Shaheen Bagh Protests: నిరసనల పేరుతో రోడ్లు బ్లాక్ చేస్తారా, ప్రజలకు ఇబ్బంది కలిగించని ప్రదేశాల్లో నిరసన చేయండి, ఆందోళనకారులకు సర్వోన్నత న్యాయస్థానం సూచన

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టాలు సీఏఏ (CAA), ఎన్‌ఆర్‌సీలకు (NRC) వ్యతిరేకంగా ఢిల్లీలోని షహీన్‌బాగ్‌లో కొనసాగుతున్న ఆందోళనలపై (Shaheen Bagh Protests) దేశ అత్యున్నత న్యాయస్థానం తీవ్రంగా స్పందించింది. నిరసన తెలియజేయడం ప్రజల ప్రాథమిక హక్కు. అయితే రోజుల తరబడి రోడ్లను ఆక్రమించి ఇతరులకు ఇబ్బంది కలిగించేలా ఉండకూడదు.

Supreme Court of India |(Photo Credits: IANS)

New Delhi, February 18: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టాలు సీఏఏ (CAA), ఎన్‌ఆర్‌సీలకు (NRC) వ్యతిరేకంగా ఢిల్లీలోని షహీన్‌బాగ్‌లో కొనసాగుతున్న ఆందోళనలపై (Shaheen Bagh Protests) దేశ అత్యున్నత న్యాయస్థానం తీవ్రంగా స్పందించింది. నిరసన తెలియజేయడం ప్రజల ప్రాథమిక హక్కు. అయితే రోజుల తరబడి రోడ్లను ఆక్రమించి ఇతరులకు ఇబ్బంది కలిగించేలా ఉండకూడదు.

సీఏఏ, ఆర్టికల్ 370పై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు

ఈ విషయంలో సమతూకం చాలా అవసరం. ప్రజలు రోడ్లపై నిరసనలు తెలుపడం మొదలెడితే ఏం జరుగుతుందో ఆలోచించండి. అభిప్రాయాలను వ్యక్తీకరించడం ద్వారానే ప్రజాస్వామ్యం పనిచేస్తుంది. కానీ, అందుకు కొన్ని హద్దులు కూడా ఉంటాయి’ అని సుప్రీంకోర్టు (Supreme Court) వ్యాఖ్యానించింది.

సీఏఏ అమల్లోకి, ముస్లీంలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న కేంద్ర ప్రభుత్వం

ప్రజాస్వామ్యంలో ఒక చట్టానికి వ్యతిరేకంగా నిరసన తెలపడం ప్రాథమిక హక్కే కానీ, ఆ కారణంగా రహదారుల దిగ్బంధనం జరగడం ఆందోళనకరమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ప్రజలకు ఇబ్బంది కలగని ప్రాంతంలోకి తమ నిరసనల కేంద్రాన్ని మార్చుకోవాలని పౌరసత్వ సవరణ చట్ట(CAA) వ్యతిరేక ఆందోళనకారులకు సూచించింది.

ప్రభుత్వ రహదారులు, పార్కుల వద్ద కాకుండా ప్రత్యేకించిన ప్రాంతాల్లోనే వారు నిరసనలు చేపట్టాలి. షహిన్‌బాగ్‌ (Shaheen Bagh) ఆందోళనల పట్ల ఓ వర్గం ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారికి ఇబ్బంది కలిగకుండా నిరసన తెలిపిందుకు మరో ప్రాంతాన్ని ఎంచుకోండి’ అని సుప్రీం స్పష్టం చేసింది.

Check ANI tweet:

షహిన్‌బాగ్‌ ప్రాంతాన్ని ఖాళీ చేసేలా ఢిల్లీ ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలంటూ న్యాయవాది అమిత్‌ సైనీ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. సీఏఏకి వ్యతిరేకంగా షహీన్‌బాగ్‌లో నిరసనల కారణంగా ట్రాఫిక్‌కు ఇబ్బంది ఎదురవుతోందంటూ ఈ పిటిషన్ దాఖలైంది.

