Andhra Pradesh Chief Minister YS Jagan Mohan Reddy (Photo-PTI)

Amaravathi, January 14: ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకలకు(Republic Day celebrations) విశాఖపట్నం వేదిక కానుంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఈసారి రిపబ్లిక్‌ డే పరేడ్‌ను విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ వద్ద (RK beach At Visakhapatnam) నిర్వహించనుంది. గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) హాజరు కానున్నారు.

గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం(YSRCP) ఏర్పడిన తర్వాత తొలిసారి గణతంత్ర వేడుకలు జరుగుతున్నాయి. రిపబ్లిక్ డే వేడుకలను ఘనంగా నిర్వహించాలని విశాఖ జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ అధికారులను ఆదేశించారు.

మరోవైపు రిపబ్లిక్‌ డే సందర్భంగా దేశ వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశంలోని ప్రధాన విమానాశ్రయంలో హైఅలర్ట్‌ ప్రకటించారు. ఈ వేడుకల్లో హైకోర్టు చీఫ్ జస్టిస్, సీఎం జగన్, మంత్రులు, అధికారులు పాల్గొంటారు. జగన్ సీఎంగా(AP CM YS Jagan) బాధ్యతలు చేపట్టాక జరుగుతున్న మొదటి గణతంత్ర వేడుక కావడంతో.. దీన్ని వైసీపీ ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది.

జీఎన్ రావు,బీసీజీ రిపోర్టులను భోగి మంటల్లో తగలబెట్టిన చంద్రబాబు

విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టాలని సీఎం జగన్ ప్రతిపాదన చేసిన తరుణంలో ఈ వేడుకకు ప్రాధాన్యత ఏర్పడింది. రాష్ట్ర రాజధానిగా విశాఖను మార్చడానికి జగన్ అనుకూలంగా ఉన్నారని సూచించడానికి... ఇక్కడ రిపబ్లిక్ డే వేడుకలు జరపాలని నిర్ణయించడమే నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు.

ఏడాదికి రెండు సార్లు వైఎస్సార్‌ లైఫ్‌ టైం ఎచీవ్‌మెంట్‌ అవార్డులు

ఇక రాజధాని అంశంపై ఏర్పాటైన జీఎన్ రావ్, బోస్టన్ కమిటీలు కూడా.. రాజధాని విభజనకే మొగ్గు చూపాయి. పరిపాలన రాజధానిగా విశాఖ బెస్ట్ అని తేల్చాయి. ఈ కమిటీల ప్రతిపాదనలను హై పవర్ కమిటీ అధ్యయనం చేస్తోంది. త్వరలో నివేదికను సీఎం జగన్ కి సమర్పించనుంది.

వైకాపా గెలిస్తే రాజకీయాలనుంచి తప్పుకుంటానని సవాల్ విసిరిన చంద్రబాబు

రాజధాని ఏర్పాటు అంశంపై జనవరి 20న ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో హై పవర్ కమిటీపై చర్చించి రాజధానిపై సీఎం జగన్ అంతింగా ఓ నిర్ణయం ప్రకటిస్తారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే విశాఖపట్నంలో వేడుకలు నిర్వహించాలన్న జగన్ ప్రభుత్వం నిర్ణయంతో ఉత్తరాంధ్ర ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ముగిసిన హై పవర్ కమిటీ సమావేశం, రాజధానిపై ఏం తేల్చింది? ఆమోదం తెలుపనున్న మంత్రివర్గం!

తొలుత విజయవాడలోని మున్సిపల్‌ స్టేడియంలో రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించాలని అనుకున్నారు. అయితే రాజధాని ప్రాంతంలో ఆందోళనలు తీవ్రం కావడంతో విశాఖలోనే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విజయవాడలోనే రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహిస్తుండేవారు.

ఆళ్ల రామకృష్ణారెడ్డి అరెస్ట్, అధికార వికేంద్రీకరణ జరగాలంటూ ర్యాలీ, అనుమతి లేదన్న పోలీసులు

ఇందిరాగాంధీ స్టేడియంలో ఈ వేడుకలు నిర్వహించేవారు. 2018లో మాత్రం చంద్రబాబు దావోస్ పర్యటనలో ఉండగా గవర్నర్ నరసింహన్ ఈ వేడుకలకు హాజరయ్యారు. విశాఖను పరిపాలన రాజధానిగా జనవరి 20వ తేదీ నుంచి ఉపయోగించనున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం నుంచి సంకేతాలు అందుతున్నాయి.