Pawan Kalyan & Kanna Lakshminarayana's Press Meet on Janasena-BJP alliance | Photo: Twitter

Vijayawada, January 16:  ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాలు, రాష్ట్ర భవిష్యత్ దృష్ట్యా భారతీయ జనతా పార్టీ (BJP) తో కలిసి నడిచేందుకు ముందుకొచ్చామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జనసేన - బీజేపీ పొత్తు (విషయమై గురువారం విజయవాడలో ఇరు పార్టీలకు చెందిన నేతల మధ్య కీలక భేటీ జరిగింది. ఈ భేటీ అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ బీజేపీ- జనసేన మధ్య కుదిరిన పొత్తు  ( BJP - Janasena Alliance) విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. భాజపాతో గతంలో ఏర్పడిన చిన్నచిన్న అంతరాలను తొలగించుకున్నామని తెలిపారు. జనసేన- బీజేపీ భావజాలం ఒక్కటేనని పవన్ అన్నారు.  పవన్  వివాదాస్పద  హిందూ వ్యాఖ్యలపై విరుచుకుపడిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్

ఇక ముందు తమ కూటమి ద్వారా వైసీపీ మరియు టీడీపీ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తామని స్పష్టం చేశారు. 2024లో ఏపీలో జనసేన- బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని పవన్ కళ్యాణ్ ధీమాగా చెప్పారు.

పవన్ మాట్లాడుతూ.. గతంలో ఏపీలో అవినీతి పాలన ఉండేది, ఇప్పుడు పాలెగాళ్ల రాజ్యం నడుస్తుంది. ప్రజలు విసిగెత్తిపోయారు. తృతీయ కూటమిని కోరుకుంటున్నారు. దానినే ప్రజలకు జనసేన- బీజేపీ కూటమి అందించబోతుంది. ప్రధాని మోదీ, అమిత్ షాల నమ్మకాన్ని నిలబెడతామని తెలిపారు.   బీజేపీ ఎఫెక్ట్.. భారీ డైలాగ్స్ పేల్చిన పవన్ కళ్యాణ్

రాజధానిపై జగన్ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకున్నంత మాత్రాన అవేవి జరిగిపోవు, ఒకవేళ జరిగినా మేం చూస్తూ ఊరుకోము. రోడ్ల మీదకు వస్తాం, మా వద్ద బలమైన నాయకత్వం, తెగించే నాయకత్వం ఉంది. మెజార్టీ ఉంది కదా అని సీఎం జగన్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటే కుదరవు, ఊరుకోం అని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. ఇళ్లను మార్చినంతా ఈజీగా రాజధానిని మారుస్తామంటే ఎలా? 5 కోట్ల మంది ఆంధ్రులు కోరుకుంటేనే అమరావతి రాజధాని అయిందని పవన్ పేర్కొన్నారు. జగన్ మొండిగా ముందుకు వెళ్తే ఇకపై జనసేన- బీజేపీ కలిసి పోరాటం చేస్తాయని స్పష్టం చేశారు.