రాజకీయాలు

Pawan Kalyan In Delhi: ఢిల్లీలో జనసేనాధినేత, బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నడ్డాను కలిసిన పవన్ కళ్యాణ్, రాజధాని మార్పు, సీఎం జగన్ నిర్ణయాలపై సమాలోచనలు, నేరుగా కాకినాడకు రానున్న పవన్ కళ్యాణ్

Hazarath Reddy

జనసేన (Janasena) అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీలో ప్రత్యక్షమయ్యారు. ఢిల్లీలో (Delhi) బీజేపీ(BJP) వర్కింగ్ ప్రెసిడెంట్ నడ్డాను(Jagat Prakash Nadda) కలిసారు. ప్రధానంగా వీరిద్దరి మధ్య ఏపీ రాజకీయాలపై చర్చలు జరిగినట్లుగా తెలుస్తోంది.

AP Capital: ముగిసిన హై పవర్ కమిటీ సమావేశం, రాజధానిపై ఇంకా రాని స్పష్టత, ఈ నెల 20న అసెంబ్లీ సమావేశంలో స్పష్టత వచ్చే అవకాశం, 17న మరోసారి సమావేశం కానున్న హైపవర్ కమిటీ

Hazarath Reddy

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ( Andhra Pradesh) పరిపాలన వికేంద్రీకరణ, సమగ్రాభివృద్ధిపై ఏర్పాటైన హై పవర్‌ కమిటీ (High-power committee) మరోసారి సమావేశమైంది. రాజధానిపై జీఎన్‌ రావు (G N Rao committee) నేతృత్వంలోని నిపుణుల కమిటీ సిఫార్సులు, బోస్టన్‌ కన్సల్టెన్సీ గ్రూప్‌ (బీసీజీ) (Boston Consulting Group,BCG)నివేదికపై అధ్యయనం చేసేందుకు ఈ కమిటీని నియమించిన సంగతి తెలిసిందే.

Bhainsa Riots: భైంసాలో చెలరేగిన మత ఘర్షణలు, అర్ధరాత్రి వరకు బీభత్సం, 144 సెక్షన్ అమలు చేసిన పోలీసులు, నివురుగప్పిన నిప్పులా ఉన్న పరిస్థితులు

Vikas Manda

భైంసా అతిసున్నితమైన పట్టణం. హైదరాబాద్ పాతబస్తీ లేదా దేశంలో ఎక్కడ ఎలాంటి మతపరమైన గొడవలు జరిగినా, భైంసా పట్టణంలో పరిస్థితులు ఒక్కసారి మారిపోతాయి. ప్రస్తుతం దేశంలో.....

Jagan-KCR Meet: 4వసారి కలవనున్న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వేదిక కానున్న ప్రగతి భవన్, కీలక అంశాలు చర్చకు వచ్చే అవకాశం, పెండింగ్‌లో ఉన్న అంశాలు, చర్చకు వచ్చే అంశాలపై ఓ లుక్కేయండి

Hazarath Reddy

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు (Telugu States Chief Ministers) నేడు మరోసారి సమావేశం కాబోతున్నారు. ఈ మధ్నాహ్నం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్..(Chief Minister K Chandrasekhar Rao)ఏపీ ముఖ్యమంత్రి జగన్(Chief Minister YS Jagan Mohan Reddy) ను విందుకు ఆహ్వానించారు. ఏపీ సీఎం జగన్ రెండు రోజులుగా హైదరాబాద్‌లోని(Hyderabad) లోటస్ పాండ్‌లోనే ఉంటున్నారు. నాలుగు నెలల విరామం తరువాత ఇద్దరి మధ్య సాగుతున్న సమావేశం కావటంతో దీని పైన ఆసక్తి నెలకొని ఉంది.

