రాజకీయాలు
Maharashtra Shocker: మహారాష్ట్ర ఆసుపత్రిలో భయంకరమైన దృశ్యం, ఒకవైపు కోవిడ్-19 మృతుల శవాలు, పక్కనే రోగులకు చికిత్స. ఇదేం పాలన అంటూ ప్రభుత్వ తీరుపై విరుచుకుపడిన విపక్షం
Team Latestlyఈ వ్యవహారంపై స్పందించిన సియోన్ ఆస్పత్రి డీన్‌ ప్రమోద్‌ ఇంగాలే మాట్లాడుతూ ఆస్పత్రి మార్చురీలో 15 స్లాట్లు ఉండగా, వాటిలో 11 ఇప్పటికే నిండిపోయాయి. వారంతా ఇతర అనారోగ్య కారణాలతో చనిపోయిన వారు. ఇప్పుడుఈ COVID-19 మృతదేహాలను మార్చురీకి తరలిస్తే అది వేరే సమస్యలకు దారి తీస్తుంది. కాబట్టి ఆసుపత్రి బెడ్లపైనే పూర్తిగా చుట్టేసి ఉంచినట్లు తెలిపారు......
Vizag Gas Leak Tragedy: కింగ్‌ జార్జ్‌ ఆస్పత్రిలో బాధితులను ఓదార్చిన ఏపీ సీఎం వైయస్ జగన్, ఆ వదంతులు నమ్మవద్దన్న డీజీపీ గౌతం సవాంగ్, ఘటనపై స్పందించిన ఎల్‌జీ కెమ్ యాజమాన్యం
Hazarath Reddyఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి (AP CM YS Jagan) ప్రత్యేక హెలికాప్టర్‌లో విశాఖపట్నంలోని కింగ్‌ జార్జ్‌ ఆస్పత్రికి చేరుకున్నారు. గ్యాస్‌ లీక్‌ ప్రమాదంలో (Vizag Gas Leak Tragedy) అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. విశాఖ కేజీహెచ్‌లో (KGH hospital) 187 మంది, అపోలో ఆస్పత్రిలో 48 మంది, సెవెన్‌హిల్స్‌ ఆస్పత్రిలో 12 మంది చికిత్స పొందుతున్నారు. సీరియస్‌గా ఉన్నవారిని జీజీహెచ్‌కు తరలిస్తున్నారు.
Maharashtra: స్వయంకృత అపరాధమేనా? మహారాష్ట్రలో కరోనా విజృంభన, ఒక్కరోజులోనే 1233 పాజిటివ్ కేసులు నమోదు, రాష్ట్రంలో 16,758 కు పెరిగిన కోవిడ్-19 బాధితుల సంఖ్య
Team Latestlyమహారాష్ట్రలో కరోనా విజృంభనకు పూర్తిగా రాష్ట్ర సర్కార్ అలసత్వమే కారణం అని చెప్పవచ్చు. ముంబైలో విపరీతమైన రద్దీ ఉంటుందని తెలిసిందే. దేశంలో అప్పటికీ విజృంభిస్తుంది. ముంబైకి సమీపంలోనే ఉన్న పుణెలో కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ పోతుంది. అయినా ప్రభుత్వం తనకేమి పట్టనట్లుగా వ్యవహరించింది.....
Maharashtra MLC Elections: ఉద్ధవ్ థాకరే సీఎం పదవి సేఫ్, మ‌హారాష్ట్ర‌లో మే 21న ఎంఎల్‌సీ ఎన్నికలు, 9 శాస‌న‌మండ‌లి స్థానాల‌కు ఎన్నిక‌లు నిర్వహించనున్న కేంద్ర ఎన్నికల సంఘం
Hazarath Reddyఓ వైపు మహారాష్ట్రలో కరోనావైరస్ (Coronavirus) విజృంభిస్తోంది. మరోవైపు ఉద్ధవ్ థాకరే సీఎం పదవి (Uddhav Thackeray) అంపశయ్యపై ఉంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ థాకరేకు కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) శుభవార్తను అందించింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న శాసనమండలి స్థానాలకు ఎన్నికలు (Maharashtra MLC Elections) నిర్వహించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ ఎన్నికల ద్వారా మ‌హారాష్ట్ర‌ ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే మండలికి ఎన్నికకావడం ఆయన సీఎం పదవి సేఫ్ కావడం వంటి కీలక పరిణమాలు జరగనున్నాయి.
