ఆంధ్ర ప్రదేశ్

Covid Update: శుభవార్త..కోవాగ్జిన్, కొవిషీల్డ్ వ్యాక్సిన్ల అత్యవసర అనుమతికి డిసీజీఐ ఆమోదం, ఏపీలో కొత్తగా 232 కరోనా కేసులు నమోదు, నలుగురు మృతితో 7115 కు చేరుకున్న మరణాల సంఖ్య

Hazarath Reddy

ఇండియాలో కోవాగ్జిన్, కొవిషీల్డ్ వ్యాక్సిన్ల (covishield and covaxin) అత్యవసర అనుమతికి డిసీజీఐ (DCGI) ఆమోదం తెలిపింది. కోవాగ్జిన్‌ను భారత్ బయోటెక్ అభివృద్ధి చేయగా.. కోవిషీల్డ్‌ను ఆక్స్ ఫర్డ్, అస్త్రాజెనకా, సీరం ఇన్స్టిట్యూట్ అఫ్ ఇండియా కలిసి అభివృద్ధి చేశాయి

Ramateertham Temple: మత రాజకీయాలకు ఆజ్యం పోస్తున్న రామతీర్థం ఘటన, అక్కడ అసలేం జరిగింది? అప్రమత్తమైన ఏపీ సర్కారు, అన్ని దేవాలయాలకు జియో ట్యాగింగ్ చేస్తామని తెలిపిన డీజీపీ సవాంగ్, రామతీర్దంలో హై టెన్సన్

Hazarath Reddy

ఏపీలో రామతీర్థం ఘటన రాజకీయ రంగును పులుముకుంది. అన్ని పార్టీలు దీన్ని రాజకీయ అస్త్రంగా మార్చుకునేందుకు అన్ని పార్టీలు పావులు కదుపుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ హైటెన్సన్ కొనసాగుతోంది. హైందవ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో చలో రామతీర్థంకు (Ramateertham Temple) పిలుపు ఇచ్చింది. అలాగే జనవరి 5వ తేదీన జనసేన-బీజేపీ రామతీర్థం ధర్మయాత్రను చేపట్టనున్నాయి.

Ramatheertham Incident: ఏపీలో ఆలయాల విధ్వంసం, అదుపులో 5 మంది అనుమానితులు, జనవరి 5న బీజేపీ-జనసేన రామతీర్థ ధర్మయాత్ర, రామతీర్థంలో పర్యటించిన చంద్రబాబు, వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి

Hazarath Reddy

ఏపీలో ఆలయాలపై దాడులు కలకలం రేపుతున్నాయి. వరుసగా జరుగుతున్న దాడులతో (Ramatheertham Incident) ప్రతిపక్షాలు అధికార పార్టీ మీద ఫైర్ అవుతున్నాయి. తాజాగా రామతీర్థం క్షేత్రంలో కోదండరామస్వామి విగ్రహం శిరస్సు నరికివేయడంతో ఏపీలో దీనిపై ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. ఈ నేపథ్యంలో హిందూ దేవతల విగ్రహాలు, ఆలయ ఆస్తులపై వరుసగా జరుగుతున్న దాడులను నిరసిస్తూ రామతీర్థ ధర్మయాత్ర (Janasena-BJP Ramatirtha Dharma Yatra) చేపట్టాలని జనసేన, బీజేపీ నిర్ణయించాయి.

Coronavirus in AP: ఏపీలో భారీగా కేసులు తగ్గుముఖం, గత 24 గంటల్లో 238 మందికి కోవిడ్‌ పాజిటివ్‌, ముగ్గురి మృతితో 7111 కు చేరుకున్న కోవిడ్ మరణాల సంఖ్య

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో రాష్ట్రంలో 48,518 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 238 మందికి కోవిడ్‌ పాజిటివ్‌గా (Coronavirus in AP) నిర్థారణ అయ్యింది. కోవిడ్‌ వల్ల నిన్న ఒక్క రోజు పశ్చిమ గోదావరి జిల్లాలో ఇద్దరు, చిత్తూరులో ఒకరు మరణించారు. దీంతో ఇప్పటి వరకు కరోనా సోకిన వారి సంఖ్య 8,82,850కు చేరింది. మొత్తం 7111 మంది మృత్యువాత పడ్డారు.