Advertisement

Alla Ramakrishna Reddy Arrest: ఆళ్ల రామకృష్ణారెడ్డి అరెస్ట్, అధికార వికేంద్రీకరణ జరగాలంటూ ర్యాలీ, అనుమతి లేదన్న పోలీసులు, అయినా ర్యాలీకి సిద్ధమైన ఎమ్మెల్యే ఆర్కే, వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్న వైసీపీ శ్రేణులు

Hazarath Reddy

వైసీపీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని(YSRCP MLA Alla Ramakrishna Reddy) పోలీసులు అరెస్ట్ చేశారు. అధికార వికేంద్రీకరణ జరగాలని కోరుతూ వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే(MLA RK) మంగళగిరిలో ర్యాలీని చేయాలని నిర్ణయించారు. మంగళగిరి (Mangalagiri) నుంచి తాడేపల్లిలోని(Tadepalli) ముఖ్యమంత్రి జగన్ (CM Jagan)నివాసం వరకూ ర్యాలీ చేసేందుకు సిద్ధమయ్యారు. పెద్దయెత్తున వైసీపీ శ్రేణలు మంగళగిరికి చేరుకున్నాయి. అయితే పోలీసులు ర్యాలీకి అనుమతి లేదని చెప్పారు. అయినా ర్యాలీకి ఆళ్ల రామకృష్ణారెడ్డి సిద్దమవడంతో పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.

Amit Shah Challenges Opposition: దమ్మంటే ఆ నిబంధనను ప్రూవ్ చేయండి, సీఏఏపై ప్రతిపక్షాలకు సవాల్ విసిరిన అమిత్ షా, పౌరసత్వం ఎక్కడ రద్దవుతుందో చెప్పాలన్న కేంద్ర హోం మంత్రి

Hazarath Reddy

CAAతో ఎవరి పౌరసత్వం పోదని బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా (Union Home Minister Amit Shah)అన్నారు.మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లో CAAకు మద్దతుగా నిర్వహించిన సభలో అమిత్ షా (Amit Shah) ఈ అంశంపై ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు.

Pakistan BAT: క్రూరమైన చర్యకు పాల్పడిన పాక్, ఇద్దరు పోర్టర్లను చంపి ఒకరి తలను తీసుకెళ్లిన దాయాది దేశం, విచక్షణా రహితంగా మోర్టార్లను ప్రయోగించిన పాకిస్తాన్, సరైన సమయంలో స్పందిస్తామని పాక్‌ను హెచ్చరించిన ఆర్మీ చీఫ్ నరవణే

Hazarath Reddy

దాయాది దేశం పాకిస్తాన్‌ మరోసారి తన దుర్మార్గపు నిజ స్వరూపాన్ని చాటుకుంది. పాక్‌ సైన్యానికి చెందిన బోర్డర్‌ యాక్షన్‌ టీం(బీఏటీ)(Pak Border Action Team) అత్యంత క్రూరమైన చర్యకు పాల్పడింది. భారత సైన్యానికి సామగ్రిని సరఫరా చేసే ఇద్దరు పోర్టర్లను(Indian Porters) చంపి ఒకరి తలను నరికి తమ వెంట తీసుకెళ్లింది. గతంలో భారత జవాన్ల (Indian army) తలు నరికిన ఘటనలు ఉన్నప్పటికీ, ఇలా పౌరుని తలను మాయం చేయడం ఇదే మొదటిసారని సైన్యం పేర్కొంది.

Vijay Sai Reddy Letter: చంద్రబాబుకు బిగిస్తున్న ఉచ్చు, వైసీపీ ఎంపీ లేఖపై స్పందించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా, తగు చర్యలు తీసుకోవాలని కేంద్ర సిబ్బంది వ్యవహారాలశాఖకు సూచన

Hazarath Reddy

ఏపీకి సంబంధం లేని వ్యక్తిని హైదరాబాద్‌ సీబీఐ జేడీగా (CBI JD) నియమించాలంటూ వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి రాసిన లేఖపై(Vijay Sai Reddy Letter) కేంద్రహోంమంత్రి అమిత్‌షాకు లెటర్ రాసిన సంగతి విదితమే.. అయితే ఈ లేఖపై అమిత్ షా(Union Home Minister Amit Shah) స్పందించారు. ఆయన లేఖకు జవాబు ఇచ్చారు.

Advertisement

Dr Syama Prasad Mookerjee Port: కోలకతా పోర్టు ఇకపై శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పోర్టు, పేరు మార్చిన ప్రధాని, పౌరసత్వంపై ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయి, అది ఇచ్చేదే కాని రద్దు చేసేది కాదు, కోల్‌కతాలో ప్రధాని స్పీచ్ హైలెట్స్..

