TTD EO Shyamalarao(TTD)

Tirumala, July 20:  ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారు. ప్రపంచం నలుమూలల నుండి తిరుమలకు భక్తులు వస్తున్న నేపథ్యంలో టీటీడీ ఈవో శ్యామలరావు మీడియాతో మాట్లాడుతూ కీలక ప్రకటన చేశారు. సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తామని, తిరుమల పవిత్రతను కాపాడుతామని స్పష్టం చేశారు.

భక్తులకు మరింత సౌకర్యవంతంగా శ్రీవారి దర్శనం, వసతి, అన్న ప్రసాదాలు అందించేలా ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు తిరుమలలోని అన్ని విభాగాలను నెల రోజుల పాటు క్షేత్రస్థాయిలో పరిశీలించినట్లు చెప్పారు. తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద భవనంలో ప్రతిరోజు రెండు లక్షల మంది భక్తులకు భోజనం అందిస్తున్నామని తెలిపారు.

అన్న ప్రసాదాలు, పాలు, తాగునీరు నాణ్యతను మరింత పెంచేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. ఉదయం అల్పాహారము, మధ్యాహ్నం, రాత్రి భోజనాలలో భక్తులకు అందించవలసిన ఆహార పదార్థాలపై నిపుణులతో కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. కమిటీ సూచించిన విధంగా సిబ్బందిని పెంచడం, వంటశాలల ఆధునీకరణ వంటి చర్యలు చేపడతామన్నారు.

శ్రీవారి లడ్డు ప్రసాదాల నాణ్యతను మరింత పెంచుతామని, నాణ్యమైన నెయ్యి, ముడి సరుకులు కొనుగోలు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. తిరుమలలో ఫుడ్ సేఫ్టీ విభాగం ఏర్పాటుచేసిన మొబైల్ ల్యాబ్ లో 80 రకాల పదార్థాలను పరీక్షించవచ్చని చెప్పారు. క్యూలైన్లలో వేచి ఉండే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తాగు నీరు, పాలు, అన్నప్రసాదాలు అందిస్తున్నామని చెప్పారు. టీటీడీ ఆర్జిత సేవలు, దర్శనము, వసతి తదితర సేవల బుకింగ్ లో లోపాలను సరిదిద్దుతామని చెప్పారు. 25న తెలంగాణ కేబినెట్ సమావేశం, బడ్జెట్‌కు అమోదం తెలపనున్న కేబినెట్, ఈ సమావేశాల్లోనే జాబ్ క్యాలెండర్