Cricket

Ishant Sharma Yorker Video: ఇషాంత్ శ‌ర్మ కళ్లు చెదిరే యార్కర్ వీడియో ఇదిగో, దెబ్బకు క్లీన్ బౌల్డ్‌తో కిందపడి విలవిలలాడిన ఆండ్రీ రస్సెల్

Hazarath Reddy

2024 Indian Premier League, Andre Russell, DC vs KKR, Delhi Capitals, Indian Premier League 2024, IPL 2024, Ishant Sharma, Kolkata Knight Riders,యార్క‌ర్ డెలివ‌రీ, ఢిల్లీ క్యాపిట‌ల్స్, కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్, కేకేఆర్‌, డీసీ, ఇషాంత్ శ‌ర్మ, ఇషాంత్ శ‌ర్మ యార్కర్, ఇషాంత్ శ‌ర్మ యార్కర్ వీడియో, ఆండ్రీ ర‌సెల్‌

IPL 2024, Delhi Capitals vs Kolkata Knight Riders: కోల్ కతా నైట్ రైడర్స్ భారీ విజయం...ఢిల్లీ క్యాపిటల్స్ పై ఏకంగా 106 పరుగుల తేడాతో విజయకేతనం..

sajaya

కేకేఆర్ భారీ లక్ష్యం ముందు ఢిల్లీ క్యాపిటల్స్ లొంగిపోయింది. 273 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు వచ్చిన ఢిల్లీ జట్టు కేవలం 166 పరుగులకే పరిమితమైంది. IPL 2024లో, KKR వరుసగా మూడో మ్యాచ్‌లో 106 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.

IPL 2024: సోషల్ మీడియా ఖాతాలో హనుమంతుని విగ్రహం పోస్ట్ చేసిన డేవిడ్ వార్నర్, ఈ రోజు కలకత్తాతో జరిగే మ్యాచ్‌లో అన్నీ మెరుపులేనంటూ కొటేషన్

Hazarath Reddy

ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో హనుమంతుని విగ్రహం పోస్ట్ చేశాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) 2024 డిసి మరియు కెకెఆర్ మధ్య జరిగే మ్యాచ్‌కు ముందు వైజాగ్ పర్యటన సందర్భంగా హనుమాన్ జీ విగ్రహాన్ని పంచుకున్నాడు.

IPL 2024: బెంగుళూరుకు తప్పని పరాజయం..లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో చిత్తుగా ఓడిన RCB..

sajaya

ఐపీఎల్ 2024 లో లక్నో సూపర్ జెయింట్స్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. మంగళవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆ జట్టు క్వింటన్ డి కాక్ అర్ధసెంచరీతో 181 పరుగులు చేసింది. దీని తర్వాత యువ ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ ధాటికి RCB జట్టు 153 పరుగులకే కుప్పకూలింది.

Advertisement

Virat Kohli New Record: ఒకే వేదికపై 100 T20లు ఆడిన మొదటి భారత క్రికెటర్‌గా విరాట్ కోహ్లీ రికార్డు, అధికారికంగా తెలిపిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

Hazarath Reddy

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లి బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో లేదా ఏ ఒక్క వేదికలోనైనా 100 టీ20 మ్యాచ్‌లు ఆడిన తొలి భారతీయ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. RCB vs LSG IPL 2024 మ్యాచ్‌లో ఈ రికార్డును విరాట్ నెలకొల్పాడు. RCB వారి అధికారిక 'X' హ్యాండిల్‌లో దీనిపై పోస్ట్‌ పెట్టి అభిమానులకు తెలియజేసింది ఆర్సీబీ.