Hazarath Reddy

పశ్చిమ బెంగాల్‌ పర్యటనలో(West Bengal) ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ(PM Narendra Modi) కీలక నిర్ణయం తీసుకున్నారు. కోల్‌కత నౌకాశ్రయానికి (Kolkata Port) భారతీయ జనసంఘ్‌ వ్యవస్థాపకుడు డాక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌ ముఖర్జీ(Syama Prasad Mookerjee Port) పేరు పెడుతున్నట్టు ఆదివారం ప్రకటించారు. నేతాజీ స్టేడియంలో జరిగిన కోల్‌కత నౌకాశ్రయ ట్రస్ట్ 150వ వార్షికోత్సవంలో పాల్గొన్న ప్రధాని ఈ ప్రకటన చేశారు.

Prudhvi Raj Audio Leaked: వెనక నుంచి పట్టుకుందామనుకున్నా, నువ్వే గుర్తుకు వస్తున్నావు, కలకలం రేపుతున్న ఎస్వీబీసీ చైర్మన్ రాసలీలల ఆడియో టేపు, ఆ వాయిస్ తనది కాదంటున్న యాక్టర్ పృథ్వీరాజ్, కఠిన చర్యలు దిశగా ప్రభుత్వం

Hazarath Reddy

ఎస్వీబీసీ చైర్మన్,(SVBC chairman) సినీ నటుడు పృథ్వీరాజ్ (Prudhvi Raj) ఇప్పటికే పోసానితో(Posani Krishna Murali) వివాదంలో చిక్కుకున్న నేపథ్యంలో తాజాగా ఆయన మరో వివాదంలో చిక్కుకున్నారు. ఎస్వీబీసీ మహిళా ఉద్యోగితో ఆయన అసభ్యంగా మాట్లాడారని, లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆయనపై ఆరోపణలు వెల్లువెత్తాయి.

AP Special Assembly Session: క్లైమాక్స్‌లో రాజధాని అంశం, ఈ నెల 20న అసెంబ్లీ ప్రత్యేక సమావేశం, రాజధానిపై కమిటీలు అందించిన నివేదికపై చర్చలు, కీలక ప్రకటన వెలువడే అవకాశం

Hazarath Reddy

ఏపీ రాజధానిపై (AP Capital)ఏదో ఒకటి తేల్చేందుకు ప్రభుత్వం (AP GOVT) శరవేగంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఈ నెల 20వ తేదీన ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ (AP Legislative assembly), 21న శాసనమండలి ప్రత్యేకంగా సమావేశం కానున్నాయి. ఈ సందర్భంగా హై పవర్‌ కమిటీ (High Power committee) నివేదికను ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది.

AP Capital-Political Stir: అమరావతిలో భూమి విలువ కోటీ నుంచి రూ.10 లక్షలకు పడిందన్న చంద్రబాబు, బాబుకు సలహాలిచ్చేది చిట్టినాయుడే అంటున్న విజయసాయి రెడ్డి, తిరుపతిలో చంద్రబాబు ర్యాలికి అనుమతిని నిరాకరించిన పోలీసులు, రాజధానిపై కొనసాగుతున్న సస్పెన్స్

Hazarath Reddy

రాజధాని అంశం (Ap Capital Issue) మీద ఓ పక్క నిరసనలు, మరో పక్క స్వాగతిస్తూ ర్యాలీలు జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం (AP GOVT)నుంచి ఏపీ రాజధాని అంశంపై ఇంకా అధికారికంగా ఎటువంటి ప్రకటన రాలేదు. అయితే ఎవరికి వారు తమ అబిప్రాయాలతో ఏపీలో (AP) వేడిని పుట్టిస్తున్నారు. టీడీపీ నేతలు (TDP) అమరావతే రాజధానిగా (Amraravathi) ఉండాలంటూ ధర్నాలు నిరసనలు చేస్తుంటే దీనికి భిన్నంగా వైసీపీ నేతలు(YSRCP) మూడు రాజధానులకు (3 Capitals) అనుకూలంగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు.