'Alcohol Remove Coronavirus': మద్యం షాపులు తెరవాల్సిందే..! ముఖ్యమంత్రికి కాంగ్రెస్ ఎమ్మెల్యే డిమాండ్, అల్కాహాల్ సేవించడం వల్ల గొంతు నుండి కరోనావైరస్ తొలగిపోతుందని వాదన
Team Latestlyఆల్కహాల్ సంబంధిత శానిటైజర్ తో చేతులు కడుక్కోవడం ద్వారా కరోనావైరస్ ను నివారించగలిగినపుడు, మద్యం సేవించడం వల్ల గొంతు నుండి ఆ వైరస్ తొలగిపోతుంది" అనేది ఎమ్మెల్యే......
Willful Defaulters Case: బ్యాంకు రుణాల ఎగవేత కేసు, బీజేపీపై విమర్శలు ఎక్కుపెట్టిన రాహుల్ గాంధీ, స్కామర్లంతా బీజేపీ సన్నిహిత మిత్రులేనన్న కాంగ్రెస్ ఎంపీ
Hazarath Reddyభారతీయ బ్యాంకులను మోసం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న టాప్ 50 ఉద్దేశపూర్వక ఎగవేతదారుల లిస్ట్ ను (Willful Defaulters Case) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విడుదల చేసిన నేపథ్యంలో మోడీ సర్కార్ పై (Modi Govt) కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆర్‌బీఐ వెల్లడించిన బ్యాంకు రుణాల ఉద్దేశపూర్వక ఎగవేతదారుల జాబితాలో బీజేపీ సన్నిహిత మిత్రులే ఎక్కువగా ఉన్నారని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) ఆరోపించారు.
Kim Jong Un's Health: కిమ్ బతికే ఉన్నాడని వార్తలు, దక్షిణాఫ్రికా అధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలుపుతూ లేఖ, ఆయన ఆరోగ్య వదంతులను కొట్టివేసిన అమెరికా, దక్షిణ కొరియా దేశాలు
Hazarath Reddyఉత్తర కొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ (Kim Jong Un) ఆరోగ్యంపై సోషల్ మీడియాలో అనేక రకాలైన వార్తలు వస్తున్నాయి. ఆయన ఆరోగ్యం సరిగా లేదని కొందరు అంటే, ఆయన చనిపోయారని మరికొందరు వాదిస్తున్నారు. అయితే ఉత్తర కొరియా ప్రభుత్వం (North Korea Govt) నుంచి కిమ్ ఆరోగ్యంపై ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే ఇప్పుడు తాజాగా ఆయన రాసినట్లుగా లేఖ బయటకు వచ్చింది.
Maharashtra CM Uddhav Thackeray: ఉద్దవ్‌ థాకరేకు పదవీ గండం, శాస‌న మండ‌లి స‌భ్యునిగా నామినెట్ చేయాలని మంత్రివర్గం మరొకసారి అభ్యర్థన, ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోని మహారాష్ట్ర గవర్నర్
Hazarath Reddyకరోనావైరస్ మహారాష్ట్రను (coronavirus in Maharashtra) వణికిస్తోంది. దేశంలో కెల్లా అత్యధికంగా అక్కడే ఎక్కువ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర సీఎం ఉద్దవ్‌ థాకరే (CM Uddhav Thackeray) కరోనా కట్టడి పనుల్లో చాలా బిజీ అయ్యారు. అయితే ఇప్పుడు ఆయనకు పదవీ గండం వచ్చి పడింది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర సర్కారు (Maharashtra Govt) మరొకసారి గవర్నర్ తలుపు తట్టారు. ముఖ్య‌మంత్రి ఉద్ద‌వ్ ఠాక్రేను శాస‌న మండ‌లి స‌భ్యునిగా నామినెట్ చేయాలంటూ గ‌వ‌ర్న‌ర్ భ‌గ‌త్‌సింగ్ కోష్యారిని మంత్రివ‌ర్గం మ‌రోసారి అభ్య‌ర్థించింది.
