Delhi Govt Formation: ఢిల్లీ అసెంబ్లీ రద్దు, ప్రేమికుల రోజున ప్రమాణ స్వీకారం లేదు, ఈ నెల 16న ఢిల్లీ ముఖ్యమంత్రిగా 3వ సారి ప్రమాణ స్వీకారం చేయనున్న అరవింద్ కేజ్రీవాల్
కానీ అందరి అంచనాలను తారుమారు చేస్తూ ఆయన ఫిబ్రవరి 16న ప్రమాణస్వీకారం చేయనున్నారు.
New Delhi, Febuary 12: ఢిల్లీ ఏడవ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాలు (Delhi Assembly Elections 2020 Results) వెలవడటంతో ఆరో అసెంబ్లీని రద్దు చేస్తూ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ (Anil Baijal) మంగళవారం నిర్ణయం తీసుకున్నారు.
''ఢిల్లీ ఆరవ అసెంబ్లీని లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ రద్దు చేశారు''అని గవర్నర్ కార్యాలయం ఒక ప్రకనటలో తెలిపింది. ఎన్నికల పూర్తి ఫలితాలు వెల్లడైన తర్వాత తదుపరి అసెంబ్లీ ఏర్పాటుపై త్వరలోనే మరో ఉత్తర్వులు జారీ అవుతాయని ప్రకటనలో పేర్కొన్నారు.
ఢిల్లీని గెలిచిన జోష్ లవర్ బాయ్‌గా మారిన అర్వింద్ కేజ్రీవాల్
ఈ నేపథ్యంలోనే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో (Delhi Assembli Elections 2020) విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party) అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో లెఫ్టినెంట్ గవర్నర్ తో ప్రభుత్వ ఏర్పాటుపై కేజ్రీవాల్ (Arvind Kejriwal) చర్చించారని ఆప్ నేతలు వెల్లడించారు. మరికాసేపట్లో పార్టీ ఎమ్మెల్యేలతో కేజ్రీవాల్ తన నివాసంలో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ఎల్‌పీ నేతగా కేజ్రీవాల్‌ను శాసనసభ్యులు ఎన్నుకోనున్నారు.
దేశంలో ఇప్పటివరకు హ్యాట్రిక్ ముఖ్యమంత్రులు వీరే
ఢిల్లీలోని (Delhi) మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు గానూ హోరాహోరీగా సాగిన ఎన్నికల్లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ క్లీన్ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. నిన్న వెలువడిన ఎన్నికల ఫలితాల్లో ఆమాద్మీ పార్టీ 62 స్థానాలు కైవసం చేసుకోగా.. బీజేపీకి 8 స్థానాలు దక్కాయి. కాంగ్రెస్ పార్టీ ఈ సారి కూడా ఇక్కడ ఖాతా తెరువలేదు.
ట్విట్టర్‌ని షేక్ చేస్తోన్న మినీ మఫ్లర్ మ్యాన్
ఆమ్ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ముచ్చటగా మూడోసారి ఢిల్లీ ముఖ్యమంత్రిగా (Hat-Trick CM) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నెల 16న ప్రమాణం స్వీకారం చేయడానికి ఆయన ముహూర్తం ఖరారు చేసుకున్నారు. అయితే ఫిబ్రవరి 14న కేజ్రీవాల్ ప్రమాణస్వీకారం చేస్తారంటూ అంతా ఊహించారు. కానీ అందరి అంచనాలను తారుమారు చేస్తూ ఆయన ఫిబ్రవరి 16న ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ఢిల్లీలోని ప్రఖ్యాత రామ్ లీలా మైదానం వేదిక కానుంది.
ఎమ్మెల్యే అంటే అతడే, పురిటినొప్పులతో బాధపడుతున్న గర్భిణీని ఆరు కిలో మీటర్లు మోశాడు
కాగా కేజ్రీవాల్‌కు ఫిబ్రవరి 14కు (Lovers Day) మధ్య ప్రత్యేక అనుబంధం ఉండడం. ఆయన ప్రమాణస్వీకారాలు, రాజీనామాలు అదే రోజున జరుగుతూ వస్తున్నాయి. 2013లో మొదటిసారి ఢిల్లీలో ఆప్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటుచేసింది.
Delhi Assembly Elections 2020-BJP Manifesto
ఆ ఎన్నికల్లో బీజేపీ (BJP) 31, ఆప్ (AAP) 28 స్థానాలు గెలుచుకోగా కాంగ్రెస్ 8 స్థానాలు గెలుచుకుంది. కాంగ్రెస్ (Congress) మద్దతుతో ఆప్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కేజ్రీవాల్ డిసెంబర్ 28న ఢిల్లీ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు.
Delhi Assembly Elections 2020-Congress Manifesto
అయితే కాంగ్రెస్, ఆప్‌ల మధ్య వివాదం నెలకొనడంతో కాంగ్రెస్ పార్టీ తన మద్దతు ఉపసంహరించుకుంది. దీంతో 49 రోజుల్లోనే కేజ్రీవాల్ ప్రభుత్వం కూలిపోయింది. 14 ఫిబ్రవరి 2014న ఢిల్లీ సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేయాల్సివచ్చింది. ఆ తర్వాత 2015లో ఢిల్లీ అసెంబ్లీకి మళ్ళీ ఎన్నికలు జరిగాయి.
Delhi Assembli Elections 2020 AAP Manifesto
ఈ ఎన్నికల్లో ఆప్ పార్టీ 67 స్థానాల్లో విజయం సాధించింది. దీంతో ఫిబ్రవరి 14న రామ్‌లీలా మైదానంలో కేజ్రీవాల్ రెండవసారి ఢిల్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఏరోజైతే పదవికి రాజీనామా చేశారో మళ్లీ అదే రోజు కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం చేయడం ఆసక్తిర అంశం.