రాజకీయాలు

ByElection for Nizamabad: నిజామాబాద్ స్థానానికి ఉపఎన్నిక, షెడ్యూల్ విడుదల చేసిన ఎన్నికల కమీషన్, అనర్హత వేటు పడటంతో ఖాళీ అయిన స్థానం

Vikas Manda

షెడ్యూల్ ప్రకారం మార్చి 12న నోటిఫికేషన్ జారీ చేయబడుతుంది. అభ్యర్థులు నామినేషన్స్ వేసేందుకు చివరి తేది మార్చి 19, నామినేషన్ల పరిశీలన మార్చి 20, నామినేషన్లకు ఉపసంహరణ గడువు మార్చి 23, ఏప్రిల్ 07వ తేదీన ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్, ఏప్రిల్ 9న ఫలితాల వెల్లడి....

Karnataka Budget 2020: ప్రతి ఎమ్మెల్యే మూడు ప్రభుత్వ స్కూళ్లు దత్తత తీసుకోవాలి, వ్యవసాయానికి పెద్ద పీఠ, 7వ సారి బడ్జెట్ ప్రవేశపెట్టిన కర్ణాటక సీఎం యడ్యూరప్ప, ముఖ్యమంత్రిగా 5వసారి..

Hazarath Reddy

కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప (Karnataka CM BS Yediyurappa) 2020-21 ఆర్థిక సంవత్సరానికిగాను అసెంబ్లీలో గురువారం రాష్ట్ర బడ్జెట్ (Karnataka Budget 2020) ప్రవేశపెట్టారు. యడియూరప్ప అసెంబ్లీలో (Karnataka Assembly) రాష్ట్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టడం ఇది ఏడవసారి. కాగా ముఖ్యమంత్రిగా ఆయనకు ఇది అయిదవ సారి. ఈ బడ్జెట్లో వ్యవసాయం, నీటిపారుదల, వరద ప్రభావిత ప్రాంతాల అభివృద్ధి కోసం ఈ బడ్జెట్‌లో పెద్ద పీట వేశారు. బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో వాగ్దానాలు కొన్నింటికి ఈ బడ్జెట్‌లో చోటు కల్పించారు.

Congress MPs Suspended: ఏడుగురు కాంగ్రెస్‌ ఎంపీలపై సస్పెన్షన్‌ వేటు, ఢిల్లీ అల్లర్ల ప్రకంపనలతో వేడెక్కిన పార్లమెంట్, ఇది స్పీకర్ నిర్ణయం కాదు, ప్రభుత్వ నిర్ణయమన్న విపక్ష నేత అధిర్ రంజన్

Hazarath Reddy

ఢిల్లీ అల్లర్లకు సంబంధించి పార్లమెంట్‌లో (Parliament Session) ప్రకంపనలు కొనసాగుతున్నాయి. సభలో అనైతికంగా వ్యవహరించారంటూ లోక్‌సభలో ఏడుగురు కాంగ్రెస్‌ ఎంపీలను స్పీకర్‌ ఓం బిర్లా గురువారం సస్పెండ్‌ (Seven Congress MPs Suspended) చేశారు. సభ సజావుగా జరగకుండా ఆటంకం కలిగిస్తున్న ఈ ఏడుగురిపై స్పీకర్‌ ఓంబిర్లా (Om Birla) చర్యలు తీసుకున్నారు. ఈ ఏడుగురు ఎంపీలను లోక్‌సభ సమావేశాల మిగిలిన రోజులకు స్పీకర్‌ సస్పెండ్‌ చేశారు.

