News

Girl Slaps Boy: వైరల్ వీడియో ఇదిగో, అబ్బాయిని లాగి చెంపమీద ఒక దెబ్బ పీకిన అమ్మాయి, బిత్తరపోయిన చూస్తుండిపోయిన అబ్బాయి.. ఆ తర్వాత ఏమైందంటే..

Team Latestly

భారతదేశంలో టీం ఇండియా క్రికెట్ మ్యాచ్‌లు ఎల్లప్పుడూ ఆసక్తికర సంఘటనలతో వార్తల్లో నిలుస్తుంటాయి., చాలా సార్లు, ప్రసారకుల కెమెరా గ్యాలరీలో చిరస్మరణీయ క్షణాలను రికార్డు అవుతూ ఉంటాయి. తాజాగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఇండియా vs వెస్టిండీస్ రెండవ టెస్ట్ డే 4లో ఒక అమ్మాయి ఒక అబ్బాయిని సరదాగా చెంపదెబ్బ కొట్టడం కనిపించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

Late Period Warning Signs: మీకు ఇంకా పీరియడ్స్ ఎందుకు రాలేదని బెంగగా ఉందా.. ఋతుస్రావం రాకపోవడానికి కారణాలు, పరిష్కారాలు మార్గాలు ఓ సారి తెలుసుకోండి

Team Latestly

ఋతుస్రావం అనేది ప్రతి స్త్రీ జీవితంలో ఒక సహజ ప్రక్రియ. అయితే కొందరు మహిళలకు ఈ సమయంలో తీవ్ర పొత్తికడుపు నొప్పులు, వెన్ను, కాళ్ల నొప్పులు, అధిక రక్తస్రావం వంటి సమస్యలు ఎదురవుతాయి. సాధారణంగా, ఋతుచక్రం 21–35 రోజుల వ్యవధిలో జరుగుతుంది. ఇది గర్భాశయ లైనింగ్ హార్మోన్ల సమతుల్యతను ప్రతిబింబిస్తుంది.

Life Skills for Kids: తల్లిదండ్రులు పిల్లలకు నేర్పవలసిన ఆత్మవిశ్వాస మంత్రాలు ఇవే, వారి చెంతన ఈ మంత్రాలు ఉంటే జీవితంలో ఎప్పుడూ వెనుకడగు వేయరు

Team Latestly

చిన్న వయసులోనే పిల్లలకు ఆత్మవిశ్వాసం, ధైర్యం, నిర్భయత్వం వంటి లక్షణాలను నేర్పించడం చాలా ముఖ్యము. ఈ గుణాలను వారిలో పెంపొందించడం ద్వారా, వారు భవిష్యత్తులో సవాళ్లను ఎదుర్కొనే ధైర్యాన్ని పొందుతారు. అలాగే వ్యక్తిగత, సామాజిక, విద్యా రంగాల్లో విజయవంతమవుతారు.

Obesity in Children: పిల్లల్లో ఊబకాయంపై షాకింగ్ రిపోర్ట్.. మధుమేహం, గుండె జబ్బులకు దారితీస్తున్న అధిక బరువు, తల్లిదండ్రులు మేలుకోకుంటే అంతే సంగతులు అంటున్న వైద్యులు

Team Latestly

ఈ రోజుల్లో పిల్లల్లో ఊబకాయం లేదా అధిక బరువు సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. చిన్నారులు సహజంగా ఎక్కువ తినడానికి అలవాటు పడుతున్నారు. అయితే జంక్ ఫుడ్, వేగం ఆహారాలు, బేకరీ స్నాక్స్, తీపి పానీయాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఊబకాయం సమస్య వేగంగా పెరుగుతోంది. UNICEF నివేదిక ప్రకారం.. ప్రతి 10 మంది పిల్లల్లో ఒకరు అధిక బరువుతో ఉన్నారు.

