Sake Sailajanath: ఏపీ హస్తానికి కొత్త సారధి, పీసీసీ చీఫ్‌గా సాకే శైలజానాధ్, రఘువీరా రెడ్డి రాజీనామా తరువాత ఖాళీగా పీసీసీ, గత ఎన్నికల్లో నోటా కంటే తక్కువ ఓట్లతో పరాజయం పాలైన సాకే శైలజానాధ్

ఏపీ పీసీసీ(AP PCC) అధ్యక్షుడిగా మాజీ మంత్రి, సీనియర్ నేత సాకే శైలజానాధ్ (Former minister Sake Sailajanath)నియమితులయ్యారు. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల (AP Assembly Elections 2019 ) తర్వాత అధ్యక్ష పదవికి రఘువీరా రెడ్డి (Raghu veera reddy)రాజీనామా చేశారు. నాటి నుంచి పార్టీ వ్యవహారాలకు ఆయన దూరంగా ఉన్నారు. దీంతో గత కొన్నాళ్లుగా పీసీసీ అధ్యక్ష ఖాళీగా ఉంది.

Sake Sailajanath appointed as new PCC chief of Andhra Pradesh (Photo-Twitter)

Amaravathi, January 17: ఏపీ పీసీసీ(AP PCC) అధ్యక్షుడిగా మాజీ మంత్రి, సీనియర్ నేత సాకే శైలజానాధ్ (Former minister Sake Sailajanath)నియమితులయ్యారు. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల (AP Assembly Elections 2019 ) తర్వాత అధ్యక్ష పదవికి రఘువీరా రెడ్డి (Raghu veera reddy)రాజీనామా చేశారు. నాటి నుంచి పార్టీ వ్యవహారాలకు ఆయన దూరంగా ఉన్నారు. దీంతో గత కొన్నాళ్లుగా పీసీసీ అధ్యక్ష ఖాళీగా ఉంది.

ఈ నేపథ్యంలో పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ (Sonia Gandhi)సీనియర్ నేత శైలజానాధ్ కి బాధ్యతలు అప్పచెప్పారు. దీంతో పాటు పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులుగా సీనియర్ నేతలు తులసి రెడ్డి, మస్తాన్ వలీకి బాధ్యతలు అప్పచెప్పారు. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు.

2014లో రాష్ట్ర విభజన తర్వాత కష్టాల్లో ఉన్న పార్టీని పైకి తీసుకురావడానికి రఘువీరారెడ్డి నాయకత్వం బాధ్యతలు చేపట్టారు. ఆయన అధ్యక్షుడిగా నియమితులయ్యాక వచ్చిన 2014, 2019 ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ కోలుకోలేని విధంగా దెబ్బతింది.

గ్లాసులో వికసించిన కమలం పువ్వు

దారుణమైన విషయం ఏంటంటే 2019 ఎన్నికల్లో ఐతే నోటా కంటే తక్కువ ఓట్లు పార్టీకి పోలవ్వడం. దీంతో పార్టీ అపజయానికి నైతిక బాధ్యత వహిస్తూ రఘువీరారెడ్డి జులై3, 2019లో అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.

పవన్  వివాదాస్పద  హిందూ వ్యాఖ్యలపై విరుచుకుపడిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్

అప్పటినుంచి ఆ పదవి ఖాళీగానే ఉంది. ఈ నేపథ్యంలో పార్టీ అనంతపురం(Ananthapuram) జిల్లాకు చెందిన దళిత నేత , ఏఐసీసీ కార్యదర్శిగా ఉన్న డాక్టర్ సాకే శైలజానాధ్ ను అధ్యక్షునిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

జీఎన్ రావు,బీసీజీ రిపోర్టులను భోగి మంటల్లో తగలబెట్టిన చంద్రబాబు

కాగా రేసులో చాలామందే ఉన్నట్లు వార్తలు వెలువడ్డాయి.కేంద్ర మాజీ మంత్రి ఎం.పళ్లంరాజు, మాజీ కేంద్రమంత్రి చింతా మోహన్, మాజీ మంత్రి శైలజానాథ్,ఏపీ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలిగా పనిచేసిన సుంకర పద్మ, గిడుగు రుద్రరాజు వంటి వారు రేసులో ఉన్నారు వీరితో పాటుగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి(Nallari kiran kumar reddy) పార్టీ పగ్గాలు ఇస్తారని ప్రచారం జరిగినా ఆయనా ఆసక్తి కనపరచకపోవటంతో ఆ స్ధానాన్ని ఏఐసీసీ పూరించలేదు.

