రాష్ట్రీయం
Hyderabad Woman Starves on US Street: ఉన్నత చదువులకు అమెరికా వెళ్లి చికాగో రోడ్లపై ఆకలితో అలమటిస్తున్న హైదరాబాద్ యువతి, కేంద్ర మంత్రిని సాయం కోరిన యువతి తల్లి
Hazarath Reddyమాస్టర్స్ డిగ్రీ చదివేందుకు అమెరికా వెళ్లిన హైదరాబాద్ మహిళ తన వస్తువులు చోరీకి గురై ఆకలితో అలమటిస్తూ చికాగో రోడ్లపై కనిపించింది. సయ్యదా లులు మిన్హాజ్ జైదీ తల్లి సయ్యదా వహాజ్ ఫాతిమా విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్‌కు లేఖ రాస్తూ జోక్యం చేసుకుని తన కుమార్తెను భారత్‌కు తీసుకురావాలని కోరారు.
Machilipatnam Doctor Murder: మచిలీపట్నంలో మహిళా డాక్టర్ దారుణ హత్య, గొంతు కోసి అతి కిరాతకంగా చంపిన దుండగులు, బంగారు నగలు అపహరణ
Hazarath Reddyకృష్ణా జిల్లా మచిలీపట్నంలో పిల్లల వైద్య నిపుణురాలైన డాక్టర్‌ రాధ దారుణ హత్యకు గురయ్యారు. గత రాత్రి వారి ఇంట్లోకి చొరబడిన దుండగులు.. రాధ గొంతు కోసి అతి కిరాతకంగా చంపేశారు.
Andhra Pradesh Rains: ఏపీలో భారీ వర్షాలు, భవానమ్మ వాగు పొంగి పొర్లడంతో జేసీబీ సాయంతో వాగు దాటిన టీచర్లు, వీడియో ఇదిగో..
Hazarath Reddyభారీ వర్షాల కారణంగా విజయనగరం జిల్లా మెంటాడ మండలం రెడ్డివానివలస సమీపంలో భవానమ్మ వాగు పొంగి పొర్లడంతో.. వాగు దాటి అవతలి ఒడ్డుకు చేరేందుకు గజంగుడ్డివలస పాఠశాల ఉపాధ్యాయులు జేసీబీలను ఆశ్రయించారు.
Indrakiladri Ghat Road Closed: భారీ వర్షాలకు విజయవాడ దుర్గ గుడి వద్ద విరిగిపడిన కొండ చరియలు, ఇంద్రకీలాద్రి ఘాట్‌ రోడ్డు మూసివేత
Hazarath Reddyవిజయవాడ ( Vijayawada ) లో ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలతో ఇంద్రకీలాద్రి (Indrakiladri) పై కొండరాళ్లు ( Landslides) బుధవారం జారి ఘాట్‌రోడ్‌ మీద పడ్డాయి . ముందు జాగ్రత్త చర్యగా ఇంద్రకీలాద్రి ఘట్‌రోడ్డును అధికారులు మూసివేశారు.
Srivari Pushkarini to be Closed: శ్రీవారి భక్తులకు అలర్ట్, నెలరోజుల పాటు తిరుమల శ్రీవారి పుష్కరిణి మూసివేత, భారీ వర్షాలకు తగ్గిన భక్తుల రద్దీ
Hazarath Reddyతిరుమ‌లలో శ్రీ‌వారి ఆల‌యం వద్ద గల పుష్కరిణిని నెలరోజుల పాటు మూసివేస్తున్నామని టీటీడీ అధికారులు వెల్లడించారు. పుష్కరిణీలో ఉన్న నీటిని తొలగించి పైపులైన్ల మరమ్మతులు, సివిల్ పనులు చేపట్టేందుకు ఆగస్టు 1 నుంచి 31వ తేదీ వరకు పుష్కరిణిని మూసివేస్తున్నామని తెలిపారు.
BJP Workers Protest Against MP Arvind: ఎంపీ ధర్మపురి అరవింద్‌ ఏకపక్ష నిర్ణయంపై భగ్గుమన్న బీజేపీ క్యాడర్, ఆందోళనకు దిగిన నిజామాబాద్ బీజేపీ కార్యకర్తలు
Hazarath Reddyతెలంగాణలో గందరగోళంగా రాష్ట్ర బీజేపీ పరిస్థితి తయారైంది. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు వ్యతిరేకంగా నిజామాబాద్ బీజేపీ నేతల ఆందోళన చేపట్టారు. నాంపల్లి పార్టీ కార్యాలయంలో ఆందోళనకు దిగిన నిజామాబాద్ బీజేపీ కార్యకర్తలు.