Advertisement

Spiritual Benefits of Meditation: మీరు ఒత్తిడిలో ఉన్నారా.. చిరాకుతో బాధపడుతున్నారా.. అయితే ధ్యానం ద్వారా పొందే అత్యంత శక్తివంతమైన ఆధ్యాత్మిక లాభాలు తెలుసుకోండి

Team Latestly

ఈ వేగవంతమైన, ఒత్తిడితో నిండిన జీవనశైలి కాలంలో ధ్యానం అనేది తప్పనిసరి సాధనగా మారింది. మనం రోజువారీ సమస్యలతో, పని ఒత్తిడితో, వ్యక్తిగత, సామాజిక బాధలతో తారసపడుతున్నప్పుడు, మన మనసు, శరీరం, ఆత్మకు శాంతి అవసరం అవుతుంది. కాబట్టి ధ్యానం అనేది ఈ అవసరాన్ని తీర్చే అత్యంత శక్తివంతమైన మార్గంగా చెప్పుకోవచ్చు.

Cow Capture Gone Wrong in Vadodara: వీడియో ఇదిగో, ఆవును పట్టుకునేందుకు ప్రయత్నించిన యువకుడు, అర కిలో మీటర్ దూరం లాక్కెళ్లిన గోమాత, బాధితుడికి తీవ్రగాయాలు

Team Latestly

గుజరాత్ వడోదరలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. రోడ్లపై తిరుగుతున్న పశువులను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్న మున్సిపల్ కార్మికుడు మహేష్ పటేల్ ను ఒక ఆవు సుమారు అర కిలోమీటరు దూరం ఈడ్చుకెళ్ళింది. ఈ సంఘటన సీసీటీవీలో రికార్డై, సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Madhya Pradesh Horror: మృతదేహాన్ని కూడా వదలని కామాంధుడు, మార్చురీలోనే మహిళ మృతదేహంపై లైంగిక దాడి, నిందితుడు అరెస్ట్

Team Latestly

మధ్యప్రదేశ్ బుర్హాన్‌పూర్ జిల్లాలో తీవ్ర కలకలం రేపిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఖక్నార్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో పోస్ట్‌మార్టం కోసం ఉంచిన మహిళ మృతదేహాన్ని ఒక వ్యక్తి లైంగికంగా వేధించిన దృశ్యం సీసీటీవీలో రికార్డు అయింది. ఈ ఘటన ఏప్రిల్ 18, 2024న చోటుచేసుకుంది. అయితే, సీసీటీవీ ఫుటేజ్ అక్టోబర్ 7, 2025న సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం వల్ల మాత్రమే ప్రజలకు తెలిసింది.

Telangana Local Body Elections: తెలంగాణ లోకల్‌ బాడీ ఎన్నికలు నిలిపివేస్తూ హైకోర్టు తీర్పు, ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలపై స్టే విధిస్తూ ఉత్తర్వులు

Team Latestly

తెలంగాణ హైకోర్టులో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. తెలంగాణ లోకల్‌ బాడీ ఎన్నికలను నిలిపివేస్తూ, అలాగే ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలపై స్టే విధిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం జీవో 9 పై కూడా హైకోర్టు స్టే విధించింది.

Advertisement

Kanpur Scooty Blast: సిసిటివి వీడియో ఇదిగో, అందరూ చూస్తుండగానే ఒక్కసారిగా షాపులో భారీ పేలుడు, 8 మందికి తీవ్ర గాయాలు

Team Latestly

కాన్పూర్‌లోని మూల్‌గంజ్ ప్రాంతంలోని మిశ్రీ బజార్‌లోని ఒక దుకాణంలో బుధవారం సాయంత్రం జరిగిన భారీ పేలుడులో ఎనిమిది మంది గాయపడ్డారు. సాయంత్రం 6:50 గంటలకు దుకాణం వెలుపల పేర్చిన కార్టన్‌ల కింద నుండి పేలుడు సంభవించినట్లు సిసిటివి ఫుటేజ్‌లో కనిపిస్తోంది.

Sudden Death Caught on Camera: వీడియో ఇదిగో, గుండెపోటుతో కుప్పకూలిన ఢిల్లీ పోలీస్ అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్, ఆస్పత్రికి వెళ్లేలోపే తిరిగిరాని లోకాలకు..

