రాష్ట్రీయం

Komatireddy Rajagopal Reddy: తనపై ఆంధ్రా మీడియా దుష్ప్రచారం, ఎన్టీఆర్‌ ఘాట్ కూల్చాలని అనలేదన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎన్టీఆర్ ఘాట్ జోలికి వస్తే ప్రజలే తిరగబడతారన్న బీఆర్ఎస్

Arun Charagonda

ఎన్టీఆర్ ఘాట్ కూల్చేయాలని తాను అన్నట్లు కొంతమంది కావాలనే విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. అసెంబ్లీ లాబిలో బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయం ముందు ఎమ్మెల్యే వివేకానంద, బాల్క సుమన్‌ మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. బీఆర్ఎస్ మా మధ్య చిచ్చు పెట్టాలని చూస్తోందని ఆ పార్టీ ట్రాప్‌లో పడేది లేదన్నారు.

Tirumala: తిరుమల సమాచారం..జనవరి 10 నుండి వైకుంఠ ద్వారా దర్శనం, వైకుంఠ ద్వారా దర్శన టికెట్ల జారీ షెడ్యూల్ ప్రకటించిన టీటీడీ

Arun Charagonda

తిరుమల వైకుంఠ ద్వారా దర్శన టికెట్ల షెడ్యూల్‌ను జారీ చేసింది టీటీడీ. ఈనెల 23న ఉదయం 11 గంటలకు ఆన్‍లైన్‍లో శ్రీవాణి దర్శన టికెట్లు విడుదల చేయనుండగా 24న ఉదయం 10 గంటలకు ఆన్‍లైన్‍లో ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల చేయనున్నారు.

Telangana Assembly Sessions: మంత్రులే ప్రశ్నలు అడుగుతారా?, మూసీని మురికి కూపం చేసిందే కాంగ్రెస్..హరీశ్‌ రావు ఫైర్, అన్ని ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నాం అన్న మంత్రి ఉత్తమ్

Arun Charagonda

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు 5వ రోజు కొనసాగుతున్నాయి. ప్రశ్నోత్తరాల సమయంలో అధికార, విపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. తొలుత మాజీ మంత్రి హరీశ్‌ రావు మాట్లాడుతూ..కేబినెట్‌ నిర్ణయం అంటే సమిష్టి నిర్ణయం. ప్రశ్నోత్తరాల సమయంలో ఒక మంత్రి మరొక మంత్రిని ప్రశ్న అడగడం ఏంటి అని చురకలు అంటించారు.

Weather Forecast: కోస్తా తీరం వైపు దూసుకొస్తున్న అల్పపీడనం, వచ్చే 24 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం, ఏపీలోని ఈ జిల్లాలకు భారీ వర్షాల అలర్ట్, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత

Hazarath Reddy

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కోస్తా తీరం వైపుగా దూసుకొస్తోందని, దీని ప్రభావంతో ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లో నేడు, రేపు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ తెలిపింది

Advertisement

Theft Caught on Camera: వీడియో ఇదిగో, డోర్ బెల్ కొట్టి మహిళ మెడలో నుంచి 4 తులాల పుస్తెలతాడును లాక్కెళ్లిన దొంగ, హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన

Hazarath Reddy

నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధి హైదర్షి కోట్ సన్ సిటీలో ఓ అపార్ట్మెంట్ మొదటి అంతస్థులో కాలింగ్ బెల్ కొట్టి తెరిచిన వెంటనే మహిళ మెడలో నుంచి 4 తులాల పుస్తెలతాడును లాకెళ్లాడు. కేసు నమోదు చేసిన పోలీసులు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి.