సీఏఏ నచ్చకుంటే దేశం విడిచి వెళ్లిపోండి

దీని విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం పైవిధంగా స్పందించింది. భావ ప్రకటన ప్రజాస్వామ్యంలో అవసరమే కానీ, దానికీ హద్దులుండాలంది. జస్టిస్‌ ఎస్కే కౌల్‌, జస్టిస్‌ కేఎం జోసెఫ్‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ పిటిషన్లను విచారించింది.

నచ్చకుంటే పాకిస్తాన్ వెళ్లు

కాగా సీఏఏను వ్యతిరేకిస్తూ ఢిల్లీలోని షాహీన్‌బాగ్‌ ప్రాంతంలో గత రెండు నెలలుగా నిరసనలు కొనసాగిస్తున్నారు. దీంతో ఈ మార్గంలో రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలుగుతున్నది. ఈ సందర్భంగా షాహీన్‌బాగ్‌ నిరసనకారులతో మాట్లాడేందుకు సీనియర్‌ న్యాయవాది సంజయ్‌ హెగ్డే, సాధన రామచంద్రన్‌ను మధ్యవర్తులుగా సుప్రీంకోర్టు నియమించింది.

సీఏఏపై ప్రతిపక్షాలకు సవాల్ విసిరిన అమిత్ షా

ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలుగనిచోట నిరసన తెలిపేలా నిరసనకారులను ఒప్పించాలని సూచించింది. ఒకవేళ ఫలితం కనిపించనిపక్షంలో నిర్ణయాధికారం అధికారులకే వదిలేస్తామని ధర్మాసనం పేర్కొన్నది. తదుపరి విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది.

నిరసన తెలపడం దేశ ద్రోహం కాదు, అది ప్రజాస్వామ్యానికి రక్షణ

ఇదిలా ఉంటే సామాజిక కార్యకర సందీప్‌ పాండేను సోమవారం లక్నో పోలీసులు అరెస్ట్‌ చేశారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పాదయాత్ర చేయాలని తలపెట్టిన పాండే.. కరపత్రాలను పంచుతుండగా అదుపులోకి తీసుకున్నారు.

పిటిషన్‌పై విచారణ సందర్భంగా.. వివాదాస్పద చట్టాలను వెనక్కి తీసుకోకపోతే దేశంలో మరో 5వేల షహిన్‌బాగ్‌ కేంద్రాలు ఏర్పాటు అవుతాయంటూ.. భీమ్‌ ఆర్మీ చీఫ్‌ చంద్రశేఖర్‌ చేసిన వ్యాఖ్యలపై కూడా ధర్మాసనం స్పందించింది. వాటితో తమకు ఎలాంటి ఇబ్బందిలేదని కానీ పౌరులకు అసౌకర్యం కలగకుండా నిరసన తెలుపుకోవాలని అభిప్రాయపడింది.

జామియా దాడి వీడియోలు లీక్

అలాగే ప్రార్థనాస్థలాల్లో దానం చేయడం మతపరమైన ఆచారమే కావచ్చు. అటువంటి ప్రదేశాల్లో విరాళంగా ఇచ్చిన ఆ డబ్బుని టెర్రరిజానికి ఉపయోగిస్తే మాత్రం చట్టం అంగీకరించదని సుప్రీంకోర్టు పేర్కొంది. ఆత్మత్యాగం, సతీసహగమనం వంటివి హత్యల కిందికే వస్తాయని, వాటిని విశ్వాసాల పేరుతో కొనసాగినవ్వలేమని తేల్చి చెప్పింది. ప్రార్థనాలయాల్లో మత స్వేచ్ఛ, లింగ వివక్షపై చీఫ్‌ జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే నేతృత్వంలోని తొమ్మిది మంది సభ్యుల ధర్మాసనం విచారణ ప్రారంభించింది.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now