TRS Formation Day: రెండు దశాబ్దాల టీఆర్ఎస్, పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఎగరవేసిన పార్టీ అధినేత, సీఎం కేసీఆర్, నిరాడంబరంగా తెలంగాణ రాష్ట్ర సమితి ఉత్సవాలు
Hazarath Reddyప్రత్యేక రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఆవిర్భవించిన ‘తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) సోమవారం 20వ వసంతంలోకి అడుగుపెట్టింది. కరోనా నీలి నీడలు కమ్ముకున్న ప్రస్తుత తరుణంలో ఈ వేడుకలను అత్యంత నిరాడంబరంగా జరుపుకోవాలని పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ (TRS President K Chandrashekhar Rao) పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో వేడుకలు నిరాడంబరంగా సాగాయి. తెలంగాణ రాష్ట్ర సమితి (telangana rashtra samithi) ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు సోమవారం తెలంగాణ భవన్‌లో పార్టీ జెండాను ఆవిష్కరించారు.
US Immigration Ban: వలసవాదులకు అమెరికా షాక్, 60 రోజుల పాటు అమెరికాలోకి ఎవరూ ఉద్యోగాల కోసం రాకుండా నిషేధం, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు 484 బిలియన్‌ డాలర్ల ప్యాకేజీ
Hazarath Reddyకరోనా సంక్షోభంలో కూరుకుపోయిన అమెరికా (America) తమ దేశ పౌరుల కోసం కీలక నిర్ణయం (US Immigration Ban) తీసుకుంది. అమెరికాలోకి కొన్ని రకాలైన వలసలను రానున్న 60 రోజులపాటు నిషేధిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి.
Sonia Gandhi: కరోనా పేరుతో బీజేపీ మత రాజకీయాలు చేస్తోంది, వలస కూలీలకు వెంటనే ఆహార భద్రత కల్పించండి, కీలక వ్యాఖ్యలు చేసిన సోనియా గాంధీ
Hazarath Reddyకాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో(CWC meeting) కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ (Sonia Gandhi) కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా పేరుతో బీజేపీ (BJP) ద్వేషము, మతతత్వమనే వైరస్‌లను వ్యాపింప చేస్తోందని ఆరోపించారు. కరోనా కల్లోలంతో (Coronavirus Pandemic) దిక్కుతోచని స్థితిలో పడిన వలస కూలీలకు ఆహార భద్రత కల్పించాలని కాంగ్రెస్‌ (Congress) పార్టీ అధినేత్రి సోనియా గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.
New FDI Rules Row: ఇండియా కొత్త ఎఫ్‌డీఐ రూల్స్, ఆవేశం వెళ్లగక్కిన చైనా, భారత్ కొత్త నిబంధనలు డబ్ల్యూటీఓ సూత్రాలకు తూట్లు పొడిచేలా ఉన్నాయంటూ విమర్శలు
Hazarath Reddyవిదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (Foreign direct investment) సంబంధించి భారత్ కొన్ని మార్పులు చేసిన సంగతి విదితమే. కాగా ఎఫ్‌డీఐ (FDI) విషయంలో భారత్ కీలక మార్పులు చేయడంపై చైనా అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రస్తుత కోవిడ్-19 (C)ovid-19) పరిస్థితిని ఆసరాగా చేసుకుని చైనా (China) సహా పొరుగుదేశాలు 'ఆవకాశవాద టేకోవర్'లకు పాల్పడకుండా భారత్‌ ఈ కఠిన చర్యలు చేపట్టింది. ఎఫ్‌డీఐల విషయంలో భారత్‌లో కొత్తగా చోటు చేసుకున్న మార్పులు డబ్ల్యూటీఓ (WTO) సూత్రాలకు తూట్లు పొడిచేలా ఉన్నాయని చైనా పేర్కొంది.