Vizag Student Dies in Canada: కెనడాలో గాజువాక విద్యార్థి అనుమానాస్పద మృతి, స్పందించిన నారా లోకేష్, మృతదేహాన్ని స్వదేశానికి రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడి

Hazarath Reddy

వైజాగ్‌కు చెందిన ఓ యువకుడు కెనడాలోని తన గదిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. వైజాగ్ నగరంలోని గాజువాక ప్రాంతానికి చెందిన పిల్లి ఫణి కుమార్ (36) కెనడాలోని కాల్గరీలోని సదరన్ ఆల్బర్టా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో సప్లయ్ చైన్, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్‌లో ప్రోగ్రామ్‌ను అభ్యసిస్తున్నాడు

Leopard Dies in Metlapalli: రైతు ఏర్పాటు చేసిన ఉచ్చులో చిక్కుకుని చిరుత పులి మృతి, గన్నవరం మండలం మెట్లపల్లిలో విషాదకర ఘటన

Hazarath Reddy

కృష్ణాజిల్లా(Krishna District) కృష్ణా జిల్లా గన్నవరం మండలం మెట్లపల్లిలో రైతు తన పంట పొలాన్ని అడవి పందుల నుంచి రక్షించుకునేందుకు ఏర్పాటు చేసిన ఉచ్చులో చిక్కుకుని చిరుతపులి(Leopard) మృతి చెందింది. ఉదయాన్నే రైతు పొలానికి వెళ్లి చూడగా ఉచ్చులో చిక్కి మృతి చెందిన చిరుత పులి కనిపించింది.

Online Betting Trap: ఆన్‌లైన్ బెట్టింగ్ ట్రాప్..వీసీ సజ్జనార్ ట్వీట్ వైరల్, అమాయకులను బెట్టింగ్ కూపంలోకి లాగేందుకు ఎలాంటి వేశాలు వేస్తున్నారో మీరు చూడండి..

Arun Charagonda

ఆన్ లైన్ బెట్టింగ్ ఫ్రాడ్‌పై ట్విట్ చేశారు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్. అమాయకులను బెట్టింగ్ కూపంలోకి లాగేందుకు ఇలాంటి చిత్ర విచిత్ర వేషాలు వేస్తున్నారు. తమ వ్యక్తిగత స్వార్థం కోసం ఎంతో మందిని అన్ లైన్ జూదానికి వ్య‌స‌న‌ప‌రుల‌ను చేస్తూ.. సొమ్ము చేసుకుంటున్నారు. యువ‌కుల్లారా!! అరచేతిలో వైకుంఠం చూపించే ఇలాంటి సంఘవిద్రోహ శ‌క్తుల వలలో చిక్కుకోకండి. బెట్టింగ్ కు బానిసై బంగారు భవిష్యత్తును చేజేతులా నాశనం చేసుకోకండిని సూచించారు.

Advertisement

Telangana: గురుకులంలో మరో విద్యార్థికి పాము కాటు, 24 గంటలు గడవకముందే మరో విద్యార్థిని కాటు వేసిన పాము...భయాందోళనలో విద్యార్థులు

Arun Charagonda

జగిత్యాల జిల్లా, మెట్ పల్లి మండలం పెద్దాపుర్ గురుకుల పాఠశాలలో ఉదయం యశ్వంత్ అనే మరో విద్యార్థికి పాము కాటు వేసింది. ఎనిమిదవ తరగతి చదువుతున్నారు యశ్వంత్. వెంటనే కోరుట్ల ప్రభుత్వాసుపత్రికి తరలించింది సిబ్బంది. నిన్న అఖిల్ అనే విద్యార్థికి పాముకాటు వేయగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు అఖిల్. గతంలో ఇదే గురుకులంలో ఇద్దరు విద్యార్థులు పాముకాటుతో మృతి చెందారు.

Andhra Pradesh: జనసేన నేత పుట్టినరోజు వేడుకలు..రేవ్ పార్టీ, యువతుల అశ్లీల నృత్యాలు..ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన...వీడియోలు వైరల్

Arun Charagonda

జనసేన నేత పుట్టినరోజు వేడుకల్లో అశ్లీల నృత్యాలతో రేవ్ పార్టీ నిర్వహించగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఘటన. ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం నిడమర్రు మండలం క్రొవ్విడి లో అశ్లీల నృత్యాలు వైరల్‌గా మారాయి. జనసేన పార్టీ మండల అధ్యక్షుడు వాకమూడి ఇంద్ర..జన్మదినం సందర్భంగా క్రొవ్విడి శివారు రైస్ మిల్లులో పార్టీ నిర్వహించారు.

