Politics

Telangana Assembly Election 2023: ఓటు వేసేందుకు ఆసక్తి చూపని హైదరాబాద్ ఓటర్లు, దారుణంగా పడిపోయిన ఓటింగ్ శాతం, రాష్ట్ర వ్యాప్తంగా మూడు గంటల వరకు సుమారు 51.89 శాతం పోలింగ్ నమోదు

Hazarath Reddy

మధ్యాహ్నం మూడు గంటల వరకు సుమారు 51.89 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. అత్యధికంగా మెదక్ జిల్లాలో 69. 33 శాతం, అత్యల్పంగా హైదరాబాద్ లో 31.17 శాతం పోలింగ్ నమోదైంది. ఇదిలా ఉంటే రూరల్ ఏరియాలో పోలింగ్ శాతం ఎక్కువగా నమోదు అవుతుండగా..హైదరాబాద్ నగరంలో మాత్రం తక్కువ పోలింగ్ నమోదవుతోంది.

Telangana Assembly Election 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు, మధ్యాహ్నం ఒంటిగంట వరకు 36.68 శాతం పోలింగ్‌ నమోదు,అత్యధికంగా మెదక్ జిల్లాలో 50.80 శాతం

Hazarath Reddy

తెలంగాణలో ఎన్నికల పోలింగ్‌ (Telangana Elections 2023) అక్కడక్కడా చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది.ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

Telangana Assembly Election 2023: వీడియో ఇదిగో, చింతమడకలో ఓటు హక్కును వినియోగించుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు

Hazarath Reddy

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ (CM KCR) ఓటు వేశారు. సిద్దిపేట జిల్లాలోని చింతమడక (Chintamadaka) గ్రామంలో సతీమణి శోభతో కలిసి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. గ్రామంలోని 13వ పోలింగ్ కేంద్రంలో సీఎం దంపతులు ఓటు వేశారు. సీఎంకు చింతమడక గ్రామం ఒక సెంటిమెంట్.

Telangana Assembly Election 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు, కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్న టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్

Hazarath Reddy

టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత పవిత్రమైన ఓటు హక్కును నా కుటుంబ సభ్యులతో కలిసి నేను వినియోగించుకున్నా. మన భవిష్యత్ మన చేతుల్లోనే ఉందనే విషయాన్ని ఓటు హక్కు చాటుతుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ లో ఓటర్లందరూ పాల్గొని తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని కోరారు.

Advertisement

Telangana Assembly Election 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు, 11 గంటల వరకు 20.64 శాతం పోలింగ్‌ నమోదు, సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనున్న పోలింగ్

Hazarath Reddy

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల (TS Assembly Elections ) పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. గురువారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌.. సాయంత్రం 5 గంటల వరకూ కొనసాగనుంది. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఆయా పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరారు

Telangana Assembly Election 2023: వీడియో ఇదిగో, బంజారాహిల్స్‌ నందినగర్‌లో ఓటు హక్కును వినియోగించుకున్న మంత్రి కేటీఆర్

Hazarath Reddy

తెలంగాణ మంత్రి కేటీఆర్‌ (Minister KTR) తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. బంజారాహిల్స్‌ నందినగర్‌ (Nandi Nagar)లో గల ఓ పోలింగ్‌ బూత్‌లో భార్యతో కలిసి ఓటు వేశారు.

Telangana Assembly Election 2023: వీడియో ఇదిగో, భార్యా కొడుకుతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్న మంత్రి హరీశ్‌రావు

Hazarath Reddy

మంత్రి హరీశ్‌రావు (Minister Harish Rao) కుటుంబ సభ్యులతో కలిసి సిద్దిపేటలో ఓటు వేశారు. భార్య శ్రీనిత, తనయుడు అర్చిస్‌ మాన్‌తో కలిసి వచ్చిన మంత్రి ఓటు వేసి.. ప్రజలంతా ఓటు వేయాలని పిలుపునిచ్చారు.