RS 'Not A Bazaar': ఇది పార్లమెంటు..బజారు కాదు, రాజ్యసభలో వెంకయ్య నాయుడు తీవ్ర ఆగ్రహం, ఢిల్లీ అల్లర్లపై చర్చ చేపట్టాలంటూ విపక్షాల డిమాండ్, సభ రేపటికి వాయిదా

Hazarath Reddy

దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన అల్లర్లపై (Delhi violence) రాజ్యసభలో (Rajya Sabha) చర్చ చేపట్టాలంటూ ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. ఈ ఘటనపై చర్చకు పట్టుబట్టిన విపక్షాలు సభలో ఆందోళనకు దిగాయి. చైర్మన్ ఎంత చెప్పినా వినకుండా నినాదాలు చేస్తూ సభను ఆటంకపరిచాయి. దీంతో వెంకయ్య నాయుడు (Chairman Venkaiah Naidu) వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

Uttarakhand: ఏపీ బాటలో ఉత్తరాఖండ్, అసెంబ్లీలో 3 రాజధానుల ప్రకటన చేసిన సీఎం రావత్, వేసవి రాజధానిగా గైర్సైన్‌, రాష్ట్ర రాజధానిగా డెహ్రాడూన్‌, న్యాయ రాజధానిగా నైనిటాల్

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ బాటలో ఇప్పుడు మరో రాష్ట్రం కూడా నడుస్తోంది. ఉత్తరాఖండ్‌కు ఇకపై మూడు రాజధానులు ఉంటాయని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ నేత త్రివేంద్ర సింగ్ రావత్, బడ్జెట్ సమావేశాల్లో కీలక ప్రకటన చేశారు. ఇప్పటికే రాష్ట్ర రాజధానిగా డెహ్రాడూన్, న్యాయ రాజధానిగా నైనిటాల్ ఉండగా, ఇకపై వేసవి రాజధానిగా గైర్సైన్ ఉంటుందని ఆయన ప్రకటించారు. దీంతో ఉత్తరాఖండ్ సైతం మూడు రాజధానులతో ముందుకు దూసుకుపోనుంది.

TDP Leader Suicide Attempt: కర్నూలు టీడీపీ సీనియర్ నేత ఆత్మహత్యాయత్నం, పార్టీ పట్టించుకోలేదంటూ ఆవేదన, గతంలో కర్నూలు మేయర్‌గా సేవలందించిన బంగి అనంతయ్య

Hazarath Reddy

కర్నూలు టీడీపీ సీనియర్ నేత బంగి అనంతయ్య (TDP leader Bangi Anantaiah) తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన చికిత్స నిమిత్తం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు.

Rahul Gandhi: కార్యకర్తలకు, నేతలకు రాహుల్ గాంధీ షాక్, పార్టీ పగ్గాలు చేపట్టే ప్రసక్తే లేదంటున్నారంటూ వార్తలు, ఏప్రిల్‌లో జరిగే పార్టీ ప్లీనరీ సమావేశంలో కీలక ప్రకటన వెలువడే అవకాశం

Hazarath Reddy

దశాబ్దాల పాటు మకుటం లేని మహరాజుగా దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీని (Congress Party) ఇప్పుడు నాయకత్వ లేమి వెంటాడుతోంది. బీజేపీ (BJP) దెబ్బకు రెండు సార్లు ప్రతిపక్షానికే పరిమితమైన కాంగ్రెస్ పార్టీని నడిపించే వారే కరువయ్యారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని విజయతీరాలకు చేరుస్తాడు అని భావిస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలు,నాయకుల ఆశలపై రాహుల్ గాంధీ నీళ్లు చల్లారనే వార్తలు వస్తున్నాయి.

