Delhi Assembly Elections 2020 -Amit shah vs Aravind kejriwal (Photo-PTI)

New Delhi, Febuary 5: మరో మూడు రోజుల్లో ఢిల్లీ అసెంబ్లీ (Delhi Assembly Election) ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజీపీ ముఖ్యమంత్రి అభ్యర్ధి (BJP Chief Ministerial Candidate) ఎవరో వెల్లడించాలని ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ (Delhi chief minister Arvind Kejriwal) బీజేపీ పార్టీకి సవాల్‌ విసిరారు. కాగా ఢిల్లీ శాసనసభ ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టో విడుదల చేసిన ఆప్ చేసిన విషయం విదితమే.

దీనిపై ఎవరితోనైనా చర్చించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఆయన స్పష్టం చేశారు. బుధవారం మధ్యాహ్నం 1 గంటలోగా బీజేపీ (BJP) తమ పార్టీ సీఎం అభ్యర్ధిని వెల్లడించాలని లేనిపక్షంలో తాను మరోసారి మీడియా ముందుకు వస్తానని చెప్పారు.

Delhi Assembly Elections 2020-Congress Manifesto

బీజేపీ సీఎం అభ్యర్థిని ప్రకటించకుండానే ప్రజల తీర్పును కోరుతోందని ఎద్దేవా చేశారు. ఢిల్లీలో ప్రజాతీర్పు వెలువడిన తర్వాత సీఎం అభ్యర్థిని ప్రకటిస్తామని అమిత్‌ షా చెబుతున్నారని, కానీ బీజేపీకి ఓటు వేస్తే ముఖ్యమంత్రిగా ఎవరు ఉంటారనేది ఢిల్లీ ప్రజలు తెలుసుకోవాలని అనుకుంటున్నారన్నారు. విద్యాభ్యాసం లేని అసమర్ధుడిని సీఎంగా అమిత్‌ షా ప్రకటిస్తే అప్పుడు ఢిల్లీ ప్రజలను మోసగించినట్టు కాదా అని కేజ్రీవాల్‌ ప్రశ్నించారు.

Delhi Assembly Elections 2020-BJP Manifesto

అమిత్ షా మాటలను బ్లాంక్ చెక్‌తో పోలుస్తూ.. ముందు ఓట్లు వేసేయండి తర్వాత పేరు చెప్తాం.. అంటే ముందు సంతకం పెట్టండి తర్వాత అమౌంట్ రాసుకుంటాం అనే రీతిలో ఉన్నాయంటూ పోల్చారు.

కేజ్రీవాల్ ఒక టెర్రరిస్ట్, అందుకు ఆధారాలున్నాయి

'ఢిల్లీ ప్రజలు.. అమిత్ షా చెప్పినట్లు ఓటు వేస్తే.. ఎవరో నిరక్షరాస్యుణ్ని నిలబెట్టినప్పుడు.. ఢిల్లీని మోసం చేసినట్లు ఫీలవుతారని కేజ్రీవాల్ వెల్లడించారు. ఫిబ్రవరి 8న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ ఛాలెంజ్ సంచలనంగా మారింది.