్, నోటిఫికేషన్లు ఇవ్వకుండానే 30 వేల ఉద్యోగాలు ఎలా అంటూ సూటి ప్రశ్న
Hazarath Reddyరైతుబంధు ఎగ్గొట్టి రుణమాఫీ అని బిల్డప్ ఇచ్చారంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఆగస్ట్ 15వ తేదీ వచ్చినా రూ. 2 లక్షల రుణమాఫీ కాలేదని... అందుకే తెలంగాణకు రావాలని పిలుస్తున్నా రాహుల్ గాంధీ రావడం లేదని ఎద్దేవా చేశారు.
Varalakshmi Vratam Messages in Telugu: వరలక్ష్మీ వ్రతం మెసేజెస్ తెలుగులో, ఈ అద్భుతమైన కొటేషన్లతో బంధుమిత్రులకు వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు చెప్పండిలా
Hazarath Reddyఈ రోజున దేవతను పూజిస్తే అష్టలక్ష్మీ పూజలకు సమానం అనే నమ్మకంతో కుటుంబ సభ్యులు కూడా పాలుపంచుకుంటారు. ముఖ్యంగా మంచి భర్త, కుమారులు కలగాలని కూడా అమ్మాయిలు పూజిస్తారు. ఈ దేవతను పూజిస్తే అష్టైశ్వర్యాలు అయిన సంపద, భూమి, శిక్షణ, ప్రేమ, కీర్తి, శాంతి, సంతోషం, శక్తి వంటివి లభిస్తాయని ప్రగాఢ విశ్వాసం.
Varalakshmi Vratham Wishes in Telugu: వరలక్ష్మీ వ్రతం విషెస్ తెలుగులో, ఈ అద్భుతమైన కొటేషన్లతో అందరికీ వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు చెప్పేయండి
Hazarath Reddyశ్రావణమాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మీ వ్రతంగా జరుపుకోవడం ఒక హిందూ ఆచారం. హిందూ మతం ప్రకారం ఈ పండగ విశిష్టమైనది. వరాలు యిచ్చే దేవతగా వరలక్ష్మీ దేవిని కొలుస్తారు.
NTR Anna Canteens: ప్రతి ఒక్కరం బతికేది జానెడు పొట్టకోసమే, అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవంలో సీఎం చంద్రబాబు, ఇంకా ఏమన్నారంటే..
Hazarath Reddyఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు తన అర్ధాంగి నారా భువనేశ్వరితో కలిసి గుడివాడలో అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు దంపతులు అన్న క్యాంటీన్ లో భోజనాలు వడ్డించారు. పేదలతో కలిసి భోజనం చేశారు.
CM Revanth Reddy Challenges Harishrao:రుణమాఫీ చేసి చూపించాం.. చీము -నెత్తురుంటే హరీష్ రావు రాజీనామా చేయాలన్న సీఎం రేవంత్ రెడ్డి, రాజీనామా చేయకపోతే ఏటిలో దూకాలని మండిపాటు
Arun Charagondaరుణమాఫీ అమలు చేసి చూపించాం..బీఆర్ఎస్ నేత హరీష్ రావుకు సిగ్గుంటే రాజీనామా చేయాలని సవాల్ విసిరారు సీఎం రేవంత్ రెడ్డి. రాజీనామా చేయకపోతే ఏటిలో దూకి చావాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం జిల్లాలోని వైరాలో రైతులను ఉద్దేశించి మాట్లాడిన రేవంత్..31 వేల కోట్లతో రుణమాఫీ పూర్తి చేశామన్నారు.