Holi Milan Programme: కరోనా కలవరం, హోళీ వేడుకలకు దూరంగా ప్రధాని మోదీ, వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు హోళీ పండుగ వేడుకలకు దూరంగా ఉండాలని ప్రజలకు పిలుపు

Hazarath Reddy

కోవిడ్‌-19 (Coronavirus) వ్యాప్తిపై ఉలాంటి ఆందోళన అవసరం లేదని ప్రకటించిన భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi) హోలీ వేడుకలకు దూరమని ప్రకటించారు. పెరుగుతున్న కరోనా వైరస్ ఆందోళనల దృష్ట్యా, ఈ సంవత్సరం హోలీ వేడుకలకు (Holi Milan 2020 Programme) దూరంగా వుంటున్నానని ట్విట్టర్ ద్వారా ప్రధాని ప్రకటించారు. అలాగే ఈ వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు హోలీ (Holi 2020) పండుగ వేడుకలకు దూరంగా ఉండాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

Advertisement

Telangana: భవనాలు కూల్చడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని అధికారాలు ఉన్నాయి, హైకోర్టుకు స్పష్టం చేసిన తెలంగాణ ప్రభుత్వం, విచారణ రేపటికి వాయిదా వేసిన న్యాయస్థానం

Vikas Manda

రాజకీయ దురుద్దేశాలతో కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, తెలంగాణ జన సమితి (టిజెఎస్) ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వర్ రావు సచివాలయ నిర్మాణాన్ని అడ్డుకోవడానికి ఈ వ్యాజ్యాలు వేశారు. ఇప్పుడున్న సచివాలయ భవనాలు మరో 70 ఏళ్ల పాటు వినియోగించవచ్చు అని పిటిషనర్లు చేసే వాదనల్లో ఎలాంటి సాంకేతిక ఆధారాలు లేవని కోర్టులో ప్రభుత్వ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.....

Spandana Program: ఉగాది రోజున 25 లక్షల ఇళ్ల స్థలాల పంపిణీ, వచ్చే నెల 1వ తేదీన 2 గంటల్లోగా పెన్షన్ల పంపిణీ పూర్తి, స్పందన కార్యక్రమంలో ఏపీ సీఎం జగన్, ఏపీలో మళ్లీ ఎన్నికల కోలాహలం

Hazarath Reddy

పరిపాలనలో దూసుకుపోతున్న ఏపీ సీఏం జగన్ (AP CM YS Jagan) కీలక నిర్ణయాలతో ప్రజల అభిమానాన్ని చూరగొంటున్నారు.పేదలందరికీ ఇళ్ల స్థలాలు పంపిణీ చేసేందుకు స్థలాల గుర్తింపు, ప్లాట్ల అభివృద్ధి అనుకున్న గడువులోగా పూర్తి చేయాలని అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆదేశించారు.

AP CM Jagan on NPR: మోదీ ప్రభుత్వానికి సున్నితంగా ఎదురెళుతున్న ఏపీ సీఎం, మైనారిటీల్లో అభద్రతాభావం.. ఎన్‌పీఆర్‌పై ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీలో తీర్మానం చేస్తామని ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి

Vikas Manda

మోదీ ప్రభుత్వం కొత్తగా రూపొందించిన ఎన్‌పిఆర్ లో కొన్ని ప్రశ్నలుగా తల్లిదండ్రుల జన్మించిన ప్రదేశం, ఆధార్ నంబర్, పాస్‌పోర్ట్ నంబర్, మొబైల్ ఫోన్ నంబర్, ఓటరు ఐడి నంబర్, మాతృభాష తదితర వివరాలు ఉన్నాయి.అయితే వీటిపై సీఎం జగన్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మోదీ సర్కార్ ఏర్పడక ముందు 2010లో ఉన్నట్లుగానే జనాభా రిజిస్టర్‌ను అప్‌డేట్ చేయాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి కేంద్రాన్ని కోరుతున్నారు....

