ఆంధ్ర ప్రదేశ్
AP Floods: వరద బాధితులకు మహేష్ బాబు రూ. 25 లక్షల సాయం, వరదల విపత్తు బాధిత కుటుంబాలకు అండగా నిలిచిన ప్రిన్స్
Hazarath Reddyసూపర్‌ స్టార్ మహేశ్‌ బాబు 25 లక్షల రూపాయలను ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం ( Rs 25 lakh to CM relief fund) అందించారు.ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. ‘
Corona in AP: ఏపీలో కొత్తగా 184 కరోనా కేసులు నమోదు, ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 2,149
Hazarath Reddyఏపీలో కొత్తగా 184 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో వైద్యసిబ్బంది 29,595 మందికి పరీక్షలు నిర్వహించినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. కొవిడ్‌ బారిన పడి కృష్ణా జిల్లాకు చెందిన ఒకరు మృతి చెందారని తెలిపారు. రాష్ట్రంలో కొవిడ్‌ బారిన పడి చనిపోయిన వారి సంఖ్య 14,443కి చేరింది.
Andhra Pradesh: సిరివెన్నెల కుటుంబానికి అండగా నిలిచిన ఏపీ ప్రభుత్వం, వైద్యం ఖర్చు మొత్తాన్ని సీఎం రిలీఫ్‌ ఫండ్‌ నుంచి విడుదల చేయాలని సీఎం జగన్ ఆదేశాలు
Hazarath Reddyసిరివెన్నెల వైద్యం ఖర్చు మొత్తాన్ని సీఎం రిలీఫ్‌ ఫండ్‌ నుంచి విడుదల చేయాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఇదివరకే కుటుంబ సభ్యులతో అధికారులు మాట్లాడారు.
Andhra Pradesh Floods: వరద బాధితులకు అండగా టాలీవుడ్ ప్రముఖులు, సీఎం సహాయ నిధికి రూ. 25 లక్షలు సాయం ప్రకటించిన మహేష్ బాబు, చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్
Hazarath Reddyసూపర్‌ స్టార్ మహేశ్‌ బాబు 25 లక్షల రూపాయలను ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం ( Rs 25 lakh to CM relief fund) అందించారు.ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విటర్‌ వేదికగా వెల్లడించారు
Andhra Pradesh Floods: ఏపీలో వరదల నష్టం రూ. 2 వేల కోట్లకు పైనే, తక్షణం రూ.వెయ్యి కోట్లిచ్చి ఆదుకోవాలని కేంద్రానికి ఎంపీ విజయసాయిరెడ్డి విజ్ఞప్తి, శాఖలవారీ నష్టంపై ప్రాథమిక నివేదికను కేంద్రానికి అందించిన రాష్ట్ర ప్రభుత్వం
Hazarath Reddyఏపీలో అకాల వరదలతో రాష్ట్రంలోని మొత్తం 13 జిల్లాల రైతులూ పెద్ద ఎత్తున నష్టపోయారు. ప్రభుత్వ ప్రాథమిక అంచనాల ప్రకారమే వ్యవసాయ, ఉద్యాన పంటలకు రూ.2వేల కోట్లకు పైనే నష్టం జరిగింది.
Jagananna Vidya Deevena Scheme: జగనన్న విద్యాదీవెన, చదువుకు పేదరికం అడ్డం కాకూడదు, విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.686 కోట్లు జమ చేసిన ఏపీ సీఎం జగన్
Hazarath Reddyజగనన్న విద్యాదీవెనలో భాగంగా మూడోవిడత బోధన రుసుముల్ని సీఎం మంగళవారం విడుదల చేశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో 11.03 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.686 కోట్లు జమచేశారు.
Cyclone Jawad: రాయలసీమ, నెల్లూరు జిల్లాకు తప్పిన ముప్పు, ఉత్తరాంధ్ర వైపు దూసుకువస్తున్న జవాద్ తుఫాను, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ
Hazarath Reddyఇటీవల ఉపరితల ఆవర్తనం రాయలసీమతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలను అతలాకుతలం చేయగా.. ఇప్పుడు మరో తుపాను ముప్పు ఉత్తరాంధ్రను వణికిస్తోంది. దక్షిణ థాయ్‌లాండ్‌ వద్ద అండమాన్‌ సమీపంలో మంగళవారం మధ్యాహ్నం అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది
AP Government Holidays 2022: ఏపీలో వచ్చే ఏడాది సెలవుల లిస్ట్ విడుదల, మొత్తం 17 సాధారణ, 18 ఐచ్ఛిక సెలవులు, మార్పులు చేయాల్సి వస్తే వాటిని ముందస్తుగా తెలియజేస్తామని ప్రకటన
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చే ఏడాది (2022)కి సంబంధించి ఉద్యోగులకు సాధారణ, ఐచ్ఛిక, నెగోషియబుల్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌ యాక్ట్‌ సెలవులను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో మొత్తం 17 సాధారణ, 18 ఐచ్ఛిక సెలవులు ఉన్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ సమీర్‌ శర్మ సోమవారం ఉత్తర్వులిచ్చారు.
