News

Congo Rebel Conflict: కాంగోలో మారణకాండ! వందలాది మహిళా ఖైదీలపై అత్యాచారం, ఆపై జైల్‌ రూముల్లో పెట్టి సజీవదహనం

VNS

మధ్య ఆఫ్రికా దేశమైన డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో (Congo Rebels) తిరుగుబాటుదారులు చెలరేగిపోయారు. జైలులోని వందలాది మహిళా ఖైదీలపై అత్యాచారాలకు పాల్పడ్డారు. మరి కొన్ని గదుల్లో ఉన్న వారిని సజీవ దహనం చేశారు. (women raped, burnt alive) మానవ హక్కుల ఉల్లంఘనలపై ఐక్యరాజ్యసమితి (ఐరాస) ఆందోళన వ్యక్తం చేసింది

KTR on Sarpanches Arrest: పెండింగ్ బిల్లులు అడిగితే అరెస్టులా? సిగ్గుచేటు అంటూ మండిపడ్డ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

VNS

పెండింగ్‌ బిల్లులు చెల్లించాలని అడిగితే అక్రమ అరెస్టు చేస్తారా? అంటూ రేవంత్‌రెడ్డి (Revanth reddy) నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారక రామారావు (KTR) మండిపడ్డారు. రాష్ట్ర సచివాలయం ముందే మాజీ సర్పంచ్ లు కంటతడి పెట్టుకోవడం అత్యంత బాధాకరమన్నారు.

Kerala: భర్తను కాపాడుకునేందుకు సాహసం చేసిన భార్య, వామ్మో ఆమె ధైర్యానికి మెచ్చుకోకుండా ఉండలేరు

VNS

ఒక వ్యక్తి ప్రమాదవశాత్తు ఇంటి వద్ద ఉన్న బావిలో పడ్డాడు. శబ్దం విన్న అతడి భార్య పరుగున బయటకు వచ్చింది. 40 అడుగుల లోతున్న బావిలో భర్త పడిపోవడాన్ని గమనించింది. సహాయం కోసం కేకలు వేసింది. ఆలస్యం చేయకుండా తాడు సహాయంతో బావిలోకి దిగింది. ఎంతో ధైర్యంతో భర్తను కాపాడింది. (Wife Saves Husband Fallen in Well) కేరళలోని పిరవోంలో ఈ సంఘటన జరిగింది.

Zepto Delivering Cars Now: ఇకపై జెప్టోలో అవి కూడా ఆర్డర్ చేయొచ్చు, ఆసక్తికర వీడియో పంచుకున్న కంపెనీ

VNS

తొలుత ఇంటికి అవసరమైన సరకులను డెలివరీ చేసేవి. ఆ తర్వాత కస్టమర్ల డిమాండ్‌ను బట్టి స్మార్ట్‌ ఫోన్స్‌, గేమింగ్‌ కన్సోల్స్‌ ఇతర ఖరీదైన వస్తువులను కూడా నిమిషాల్లోనే డెలివరీ చేస్తున్నాయి. అయితే, ఇప్పుడు కార్లను కూడా డెలివరీ చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

Advertisement

HC on Vijay Mallya’s Plea: విజయ్ మాల్యా రుణ ఎగవేత కేసులో కీలక మలుపు, బ్యాంకులకు నోటీసులు జారీ చేసిన కర్ణాటక హైకోర్టు, చేసిన అప్పు కంటే ఎక్కువ మొత్తం రికవరీ చేశారని మాల్యా పిటిషన్

Hazarath Reddy

బ్యాంకులకు వేల కోట్లు ఎగ్గొట్టి పరారీలో ఉన్న వ్యాపారవేత్త విజయ్ మాల్యా దాఖలు చేసిన పిటిషన్‌పై కర్ణాటక హైకోర్టు బుధవారం (ఫిబ్రవరి 5, 2025) రుణ రికవరీ అధికారికి, 10 బ్యాంకులకు నోటీసు జారీ చేస్తూ ఆదేశాలు (HC on Vijay Mallya’s Plea) జారీ చేసింది