Telangana High Court: అధికారులకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు, స్టే ఆర్డర్ ఉన్న ఇంటిని కూల్చేయడంపై ఆగ్రహం..అధికారుల సొంత ఖర్చులతో తిరిగి కట్టించాలని ఆదేశం

Arun Charagonda

తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లాలో కోర్టు స్టే ఆర్డర్ ఉన్నా ఇంటిని, హోటల్‌ని కూల్చేశారు అధికారులు. కోర్టు స్టే ఆర్డర్ ఉన్నా కూడా కూల్చివేతలకు పాల్పడ్డ అధికారులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తక్షణమే అధికారుల సొంత ఖర్చుతో తిరిగి కట్టించి ఇవ్వాలని ఆదేశించింది. కోర్టు తీర్పు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది.

Balagam Mogilaiah: బలగం మూవీ నటుడు మొగిలయ్య కన్నుమూత, కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న మొగిలయ్య...స్వగ్రామంలో జరగనున్న అంత్యక్రియలు

Arun Charagonda

బలగం మూవీ ఫేమ్ జానపద కళాకారుడు మొగిలయ్య కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న మొగులయ్య..ఇవాళ ఉదయం మృతి చెందారు. ఆయన మృతిపట్ల పలువురు సంతాపం తెలపగా మొగిలయ్య స్వగ్రామం నర్సంపేట నియోజకర్గం దుగ్గొండి మండల కేంద్రం. ఆయన స్వగ్రామంలో అంత్యక్రియలు జరగనున్నట్లు సమాచారం.

Advertisement

Hyderabad: వనస్థలిపురంలో షాకింగ్ సంఘటన, కారులో మహిళ ఆత్మహత్య, పురుగుల మందు తాగి సూసైడ్...పోలీసులకు ఫిర్యాదు చేసిన మృతురాలి సోదరుడు

Arun Charagonda

వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. ఇంజాపూర్ రాజశ్రీ ఎన్ క్లేవ్ లో నివాసముంటున్నారు రామకృష్ణారెడ్డి, ఉమాశ్రీ దంపతులు. తమ కారులో కూర్చుని పురుగు మందు తాగి సూసైడ్ చేసుకుంది ఉమాశ్రీ. ఉమాశ్రీ మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు సోదరుడు.

Telangana: గురుకులంలో మరో విద్యార్థికి పాము కాటు, స్నానం చేసే సమయంలో కాటు వేసిన పాము..పెద్దాపూర్ గురుకులంలో ఘటన, వీడియో

Arun Charagonda

గురుకులంలో మరో విద్యార్థికి పాము కాటు కలకలం రేపింది. జగిత్యాల - పెద్దాపూర్ 8వ తరగతి చదువుతున్న ఓంకార్ అఖిల్ అనే విద్యార్థికి స్నానం చేసే సమయంలో కాటు వేసింది పాము. హుటాహుటిన విద్యార్దిని ఆస్పత్రికి తరలించగా 24 గంటలు వైద్యుల పర్యవేక్షణలో కొనసాగుతోంది చికిత్స.

Andhra Pradesh Cabinet Meeting: ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినేట్ భేటీ.. రాజధాని నిర్మాణంలో యువత భాగస్వామ్యం, పరిశ్రమలకు భూ కేటాయింపు, కీలక నిర్ణయాలు తీసుకోనున్న మంత్రివర్గం

Arun Charagonda

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ కేబినెట్ కీలక సమావేశం జరగనుంది. ఉదయం 11 గంటలకు మంత్రివర్గ సమావేశం జరగనుండగా పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ప్రధానంగా రాజధాని అమరావతి ప్రాంతంలో చేపట్టాల్సిన నిర్మాణాలపై చర్చించనున్నారు. సీఆర్డీఏ ఆధారిటీ స‌మావేశంలో ఆమోదం తెలిపిన రూ. 24,276 కోట్ల పనులకు మంత్రివ‌ర్గం ఆమోదం తెలియజేయనుంది.