No Confidence Motion: అవిశ్వాస తీర్మానంపై విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు, అంతా సవ్యంగా సాగుతున్నప్పుడు అవిశ్వాస తీర్మానం ఎందుకని వెల్లడి
Hazarath Reddyఅంతా సవ్యంగా సాగుతున్నప్పుడు అవిశ్వాస తీర్మానం పెట్టాల్సిన అవసరం ఎక్కడిదని.. ఆ తీర్మానాన్ని వ్యతిరేకిస్తున్నామని వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు.
Kuppam Politics: భరత్‌ను కుప్పంలో ఎమ్మెల్యేగా గెలిపిస్తే సీఎం చేస్తాం, పొరపాటున నోరు జారిన మంత్రి పెద్దిరెడ్డి, వీడియో ఇదిగో..
Hazarath Reddyకుప్పం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి భరత్‌ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే సీఎం చేస్తాం అంటూ మంత్రి పెద్దిరెడ్డి నోరుజారారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Andhra Pradesh: 80 రూపాయల బిర్యానీ కోసం వెళ్లి 4 లక్షలు పోగొట్టుకున్న యువకులు, వీడియో ఇదిగో..
Hazarath Reddyభీమవరంలో 80 రూపాయల బిర్యానీ కోసం వెళ్లి 4 లక్షలు పోగొట్టుకున్న యువకులు. భీమవరం పట్టణంలోని సీతయ్య హోటల్ వద్ద స్కూటీ డిక్కీలో ఉన్న 4 లక్షల రూపాయలను దొంగ ఎత్తుకు పోయాడు.
Hyderabad Rains: హైదరాబాద్‌లో ఈ ఏరియాలకు రెడ్ అలర్ట్‌, అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక
Hazarath Reddyబంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నిన్న తీవ్ర పీడనంగా మారింది. మరి కొద్ది గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని ఒడిశాలోని గోపాల్‌పూర్ వాతావరణశాఖ తెలిపింది. ఇది దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరానికి చేరువ అవుతోందని, దీనికి అనుబంధంగా సముద్ర ఉపరితలంలో 7.6 కిలోమీటర్ల ఎత్తులో మరో తుపాను ఆవర్తనం కొనసాగుతున్నట్టు పేర్కొంది.
IMD Weather Forecast: నేడు వాయుగుండంగా మారనున్న అల్పపీడనం, తీరప్రాంతంలో గంటకు 55 కిలోమీటర్ల వేగంతో గాలులు, మత్స్యకారులు చేపలవేటకు వెళ్లొద్దని హెచ్చరిక
Hazarath Reddyబంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నిన్న తీవ్ర పీడనంగా మారింది. మరి కొద్ది గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని ఒడిశాలోని గోపాల్‌పూర్ వాతావరణశాఖ తెలిపింది. ఇది దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరానికి చేరువ అవుతోందని, దీనికి అనుబంధంగా సముద్ర ఉపరితలంలో 7.6 కిలోమీటర్ల ఎత్తులో మరో తుపాను ఆవర్తనం కొనసాగుతున్నట్టు పేర్కొంది.
Viral Video: భారీ వర్షాలకు ఇంట్లోకి పాము, అధికారులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోకోవడంతో జీహెచ్ఎంసీ ఆఫీసుకి పాముని పట్టుకుపోయిన యువకుడు
Hazarath Reddyహైదరాబాద్ - భారీ వర్షాలకు అల్వాల్ ప్రాంతంలో సంపత్ కుమార్ అనే యువకుడి ఇంట్లోకి వరద నీరుతో పాటు పాము వచ్చింది. జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేసి 6 గంటలు గడిచినా ఎలాంటి స్పందన లేకపోవడంతో.. ఓపిక నశించి అల్వాల్ జీహెచ్ఎంసీ వార్డు ఆఫీసుకు పామును తీసుకొచ్చి టేబుల్ మీద పామును పెట్టి నిరసన తెలిపాడు.
Video: విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై లారీలో భారీగా మంటలు, కిందకు దూకి ప్రాణాలు దక్కించుకున్న డ్రైవర్
Hazarath Reddyమంగళవారం నాడు ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల సమీపంలో విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై లారీలో భారీ మంటలు చెలరేగడంతో డ్రైవర్ తృటిలో తప్పించుకున్నాడు, మంటలను చూసి డ్రైవర్ వాహనాన్ని ఆపి లారీ నుండి దూకాడు.