Team Latestly

అక్టోబర్ 6, సోమవారం ఉదయం తీస్ హజారీ కోర్టు కాంప్లెక్స్‌లో ఢిల్లీ పోలీస్ అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ (ASI) గుండెపోటుతో మరణించిన విషాద సంఘటన చోటు చేసుకుంది. తక్షణ సహాయం అందించినా ఆ అధికారిని తిరిగి బ్రతికించలేకపోయారు. ఈ సంఘటనకు సంబంధించిన CCTV వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Gaza Peace Deal: ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధంలో కీలక ముందడుగు, మొదటి దశ శాంతి ఒప్పందానికి అంగీకరించిన రెండు దేశాలు, నెతన్యాహు బలమైన నాయకత్వాన్ని ప్రశంసించిన భారత ప్రధాని మోదీ

Team Latestly

గత రెండు ఏళ్ల నుంచి సాగుతున్న ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధం ముగింపుకు కీలక ముందడుగు పడింది. గాజాలో యుద్ధం ముగించేందుకు ఇజ్రాయెల్‌ (Israel), హమాస్‌ (Hamas) రెండు దేశాలె మొదటి దశ శాంతి ఒప్పందానికి అంగీకరించాయి. ఈ శాంతి ఒప్పందంపై ఇరుపక్షాలు సంతకం చేసినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తాజాగా ప్రకటించారు.

Andhra Pradesh Grameena Banks Merger: ఏపీ గ్రామీణ బ్యాంకుల విలీనం, ఐదు రోజుల పాటు నిలిచిపోనున్న సేవలు, ఏయే బ్యాంకులు మెర్జ్ అవుతున్నాయంటే..

Team Latestly

ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామీణ ప్రాంతాల బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని నాలుగు ప్రధాన గ్రామీణ బ్యాంకుల విలీన ప్రక్రియ ప్రారంభమవుతోంది. ఈ నేపథ్యంలో దాదాపు ఐదు రోజుల పాటు అన్ని కీలక బ్యాంకింగ్ సేవలు తాత్కాలికంగా నిలిచిపోనున్నాయని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు ప్రకటించింది.

Advertisement

Poor Air Quality Health Effects: కీళ్లపై దాడి చేస్తున్న వాయు కాలుష్యం, రుమటాయిడ్ ఆర్థరైటిస్ పెరుగుదలపై వైద్య నిపుణుల తీవ్ర ఆందోళన, పూర్తి వివరాలు ఇవే..

Team Latestly

మన రోజువారీ జీవితంలో పీల్చే గాలి మన ఆరోగ్యానికి ఎంత ముఖ్యమో తెలిసిందే. అయితే తాజాగా పెరుగుతున్న వాయు కాలుష్యం కేవలం ఊపిరితిత్తులు, గుండెను మాత్రమే కాదు, మన కీళ్లను కూడా తీవ్రంగా దెబ్బతీస్తోందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

‘Show Your Ticket Or Get Out’: వీడియో ఇదిగో, రైలులో టికెట్ లేకుండా ప్రయాణిస్తూ పట్టుబడిన ప్రభుత్వ టీచర్, అడిగినందుకు టీటీపై బూతులతో దాడి

Team Latestly

రైల్వే నియమాల అమలును బేఖాతరు చేస్తూ బీహార్ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఒకరు టికెట్ లేకుండా ప్రయాణిస్తూ పట్టుబడ్డారు. రైలు టికెట్ కలెక్టర్ (TT) తన విధిని నిర్వర్తిస్తూ, ఆమెను ఎదుర్కొని, “అగర్ టికెట్ హై తో షో కిజియే నా మేడం (మీ దగ్గర టికెట్ ఉంటే, దయచేసి నాకు చూపించండి, మేడమ్)” అని అన్నాడు.

UPI Milestone: 5 కోట్లకు పైగా వినియోగదారులతో సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన యూపీఐ, 65 మిలియన్ల వ్యాపారులతో దూసుకుపోతున్న డిజిటల్ చెల్లింపు దిగ్గజం

Team Latestly

భారతదేశంలో UPI (Unified Payments Interface) డిజిటల్ చెల్లింపు వేదిక 5 కోట్లకు పైగా వినియోగదారులు, 65 మిలియన్ల వ్యాపారులతో దూసుకుపోతోంది. ఈ వేదిక MSMEలు, చిన్న వ్యాపారాలకు వృద్ధి అవకాశాలను అందిస్తోంది. NPCI, BCG కలిసి గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ 2025లో విడుదల చేసిన నివేదిక ప్రకారం.. UPI ప్రపంచ రియల్-టైమ్ చెల్లింపులలో సుమారుగా 50 శాతం వాటా కలిగి ఉంది.