Vijayakanth Health Update: డీఎండీకే అధినేత విజయకాంత్ చనిపోయారనే ప్రచారాన్ని ఖండించిన భార్య ప్రేమలత, తప్పుడు వార్తలను నమ్మొద్దని వీడియో ద్వారా విన్నపం

Hazarath Reddy

ప్రముఖ తమిళ సీనియర్ నటుడు, డీఎండీకే అధినేత విజయకాంత్ చనిపోయారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన భార్య ప్రేమలత స్పందిస్తూ... కెప్టెన్ విజయ్ బాగున్నారని చెప్పారు. ఆయన చనిపోలేదని... తప్పుడు వార్తలను నమ్మొద్దని కోరారు. వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారని... త్వరలోనే ఆయన పూర్తిగా కోలుకుని బయటకు వస్తారని చెప్పారు.

Advertisement

Telangana Assembly Election 2023: పది గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 11 శాతం పోలింగ్ నమోదు, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్న పలువురు ప్రముఖులు

Hazarath Reddy

తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. కొన్ని చోట్ల చిన్నచిన్న ఘర్షణలు తలెత్తినా పోలీసులు సర్దిచెబుతున్నారు. రాష్ట్రంలోని అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. ఉదయం ఏడు గంటల నుంచే ఓటర్ల రాక మొదలైంది.

Telangana Assembly Election 2023: ఓటు హక్కును వినియోగించుకున్న AIMIM అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ, వీడియో ఇదిగో..

Hazarath Reddy

తెలంగాణ శాసనసభకు జరుగుతున్న ఎన్నికల పోలింగ్ రాష్ట్రవ్యాప్తంగా జోరుగా కొనసాగుతోంది. కొన్ని చోట్ల ఈవీఎంల మొరాయింపు మినహా ప్రశాంతంగా కొనసాగుతోంది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఉదయాన్నే పోలింగ్ బూత్‌లకు చేరుకుని తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు.

Telangana Assembly Election 2023: ఓటు హక్కును వినియోగించుకున్న మాజీ భారత కెప్టెన్ ముహమ్మద్ అజహరుద్దీన్, వీడియో ఇదిగో..

Hazarath Reddy

తెలంగాణ శాసనసభకు జరుగుతున్న ఎన్నికల పోలింగ్ రాష్ట్రవ్యాప్తంగా జోరుగా కొనసాగుతోంది. కొన్ని చోట్ల ఈవీఎంల మొరాయింపు మినహా ప్రశాంతంగా కొనసాగుతోంది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఉదయాన్నే పోలింగ్ బూత్‌లకు చేరుకుని తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి , మాజీ ఇండియన్ క్రికెటర్ ముహమ్మద్ అజహరుద్దీన్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Telangana Assembly Election 2023: రాష్ట్రంలో పోలింగ్ ప్రశాంతంగా సాగుతున్నదని తెలిపిన ప్రధాన ఎన్నికల అధికారి, ఓటు హక్కును వినియోగించుకున్న వికాస్

Hazarath Reddy

రాష్ట్రంలో 119 మంది సభ్యుల అసెంబ్లీకి ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలిపారు. పోలింగ్ బూత్‌ల వెలుపల ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి అంతర్గత, పట్టణ ప్రాంతాలలో కనిపించారని, ఓటర్లు ఎక్కువగా కనిపించారని. ఇది సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుందని ఆయన అన్నారు.

Advertisement

Amit Shah On CAA: పౌరసత్వ సవరణ చట్టాన్ని ఎవరూ ఆపలేరు, అమలు చేసి తీరుతామని స్పష్టం చేసిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా

Hazarath Reddy

పౌరసత్వ (సవరణ) చట్టాన్ని అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వాన్ని ఎవరూ అడ్డుకోలేరని కేంద్ర హోం మంత్రి అమిత్ షా బుధవారం అన్నారు.

Telangana Assembly Elections 2023: ఓటరుకు లక్ష రూపాయలు ఆఫర్ చేశారని ఆరోపణలు, నాంపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఫిరోజ్ ఖాన్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు

Hazarath Reddy

నాంపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఫిరోజ్ ఖాన్‌పై హైదరాబాద్ పోలీసులు నవంబర్ 29, బుధవారం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2023కి ముందు ఓటరుకు రూ. 1 లక్ష ఆఫర్ చేశారని ఆరోపిస్తూ కేసు నమోదు చేశారు.