Advertisement

AP Capital-Sujana Chowdary: అమరావతిని అంగుళం కూడా కదల్చలేరు, బీజేపీ ఎంపీ సుజనా చౌదరి ఆసక్తికర వ్యాఖ్యలు, రాజధానిపై కేంద్రం జోక్యం చేసుకోదు, అది రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లోనే ఉంటుందన్న బీజేపీ నేత జీవీఎల్, ప్రజలను గందరగోళంలోకి నెడుతున్న బీజేపీ నేతలు

Hazarath Reddy

అమరావతిని (Amaravathi) ఏపీ సీఎం జగన్ (AP CM YS Jagan) ఒక్క అంగుళం కూడా కదల్చలేరని బీజేపీ ఎంపీ సుజనా చౌదరి (BJP MP Sujana Chowdary) సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధాని అమరావతి విషయంలో రైతుల పోరాటానికి కేంద్రంలోని మా ప్రభుత్వం సహకరిస్తుందని భావిస్తున్నానని, ఈ విషయంలో అవసరమైతే తాను వ్యక్తిగత పోరాటం చేస్తానని బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి ప్రకటించారు.

Citizenship Amendment Act: ఎట్టకేలకు సీఏఏ అమల్లోకి, 2019 డిసెంబర్‌ 11న పార్లమెంట్‌ ఆమోదం, ముస్లీంలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న కేంద్ర ప్రభుత్వం, దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న నిరసనలు

Hazarath Reddy

పౌరసత్వ సవరణ చట్టం (Citizenship Amendment Act (CAA))జనవరి 10వ తేదీ నుంచి అమల్లోకి వచ్చిందని కేంద్రం శుక్రవారం ప్రకటించింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌ల్లో ( Pakistan, Bangladesh, Afghanistan ) మత వివక్ష ఎదుర్కొని భారత్‌కు శరణార్ధులుగా వచ్చిన హిందూ, సిఖ్, జైన్, పార్శీ, క్రిస్టియన్, బౌద్ధ మతస్తులకు(Hindu, Christian, Sikh, Buddhist and Parsi communities) భారత పౌరసత్వం( Indian citizenship) కల్పించేందుకు ఈ చట్టాన్ని రూపొందించారు.

Telangana: కరీంనగర్‌లో మొదలైన ఎన్నికల నామినేషన్స్ ప్రక్రియ, తెలంగాణ అంతంటా ముగిసిన గడువు, రాష్ట్రంలో కొనసాగుతున్న మున్సిపల్ ఎన్నికల వేడి

Vikas Manda

రీంనగర్ మునిసిపల్ కార్పొరేషన్ (Karimnagar Municipal corporation) కోసం నామినేషన్ల ప్రక్రియ ఇప్పుడు ప్రారంభమైంది. కరీంనగర్ కార్పోరేషన్ లోని 3, 24, 25 డివిజన్లలో ఓటరు జాబితాలో అవకతవకలు జరిగాయంటూ సింగిల్ జడ్జి బెంచ్ లో రిట్ పిటిషన్ దాఖలవడంతో...

CBI Summons Minister Sabitha: ఏపీ సీఎం జగన్ కేసులో తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి సీబీఐ సమన్లు, జనవరి 17న విచారణకు హాజరు కావాలని ఆదేశాలు

Vikas Manda

అనంతపురం జిల్లాలో పెన్నా సిమెంట్స్‌కు భూముల కేటాయింపు మరియు తాండూర్‌ తదితర ప్రాంతాల్లో గనుల కేటాయింపు వ్యవహారాల్లో అవకతవకలు జరిగాయని చార్జిషీట్‌లో సీబీఐ పేర్కొంది....

