Tirumala, Dec 27: భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు (PV Sindhu), వెంకట దత్తసాయి దంపతులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అంతకుముందు తిరుపతిలోని తిరుచానూరు (Tiruchanur) శ్రీ పద్మావతి అమ్మవారిని కూడా దర్శించుకున్నారు. ఇటీవలే సింధు వివాహం హైదరాబాద్ కు చెందిన వెంకట దత్త సాయితో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పెళ్లి తర్వాత కొత్త దంపతులు శ్రీవారి, అమ్మవారి ఆశీస్సుల కోసం తిరుపతి వచ్చారు. కుటుంబ సభ్యులతో కలిసి సింధు-దత్త సాయి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం వేద పండితులు ఆశీర్వచనం చేశారు. శ్రీవారిని, అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని.. పెళ్లి తర్వాత దేవుడి ఆశీస్సుల కోసం వచ్చినట్లు సింధు తెలిపారు.
Here's Video:
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నవ దంపతులు
పీవీ సింధు, వెంకట దత్త సాయి pic.twitter.com/z9iKg7aYaP
— BIG TV Breaking News (@bigtvtelugu) December 27, 2024
దీవిలో వివాహం
కాగా, పీవీ సింధు – వెంకట దత్తసాయి వివాహం ఈనెల 22న ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. రాజస్థాన్ ఉదయ్ పూర్ లోని ఓ సరస్సులో 21 ఎకరాల్లో విస్తరించిన ఒక దీవిలో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ జంట ఒక్కటైంది. ఇక పెళ్లికి సంబంధించిన ఫొటోలను కూడా సింధు సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూత, ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ మరణించిన రాజకీయ దురంధరుడు