Viral

Video: వీడియో ఇదిగో, జలపాతంలో కొట్టుకుపోతున్న తండ్రి, కొడుకులను కాపాడిన పర్యాటకులు, సంగారెడ్డిలో ఘటన

Hazarath Reddy

Telangana Road Accident: వీడియో ఇదిగో, అదుపుతప్పిన బైక్, టీ తాగుదామని బయటకుకి వచ్చిన బావ, బావమరిది మృతి

Hazarath Reddy

జనగాంకు చెందిన ఉల్లెంగుల నరేష్ (23) కాప్రాలో ఉంటున్న మేనమామ కొడుకు క్రాంతి(23)తో కలిసి ఆదివారం తెల్లవారుజామున టీ తాగుదామని బైక్ మీద బయటకు వెళ్లి ఈసీఐఎల్ చౌరస్తాలో స్కిడ్ అయ్యి పడిపోయి అంబేడ్కర్ విగ్రహం గద్దెకు ఢీకొని తలలకు తీవ్రగాయాలై మృతి చెందారు.

Visakha old woman Murder Case: సీసీటీవీ ఫుటేజ్ ఇదిగో, బంగారం కోసం వృద్ధురాలిని హత్య చేసిన బయటకు వెళుతున్న గ్రామ వాలంటీర్‌

Hazarath Reddy

బంగారం కోసం వృద్ధురాలిని హత్య చేసిన గ్రామ వాలంటీర్‌ దొరికాడు. వైజాగ్ - పెందుర్తిలో బంగారం కోసం 73 ఏళ్ళ వృద్ధురాలు వరలక్ష్మిని హత్య చేసిన గ్రామ వాలంటీర్‌ వెంకట్‌ను పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. హత్య చేసిన అనంతరం ఇంటి నుండి బైటికి వెళ్ళిన సీసీటీవీ ఫుటేజ్ స్వాధీనం చేసుకున్న పోలీసులు.

Kape Technologies Layoffs: ఆగని లేఆప్స్, 200 మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్న సైబర్‌ సెక్యూరిటీ సంస్థ కేప్‌ టెక్నాలజీస్‌

Hazarath Reddy

సైబర్‌ సెక్యూరిటీ సంస్థ కేప్‌ టెక్నాలజీస్‌ డిపార్ట్‌మెంట్‌లలో దాదాపు 200 మంది ఉద్యోగులను తొలగించిందని, కంపెనీ చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ డాన్‌ గెరిక్‌ వాకౌట్‌ చేయాలని నిర్ణయించుకున్నారు. ExpressVPN, CyberGhost, ప్రైవేట్ యాక్సెస్ ఇంటర్నెట్ (PIA)తో సహా అనేక ప్రసిద్ధ వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్ (VPN) సేవల వెనుక కేప్ టెక్నాలజీస్ ఉంది

Advertisement

CID DSP Booked for Harassing Woman: డీఎస్పీ కాదు కామాంధుడు, నా కౌగిలిలో నలిగిపోవాలంటూ ఉద్యోగికి వేధింపులు, కేసు నమోదు చేసిన పోలీసులు

Hazarath Reddy

దక్షిణాది డిస్కమ్‌ (టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌) సీనియర్‌ అకౌంటెంట్‌కు పోలీస్ ఉన్నతాధికారి లైంగగిక వేధింపులకు పాల్పడ్డారు. ఈ ఘటనపై చైతన్యపురి పోలీసులు సీఐడీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ కిషన్‌సింగ్‌పై కేసు నమోదు చేశారు.

Visakhapatnam Horror: విశాఖలో వృద్ధురాలిని హత్య చేసిన వాలంటీర్.. కొంత కాలంగా బాధితురాలి షాపులో పార్ట్ టైమ్ వర్క్ చేస్తున్న నిందితుడు

Rudra

విశాఖలో ఘోరం చోటు చేసుకుంది. వరలక్ష్మి అనే 73 ఏండ్ల వృద్ధురాలిని వాలంటీర్ గా పని చేస్తున్న వెంకటేశ్ రాత్రి 10.30 గంటల సమయంలో హత్య చేశాడు. పెందుర్తి నియోజకవర్గం సుజాతనగర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతురాలు నిర్వహిస్తున్న షాప్ లో వెంకటేశ్ గత కొంత కాలంగా పార్ట్ టైమ్ వర్కర్ గా పని చేస్తున్నాడు.

Jaipur Express Train Tragedy: జైపూర్ ఎక్స్‌ ప్రెస్‌ రైలులో కాల్పులు.. ఆర్పీఎఫ్ ఏఎస్ఐ సహా నలుగురు మృతి.. వీడియో వైరల్

Rudra

మహారాష్ట్రలోని పాల్ఘర్ రైల్వే స్టేషన్ (Palghar Railway Station) సమీపంలో జైపూర్ – ముంబై ఎక్స్‌ ప్రెస్ (Jaipur-Mumbai Express) రైలులో కాల్పుల ఘటన చోటు చేసుకుంది. ఈ కాల్పుల్లో నలుగురు మరణించారు.