Andhra Pradesh Elections 2024: ఏపీలో మరో కొత్త పార్టీ, విశాఖ నుంచి పోటీ కోసం అవసరమైతే కొత్త పార్టీ పెడతానని తెలిపిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ

Hazarath Reddy

2024లో ఏపీలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో విశాఖ నుంచే పోటీ చేస్తానని... అవసరం అయితే కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉందని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ (Former CBI JD Lakshminarayana) స్పష్టం చేశారు. బోగస్ ఓట్లను కచ్చితంగా తొలగించాల్సిందేనని అన్నారు.

Betting On Telangana Elections: తెలంగాణ ఎన్నికలపై కోట్లలో బెట్టింగ్, కాయ్ రాజా కాయ్‌ అంటున్న పందెం రాయుళ్లు, పలు నియోజకవర్గాలపై నెలకొన్న ఆసక్తి

VNS

ఇప్పటికే కోట్ల రూపాయల మేర బెట్టింగులు కాశారు. నవంబరు 30 వతేదీ పోలింగ్ ముగిశాక ఎగ్జిట్ ఫలితాలు (Exit polls) వెలువడే అవకాశం ఉన్నందున డిసెంబర్ 3వతేదీ ఓట్ల లెక్కింపు తేదీ వరకు బెట్టింగ్ లు 9 కోట్ల రూపాయలు దాటుతాయని బెట్టింగ్ రాయుళ్లు చెబుతున్నారు.

Advertisement

Telangana Assembly Elections 2023: ఒవైసీ, మోదీ ఇద్దరి మధ్య రహస్య సంబంధం, వారిద్దరికీ ఈ అవినీతిపరుడైన కేసీఆర్ తోడు, ఎన్నికల ప్రచారంలో సంచలన వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ

Hazarath Reddy

కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ గత కొన్ని రోజులుగా పలు వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్నారు. ప్రపంచ కప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియాతో భారత్ ఓటమిపై ప్రధాని నరేంద్ర మోదీపై ఆయన 'పనౌటీ' వ్యాఖ్యలు వైరల్ అయిన కొద్ది రోజులకే, మంగళవారం తెలంగాణలో జరిగిన ర్యాలీలో గాంధీ మళ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Telangana Assembly Elections 2023: ఇందిరమ్మ రాజ్యమంతా ఎన్‌కౌంటర్లే, వరంగల్ బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలో కాంగ్రెస్ పార్టీపై మండిపడిన సీఎం కేసీఆర్

Hazarath Reddy

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచార ఘట్టం చివరి దశకు చేరుకుంది. ఈ క్రమంలో సీఎం కేసీఆర్‌ ప్రచారంలో దూకుడు పెంచారు. నేడు వరంగల్‌లో బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభకు సీఎం కేసీఆర్‌ హాజరయ్యారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌పై మండిపడ్డారు.

Telangana Assembly Election: నేటితో తెలంగాణ ఎన్నికల ప్రచారం సమాప్తం.. సాయంత్రం 5 గంటలకు మూగబోనున్న మైకులు.. ప్రచారం ముగిసిన వెంటనే అమల్లోకి 144 సెక్షన్

Rudra

రెండు, మూడు నెలల నుంచి హోరాహోరీగా కొనసాగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి మరికొద్ది గంటల్లో తెర పడనున్నది. మంగళవారం (నేడు) సాయంత్రం 5 గంటల్లోగా ప్రచారపర్వం పరిసమాప్తం కానుంది.

PM Modi Roadshow in Telangana: వీడియో ఇదిగో, హైదరాబాద్ రోడ్ షోలో ప్రధాని మోదీపై పూల వర్షం కురిపించిన కార్యకర్తలు, మోదీ మోదీ అంటూ నినాదాలు 

Hazarath Reddy

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్‌లో రోడ్‌షో నిర్వహించారు. 2023 అసెంబ్లీ ఎన్నికలకు నవంబరు 30న పోలింగ్‌కు కొద్దిరోజులు మాత్రమే మిగిలి ఉండగా, ప్రధానమంత్రి కాన్వాయ్‌కు ఉత్సాహభరితమైన ఆదరణ లభించింది

Advertisement
Advertisement