Telangana Floods:భారీ వరదలు, శవ దహనం కోసం ప్రాణాలు అర చేతిలో పెట్టుకొని వాగు దాటిన సిద్దిపేట గ్రామస్థులు, వీడియో ఇదిగో..
Hazarath Reddyసిద్దిపేట - చేర్యాల మండలంలో భారీ వర్షాల వల్ల వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. శవ దహనం కోసం ప్రాణాలు అర చేతిలో పెట్టుకొని గ్రామస్థులు వాగు దాటిన కార్యక్రమం పూర్తి చేశారు. వీడియో ఇదిగో..
Telangana Shocker: సోషల్ మీడియాలో రీల్స్‌తో పాపులర్ అవుతుందని చెల్లిని రోకలి బండతో కొట్టి చంపేసిన అన్న, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదకర ఘటన
Hazarath Reddyభద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం రాజీవ్‌నగర్‌లో దారుణం చోటు చేసుకుంది. చెల్లెలు సోషల్‌ మీడియాలో వీడియోలు పెడుతోందని ఆగ్రహించిన అన్న ఆమెను రోకలిబండతో మోది హత్య చేశాడు. అనంతరం రాయి తగిలి చనిపోయిందని నమ్మించే ప్రయత్నం చేయగా.. గ్రామస్థులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అసలు విషయం బయటపడింది.
Andhra Pradesh: డ్రైవింగ్ చేస్తూ ఇయర్ ఫోన్స్,హెడ్‌సెట్ పెట్టుకుంటే రూ. 20,000 జరిమానా, ఏపీలో రూల్స్ త్వరలో అమల్లోకి రానున్నట్లుగా వార్తలు..
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇకపై బైక్ మీద కానీ కారులో కానీ ఆటోలో కానీ ఇయర్ ఫోన్స్ లేదా హెడ్సెట్ పెట్టుకుంటే రూ. 20,000 జరిమానా వేయనుంది.
Video: వీడియో ఇదిగో, భారీ వర్షాలకు కృష్ణానదిలోకి భారీగా కొట్టుకువచ్చిన మొసళ్లు, నది దగ్గరకు వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు
Hazarath Reddyతెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. గత వారం రోజుల నుంచి జన జీవనం స్థంభించి పోయింది. భారీ వర్షాలకు మొసళ్లు సైతం వాగులో కొట్టుకుంటూ వచ్చాయి. తాజాగా నారాయణపేట - మక్తల్ మండలం పసుపుల గ్రామ కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షానికి వాగులో మొసళ్ళు కొట్టుకొచ్చాయి. వీడియో ఇదిగో.
No-Confidence Motion: మోదీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన బీఆర్ఎస్, కాంగ్రెస్, నోటీసును పరిగణనలోకి తీసుకోవాలని స్పీకర్‌కు విన్నపం
Hazarath Reddyమణిపూర్‌పై వివాదం మధ్య, కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్, బీఆర్‌ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు లోక్‌సభలో మోదీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టారు. లోయర్ హౌస్ స్పీకర్ ఈరోజు పార్లమెంటులో నోటీసును పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది.
Video: వీడియో ఇదిగో, రద్దీ రోడ్డులో ఒక్కసారిగా పేలిన కారు టైరు, ఈడ్చుకుంటూ వెళ్లిన లారీ, తప్పిన భారీ ప్రమాదం
Hazarath Reddyహైదరాబాద్ - మైలార్ దేవ్‌పల్లి పరిధిలోని దుర్గానగర్లో ఆల్టో కారు టైర్ ఒక్కసారిగా పేలడంతో పక్కన వెళుతున్న లారీని ఢీకొట్టింది. కారును లారీ ఈడ్చుకుంటూ వెళ్లడంతో కారులో ప్రయాణిస్తున్న వ్యక్తులకు తీవ్రగాయాలయ్యాయి. వీడియో ఇదిగో..
Telangana Schools Closed for 2 Days: రేపు,ఎల్లుండి స్కూళ్లకు సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం, హైదరాబాద్‌ సహా 8 జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌
Hazarath Reddyభారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో రేపు, ఎల్లుండి విద్యాసంస్థలకు సెలవులు ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.హైదరాబాద్‌ సహా 8 జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ను వాతావరణ శాఖ జారీ చేసింది.