TS Cabinet Meeting Today: కేసీఆర్ అధ్యక్షతన నేడు క్యాబినెట్ మీటింగ్.. మధ్యాహ్నం 2 గంటలకు సచివాలయంలో భేటీ.. 40 నుంచి 50 అంశాలపై చర్చ.. నిరుద్యోగభృతి వంటి అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం

Rudra

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సోమవారం జరుగనున్నది. సచివాలయంలో మధ్యాహ్నం 2 గంటల నుంచి మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిర్ణయించిన సంగతి తెలిసిందే.

Advertisement

Conjunctivitis in Telangana: తెలంగాణలో పెరుగుతున్న కళ్ల కలక కేసులు.. ఆసుపత్రులకు క్యూ కడుతున్న బాధితులు

Rudra

తెలంగాణలో కళ్ల కలక కేసులు పెరిగిపోతున్నాయి. హైదరాబాద్ లోని సరోజినీదేవీ కంటి ఆసుపత్రితో పాటు ఎల్వీ ప్రసాద్ ఐ హాస్పిటల్ కు బాధితులు క్యూ కడుతున్నారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశాలోనూ కేసులు పెరుగుతున్నాయని ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రి వైద్యులు చెప్పారు.

IIT Bombay: ఐఐటీ బాంబే క్యాంటీన్ లో పోస్టర్ల కలకలం.. శాకాహారం తినేవాళ్లే ఇక్కడ కూర్చోవాలంటూ వెలిసిన పోస్టర్లు

Rudra

ప్రతిష్టాత్మక విద్యాసంస్థ ఐఐటీ బాంబేలో వెలిసిన పోస్టర్లు కలకలం సృష్టిస్తున్నాయి. క్యాంపస్ లో మాంసాహారం చిచ్చు రేగింది. మాంసాహారం తినే విద్యార్థులపై క్యాంటీన్ లో వివక్ష చూపుతున్నారంటూ ఆరోపణలు వచ్చాయి.

Hyderabad Crime Case: హైదరాబాద్‌ లో సాఫ్ట్‌ వేర్ ఇంజినీర్ అనుమానాస్పద మృతి.. పాస్‌ పోర్టు కోసం నగరానికి వచ్చిన మణిరాజ్.. స్నేహితుడి ఇంటికి వెళ్లి బాత్రూంలో అనుమానాస్పద మృతి.. మృతుడు వరంగల్ వాసిగా గుర్తింపు

Rudra

వరంగల్‌ కు చెందిన సాఫ్ట్‌ వేర్ ఇంజినీర్ హైదరాబాద్‌ లో అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. పాస్‌పోర్టు తీసుకునేందుకు త్రిపురాది మణిరాజ్ (30) తండ్రి నవీన్‌కుమార్‌ తో కలిసి ఈ నెల 28న హైదరాబాద్ వచ్చాడు. ఆ తర్వాత

Uttar Pradesh Shocker: అయ్యా.. దాహం అవుతుంది కాస్త, మంచినీళ్లు ఇవ్వండని అడిగిన దివ్యాంగుడిపై ఇద్దరు ప్రాంతీయ రక్షక్ జవాన్ల దాడి.. ఉత్తరప్రదేశ్ లో దారుణ ఘటన.. వీడియోతో

Rudra

ఉత్తరప్రదేశ్ లో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. దాహం తీర్చుకునేందుకు మంచి నీళ్లు ఇవ్వాలని అడిగిన ఓ దివ్యాంగుణ్ణి ఇద్దరు జవాన్లు చావచితక కొట్టిన ఘటన దేవరీయా ప్రాంతంలో వెలుగు చూసింది.

Advertisement

Viral Video: తన పిల్లలని కాపాడమని రోడ్డు మీద వెళ్లే వాహనాల వెంటపడి వేడుకున్న కుక్క, తల్లి వద్దకు పిల్లలను చేర్చిన పోలీసులు, వీడియో చూస్తే కన్నీళ్లు ఆగవు..

kanha

ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వరద నీటిలో చిక్కుకున్న కుక్క పిల్లల కోసం తల్లి కుక్క ఆవేదన. తన పిల్లలను కాపాడాలని వాహనాలు, పోలీసుల చుట్టూ తిరుగుతున్న మూగజీవి ఆవేదనను గమనించి వరదనీటిలో ఓ ఇంట్లో కుక్క పిల్లలను గమనించి తల్లి వద్దకు చేర్చి మానవత్వం చాటిన పోలీసులు.