Rahul Gandhi Video Conference: కరోనా నియంత్రణకు లాక్‌డౌన్‌ ఒక్కటే పరిష్కారం కాదు, అన్నీ పార్టీలతో కలిసి పనిచేయాలి, మీడియాతో కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ రాహుల్‌ గాంధీ
Hazarath Reddyదేశంలో కరోనా మహమ్మారిని అరికట్టడానికి లాక్‌డౌన్‌ (Lockdown) ఒక్కటే పరిష్కారం కాదని కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ రాహుల్‌ గాంధీ (Congress MP Rahul Gandhi )అన్నారు. ప్రస్తుతం విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్నామని, ప్రజలతోపాటూ అన్నీ పార్టీలతో అధికార పార్టీ కలిసి పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. లాక్‌డౌన్‌ కేవలం కరోనా వ్యాప్తిని మాత్రమే అడ్డుకుంటుందని, ఆ తర్వాత మళ్లీ విజృంభించే అవకాశం లేకపోలేదన్నారు.
Justice V Kanagaraj: ఏపీకి నయా ఎస్‌ఈసీ, నూతన ఎన్నికల కమిషనర్‌గా రిటైర్డ్‌ జడ్జి జస్టిస్‌ కనగరాజ్‌, నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీ విరమణ, కనగరాజ్ పూర్తి ప్రొపైల్ గురించి ఓ సారి తెలుసుకోండి
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌ నూతన ఎన్నికల కమిషనర్‌(ఎస్‌ఈసీ)గా (AP new State Election commissioner) రిటైర్డ్‌ జడ్జి జస్టిస్‌ కనగరాజ్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ నూతన ఎస్‌ఈసీగా జస్టిస్‌ కనగరాజ్‌ ( Justice V. KanagaRaj) శనివారం ఉదయం బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా రిటైర్డ్‌ జడ్జిని (Retired Justice) నియమించాలని ఏపీ ప్రభుత్వం (AP Govt) నిన్న (శుక్రవారం) ఆర్డినెన్స్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆర్డినెన్స్ మేరకు జస్టిస్ కనగరాజ్‌ను ఎస్‌ఈసీగా ప్రభుత్వం నియమించింది
Trump Thanks PM Modi: 'మీ బలమైన నాయకత్వం, మానవత్వానికి సహాపడుతుంది'. ప్రధాని నరేంద్ర మోదీపై యూఎస్ ప్రెసిడెంట్ ప్రశంసలు, హైడ్రోక్లోరోక్విన్ ఎగుమతిపై ధన్యవాదాలు తెలిపిన ట్రంప్
Vikas Manda"అసాధారణ సమయాల్లో స్నేహితుల మధ్య మరింత పరస్పర సహకారం అవసరం. హెచ్‌సిక్యూపై నిర్ణయం తీసుకున్నందుకు భారత్‌కు, భారతీయ ప్రజలకు ధన్యవాదాలు. మీ సహకారాన్ని మర్చిపోలేము! ఈ పోరాటంలో భారతదేశానికి మాత్రమే కాకుండా, మానవత్వానికి సహాయం చేయడంలో ప్రదర్శించిన బలమైన నాయకత్వానికి ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు..........
India Lockdown: ఒక్కసారిగా లాక్‌డౌన్ ఎత్తివేయలేం, కోవిడ్-19 సంక్షోభం తర్వాత మునిపటిలా జీవితం ఉండకపోవచ్చు, అఖిలపక్షం సమావేశంలో ప్రధాని మోదీ వ్యాఖ్యలు, 11న సీఎంలతో టెలి కాన్ఫరెన్స్
Vikas Mandaఇప్పటికే చాలా రాష్ట్రాలు లాక్డౌన్ పొడగింపుపై కోరుతున్నాయి. దీనిపై రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సంప్రదింపులు జరుపుతామని ప్రధాని తెలిపారు. ఏదేమైనా లాక్డౌన్ ముగించే అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఏప్రిల్ 11న మరోసారి ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం కానున్నారు. అనంతరం లాక్డౌన్ కొనసాగింపుపై కేంద్రం నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.