AP Local Body Polls: స్థానిక సంస్థల ఎన్నికలపై గురిపెట్టిన సీఎం జగన్, నెల రోజుల్లోగా ఎన్నికలు పూర్తి కావాలని అధికారులకు ఆదేశాలు, ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడితే జైలుకే అని హెచ్చరిక

Vikas Manda

స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం జగన్ ఫుల్ ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తుంది. మూడు రాజధానుల అంశం, ప్రభుత్వ ఇతర నిర్ణయాలను ప్రతిపక్షం, ముఖ్యంగా చంద్రబాబు అండ్ కో తీవ్రంగా వ్యతిరేకిస్తూ తన పాలనకు వ్యతిరేకంగా భారీగా ప్రచారం చేస్తున్న సందర్భంలో, ఈ ఎన్నికల్లో ప్రతిపక్షాలకు ఏమాత్రం గెలిచే అవకాశం ఇవ్వకుండా పూర్తిగా ఆధిపత్యం సాధించి

Advertisement

Nation is Supreme: దిల్లీ అల్లర్లపై పార్లమెంటులో లొల్లి. రాజకీయ లబ్ది కన్నా, దేశ ప్రయోజనాలే ముఖ్యం, శాంతి సామరస్యాలను నెలకొల్పాలని సహచర మంత్రులకు ప్రధాని మోదీ సూచన

Vikas Manda

దేశ అభివృద్దే ధ్యేయంగా బీజేపీ ప్రభుత్వం పని చేస్తుంది అని, అయితే అందుకు శాంతియుత వాతావరణం ఉండాలి అని ప్రధాని కోరుకుంటున్నారని పార్లమెంట్ సభావ్యవహరాల మంత్రి ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు. "దేశమే మా సుప్రీం, అభివృద్ధి మా మంత్రం" అని జోషి అన్నారు.....

Telangana: సిఎఎకు వ్యతిరేకంగా తెలంగాణ అసెంబ్లీ తీర్మానిస్తే గవర్నర్ తమిళిసై అదే పనిచేస్తారా? కేరళ గవర్నర్‌ను అనుసరించనున్న తెలంగాణ గవర్నర్

Vikas Manda

ఇదిలా ఉండగా మార్చి 06 నుంచి ప్రారంభం కాబోయే అసెంబ్లీ సమావేశాలలో 2020-21కి గానూ తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ను ప్రభుత్వం సమర్పించనుంది. ఆర్థిక మంత్రి హరీశ్ రావు సభలో బడ్జెట్ ప్రవేశ పెడతారు. ఇక రైతుబంధు నిధులు, డబుల్ బెడ్ రూం ఇండ్లు, ఇతర సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని ప్రతిపక్షం సిద్ధమవుతోంది.....

Chandrashekhar Aazad: రాజకీయాల్లోకి భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్, అతి త్వరలో రాజకీయ పార్టీ ప్రకటన, 2022 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ

Hazarath Reddy

పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా (Anti-CAA Protests) గళం విప్పుతూ నిరసనలు కొనసాగిస్తున్న భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ (Bhim Army, Chandra Shekhar Aazad) త్వరలో రాజకీయాల్లోకి రానున్నారు. అతి త్వరలోనే ఆయన రాజకీయ పార్టీ పెట్టబోతున్నారని తెలుస్తోంది.

Amit Shah: కలకత్తాలో అమిత్‌షా, గో బ్యాక్ అంటూ వామపక్షాలు, కాంగ్రెస్ నిరసనలు, హోమంత్రి పదవి నుంచి అమిత్ షా తప్పుకోవాలంటూ నినాదాలు

Hazarath Reddy

కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Union Home Minister Amit Shah), భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాకు (Kolkata) చేరుకున్నారు. అయితే వారి రాకకు వ్యతిరేకిస్తూ నలుపు బెలూన్లతో వామపక్ష విద్యార్థి సంఘాల కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. ఢిల్లీలో జరిగిన అల్లర్లపై కేంద్రానిదే బాధ్యత అని, హోమంత్రి పదవి నుంచి అమిత్ షా తప్పుకోవాలంటూ నినాదాలు చేశారు.

Advertisement

Mukesh Ambani Meets AP CM: గంటన్నరపాటు ముఖేష్ అంబానీతో ఏపీ సీఎం చర్చలు, సీఎం అయిన తరువాత తొలిసారి అంబానీతో మీటింగ్, పారిశ్రామిక పెట్టుబడులే లక్ష్యంగా..

