Shaheen Bagh Shooting: ఢిల్లీలో మళ్లీ కాల్పుల కలకలం, జామియా యూనివర్సిటీ ఘటన మరువక ముందే మరో ఘటన, కాల్పుల ఘటన వెనుక కారణాలను అన్వేషిస్తున్న ఢిల్లీ పోలీసులు
Kapil Gujjar being taken away by police after he opened fire at Shaheen Bagh (Photo Credits: ANI)

New Delhi, February 1: జామియా యూనివర్సిటీ (Jamia Millia Islamia University) వద్ద కాల్పుల ఘటన మరువక ముందే మరోసారి ఢిల్లీలో (Delhi) కాల్పుల కలకలం రేగింది. ఈ ఘటనతో అక్కడ ఆందోళన కారులు భయాందోళనలకు గురవుతున్నారు. ఢిల్లీ పోలీసులే కాల్పులు జరిపిస్తున్నారని ఆందోళనకారులు ఆరోపించారు.

పౌరసత్వ సవరణ చట్టానికి (CAA) వ్యతిరేకంగా ఈరోజు షాహీన్ బాగ్ (Shaheen Bagh)ప్రాంతంలో నిరసన ప్రదర్శన కొందరు నిర్వహిస్తున్నారు. ఆసమయంలో కపిల్ గుజ్జర్ 2 రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపాడు. అప్రమత్తమైన పోలీసులు గుజ్జార్ ను అదుపులోకి తీసుకున్నారు.

కపిల్ గుజ్జార్ ను పోలీసులు అరెస్టు చేసినప్పుడు జై శ్రీరాం అంటూ నినాదాలు చేశాడు. కాగా ఉత్తర ప్రదేశ్ కు చెందిన గుజ్జార్ ప్రస్తుతం ఈస్ట్ ఢిల్లీలో నివాసం ఉంటున్నాడు. కాగా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల మొదటి రోజు ఈ కాల్పుల ఘటన జరగటం కొంత కలవరం సృష్టించింది.

Video of the Incident:

కాల్పుల ఘటనల వెనుక ఎవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. గత 20 రోజులుగా షాహీన్ బాగ్ లో ప్రతి రోజు నిరసన ప్రదర్శనలు జరుగుతూనే ఉన్న విషయం విదితమే.

దేశాన్ని కలుషితం చేయవద్దన్న విజయ్ గోయెల్

పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) (Citizenship Amendment Act) వ్యతిరేకంగా జామియా యూనివర్సిటీలో ఆందోళన నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో గత వారం ఆందోళన చేస్తున్నవారిపై ఓ వ్యక్తి హఠాత్తుగా తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఓ విద్యార్ధికి తీవ్రంగా గాయాలయ్యాయి.

Here's The ANi Video

దీంతో అక్కడే ఉన్న పోలీసులు కాల్పులు జరిపిన అగంతకుడిని అదుపులోకి తీసుకున్నారు. కాల్పులు జరిపిన వ్యక్తి విద్యార్ధులపై కాల్పులు జరుపుతూ..‘‘మీరు స్వేచ్ఛను కావాలనుకుంటున్నారు కదూ అయితే తీసుకోండి’’అంటూ వ్యాఖ్యానించారు.

నీ పని నీవు చూసుకో, మోదీ మా దేశ ప్రధాని

ఈ ఘటనపై రాహుల్ గాంధీ (Rahul Handhi) తీవ్ర స్థాయిలో స్పందిస్తూ..కాల్పులు జరిపిన వ్యక్తికి ‘‘డబ్బులు ఎవరు చెల్లించారంటూ?’’ ప్రశ్నించారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న క్రమంలో పార్లమెంటు ఆవరణలో కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రతిపక్ష నేతలు సీఏఏ, ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పిఆర్‌కు వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్న రాహుల్ ఈ ప్రశ్నలు వేశారు.

Here's Priyanka Gandhi Vadra Tweet

మరోవైపు వర్శిటీలో కాల్పుల ఘటనపై ప్రియాంక గాంధీ కూడా ట్విటర్లో స్పందిస్తూ..మోడీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘‘కాల్చిపారేయాలి అంటూ బీజేపీ నేతలు, మంత్రులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం వల్లే ఇవన్నీ జరుగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీని ఎలా తయారు చేయాలనుకుంటున్నారు? అని అడిగితే మోడీ సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. రా? వాళ్లు హింస వైపు నిలబడతారా, అహింస వైపు నిలబడతారా? అభివృద్ధి వైపు నిలబడతారా? అల్లర్ల వైపు నిలబడతారా?’’ అంటూ ప్రశ్నించారు.