KTR On BRS - BJP Merge: బీజేపీతో బీఆర్ఎస్ కలిసుంటే కవిత జైలులో ఉండేదా?, త్వరలో స్టేషన్ ఘన్‌పూర్ ఉప ఎన్నిక వస్తుందన్న కేటీఆర్, బీఆర్ఎస్ కార్యకర్తలకు శిక్షణ తరగతులు
Arun Charagondaతప్పకుండ స్టేషన్ ఘన్‌పూర్లో ఉప ఎన్నిక వస్తుంది.. మళ్లీ తిరిగి రాజయ్య గెలుస్తాడన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్..హై కోర్టులో తీర్పు కూడా రిజర్వు చేసి పెట్టారు.. అక్కడ సానుకూల ఫలితం వస్తుందని అనుకుంటున్న అన్నారు. ఊసరవెల్లిలు రాజ్యం నడిపితే ఖచ్చితంగా ఉడుతలు, తొండలే వస్తాయి...కరెంటు పోతుందని సోషల్ మీడియాలో ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ వాళ్లకు పెడితే.. ట్రాన్స్‌ఫార్మర్ మీద తొండ పడ్డది, ఉడుత పడ్డదని సమాధానం ఇస్తున్నారు అని దుయ్యబట్టారు.
National Flag Underwater: సముద్ర గర్భాన జాతీయ జెండా రెపరెపలు, విశాఖలో స్కూబా డైవర్ సాహసం, వీడియో వైరల్
Arun Charagondaదేశవ్యాప్తంగా 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి. తెలుగు రాష్ట్రాల్లో సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఇక స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా వైజాగ్ సముద్ర గర్భంలో జాతీయ జెండాను రెపరెపలాడించారు స్కూబా డైవర్. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Karnataka Shocker: దారుణం, అందంగా తయారవుతోందని స్నేహితులతో కలిసి భార్యను చంపిన భర్త, ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు
Hazarath Reddyకర్ణాటకలోని రామనగర జిల్లా మాగడిలో అందగా తయారవుతున్న భార్యను చూసి ఓర్చుకోలేని భర్త ఆమెను దారుణంగా హత్య చేశాడు. పోలీసుల కథనం ప్రకారం.. 32 ఏళ్ల దివ్య-ఉమేశ్ భార్యాభర్తలు. అందంగా కనిపించాలన్న తపనతో దివ్య రోజూ తయారయ్యేది. పెదవులకు లిప్‌స్టిక్ వేసుకునేది. ఒంటిపై టాటూ కూడా పొడిపించుకుంది.
Independence Day 2024: 78వ స్వాతంత్య్ర దినోత్సవం, పూరీ తీరంలో ఆకట్టుకుంటున్న సైకత శిల్పం, సెల్ఫీలు దిగేందుకు ఎగబడుతున్న పర్యాటకులు
Arun Charagondaదేశవ్యాప్తంగా 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఢిల్లీలోని ఎర్రకోటలో జాతీయ జెండా ఎగురవేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఊరూర, వాడ వాడలా మువ్వన్నెల జెండ రెపరెపలాడింది.
Telangana: వీడియో ఇదిగో, స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఒంటిపై పెట్రోల్ పోసుకున్న పారిశుద్ధ్య కార్మికుడు, అధికారుల వేధింపులే కారణం
Hazarath Reddyఅధికారులు వేధింపులకు గురిచేస్తున్నారని స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఒంటిపై పెట్రోల్ పోసుకున్న పారిశుద్ధ్య కార్మికుడు. రామగుండంలో జాతీయ జెండా ఎగరవేసిన అనంతరం.. మేయర్ కమీషనర్ ఉన్న సమయంలోనే.. ఆత్మహత్యాయత్నం చేసిన పారిశుద్ధ్య కార్మికుడు విజయ్.
Mobile Phone Explodes: ప్యాంటు జేబులో ఒక్కసారిగా పేలిన సెల్ ఫోన్, జేబు కాలిపోవడంతో పాటు..