Jeet Adani-Diva Shah Wedding Promise: 500 మంది వికలాంగులైన వధువులకు ఏటా రూ. 10 లక్షలు సాయం, పెళ్లికి ముందు సంచలన హామీని ప్రకటించిన గౌతమ్ అదానీ కుమారుడు జీత్ అదానీ

Hazarath Reddy

ఈ జంట 500 మంది దివ్యాంగుల (వికలాంగులు) మహిళల వివాహాలకు ఏటా రూ. 10 లక్షలు విరాళంగా ఇస్తామని ప్రతిజ్ఞ చేశారు. వారి వేడుకలను మరింత అందుబాటులోకి తీసుకురావడం, ఆనందదాయకంగా మార్చడం లక్ష్యంగా పెట్టుకున్నారు.

Delhi Exit Poll 2025 Results: ఢిల్లీ పీఠం బీజేపీదేనంటున్న ఎగ్జిట్ పోల్స్, ఊహించని షాక్ ఇస్తామంటున్న ఆమ్ ఆద్మీ, మళ్లీ కాంగ్రెస్‌కు ఘోర పరాభవమేనంటున్న సర్వేలు

Hazarath Reddy

దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) పోలింగ్‌ ముగిసింది. ఉదయం ఏడు గంటలకు మొదలైన ఓటింగ్‌ ప్రక్రియ సాయంత్రం 6గంటలకు ముగిసింది. సాయంత్రం 5గంటల వరకు 57.70 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల సంఘం (Election Commission) వెల్లడించింది. తాజాగా ఢిల్లీ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడవుతున్నాయి.

Delhi Exit Poll 2025 Results: ఢిల్లీలో బీజేపీదే అధికారమని అంచనా వేసిన చాణక్య సర్వే, ఆమ్ ఆద్మీ 25 నుంచి 30 సీట్లకు మాత్రమే పరిమతమవుతుందని సర్వే అంచనా

Hazarath Reddy

Chanakya Strategies ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వస్తుందని అంచనా వేసింది. 39 నుంచి 44 సీట్ల మధ్య బీజేపీ సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేసింది. ఇక ఆప్ 25 నుంచి 28 సీట్లకు పరిమితం అవుతుందని ఈ సర్వే అంచనా వేసింది. కాంగ్రెస్ 2 నుంచి 3 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని అంచనా వేసింది ఈ సర్వే.

Advertisement

Delhi Exit Poll 2025 Results: ఢిల్లీ ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఇవిగో, బీజేపీదే అధికారమని స్పష్టం చేసిన JVC-Times Now, ప్రతిపక్షానికి కేజ్రీవాల్ పరిమితమవుతారని అంచనా

Hazarath Reddy

2025 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన JVC-Times Now ఎగ్జిట్ పోల్ ఫలితం BJPకి స్పష్టమైన మెజారిటీని అంచనా వేసింది. ఈ సర్వే BJP+ 39-45 సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేయగా, AAP 22-31 సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేయబడింది, ఇది సగం మార్కుకు దగ్గరగా ఉంది

Delhi Exit Poll 2025 Results: ఢిల్లీ ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఇవిగో, బీజేపీ అధికారంలోకి వస్తుందని తెలిపిన పి-మార్క్ ఎగ్జిట్ పోల్, కేజ్రీవాల్‌కి పరాభవం తప్పదని అంచనా

Hazarath Reddy

2025 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన పి-మార్క్ ఎగ్జిట్ పోల్ ఆప్ కు పెద్ద ఎదురుదెబ్బ అని సూచిస్తుంది, బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. సర్వే ప్రకారం, బిజెపి 39-49 సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేయగా, ఆప్ 21-31 సీట్లు మాత్రమే గెలుచుకుంటుందని అంచనా.