రాజధానిపై మరో ఝలక్, విశాఖలోనే గణతంత్ర వేడుకలు

రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ నుంచి వెళ్లిపోయిన కిరణ్ కుమార్ రెడ్డి జై సమైక్యాంధ్ర పేరుతో సొంతంగా పార్టీ పెట్టుకున్నారు. ఆ పార్టీకి 2014 ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో ఆదరణ రాకపోవటంతో 2018లో తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు. ఈ పరిణామాల నేపథ్యంలో సాకే శైలజనాథ్ వైపు అధిష్టానం మొగ్గు చూపింది.

పోలవరం ప్రాజెక్టుపై సుప్రీం కీలక వ్యాఖ్యలు

2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ 175 అసెంబ్లీ, 24 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయగా ఎక్కడా డిపాజిట్లు రాలేదు. కళ్యాణదుర్గంలో పోటీ చేసిన కాంగ్రెస్‌ పార్టీ(Indian National Congress) రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌ రఘువీరారెడ్డికి కేవలం 28,883 ఓట్లు పోలయ్యాయి.

బీజేపీ ఎఫెక్ట్.. భారీ డైలాగ్స్ పేల్చిన పవన్ కళ్యాణ్

కాగా..ఇప్పుడు ఏపీ పీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన శైలజా నాధ్ 2019 సాధారణ ఎన్నికల్లో అనంతపురం జిల్లా శింగనమల(Singanamala) నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇక్కడ ఆయనకు నోటా కంటే తక్కువగా ఓట్లు పోలయ్యాయి. మొత్తం 1,97,466 ఓట్లు పోలయితే ఆయనకి 1,384 ఓట్లు మాత్రమే వచ్చాయి. నోటాకు 2,304 ఓట్లు పడ్డాయి.

వైకాపా గెలిస్తే రాజకీయాలనుంచి తప్పుకుంటానని సవాల్ విసిరిన చంద్రబాబు

వైయస్సార్ హవా కొనసాగుతున్నప్పుడు శైలజానాధ్ రెండు సార్లు కాంగ్రెస్ నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2004,2009లో ఆయన అనంతపురం జిల్లా మడకశిర నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. రెండు సార్లు టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి శమంతక మణిని ఓడించారు. 2009 లో వైయస్ రాజశేఖర్ రెడ్డి రెండో సారి సీఎం అయిన వెంటనే ఉమ్మడి రాష్ట్రంలోని మూడు ప్రాంతాల నుండి విప్ లుగా అవకాశం కల్పించారు.

ఏడాదికి రెండు సార్లు వైఎస్సార్‌ లైఫ్‌ టైం ఎచీవ్‌మెంట్‌ అవార్డులు

తెలంగాణకు చెందిన మల్లు భట్టివిక్రమార్క కు చీఫ్ విప్ గా..అదే విధంగా రాయలసీమ నుండి శైలజానాద్..ఉత్తరాంధ్ర నుండి కోండ్రు మురళీలను విప్ లుగా నియమించారు. అయితే వైయస్సార్ మరణం తరువాత చాలామంది నేతలకు కోలుకోలేని దెబ్బ తగిలింది. వారిలో శైలజానాధ్ కూడా ఉన్నారు.

కేంద్రమే పోలవరాన్ని పూర్తి చేయాలి

కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత అనంతపురం జిల్లా నుండి రఘువీరాతో పాటుగా శైలజా నాద్ మంత్రిగా ఆయన కేబినెట్ లో ఛాన్స్ దక్కించుకున్నారు. తొలిసారి మంత్రి అయిన శైలజా నాధ్ ప్రాధమిక విద్యాశాఖ మంత్రిగా వ్యవహరించారు. రాష్ట్ర విభజన బిల్లు అసెంబ్లీకి వచ్చిన సమయంలో విభజనకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తన వాయిస్ వినిపించారు.

ఆళ్ల రామకృష్ణారెడ్డి అరెస్ట్, అధికార వికేంద్రీకరణ జరగాలంటూ ర్యాలీ, అనుమతి లేదన్న పోలీసులు

ప్రస్తుతం ఏపీ కాంగ్రెస్ లో ఏ నేత యాక్టివ్ గా లేరు. ప్రస్తుతం జరుగుతున్న రాజధాని వివాదం పైనా పార్టీ వాయిస్ ప్రస్తుతానికి టీవీ చర్చల్లోనూ.. బయటా రెగ్యులర్ గా తులసి రెడ్డి..అప్పుడప్పుడూ శైలజా నాధ్ వినిపిస్తున్నారు. దీంతో..ఎస్సీ వర్గానికి చెందిన రాయలసీమ నేతకు కాంగ్రెస్ అధినాయకత్వం ఏపీ కాంగ్రెస్ బాధ్యతలను అప్పగించింది. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని వీరు ఏ మేరకు ముందుకు తీసుకువెళతారనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now