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో (Andhra Pradesh Chief Minister YS Jagan Mohan Reddy) రిలయన్స్ అధినేత ముకేశ్‌ అంబానీ (Mukesh Ambani) భేటీ ముగిసింది. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో (CM’s Camp Office) దాదాపు గంటన్నర పాటు సీఎం జగన్‌తో అంబానీ బృందం చర్చలు జరిపింది. ఏపీలో పరిశ్రమల ఏర్పాటు అంశంపై వీరు చర్చించారు.

Telangana Budget Session 2020: మార్చి 6 నుంచి తెలంగాణా అసెంబ్లీ సమావేశాలు, 8న అసెంబ్లీకి రానున్న తెలంగాణా బడ్జెట్, కేసీఆర్ బడ్జెట్‌పై సర్వత్రా ఆసక్తి

Hazarath Reddy

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు (Telangana Assembly Budget Sessions) మార్చి 6వ తేదీన ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ శనివారం విడుదలైంది. రెండు వారాలపాటు జరగనున్న ఈ సమావేశాలు తొలి రోజున రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్య రాజన్ ప్రసంగంతో ఉభయ సభలు ప్రారంభంకానున్నాయి. మార్చి 8వ తేదీన ఆర్థిక శాఖమంత్రి తన్నీరు హరీశ్ రావు (Harish Rao) అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అలాగే శాసన సభ వ్యవహారాల శాఖమంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అదే బడ్జెట్ ను కౌన్సిల్ లో ప్రవేశపెట్టనున్నారు.

'RajDharma' Row: వాజ్ పేయినే లెక్క చేయలేదు..మీకు మేమెంత, రవి శంకర్ ప్రసాద్‌కి కౌంటర్ విసిరిన కపిల్ సిబాల్, అధికార, ప్రతిపక్షాల మధ్య వేడెక్కిన ‘రాజధర్మ’ వార్

Hazarath Reddy

‘రాజధర్మం’ (Raj Dharma Row) అధికార, ప్రతిపక్షాల మధ్య చిచ్చు రాజేసింది. కాంగ్రెస్‌ హయాంలో రాజధర్మాన్ని పాటించామని అన్ని వర్గాల ప్రజలను రక్షించామని ఆ పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలు అధికార, ప్రతిపక్షాల మధ్య చిచ్చుకు కారణమయ్యాయి. తాజాగా కేంద్ర న్యాయశాఖా మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు (Ravi Shankar Prasad) కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ (Kapil Sibal) సిబాల్ శనివారం కౌంటర్ ఇచ్చారు.

Congress Fact-Finding Panel: ఢిల్లీ అల్లర్లపై కాంగ్రెస్ నిజనిర్థారణ కమిటీ, అమిత్ షా రాజీనామా చేయాలన్న సోనియా గాంధీ, మాకు రాజధర్మం నేర్పవద్దని రవిశంకర్ ప్రసాద్ చురకలు

Hazarath Reddy

ఢిల్లీలో అల్లర్లకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యమే కారణమని కాంగ్రెస్‌ పార్టీ (Congress) ఆరోపణలు చేస్తోంది. ఈ పరిస్థితులు ఇలా ఉంటే ఢిల్లీ అల్లర్లపై కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఐదుగురు సభ్యులతో నిజ నిర్ధారణ కమిటీ (Congress Fact-Finding Panel) ఏర్పాటు చేస్తున్నట్టు సోనియా గాంధీ తెలిపారు. ఈ బృందం ఘర్షణలు జరిగిన ప్రాంతాల్లో పర్యటించనుంది. ఈ కమిటీలో ముకుల్‌ వాస్నిక్‌, తారిక్ అన్వర్, సుష్మితా దేవ్, శక్తిసిన్హా గోహిల్‌, కుమారి సెల్జా సభ్యులుగా ఉన్నారు.

Advertisement
Advertisement