Cherlapally Terminal: చ‌ర్ల‌ప‌ల్లి రైల్వే టెర్మిన‌ల్ ప్రారంభోత్స‌వానికి ముహుర్తం ఖ‌రారు. ఈ నెల 28న రైల్వే మంత్రి చేతుల మీదుగా ప్రారంభం

VNS

సికింద్రాబాద్‌, కాచిగూడ, నాంపల్లి స్టేషన్లపై ఒత్తిడి తగ్గిచేందుకు చర్లపల్లి టెర్మినల్‌ను రైల్వేశాఖ (Railway Ministry) అభివృద్ధి చేసింది. చర్లపల్లి టెర్మినల్‌ను ప్రారంభించిన అనంతరం ఇక్కడి నుంచే వివిధ ప్రాంతాలకు రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి.

Advertisement

Hyderabad: విగ్గులు మారుస్తూ 50 మంది యువతులను పెళ్లి పేరుతో మోసం చేసిన ఘనుడు, మహిళా డాక్టర్‌ ని రూ.50 లక్షల మేర మోసం చేయడంతో ఘటన వెలుగులోకి..

Hazarath Reddy

హైదరాబాద్‌కి చెందిన వంశీ కృష్ణ అనే వ్యక్తి పెళ్లి పేరుతో 50 మంది యువతులను మోసం చేశాడు. ప్రస్తుతం అతడి కోసం హైదరాబాద్ గచ్చిబౌలి పోలీసులు గాలిస్తున్నారు. పెళ్లై ఇద్దరు పిల్లలున్నా.. విగ్గులు మారుస్తూ, కులాలకు తగ్గట్లు తన పేరు మార్చుకుని, తానో సాఫ్ట్ వేర్ కంపెనీ యజమానిగా మ్యాట్రిమోనిలో పేర్కొన్న వంశీ

Andhra Pradesh: వీడియో ఇదిగో, బ్యాంకులో క్యాషియర్ మెడపై కత్తి పెట్టి బ్యాగులో డబ్బులు వేయాలని బెదిరించిన దొంగ

Hazarath Reddy

బ్యాంకు ఉద్యోగి మెడ పై కత్తి పెట్టి బెదిరించిన దొంగ...తిరపతి రూరల్ మండలం రేణిగుంట రోడ్డులోని బ్యాంకులోకి దొంగ కత్తితో చొరబడ్డ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. క్యాషియర్ దగ్గరకు వెళ్లి మెడపై కత్తి పెట్టి బ్యాగులో డబ్బులు వేయాలని బెదిరించాడు.

Telangana: దారుణం, 8వ తరగతి విద్యార్థితో వంట చేయించిన ప్రిన్సిపాల్, ఒంటిపై నూనె పడటంతో తీవ్ర గాయాలు, ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేయాలంటూ తల్లిదండ్రుల డిమాండ్

Hazarath Reddy

భువనగిరి - నారాయణపురం మండలంలోని సర్వేల్ గురుకుల పాఠశాలలో వంట మనుషులు లేకపోవడంతో 8వ తరగతి విద్యార్థితో వంట పనులు చేయించాడు ప్రిన్సిపాల్. అయితే వంట చేస్తుండగా విద్యార్థి ఒంటిపై నూనె పడి తీవ్ర గాయాలు అయ్యాయి

Telugu YouTuber Prasad Behara Arrest: లైంగిక వేధింపుల కేసులో తెలుగు యూట్యూబ‌ర్ ప్ర‌సాద్ బెహ‌ర‌ అరెస్ట్, షూటింగ్‌ సమయంలో త‌న‌ ప్రైవేట్‌ భాగాలను తాకాడని యువతి ఫిర్యాదు

Hazarath Reddy

ప్ర‌ముఖ తెలుగు యూట్యూబ‌ర్ ప్ర‌సాద్ బెహ‌ర‌ను లైంగిక వేధింపుల కేసులో హైద‌రాబాద్ జూబ్లీహిల్స్‌ పోలీసులు అరెస్ట్ చేసిన‌ట్లు తెలుస్తుంది. త‌న సహచర న‌టిపై లైంగిక వేధింపులు చేశాడంటూ ఒక యువ‌తి పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది.

Advertisement
Advertisement