Hazarath Reddyకామారెడ్డి - పిట్లం మండల కేంద్రంలో పిట్లం ఎస్సీ కాలనీకి చెందిన ప్రైవేట్ మెడికల్ ప్రాక్టిషనర్ ఎనిగే సాయిలు రోజు మాదిరిగానే తన క్లినిక్‌కు వచ్చారు. అకస్మాత్తుగా తన ప్యాంటు జేబులో నుంచి పొగలు రావడంతో గమనించి అప్రమత్తమయ్యారు. ఈలోపే జేబులో ఉన్న సెల్ ఫోన్ ఒక్కసారిగా పేలి పూర్తిగా ధ్వంసమై జేబు కాలిపోయింది. ఈ ప్రమాదంలో సదరు వ్యక్తికి ఎలాంటి గాయాలు కాలేదు
Viral Video: రెండుగా విడిపోయిన అహ్మదాబాద్ - ముంబై డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్, గోతంగం యార్డ్ సమీపంలో ఘటన, వీడియో వైరల్
Arun Charagondaఅహ్మదాబాద్-ముంబై డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్ కోచ్ భోగిలు రెండుగా విడిపోయాయి. కప్లర్ లోపం కారణంగా సూరత్ సమీపంలో విడిపోయినట్లు తెలుస్తోంది. దీంతో వెనుక ముందు బోగీలను ఫ్లాట్‌ఫామ్‌కి తరలించారు. ఇవాళ ఉదయం 8:50 గంటలకు వడోదర డివిజన్‌లోని గోతంగం యార్డ్ సమీపంలో ఈ సంఘటన జరిగింది.
Telangana Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం వీడియో ఇదిగో, ఆటోని ఢీకొట్టిన భారీ ఐరన్ లోడ్ లారీ, ఒకరు మృతి, మరో 5 మందికి తీవ్ర గాయాలు
Hazarath Reddyజోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండల పరిధిలో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కర్నూల్ నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న రాజస్థాన్ భారీ ఐరన్ లోడ్ ట్రాలీ ఆటోని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, 5 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. పరిస్థితి విషమంగా ఉండడంతో కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Weight Loss Story: అద్భుతం.. 610 కేజీల నుండి 63 కేజీలకు, కేవలం ఆరునెలల్లో 540 కిలోలు తగ్గిన ప్రపంచంలోనే అత్యంత బరువైన వ్యక్తి
Hazarath Reddyప్రపంచంలోనే అత్యంత బరువైన వ్యక్తిగా గుర్తింపు పొందిన సౌదీ అరేబియాకు చెందిన ఖలీద్ బిన్ మోహ్‌సేన్ షరీ సుమారు 610 కిలోల బరువు నుండి ఇప్పుడు 63.5 కేజీలకు తగ్గాడు. అత్యంత భారీ కాయంతో బరువు కారణంగా మూడేండ్లకు పైగా ఖలీద్ మంచానికే పరిమితమయ్యాడు. అతని ఆరోగ్యం రోజురోజుకు క్షీణించడం, వైద్యానికి ఖర్చు ఎక్కువ కావడంతో దానిని భరించలేకపోయాడు.
Vivek Ramaswamy on Bangladesh Hindus Attack: బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులను ఖండించిన వివేక్ రామస్వామి, హిందువులే టార్గెట్‌గా దాడులు చేస్తున్నారని మండిపాటు,
Arun Charagondaరిజర్వేషన్లు తెచ్చిన తంటాతో దేశం విడిచిపారిపోయారు బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనా. ఆ దేశ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు విద్యార్థుల ఆందోళనలకు కారణం కాగా వందలాది మంచి చనిపోయారు. ప్రస్తుతం తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడినా బంగ్లాలో దాడులు మాత్రం ఆగడం లేదు. ప్రధానంగా ఆ దేశంలో ఉంటున్న హిందువులే టార్గెట్‌గా దాడులు జరుగుతున్నాయి.
New ED Director: ఈడీ కొత్త బాస్‌గా రాహుల్ నవీన్, తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు పదవిలో కొనసాగనున్న 1993 బ్యాచ్ ఐఆర్‌ఎస్ అధికారి
Hazarath Reddyఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తాత్కాలిక చీఫ్‌గా ఉన్న రాహుల్ నవీన్ పూర్తిస్థాయి డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు క్యాబినెట్ నియామకాల కమిటీ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. 1993 బ్యాచ్ ఐఆర్‌ఎస్ అధికారి అయిన నవీన్ ఈడీ డైరెక్టర్‌గా రెండేండ్లు లేదా తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఏది ముందైతే అప్పటివరకు పదవిలో కొనసాగుతారు.