Assam MLA Aminul Islam: మతాల మధ్య చిచ్చుపెడుతున్న అస్సాం ఎమ్మెల్యే, ఐపిసి సెక్షన్ 124-ఎ కింద దేశద్రోహ అభియోగం కేసు నమోదు, అస్సాంలో 26కి చేరిన కరోనా కేసులు
Hazarath Reddyఅస్సాంలోని (Assam) ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యే మతాలకు సంబంధించి తప్పుడు ప్రచారం చేస్తుండటంతో పోలీసులు అరెస్టు చేశారు. ఐపిసి సెక్షన్ 124-ఎ కింద దేశద్రోహ అభియోగం అతనిపై మోపబడిందని నివేదికలు తెలిపాయి. ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక ఫ్రంట్ (AIUDF) పార్టీకి చెందిన అమీనుల్ ఇస్లాం (Assam MLA Aminul Islam) అనే ఎమ్మెల్యే మతాల మధ్య చిచ్చు పెట్టే వ్యాఖ్యలు చేస్తున్నట్లుగా అస్సాం డీజీపీ భాస్కర్ జ్యోతి మహంతా గుర్తించారు. అతను మాట్లాడిన ఆడియో క్లిప్పింగులు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుండటంతో విషయం పోలీసుల వరకూ వచ్చింది.
UK PM Boris Johnson: మరింత క్షీణించిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఆరోగ్యం, ఐసీయూలో చికిత్స, ఫారెన్ సెక్రెటరీ డొమినిక్ రాబ్‌కు బాధ్యతల అప్పగింత, ప్రశ్నార్థకంగా మారిన పాలన
Vikas Mandaఒకవేళ ప్రధాని ఆరోగ్యం మరింత క్షీణించి ఆయన పాలించలేని పక్షంలో లేదా చనిపోతే ఆయన వారసుడిగా ఎవరుండాలనే దానిపై యూకే కేబినేట్ మినిస్టర్స్ నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. బోరిస్ జాన్సన్ ఐసీయూలో చేరడంతో 'అవసరం మేరకు' విదేశాంగ కార్యదర్శి డొమినిక్ రాబ్‌ను అపద్ధర్మ ప్రధానమంత్రి బాధ్యతలు నిర్వర్తించాల్సిందిగా....
BJP Foundation Day: ప్రధాని మోదీ పంచ సూత్రాలు, వ్యవస్థాపక దినోత్సవం సంధర్భంగా కార్యకర్తలకు పలు సూచనలు, పీఎం కేర్ ఫండ్‌కు విరాళాలు ఇవ్వాలని పిలుపు
Hazarath Reddyబీజేపీ కార్యకర్తలకు మోదీ పంచ సూత్రాలు చెప్పారు. వీడియో సందేశం ద్వారా కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన పార్టీకన్నా దేశమే ముఖ్యమని చెప్పారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో సేవా కార్యక్రమలలో పాల్గొనే వారు తప్పక మాస్కులు ధరించాలని సూచించారు.
BJP Foundation Day 2020: 40వ సంవత్సరాల బీజేపీ, కార్యకర్తలకు, నాయకులకు, వ్యవస్థాపక సభ్యులకు కృతజ్ఞతలు తెలిపిన ప్రధాని మోదీ, కరోనాపై పోరాడాలని కార్యకర్తలకు పిలుపు
Hazarath Reddyభారతీయ జనతా పార్టీ (haratiya Janata Party (BJP)40 వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ (బిజెపి) వ్యవస్థాపక సభ్యులు, నాయకులు, కార్యకర్తలకు ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi)సోమవారం కృతజ్ఞతలు తెలిపారు. సామాజిక దూరం యొక్క ప్రాముఖ్యతను పునరుద్ఘాటించాలని, లాక్డౌన్ (Lockdown) నేపథ్యంలో అవసరమైన వారికి సహాయం చేయాలని మరియు COVID-19 వ్యాప్తిని అధిగమించడానికి భారతదేశాన్ని సిద్ధం చేయాలని పార్టీ కార్యకర్తలకు ప్రధాని తన సందేశంలో విజ్ఞప్తి చేశారు.