Anandayya 'New Political Party': రాజకీయాల్లోకి ఆనందయ్య, కొత్త పార్టీ పెడుతున్నట్లు ప్రకటన, కరోనా థర్డ్‌వేవ్ మందు తన దగ్గర ఉందని, రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తే అందిస్తానని తెలిపిన కృష్ణపట్నం ఆయుర్వేద వైద్యుడు
Hazarath Reddyకరోనాకు మందు కనిపెట్టానంటూ గతంలో సంచలనం రేపిన నెల్లూరు ఆయుర్వేద డాక్టర్ ఆనందయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను రాజకీయాల్లోకి (Anandayya Coming to Politic) వస్తున్నట్లు ప్రకటించారు. త్వరలోనే బీసీల కోసం రాజకీయ పార్టీని (Anandayya New Political Party) స్థాపిస్తానని తెలిపారు.
YSR Housing Scheme: హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి ఊరట, పేదలందరికీ ఇళ్లు పథకంపై సింగిల్ బెంచ్ తీర్పును కొట్టివేసిన డివిజన్‌ బెంచ్, పేదల ఇళ్ల నిర్మాణానికి ఇక మార్గం సుగమం
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ లో పేదలందరికీ ఇళ్ల నిర్మాణానికి మార్గం సుగమం అయ్యింది.. పేదలందరికీ ఇళ్ల పథకం (YSR Housing Scheme) విషయంలో హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్‌ బెంచ్ రద్దు చేసింది .. దీంతో, ఇళ్ల స్థలాలపై హైకోర్టులో (Andhra Pradesh High Court) దాఖలు చేసిన పిటిషన్‌ను వెనక్కి తీసుకుంటున్నట్టు పిటిషనర్లు తెలిపారు.
Three Capitals Cases: ప్రతీ ప్రభుత్వ నిర్ణయాన్ని అనుమానించాల్సిన అవసరం లేదు, గవర్నర్‌ ఆమోదించేవరకు రాజధానుల బిల్లుపై తేల్చలేమన్న హైకోర్టు, తదుపరి విచారణ డిసెంబర్‌ 27కి వాయిదా
Hazarath Reddyఏపీ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా తీసుకువచ్చిన పాలన వికేంద్రీకరణ బిల్లును రద్దు చేయడం, వెంటనే అసెంబ్లీలో ఆమోదం పొందడం తెలిసిందే. అయితే ఈ బిల్లులపై హైకోర్టులో కేసులు (Three Capitals Cases) నడుస్తున్నాయి. తాజాగా పాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు చట్టాలను ఉపసంహరిస్తూ ప్రభుత్వం తాజాగా తెచ్చిన బిల్లులపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
Weather Update: నేడు మరో అల్పపీడనం, ఏపీలో నాలుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు, తెలంగాణలో పొడి వాతావరణం
Hazarath Reddyనేడు దక్షిణ అండమాన్ సముద్రంలో మరో అల్పపీడనం (Low pressure) ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ అల్పపీడనం మరింత బలపడి మరో 48 గంటల్లో పశ్చిమ వాయవ్య దిశలో ప్రయాణించే అవకాశం ఉందని తెలిపారు.
Corona in AP: ఏపీలో 101 మందికి కరోనా పాజిటివ్, అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 19 కేసులు నమోదు
Hazarath Reddyఏపీలో గడచిన 24 గంటల్లో 18,730 కరోనా నమూనాలు పరీక్షించగా, 101 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 19 కేసులు నమోదు కాగా, తూర్పు గోదావరి జిల్లాలో 14, గుంటూరు జిల్లాలో 12 కేసులు వెల్లడయ్యాయి. విజయనగరం, కర్నూలు జిల్లాల్లో కొత్త కేసులేవీ నమోదు కాలేదు.