Delhi Exit Poll 2025 Results: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై మ్యాట్రిజ్ సర్వే, బీజేపీ- ఆప్ మధ్య టఫ్ ఫైట్, కాంగ్రెస్ పార్టీ ఖాతా కూడా తెరవలేదని అంచనా వేసిన మ్యాట్రిజ్

Hazarath Reddy

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై మ్యాట్రిజ్ సర్వే ఏం చెప్పిందంటే ఆప్, బీజేపీ మధ్య పోటీ గట్టి పోటీ ఉంటుందని తెలిపింది. ఆప్ 32 నుంచి 37 సీట్ల మధ్యలో గెలుచుకుంటుందని అలాగే బీజేపీ 35 నుంచి 40 సీట్ల మధ్యలో గెలుచుకుంటుందని అంచనా వేసింది. ఇక కాంగ్రెస్ ఖాతా కూడా తెరవదని ఈ సర్వే స్పష్టం చేసింది.

Delhi Exit Poll 2025 Results: 27 ఏళ్ళ తరువాత ఢిల్లీ పీఠంపై బీజేపీ, 51-60 సీట్లతో అధికారం కైవసం చేసుకుంటుందని తెలిపిన పీపుల్స్ పల్స్ సర్వే, 20 సీట్ల కంటే తక్కువకు ఆప్ పడిపోతుందని వెల్లడి

Hazarath Reddy

27 సంవత్సరాల తర్వాత బీజేపీ 51-60 సీట్లతో విజయం సాధిస్తుందని పీపుల్స్ పల్స్ అంచనా వేసింది. ఆప్ 20 సీట్ల కంటే తక్కువకు పడిపోవచ్చని అంచనా వేసింది.

Advertisement

Delhi Assembly Elections 2025: ఢిల్లీలొ ముగిసిన ఎన్నికల పోలింగ్, సాయంత్రం 5గంటల వరకు 57.70 శాతం పోలింగ్‌ నమోదు, ఫిబ్రవరి 8న ఫలితాలు విడుదల

Hazarath Reddy

దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) పోలింగ్‌ ముగిసింది. ఉదయం ఏడు గంటలకు మొదలైన ఓటింగ్‌ ప్రక్రియ సాయంత్రం 6గంటలకు ముగిసింది. సాయంత్రం 5గంటల వరకు 57.70 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల సంఘం (Election Commission) వెల్లడించింది.

Pawan Kalyan Health Update: వైరల్ జ్వరంతో పాటుగా స్పాండిలైటిస్‌తో బాధపడుతున్న పవన్ కళ్యాణ్, జనసేన కార్యాలయం ఏమన్నదంటే..

Hazarath Reddy

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అస్వస్థతకు గురైయ్యాడు. జనసేన అధినేత వైరల్ ఫీవర్‌, స్పాండిలైటిస్ తో ఇబ్బంది పడుతున్నట్లు ఆయన టీం వెల్లడించింది. జ్వరంతో పాటుగా స్పాండిలైటిస్ వల్ల బాధ పడుతున్నారని సీఎంవో వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రెస్ట్ తీసుకొంటున్నారని తెలిపారు.ఈ మేరకు జనసేన ట్వీట్ చేసింది.

Telangana: వీడియో ఇదిగో, ఆసుపత్రిలో ఇంజక్షన్ వికటించి 9వ తరగతి బాలుడు మృతి, కళ్ళముందే మృతి చెందడం తట్టుకోలేక కన్నీటిపర్యంతం అయిన తల్లిదండ్రులు

Hazarath Reddy

డాక్టర్ పరిశీలించి పెద్దలకు ఇచ్చే ఎక్కువ డోస్ ఇంజక్షన్ ఇవ్వడంతో బాలుడు క్షణాలలో మృతి చెందాడు. బాలుడు శ్వాస ఆడక కళ్ళముందే మృతి చెందడంతో తట్టుకోలేక కన్నీటి పర్వమయ్యారు తల్లిదండ్రులు, బంధువులు.

YS Jagan: వీడియో ఇదిగో, ఎవరొచ్చినా వైసీపీ కార్యకర్త వెంట్రుక కూడా పీకలేరు, వచ్చే 30 ఏళ్లు మనదే అధికారం, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Hazarath Reddy

విజయవాడ వైఎస్సార్‌సీపీ నేతలు, కార్పొరేటర్లతో పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి భేటీ అయ్యారు. బుధవారం ఉదయం తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో వాళ్లతో ఆయన తాజా రాజకీయ పరిణామాలను చర్చించారు. ‘ఈసారి జగన్ 2.0ని చూడబోతున్నారు

Advertisement

Theft Caught on Camera: వీడియో ఇదిగో, బైకు మీద పెట్టిన బ్యాగ్ నుంచి 4 లక్షలు ఎత్తుకెళ్లిన దొంగ, మరీ ఇంత నిర్లక్ష్యంగా ఎలా ఉన్నాడో యజమాని మీరే చూడండి

Hazarath Reddy

నారాయణపేట (Narayanpet)లో చోరీ జరిగింది. నారాయణ అనే వ్యక్తి తన బంధువుల ఇంట్లో పెళ్లి ఉన్నదని చెప్పి బ్యాంకు (bank) నుంచి రూ. 4 లక్షల డ్రా (withdrawing) చేసి తీసుకెళ్తున్నాడు. ద్విచక్రవాహనం (two-wheeler)లో డబ్బు పెట్టి, మార్గమధ్యంలో బేకరీ (bakery)కి వెళ్లాడు.

US Illegal Indian Immigrants Return: అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న భారతీయులను ఇండియాకు పంపిన ట్రంప్, 104 మందితో అమృత్‌సర్ చేరుకున్న విమానం

Hazarath Reddy

అమెరికా (USA) లో అక్రమ వలసదారులపై డొనాల్డ్‌ ట్రంప్ (Donald Trump) సర్కారు కఠినంగా వ్యవహరిస్తోంది. వారందరినీ వారి స్వంత దేశాలకు వెళ్లగొడుతోంది.తాజాగా చట్టవ్యతిరేకంగా అగ్రరాజ్యంలో అడుగుపెట్టిన భారతీయులను (Indian Migrants) వారి ప్రత్యేక విమానంలో స్వదేశానికి (US Illegal Indian Immigrants Return) పంపింది

Hero Thottempudi Venu: హీరో తొట్టెంపూడి వేణుపై కేసు నమోదు.. ఉత్తరాఖండ్ పవర్ ప్రాజెక్టు కాంట్రాక్టు ఉల్లంఘన, కోర్టు ఆదేశాలో హైదరాబాద్ పోలీసుల కేసు నమోదు

Arun Charagonda

హీరో తొట్టెంపూడి వేణుపై పోలీస్ కేసు నమోదైంది. రిత్విక్ సంస్థతో చేసుకున్న ఒప్పందాన్ని వేణు, ప్రోగ్రెసివ్ సంస్థ నిర్వాహకులు రద్దు చేశారు. వీరిపై రిత్విక్ సంస్థ ఫిర్యాదు చేయగా పోలీస్ కేసు నమోదు చేశారు.

Telangana: వీడియో ఇదిగో, కరెంటు తీగలు మార్చే క్రమంలో కరెంటు షాక్‌‌కు గురైన ఉద్యోగి, శ్రీశైలం మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లలో అపశృతి

Hazarath Reddy

శ్రీశైలం మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లలో అపశృతి చోటు చేసుకుంది. కరెంటు తీగలు మార్చే క్రమంలో కరెంటు షాక్‌కు గురయ్యారు గద్వాల జిల్లా రామాపురానికి చెందిన కృష్ణ (26) అనే ఉద్యోగి. కొన ఊపిరితో ఉన్న కృష్ణను కిందకు దింపి శ్రీశైలం దేవస్థానం వైద్యశాలలో అత్యవసర చికిత్స అందిస్తున్నారు.

Advertisement
Advertisement