Labelling dissent as ‘anti-national’ strikes at the heart of democracy, says Supreme Court Judge DY Chandrachud (Photo-PTI)

New Delhi, Febuary 16: దేశ వ్యాప్తంగా ఎన్నార్సీ (NRC), సీఏఏ (CAA) మీద నిరసనలు మిన్నంటున్నతున్న వేళ సుప్రీంకోర్టు (Supreme Court) న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ (Dhananjaya Y.Chandrachud) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసమ్మతి దేశద్రోహం కాదని, అది ప్రజాస్వామ్యానికి రక్షణ ఛత్రం వంటిదని ఆయన తెలిపారు.

అసమ్మతివాదులపై (Anti-CAA protests) జాతివ్యతిరేకులుగా ముద్రవేయడం రాజ్యాంగ విలువలపై, ప్రజాస్వామ్య వ్యవస్థపై దాడిచేయడంతో సమానమని వ్యాఖ్యానించారు. సీఏఏ నిరసనల్లో ఆస్తుల విధ్వంసానికి సంబంధించి యూపీ సర్కారు (UP Govt) ఆందోళనకారుల నుంచి సొమ్ము రికవరీ చేయడంపై దాఖలైన వ్యాజ్యాలను విచారిస్తున్న ధర్మాసనంలో చంద్రచూడ్‌ భాగస్వామిగా ఉన్నారు.

పౌరసత్వ సవరణ చట్టంపై స్టే ఇవ్వడానికి నిరాకరించిన సుప్రీంకోర్ట్

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో శనివారం నిర్వహించిన ‘జస్టిస్‌ పీడీ దేశాయ్‌ స్మారక 15వ ఉపన్యాస’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ‘ద హ్యూస్‌ దట్‌ మేక్‌ ఇండియా: ఫ్రం ప్లూరాలిటీ టు ప్లూరలిజం’ అనే అంశంపై ఆయన ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్క్ష్యలు చేశారు.

సీఏఏపై సుప్రీంకోర్టు గడప తొక్కిన తొలి రాష్ట్రంగా గుర్తింపుకెక్కిన కేరళ

ప్రభుత్వ వ్యతిరేక స్వరాలు వినిపించే గొంతుకలను బలవంతంగా మూయించడం దేశ బహుళత్వానికి పెద్దముప్పుగా పరిణమిస్తుందని ఆయన ఈ సంధర్భంగా తెలిపారు. కాగా దేశవ్యాప్తంగా సీఏఏ, ఎన్నార్సీకి వ్యతిరేకంగా ఉవ్వెత్తున ఉద్యమం ఎగిసిపడుతున్న సమయంలోనే జస్టిస్‌ చంద్రచూడ్‌ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకున్నది.

స్వార్థపరుల ఆటలు ఇక సాగవు, ఆవదంతులు నమ్మవద్దు, సీఏఏతో భారతీయులకు ఎలాంటి నష్టం జరగదు

అసమ్మతిని అణచివేయడం అంటే రాజకీయంగా, ఆర్థికంగా, సాంస్కృతికపరంగా, సామాజికంగా అభివృద్ధిని అడ్డుకోవడమేనని అన్నారు. ప్రశ్నించేతత్వాన్ని, అసమ్మతిని అణగదొక్కడానికి అధికార యంత్రాంగాన్ని వినియోగించి భయాన్ని సృష్టించడం, ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టడం నిబంధనల ఉల్లంఘన కిందికి వస్తుంది.

నిరసనల పేరుతో విధ్వంసం సృష్టించిన 'హింసాత్మక ఆందోళనకారుల' ఫోటోలను విడుదల

ప్రజల వ్యక్తిగత స్వేచ్ఛను, వాక్‌ స్వాతంత్య్రాన్ని కాపాడేందుకే అధికార యంత్రాంగాన్ని వినియోగించాల్సి ఉంటుంది. అసమ్మతివాదులపై ఏకపక్షంగా దేశద్రోహులుగా, ప్రజాస్వామ్య వ్యతిరేకులుగా ముద్రవేయడం అనేది రాజ్యాంగ విలువలను కాపాడుతామన్న మన నిబద్ధతపై దాడిచేయమేనని తెలిపారు.

సీఏఏని ఎట్టి పరిస్థితుల్లో అమలు కానివ్వం

ప్రజాస్వామ్య వ్యవస్థకు చర్చలు, భిన్న వాదనలే ప్రాణం. దేశంలోని ప్రతి వ్యక్తి తన వాదనను స్వేచ్ఛగా, బలంగా వినిపించే వాతావరణాన్ని కల్పించడమే ప్రజాస్వామ్యానికి అసలైన పరీక్ష. ప్రజాస్వామ్యాన్ని మనం ఏర్పాటుచేసుకున్న వ్యవస్థలు మాత్రమే నిర్వచించలేవు. సమాజం నుంచి వచ్చే భిన్న స్వరాలను గుర్తించడం, వాటికి విలువ ఇవ్వడం, స్పందించడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని గుర్తించవచ్చని అన్నారు.

కేరళ తర్వాత పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా తీర్మానం చేసిన పంజాబ్ రాష్ట్రం

జాతీయ ఐక్యత అనేది భాగస్వామ్య సాంస్కృతిక విలువలను సూచిస్తుంది. అంతేకాకుండా దేశంలోని ప్రతి వ్యక్తికి ప్రాథమిక హక్కులతోపాటు స్వేచ్ఛ, భధ్రత కల్పిస్తామన్న రాజ్యాంగ మూల సూత్రానికి అది నిదర్శనంగా నిలుస్తుంది.

నచ్చకుంటే పాకిస్తాన్ వెళ్లు

భిన్న సంస్కృతులకు, వైవిధ్యానికి, అసమ్మతికి చోటివ్వడం ద్వారా దేశం నిరంతరం మార్పులు చెందుతున్నదని, ‘ఈ దేశం ప్రతి ఒక్కరిది’ అన్న భావనను పెంపొందిస్తున్నామని పునరుద్ఘాటించినట్టు అవుతుందని జస్టిస్‌ చంద్రచూడ్‌ చెప్పారు.

సీఏఏ నచ్చకుంటే దేశం విడిచి వెళ్లిపోండి

హిందూ దేశం లేదా ముస్లిం దేశం అన్న భావనను మన రాజ్యాంగ నిర్మాతలు తిరస్కరించారు. వారు మన దేశాన్ని ‘గణతంత్ర రాజ్యం’గా మాత్రమే నిర్వచించారు. భవిష్యత్తు తరాల వారు భిన్నత్వంలో ఏకత్వాన్ని పాటిస్తూ ‘మనమంతా భారతీయులం’ అనే భావనతో కలిసిమెలిసి ఉంటారని మన పూర్వీకులు నమ్మారని ఆయన అన్నారు.