Advertisement

AP Capital-Foot March: అమరావతిలో ఉద్రిక్తత, మహిళలపై లాఠీచార్జ్, పలువురికి గాయాలు, గుంపులుగా రావడంతోనే వారిని నిలువరించామన్న పోలీసులు, ఫేక్ వీడియోలు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవన్న ఎస్పీ, వేడెక్కిన టీడీపీ, వైసీపీ సోషల్ మీడియా వార్

Hazarath Reddy

అమరావతిలో(Amaravathi) ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాజధానిని (AP Capital) అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ.. 29 గ్రామాల రైతులు, ప్రజలు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. దీంతో రాజధాని గ్రామాల్లో పోలీసులు భారీగా మోహరించారు. ఉద్దండరాయునిపాలెం(Uddandrayuni Palem) నుంచి విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం (Kanakadurga temple) వరకు మహిళలు నిర్వహించ తలపెట్టిన పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు.

Fact-Finding Committee: అమరావతికి నిజ నిర్ధారణ కమిటీ, మహిళలపై పోలీసుల దాడిని సుమోటోగా స్వీకరించిన జాతీయ మహిళా కమీషన్, నిజ నిర్ధారణ కమిటీ నివేదిక సమర్పించిన అనంతరం తదుపరి చర్యలు, ట్విట్లర్లో వెల్లడించిన జాతీయ మహిళా కమీషన్ చైర్ పర్సన్ రేఖా శర్మ

Hazarath Reddy

ఏపీ రాజధానిగా అమరావతినే (Amaravati) కొనసాగించాలంటూ తుళ్లూరు, మందడం గ్రామాల్లో నిరసన ప్రదర్శన చేస్తున్న మహిళా రైతులపై పోలీసులు దాడి చేసిన ఘటనను జాతీయ మహిళా కమీషన్ (National Women Commission) సుమోటోగా స్వీకరించింది. శనివారం నిజ నిర్ధారణ కమిటీని(Fact-Finding Committee ) అమరావతికి పంపుతామని జాతీయ మహిళా కమీషన్ చైర్ పర్సన్ రేఖా శర్మ (Rekha Sharma)ట్విట్టర్ లో తెలిపారు.

AP Capital Issue: రాజమండ్రిని నాలుగవ రాజధానిగా చేయమన్న మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజు, గ్రేటర్ రాయలసీమను ఇవ్వకుంటే ఉద్యమం చేస్తామన్న కేంద్ర మాజీ మంత్రి కోట్ల, రాజధాని కోసం జోలె పట్టిన చంద్రబాబు, నేతలు ఏమన్నారంటే..

Hazarath Reddy

ఏపీలో మూడు రాజధానులు అంశం (AP 3 Capital issue) వేడెక్కిస్తోంది. రాజధాని ప్రాంతాల్లో ప్రజలు రోడ్లెక్కి ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో మూడు రాజధానులు వద్దు..నాలుగు రాజధానులు కావాలని మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజు (Minister Sriranganatha Raju) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజమండ్రిని (Rajamandri) 4వ రాజధాని చేయాలని. సాంస్కృతిక రాజధానిగా దాన్ని చేయాలని, వచ్చే కేబినెట్, అసెంబ్లీ సమావేశాల్లో సీఎం జగన్ (CM Jagan) దృష్టికి తీసుకెళుతామని ఆయన అన్నారు.

Supreme Court: జమ్మూ కాశ్మీర్‌లో ఇంటర్నెట్ బంద్‌పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు, ఆంక్షలు సరికాదు, భావ ప్రకటనా స్వేచ్ఛని అడ్డుకునే హక్కు ఎవరికీ లేదు, అన్ని ఆంక్షలను సమీక్షించాలని ఆదేశాలు జారీ చేసిన అత్యున్నత న్యాయస్థానం

Hazarath Reddy

జమ్మూ కాశ్మీర్‌లో (Jammu and Kashmir) కొద్ది రోజులుగా ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడంపై సుప్రీంకోర్టు (Supreme Court )కీలక వ్యాఖ్యలు చేసింది. జమ్మూకశ్మీర్‌లో విధించిన ఆంక్షలపై దాఖలైన అన్ని పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది. వారం రోజుల్లో కశ్మీర్‌లోని అన్ని ఆంక్షలను సమీక్షించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇంటర్నెట్‌పై (Internet) అపరిమిత ఆంక్షలు సరికాదని, ఆంక్షలకు సంబంధించిన ఉత్తర్వులు ప్రజలకు అందుబాటులో ఉంచాలని పేర్కొంది.

Advertisement
Advertisement