IPL 2024 MI vs RR: ముంబై ఇండియన్స్ పై రాజస్థాన్ రాయల్స్ గెలుపు.. 6 వికెట్ల తేడాతో విజయం.. ముంబైకి వరుసగా మూడో ఓటమి.

sajaya

హార్దిక్ పాండ్యా సారథ్యంలోని ముంబయి 6 వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓడింది. ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ పూర్తిగా విఫలం కావడంతో ఆ జట్టు తొలుత ఆడుతున్న సమయంలో 9 వికెట్లకు 125 పరుగులు మాత్రమే చేయగలిగింది. 16వ ఓవర్లో రాజస్థాన్ మూడు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది.

DC Win By 20 Runs: ఈ సీజ‌న్ లో బోణీ కొట్టిన ఢిల్లీ, పంత్, వార్న‌ర్ విజృంభ‌ణ‌తో చెన్నై సూప‌ర్ కింగ్స్ కు హ్యాట్రిక్ మిస్

VNS

ఐపీఎల్‌లో (IPL) బోణీ కొట్ట‌ని ఢిల్లీ (Delhi Win) హ్యాట్రిక్ ఓట‌మి త‌ప్పించుకుంది. కీల‌క పోరులో సంచ‌ల‌న ప్ర‌ద‌ర్శ‌న‌తో చెన్నైకి (CSK) చెక్ పెట్టింది. భారీ ఛేద‌న‌లో చెన్నై చెన్నై సూప‌ర్ కింగ్స్‌ను ఖ‌లీల్ అహ్మ‌ద్ ఆదిలోనే హ‌డలెత్తించాడు. వ‌రుస ఓవ‌ర్ల‌లో రుతురాజ్ గైక్వాడ్‌(1), ర‌చిన్ ర‌వీంద్ర‌(2)ల‌ను ఔట్ చేశాడు.

IPL 2024, SRH vs GT: అయ్యో హైదరాబాద్..గుజరాత్ దెబ్బకు మట్టికరిచిన సన్ రైజర్స్..7 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్ విజయం..

sajaya

SRH vs GT: సన్ రైజర్స్పై గుజరాత్ పై చేయి సాధించింాది. 19.1 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసిన గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది. వివరాల్లోకి వెళితే ఐపీఎల్ 2024 12వ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది.

Advertisement

LSG Vs PBKS: హోం గ్రౌండ్ లో చిత‌క్కొట్టిన ల‌క్నో, 21 ప‌రుగుల తేడాతో పంజాబ్ పై విజ‌య‌దుందుబి

VNS

ఐపీఎల్‌ 17వ సీజన్‌లో లఖ్‌నవూ (Lucknow) బోణీ కొట్టింది. సొంత గడ్డపై పంజాబ్‌తో (Punjab) జరిగిన మ్యాచ్‌లో 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముందుగా టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు (Lsg Vs Pbks) దిగిన పంజాబ్‌ దంచికొట్టింది.

Moment of the Day: 11 ఏండ్ల త‌ర్వాత క‌లిసిపోయిన కోహ్లీ-గంబీర్, కేకేఆర్-ఆర్సీబీ మ్యాచ్ లో ఆసక్తిక‌ర‌మైన ఘ‌ట‌న‌, న‌వ్వుతూ మాట్లాడుకున్న ఇరువురు

VNS

కోహ్లి ఇద్ద‌రూ ఒకరినొకరు అప్యాయంగా ప‌లక‌రించుకుంటూ హగ్ చేసుకున్నారు. దీంతో వారిద్ద‌రి మ‌ధ్య 11 ఏళ్ల‌గా కొనసాగుతున్న వైర్యానికి తెర‌ప‌డింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియా వైరల్ అవుతున్నాయి.