Hyderabad Shocker: గాజు పెంకుతో తండ్రి గొంతు కోసిన కూతురు, అంబర్ పేటలో దారుణం..

kanha

తండ్రి మందలించాడని గొంతు కోసిన కూతురు. అంబర్‌పేటలో తండ్రి మందలించాడని కోపంతో తండ్రి గొంతు కోసిన కూతురు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తండ్రి మృతి. కూతురుని అరెస్ట్ చేసిన పోలీసులు.

Viral Video: యూపీలో వికలాంగుడిని చితకబాదిన పోలీసులు

kanha

ఉత్తరప్రదేశ్‌లోని డియోరియా జిల్లాలో ట్రైసైకిల్‌పై కనిపించిన ఓ వికలాంగుడిని డ్యూటీలో ఉన్న ప్రాంతీయ రక్షక్ దళ్ (పిఆర్‌డి) జవాన్లు కొట్టి దుర్భాషలాడారు. ట్రైసైకిల్‌పై ఉన్న వికలాంగుడిని పీఆర్‌డీ జవాన్లు చెంపదెబ్బ కొట్టి కొట్టిన వీడియో కెమెరాలో చిక్కింది.

T20 World Cup 2024: జూన్‌ 4 నుంచి టీ20 వరల్డ్‌ కప్‌.. మెగాటోర్నీకి ఆతిథ్యమివ్వనున్న వెస్టిండీస్‌, అమెరికా

Rudra

వచ్చే ఏడాది జరుగనున్న టీ20 ప్రపంచకప్‌ ను జూన్‌ 4 నుంచి 30 మధ్య నిర్వహించాలని అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) ప్రాథమికంగా నిర్ణయించింది. నిరుడు ఆస్ట్రేలియా వేదికగా పొట్టి ప్రపంచకప్‌ జరుగగా.. వచ్చే యేడు వెస్టిండీస్‌, అమెరికా సంయుక్తంగా మెగాటోర్నీకి ఆతిథ్యమివ్వనున్నాయి.

Advertisement

Ambati Rambabu: 'బ్రో'లో అంబటిని ట్రోల్ చేసేలా సీన్.. పవన్ పై అంబటి కౌంటర్ ట్వీట్.. ఏంటా విషయం??

Rudra

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి ఏపీ మంత్రి అంబటి రాంబాబు చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. 'గెలిచినోడి డాన్స్ సంక్రాంతి.. ఓడినోడి డాన్స్ కాళరాత్రి' అని అంబటి ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కు పవన్ కల్యాణ్ ను ట్యాగ్ చేశారు.

NSR Prasad Passes Away: టాలీవుడ్ లో మరో విషాదం.. దర్శకుడు ఎన్ఎస్ఆర్ ప్రసాద్ కన్నుమూత.. గత కొంత కాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న ప్రసాద్

Rudra

టాలీవుడ్ లో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ దర్శకుడు, రచయిత ఎన్ఎస్ఆర్ ప్రసాద్ (49) ఆకస్మిక మరణం చెందారు. గత కొంత కాలంగా క్యాన్సర్ తో పోరాడుతూ ఆయన కన్నుమూశారు. ఆర్యన్ రాజేశ్ హీరోగా దివంగత డి.రామానాయుడు నిర్మించిన 'నిరీక్షణ' చిత్రంతో ఆయన దర్శకుడిగా మారారు.

383 Years Jail Punishment: ఆర్టీసీ బస్సుల వేలంలో అక్రమాల కేసు.. నకిలీ పత్రాలతో 47 బస్సుల విక్రయం.. మూడు దశాబ్దాల తర్వాత తీర్పు.. నిందితుడికి 383 ఏళ్ల జైలు శిక్ష విధించిన కోయంబత్తూర్ కోర్టు

Rudra

నకిలీ పత్రాలను సృష్టించి, మోసానికి పాల్పడిన వ్యక్తికి తమిళనాడులని కోయంబత్తూర్ కోర్టు 383 ఏళ్ల జైలు శిక్షను విధించింది. దీంతో పాటు రూ. 3.32 కోట్ల జరిమానాను విధిస్తూ సంచలన తీర్పును ఇచ్చింది.

Twitter Revenue: ట్విట్టర్ ద్వారా యూజర్లకు ఆదాయం... యూట్యూబ్ తరహాలో ట్విట్టర్ లోనూ యాడ్ మోనిటైజేషన్.. రెవెన్యూ షేరింగ్ కు విధివిధానాలు ఇవిగో!

Rudra

ప్రముఖ వీడియో పోస్టింగ్ ప్లాట్ ఫాం.. యూట్యూబ్ లో వీడియోలు పోస్టు చేసిన వారు వ్యూస్ ఆధారంగా ఆదాయం పొందుతుండడం తెలిసిందే. ఇప్పుడదే తరహాలో ట్విట్టర్ లోనూ యూజర్లు ఆదాయం అందుకునేలా కొత్త ఫీచర్ తీసుకువచ్చారు.

Advertisement
Advertisement