‘War 2’ OTT Release Date: అక్టోబర్ 9 నుంచి ఓటీటీలో వార్ 2 స్ట్రీమింగ్, తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నెట్‌ఫ్లిక్స్ లో అందుబాటులోకి..

Team Latestly

వార్-2’ ఓటీటీ స్ట్రీమింగ్‌పై సంస్థ అధికారికంగా ప్రకటించింది. ‘‘ఆవేశాన్ని రెట్టింపు చేసుకోండి. కోపాన్ని రెట్టింపు చేసుకోండి. యుద్ధానికి సిద్ధంగా ఉన్నారా?’’ అనే క్యాప్షన్ దీనికి జత చేశారు. ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకోగా.. అక్టోబర్ 9 నుంచి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు వెల్లడించారు.

Advertisement

Andhra Pradesh Fire Accident: ఏపీలో ఘోర అగ్ని ప్రమాదం, మంటల్లో ఆరుగురు సజీవ దహనం, మరికొందరికి గాయాలు, ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

Team Latestly

తూర్పు గోదావరి జిల్లాలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది.రాయవరంలో ఉన్న గణపతి గ్రాండ్ బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు చోటు చేసుకుంది. పేలుడు కారణంగా పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. మంటల్లో చిక్కుకున్న ఆరుగురు సజీవ దహనమయ్యారు.

Cough Syrup Deaths: దగ్గు మందుతో పెరుగుతున్న మరణాలు, మరో రెండు దగ్గు మందులను బ్యాన్‌ చేసిన తెలంగాణ ప్రభుత్వం, లిస్టులో ఏ సిరప్స్ ఉన్నాయంటే..

Team Latestly

తెలంగాణ రాష్ట్రంలో చిన్నారుల ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి ప్రభుత్వం ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ఔషధ నియంత్రణ విభాగం (DCA) ద్వారా కొన్ని దగ్గు సిరపులపై నిషేధాలు విధించారు. ఈ నిర్ణయం ముఖ్యంగా మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లోని చిన్నారుల దగ్గు మందుల వల్ల గల్లంతైన ఘటనల నేపథ్యంలో తీసుకుంది ప్రభుత్వం.

Indian-Origin Motel Manager Killed in US: వీడియో ఇదిగో, అమెరికాలో మరో భారతీయుడు దారుణ హత్య, పాయింట్ బ్లాంక్‌లో భారత వ్యాపారిని గన్‌తో తలపై కాల్చి చంపిన దుండగుడు

Team Latestly

అమెరికాలోని పెన్సిల్వేనియాలో భారత సంతతి వ్యాపారి రాకేశ్ ఎహగబన్ (51) దారుణ హత్యకు గురయ్యారు. పిట్స్‌బర్గ్‌లోని రాబిన్సన్ టౌన్‌షిప్‌లో మోటెల్ నిర్వాహకుడిగా పనిచేస్తున్న ఆయన శుక్రవారం సాయంత్రం మోటెల్ బయట జరిగిన గొడవను ఆపడానికి వెళ్లిన సమయంలో నిందితుడు కాల్పులు జరిపి ప్రాణాలు తీసేశాడు.

Nobel Prize in Physics 2025 Winners: ఈ ఏడాది భౌతికశాస్త్రంలో ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ బహుమతి, ఎనర్జీ క్వాంటిజేషన్ అనే పరిశోధనకు గుర్తింపు అవార్డు

Team Latestly

ఈ ఏడాది భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతి ముగ్గురు శాస్త్రవేత్తలకు దక్కింది. జాన్ క్లార్క్‌, మైఖేల్ హెచ్. దేవరేట్‌, జాన్ ఎం. మార్టినిస్‌లకు సంయుక్తంగా అవార్డు ప్రకటించబడింది. వారు ఎలక్ట్రిక్ సర్క్యూట్‌లో సంభవించే ఎనర్జీ క్వాంటిజేషన్ అనే పరిశోధనకు గుర్తింపు పొందారు.

Advertisement
Advertisement