RCB vs KKR: వ‌రుస‌గా రెండో మ్యాచ్ లోనూ కోల్ క‌తా గ్రాండ్ విక్ట‌రీ, ఆర్సీబీపై 7 వికెట్ల తేడాతో విజ‌యం, వృధాగా మారిన కోహ్లీ వ‌న్ మ్యాన్ షో

VNS

ఐపీఎల్‌ 2024లో భాగంగా కోల్‌కతా వరుసగా (RCB vs KKR) రెండో విజయం సాధించింది. బెంగళూరుతో జరిగిన పోరులో ఆ జట్టు 7 వికెట్ల తేడాతో నెగ్గింది. 183 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా 16.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. వెంకటేశ్‌ అయ్యర్‌ (50) అర్ధశతకం చేయగా, సునీల్‌ నరైన్‌ (47), ఫిలప్‌ సాల్ట్‌(30), శ్రేయస్‌ అయ్యర్‌(39*) (Shreyas Iyer) రాణించారు.

Riyan Parag Dance Videos: రాత్రికిరాత్రే స్టార్ అయిపోయిన రియాన్ పరాగ్, పాత డ్యాన్స్ వీడియోలు వైరల్, ఒంటిచేత్తో స్కోరుబోర్డును పరుగులు పెట్టించి రాజస్థాన్ కు విజయం అందించిన రియాన్

Hazarath Reddy

ఐపీఎల్‌ 17వ సీజన్‌లో మాజీ చాంపియన్‌ రాజస్తాన్‌ రాయల్స్‌ సొంతగడ్డపై వరుసగా రెండో విజయాన్ని సాధించింది. టాపార్డర్‌ చేతులెత్తేసిన వేళ రియాన్‌ పరాగ్‌ (45 బంతుల్లో 84 నాటౌట్‌; 7 ఫోర్లు, 6 సిక్స్‌లు) ఢిల్లీ క్యాపిటల్స్‌ బౌలర్లందరినీ ఉతికి ఆరేయడంతో రాజస్తాన్‌ రాయల్స్‌ 12 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై గెలిచింది.

Advertisement

Rishabh Pant Frustration Video: రిషబ్ పంత్ ప్రస్టేషన్ వీడియో ఇదిగో, అసహనంతో బ్యాట్‌ను కర్టెయిన్‌కేసి బాదిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్

Hazarath Reddy

మార్చి 28 రాత్రి జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఢిల్లీ క్యాపిటల్స్ 12 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. 186 పరుగుల లక్ష్య ఛేదనలో కీలకమైన దశలో ఔట్ అయిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ తీవ్ర అసహనానికి గురయ్యాడు. 26 బంతులు ఎదుర్కొన్న పంత్ కేవలం 28 పరుగులే చేశాడు.

IPL 2024, SRH vs MI : ఉత్కంఠ పోరులో ముంబైపై హైదరాబాద్‌ ఘన విజయం, 31 పరుగుల తేడాతో గెలుపు..రికార్డు టార్గెట్ ఛేదనలో పోరాడి ఓడిన ముంబై..

sajaya

IPL 2024 8వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 31 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్‌ను ఓడించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. దీంతో ముంబై జట్టు 20 ఓవర్లలో 246/5 ​​పరుగులు మాత్రమే చేయగలిగింది.

IPL CSK vs GT: చెపాక్‌ స్టేడియంలో చెన్నైకి భారీ విజయం..చిత్తుగా ఓడిన గుజరాత్ టైటాన్స్..

sajaya

ఐపీఎల్ 2024 ఏడో మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ భారీ విజయం సాధించింది. డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్‌ను 63 పరుగుల తేడాతో ఓడించింది. ఈ సీజన్‌లో ఆ జట్టుకు ఇది వరుసగా రెండో విజయం.

Fan Touches Virat Kohli's Feet: వీడియో ఇదిగో, ఫ్యాన్స్‌పై విరాట్ కోహ్లీ మంచి మనసు, గ్రౌండ్‌లోకి దూసుకొచ్చి కాళ్లు మొక్కిన అభిమానిపై కోహ్లీ రియాక్షన్ ఇదే..