Orange Alert for AP: ఏపీలో నాలుగు జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌, భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపిన వాతావరణ శాఖ, దక్షిణ అండమాన్‌ సముద్రంలో 30న మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, వైఎస్సార్‌ జిల్లాలకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఆరెంజ్‌ అలర్ట్‌ చేసింది. నాలుగు జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. దక్షిణ అండమాన్‌ సముద్రంలో 30న మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.
AP Flash Floods: 30న మరో అల్పపీడనం, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాలకు మళ్లీ తప్పని ముప్పు, ఇప్పటికే భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తం, వరద ప్రభావిత ప్రాంతాల్లో రెండు కేంద్ర బృందాలు పర్యటన
Hazarath Reddyకోమరిన్‌ ప్రాంతం, శ్రీలంక పరిసరాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో సోమవారం చిత్తూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, మిగిలిన జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం (Heavy Rains continue) ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.
Dollar Seshadri No More: గుండెపోటుతో డాలర్‌ శేషాద్రి హఠాన్మరణం, సంతాపం తెలిపిన ఏపీ సీఎంతో పాటు పలువురు ప్రముఖులు, విశాఖ కేజీహెచ్‌ నుంచి తిరుపతికి డాలర్ శేషాద్రి భౌతికకాయం తరలింపు
Hazarath Reddyశ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్‌ శేషాద్రి హఠాన్మరణం (Dollar Seshadri dies of cardiac arrest in Visakhapatnam) చెందారు. విశాఖపట్నంలో కార్తీక దిపోత్సవం కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన ఆయన.. వేకువజామున గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తరలించే లోపు తుది శ్వాస (Dollar Seshadri No More) విడిచారు. 1978 నుంచి డాలర్‌ శేషాద్రి శ్రీవారి సేవలో ఉన్నారు.
AP on High Alert: ఆంధ్రప్రదేశ్‌కు మరో ముప్పు, డిసెంబర్ 2 వరకు రాయలసీమకు భారీ వర్షసూచన, చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల్లో రెడ్‌అలర్ట్ జారీ
Naresh. VNSగత కొద్దిరోజులుగా భారీ వర్షాలతో అతలాకుతలమైన ఆంద్రప్రదేశ్‌కు (Andhra Pradesh) మరోసారి వర్షసూచన ఉందని ఐఎండీ(IMD) హెచ్చరించింది. రాయలసీమ, దక్షిణ కోస్తాల్లో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. ఈ నెల 29న అండమాన్‌ తీరంలో అల్పపీడనం ఏర్పడే సూచన ఉందని, ఇది క్రమంగా బలపడి కోస్తాంధ్ర తీరానికి దగ్గరగా వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
MLC Elections : తెలంగాణలో ఎన్నికలు లేకుండానే ఆరు చోట్ల టీఆర్ఎస్ విజయం, ఏపీలో 11 స్థానాలు ఏకగ్రీవం, శాసన మండలిలో 32కు చేరనున్న వైసీపీ బలం..
Krishnaనిజామాబాద్ నుంచి క‌ల్వ‌కుంట్ల క‌విత‌, రంగారెడ్డి నుంచి ప‌ట్నం మ‌హేంద‌ర్ రెడ్డి, శంభీపూర్ రాజు, వ‌రంగ‌ల్ నుంచి పోచంప‌ల్లి శ్రీనివాస్ రెడ్డి, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ నుంచి క‌సిరెడ్డి నారాయ‌ణ‌రెడ్డి, కూచుకుళ్ల దామోద‌ర్ రెడ్డి ఏక‌గ్రీవంగా ఎన్నికయ్యారు.
Viral Andhra Police Video: పెన్సిల్ పోయిందని పోలీస్ గడప తొక్కిన బుడతడు, సార్ పెన్సిల్ తిరిగి ఇచ్చాను అని చెప్పిన మరో బుడతడు, వైరల్‌గా మారిన ఆంధ్రప్రదేశ్ పోలీసుల ట్వీట్ వీడియో
Hazarath Reddyతాను హోంవర్క్ చేస్తుంటే తన పెన్సిల్ దొంగిలించాడని పోలీస్‌ స్టేషన్ మెట్లెక్కాడు ఓ బుడతడు. కర్నూలు జిల్లా కడుబూరులో జరిగింది ఈ ఘటన. హ‌న్మంత్ అనే విద్యార్థి పెన్సిల్‌ను మ‌రో అబ్బాయి దొంగిలించాడు. దీంతో హ‌న్మంత్ స్థానిక పోలీసు స్టేష‌న్‌కు వెళ్లి పెన్సిల్ దొంగ‌త‌నంపై పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు.