రాష్ట్రీయం
Telangana Assembly Elections 2023: కేసీఆర్‌ను మూడోసారి గెలిపిస్తే జాబ్ క్యాలెండర్‌, కాంగ్రెస్ నాయకుల మాటలు నమ్మి మోసపోవద్దంటున్న కేటీఆర్
Hazarath Reddyతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మూడోసారి గెలిపిస్తే తాము కచ్చితంగా జాబ్ క్యాలెండర్‌ను అమలు చేస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు అన్నారు. ఒక్క అవకాశం ఇవ్వమంటున్న కాంగ్రెస్ నాయకుల మాటలు నమ్మి మోసపోవద్దన్నారు.
Andhra Pradesh: ప్రపంచంలో ఎక్కువ అవకాశాలు కలిగిన దేశం మన భారత్‌ ఒక్కటే, ఆంధ్రప్రదేశ్ పర్యటనలో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ కీలక వ్యాఖ్యలు
Hazarath Reddyఏపీ ఎదుర్కుంటున్న పలు సమస్యలపై ఆంధ్రప్రదేశ్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ప్రతినిధులు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యారు.ఎన్టీఆర్‌ జిల్లా, విజయవాడలోని ఓ హోటల్‌లో సోమవారం సమావేశమైన వారు పలు అంశాలపై చర్చించారు.
Andhra Pradesh: విశాఖపట్నంలో ఆటోలో వాషింగ్ మెషిన్‌లో బయటపడ్డ నోట్ల కట్టలు, వాటి విలువ రూ.1.30 కోట్లు పైనే, స్వాధీనం చేసుకున్న పోలీసులు
Hazarath Reddyవిశాఖపట్నం నుంచి విజయవాడకు ఎలక్ట్రానిక్ వస్తువులతో వెళుతున్న ఓ ఆటోను ఆపి తనిఖీ చేసిన పోలీసులకు అందులో నోట్ల కట్టలు కనిపించడంతో ఆశ్చర్యానికి లోనయ్యారు. వాషింగ్ మెషిన్లను డెలివరీకి ఇచ్చేందుకు వెళుతున్నట్లు ఆటో డ్రైవర్ చెప్పాడు.
Telangana Assembly Elections 2023: బీజేపీకి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా, ఈ నెల 27న రాహుల్‌ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరనున్న మాజీ ఎమ్మెల్యే
Hazarath Reddyబీజేపీకి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేశారు. ఈ నెల 27న రాహుల్‌ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లోకి చేరనున్నారు. కాంగ్రెస్‌ తరపున మునుగోడు నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బరిలోకి దిగనున్నట్లు సమాచారం.
Andhra Pradesh Shocker: చిత్తూరు జిల్లాలో ఘోర విషాదం, తాగిన మత్తులో బాంబు నమలడంతో నోట్లో పేలిన కంట్రీ బాంబ్, తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం గడ్డంవారిపల్లి గ్రామంలో ఘోర ప్రమాదంలో ఓ వ్యక్తి నోటిలో కంట్రీ బాంబ్ పేలి మృతిచెందాడు. ఈ ఘటన సోమవారం అర్థరాత్రి చోటుచేసుకుంది
Ramagundam Thermal Power Station Fire: రామగుండం విద్యుత్‌ కేంద్రంలో అగ్ని ప్రమాదం, నిలిచిపోయిన విద్యుదుత్పత్తి, వీడియో ఇదిగో..
Hazarath Reddyపెద్దపల్లి జిల్లాలోని 62.5 మెగావాట్ల రామగుండం బీ థర్మల్‌ విద్యుత్తు కేంద్రంలో సోమవారం అర్ధరాత్రి ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. బాయిలర్‌లో బొగ్గు ను మండిస్తుండగా కోల్‌ఫైర్‌ బయటకు రావడంతో పవర్‌కేబుల్‌ అంటుకొని మంట లు చెలరేగాయి.
Devaragattu: దేవరగట్టు బన్నీ ఉత్సవంలో విషాదం, కర్రల సమరంలో ప్రాణాలు కోల్పోయిన యువకుడు, 100 మందికి పైగా గాయాలు, ముగ్గురి పరిస్థితి విషమం
VNSఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా హోళగుంద మండలం దేవరగట్టులో (Devaragattu) బన్నీ ఉత్సవం (Bunny Utsavam) ఘనంగా జరిగింది. దసరా పర్వదినాన గ్రామగుట్టపై అర్ధరాత్రి 12 గంటలకు మాళమ్మ, మల్లేశ్వరాస్వామి కల్యాణం కన్నులపండువగా నిర్వహించారు. అంనతరం ఉత్సవ విగ్రహాలను ఆలయ పరిసరాల్లో ఊరేగించారు.
Hyderabad Shocker: పనిమనిషి అత్యాచారం కేసులో మురళీ ముకుంద్కు జ్యుడీషియల్ రిమాండ్
ahanaజూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ మాజీ చైర్మన్ మురళీముకుంద్కు జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. మురళీముకుంద్కు నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.
Kaleshwaram Project: మేడిగడ్డ బ్యారేజీ కృంగిన ఘటనపై కేసు నమోదు, ఇరిగేషన్ అధికారుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన మహాదేవ్ పూర్ పోలీసులు
ahanaమేడిగడ్డ ఘటనపై ఇరిగేషన్ అధికారుల ఫిర్యాదుతో మహాదేవ్ పూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో కుట్ర కోణం ఉందని ఇరిగేషన్ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై విద్రోహ శక్తులున్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Telangana Assembly Elections 2023: వీడియో ఇదిగో, ఇంకో పదేళ్లలో తెలంగాణకు నేనే ముఖ్యమంత్రిని, సంగారడ్డి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు
Hazarath Reddyతాను ఇంకా పదేళ్లకైనా సీఎం అవుతానని, మీ కడుపులో పెట్టుకొని కాపాడుకోండి’’ అంటూ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయదశమి ఉత్సవాల్లో భాగంగా సంగారెడ్డిలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్న జగ్గారెడ్డి.. విజయదశమి రోజున నా మనసులో మాట చెబుతున్నానన్నారు.
Winter Season: తెలంగాణలో మొదలైన చలి పంజా.. త‌గ్గుముఖం ప‌ట్టిన ఉష్ణోగ్ర‌త‌లు.. ఆదిలాబాద్‌ లో 17.2 డిగ్రీల సెల్సియ‌స్ ఉష్ణోగ్ర‌త‌ నమోదు
Rudraతెలంగాణలో గ‌జ‌గ‌జ మొద‌లైంది. చ‌లి వ‌ణికిస్తోంది. నాలుగైదు రోజుల క్రితం వ‌ర‌కు ప‌గ‌లు, రాత్రి స‌మ‌యాల్లో ప్ర‌జ‌లు ఉక్క‌పోత‌తో అల్లాడిపోయారు. నైరుతి రుతుప‌వ‌నాలు తిరుగుముఖం ప‌ట్ట‌డంతో తెలంగాణ వైపు శీత‌ల గాలులు వీస్తున్నాయి.
TDP Janasena First Coordination Meeting: టీడీపీ-జనసేన సమన్వయ కమిటీ సమావేశం హైలెట్స్ ఇవిగో, కామన్ మినిమమ్ ప్రోగ్రాం సహా ఆరు అంశాలతో అజెండా
Hazarath Reddyటీడీపీ, జనసేన పార్టీల సమన్వయ కమిటీ తొలి సమావేశం (TDP Janasena Alliance First Meeting) రాజమహేంద్రవరంలో జరిగింది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో ఇరు పార్టీల నుంచి 14 మంది నేతలు పాల్గొన్నారు.
Lokesh-Amit Shah Meeting Row: అమిత్‌షాను పదేపదే అపాయింట్‌మెంట్‌ అడిగింది లోకేషే, సంచలన వ్యాఖ్యలు చేసిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
Hazarath Reddyటీడీపీ నేత, చంద్రబాబు తనయుడు నారా లోకేష్‌‍ ఇటీవల అమిత్‌షాను కలిసిన సంగతి తెలిసిందే. అయితే నారా లోకేష్‌ కేంద్రమంత్రిని కలవడంలో తన పాత్ర ఏమి లేదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. అమిత్‌షాను పదేపదే అపాయింట్‌మెంట్‌ అడిగింది లోకేషేనని తెలిపారు.
Rahul Gandhi Played Bathukamma Video: చెప్పులతో బతుకమ్మ ఆడిన రాహుల్ గాంధీ, ఇది బతుకమ్మకు అవమానమంటూ బీఆర్ఎస్ పార్టీ మండిపాటు
Hazarath Reddyరాహుల్ గాంధీ, జైరాం ర‌మేష్ తెలంగాణ ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొంటున్నారు. ఈ సంద‌ర్బంగా బ‌తుక‌మ్మ‌ను ఆడారు. అయితే చెప్పులతో బ‌తుక‌మ్మ‌ ఎలా ఆడుతారంటూ బీఆర్ఎస్ పార్టీ విమర్శలు ఎక్కుపెట్టింది. ఇది ఘోర‌మైన అవ‌మాన‌మ‌ని బీఆర్ఎస్ పేర్కొంది. సోమ‌వారం ట్విట్ట‌ర్ వేదిక‌గా నిప్పులు చెరిగింది పార్టీ.
Suryakumar Yadav Run Out Video: రోడ్ల మీద వెనుకా ముందు చూసుకోకుండా ఇలా వెళితే అంటూ...సూర్యకుమార్ యాదవ్ రనౌట్ వీడియో షేర్ చేసిన సజ్జనార్
Hazarath Reddyరోడ్లపై అతివేగం యమ డేంజర్! వెనుక ముందు చూసుకోకుండా ఇలా రయ్యిన దూసుకుపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ట్రాఫిక్ రూల్స్ పాటించండి. క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోండి అంటూ సూచన చేశారు.
Telangana Assembly Elections 2023: బీజేపీని ప్రాణంలా కాపాడుకుంటే నమ్మించి గొం కోసేశారు, ఏడ్చేసిన బీజేపీ నిర్మల్ జిల్లా అధ్యక్షురాలు రమాదేవి, పార్టీకి రాజీనామా
Hazarath Reddyనిర్మల్లో బీజేపీకీ షాక్ తగిలింది. బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రమాదేవి పార్టీకి రాజీనామా చేశారు. ముధోల్ నుంచి టికెట్ ఆశించగా.బీజేపీ తనకు అన్యాయం చేసిందని ఆమె బోరున విలపించారు.
Immersion of Durga Idols: నేటి నుంచే దుర్గామాత విగ్రహాల నిమజ్జనం.. 23వ తేదీ నుంచి 26వ తేదీ వరకు హుస్సేన్‌ సాగర్‌ పరిసరాలలో ట్రాఫిక్‌ ఆంక్షలు
Rudraదుర్గా మాత విగ్రహాల నిమజ్జనాల సందర్భంగా 23వ తేదీ నుంచి 26వ తేదీ వరకు హుస్సేన్‌ సాగర్‌ పరిసరాలలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర ట్రాఫిక్‌ అదనపు సీపీ సుధీర్‌బాబు తెలిపారు.
Saddula Bathukamma: తెలంగాణలో నేలకు దిగిన పూల సింగిడి, రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు, ఉయ్యాల పాటలతో హోరెత్తించిన ఆడబిడ్డలు
VNSసద్దుల బతుకమ్మ వేడుకలు (Saddula Bathukamma ) రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. పితృ అమావాస్య రోజున ఎంగిలిపూలతో ప్రారంభమైన వేడుకలు.. సద్దులతో ముగిశాయి. తంగేడు, గునుగు, పట్టుగుచ్చులు తదితర తీరొక్క పువ్వులతో బతుకమ్మలను పేర్చారు. తర్వాత గౌరమ్మను చేసి.. పసుపు కొమ్ము, వక్కతో పాటు గౌరమ్మను చేసి బతుకమ్మలో (Saddula Bathukamma ) పెట్టి పూజించారు.
Chandrababu Letter: రాజమండ్రి జైలు నుంచి నారా చంద్రబాబు నాయుడు బ‌హిరంగ లేఖ..నేను జైలులో లేను..ప్రజ‌ల హృద‌యాల్లో ఉన్నాను..
ahanaతెలుగు ప్రజలకు చంద్రబాబు జైలు నుంచి బహిరంగ లేఖ విడుదల చేశారు. నేను జైలులో లేను.. ప్రజ‌ల హృద‌యాల్లో ఉన్నాను. ప్రజ‌ల నుంచి న‌న్ను ఒక్క క్షణం కూడా ఎవ్వరూ దూరం చేయ‌లేరు అని చంద్రబాబు లేఖలో తెలిపారు.
Bathukamma Song: బతుకమ్మ పాట పాడిన కల్వకుంట్ల కవిత...వైరల్ వీడియో మీ కోసం..
ahanaఎమ్మెల్సీ కవిత తొలిసారిగా బతుకమ్మ పాటపాడి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. కల్వకుంట్ల కవిత పాడిన బతుకమ్మ పాటను సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ ఆడబిడ్డలందరికీ ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్ శుభాకాంక్షలు తెలిపారు.