Hazarath Reddy

ఐపీఎల్‌-2024లో భాగంగా చిన్న‌స్వామి స్టేడియం వేదిక‌గా రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు, పంజాబ్ కింగ్స్ జ‌ట్లు తలపడిన సంగతి విదితమే. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ బ్యాటింగ్ సంద‌ర్భంగా ఓ అభిమాని సెక్యూరిటీ సిబ్బంది, పోలీసుల కళ్లు గప్పి మైదానంలోకి దూసుకొచ్చాడు.విరాట్ కోహ్లి వ‌ద్ద‌కు వెళ్లి కాళ్లకు మొక్కి తన అభిమానాన్ని ప్రదర్శించాడు

Advertisement

Virat Kohli Viral Video: గెలిచిన ఆనందంలో భార్యా పిల్లలకు ముద్దులు ఇస్తూ కెమెరాకు చిక్కిన విరాట్ కోహ్లీ, వీడియో సోషల్ మీడియాలో వైరల్

Hazarath Reddy

విరాట్‌ తన మెరుపు ఇన్నింగ్స్‌కు ఫలితంగా ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు గెలుచుకున్నాడు. ఈ అవార్డు అందుకున్న అనంతరం విరాట్‌ లండన్‌లో ఉంటున్న తన కుటుంబంతో వీడియో కాల్‌ మాట్లాడాడు.తన కుటుంబంపై ముద్దుల వర్షం కురిపిస్తూ కనిపించాడు.

Virat Kohli: ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డుల్లో ధోనీ రికార్డును సమం చేసిన విరాట్ కోహ్లీ, టాప్‌లో కొనసాగుతున్న ముంబై ఇండియన్స్‌ మాజీ సారధి రోహిత్‌ శర్మ

Hazarath Reddy

ఈ మ్యాచ్‌లో "ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌"గా నిలిచిన ఆర్సీబీ స్టార్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లి.. ఐపీఎల్‌లో అత్యధిక ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డులు గెలుచుకున్న భారత ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానానికి ఎగబాకాడు. ఈ జాబితాలో రెండో స్థానంలో ఉండిన సీఎస్‌కే మాజీ కెప్టెన్‌ ఎం​ఎస్‌ ధోని రికార్డును కోహ్లి సమం చేశాడు.

Virat Kohli Most Catches Record: సురేష్ రైనా రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ, టీ20 క్రికెట్‌లో అత్య‌ధిక క్యాచ్‌లు అందుకున్న భార‌త క్రికెట‌ర్‌గా రికార్డు

Hazarath Reddy

పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో బెయిర్ స్టో క్యాచ్‌ను అందుకున్న కోహ్లి.. టీ20 క్రికెట్‌లో అత్య‌ధిక క్యాచ్‌లు అందుకున్న భార‌త క్రికెట‌ర్‌గా అరుదైన ఘ‌న‌తను త‌న పేరిట లిఖించుకున్నాడు.కోహ్లి ఇప్పటివ‌ర‌కు టీ20ల్లో 173 క్యాచ్‌లు అందుకున్నాడు.

Virat Kohli New Record: టీ20ల్లో 100 సార్లు 50 ప్ల‌స్ ర‌న్స్, తొలి భారత క్రికెటర్‌గా విరాట్ కోహ్లీ రికార్డు, తొలి స్ధానంలో కొనసాగుతున్న క్రిస్ గేల్‌

Hazarath Reddy

చిన్న‌స్వామి స్టేడియం వేదిక‌గా పంజాబ్ కింగ్స్‌తో జ‌రిగిన ఉత్కంఠ పోరులో 4 వికెట్ల తేడాతో ఆర్సీబీ ఘన విజయం సాధించి ఐపీఎల్‌-2024లో బోణీ కొట్టింది. 177 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ 6 వికెట్లు కోల్పోయి 19.2 ఓవర్లలో ఛేదించింది.ఈ మ్యాచ్‌లో విధ్వంస‌క‌ర ఇన్నింగ్స్‌ను ఆడిన కోహ్లి.. ఓ అరుదైన రికార్డును త‌న పేరిట లిఖించుకున్నాడు.

Advertisement
Advertisement