Advertisement

AP Coronavirus Update: కరోనా నుంచి కోలుకున్న ఏపీ, రోజు రోజుకు తగ్గుతున్న కేసులు, కొత్తగా 326 కరోనా కేసులు నమోదు, గత 24 గంటల్లో కరోనా నుంచి 350 మంది డిశ్చార్జ్‌

Hazarath Reddy

ఏపీలో రోజురోజుకు కరోనావైరస్ కేసులు తగ్గుతూ వస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 326 కరోనా కేసులు (AP Coronavirus Update) నమోదయ్యాయి. ఈ రోజు నమోదయిన కేసులతో కలిపి రాష్ట్రంలో 8,82,612కు కరోనా కేసులు (AP Coronavirus) చేరాయి. నిన్న ఒక్క రోజు కోవిడ్‌ వల్ల ఎటువంటి మరణం సంభవించలేదు. మొత్తం 7108 మంది మృత్యువాత పడ్డారు. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ శుక్రవారం హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది.

Aditya Nath Das: అంతర్‌ రాష్ట్ర బదిలీలలపై తొలి సంతకం, నూతన సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించిన ఆదిత్యనాథ్‌ దాస్‌, ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా నియమితులయిన నీలం సాహ్ని, సీఎంతో మర్యాదపూర్వక భేటీ

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌ నూతన సీఎస్‌గా ఆదిత్యనాథ్‌ దాస్‌ గురువారం బాధ్యతలు చేపట్టారు. గురువారం సచివాలయం మొదటి బ్లాకులోని కార్యాలయంలో నీలం సాహ్ని నుంచి సీఎస్‌గా ఆయన బాధ్యతలు స్వీకరించారు. అంతర్‌ రాష్ట్ర బదిలీలకు సంబంధించిన దస్త్రంపై ఆదిత్యనాథ్‌దాస్‌ (Aditya Nath Das) తొలి సంతకం చేశారు.

New CJ to AP High Court: ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అరూప్ గోస్వామి, ఆమోదముద్ర వేసిన రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, సిక్కిం హైకోర్టుకు బదిలీ అయిన జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి, పదవీ విరమణ చేసిన హైకోర్టు సీనియర్‌ న్యాయమూర్తి రాకేష్ కుమార్

Hazarath Reddy

ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అరూప్ గోస్వామి నియామకానికి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోదముద్ర వేశారు. ఇందుకు సంబంధించిన గెజిట్‌ను కేంద్ర న్యాయశాఖ గురువారం విడుదల చేసింది. దీంతోపాటు ఆంధ్రప్రదేశ్‌ చీఫ్‌ జస్టిస్‌ జితేంద్ర కుమార్ మహేశ్వరీ బదిలీపై కూడా కేంద్ర న్యాయశాఖ సంయుక్త కార్యదర్శి నోటిఫికేషన్‌ జారీ చేశారు.

YCP MLC Challa Dies: కరోనాతో వైసీపీ ఎమ్మెల్సీ మృతి, అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన చల్లా రామకృష్ణారెడ్డి, గత నెల 13న కరోనాతో ఆస్పత్రిలో చేరిక

Hazarath Reddy

వైసీపీ ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి కరోనావైరస్ తో కన్నుమూశారు. హైదరాబాద్ లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి (YSRCP MLC Challa Dies) చెందారు. కాగా చల్లాకు గత నెల 13న కరోనా సోకింది. ఆస్పత్రిలో చేరిన ఆయన అప్పటి నుంచి వెంటిలేటర్ పై ఉన్నారు. పరిస్థితి విషమించడంతో ఈ ఉదయం తుదిశ్వాస (challa ramakrishna reddy Died with Covid) విడిచారు.

Advertisement

Covid Updates: కొత్త ఏడాదిలో కొత్త కరోనా కలవరం, ఫైజర్ వ్యాక్సిన్‌కు అత్యవసర అనుమతినిచ్చిన డబ్ల్యూహెచ్ఓ, దేశంలో తాజాగా 20,036 మందికి కరోనా, తెలంగాణలో 461 కొత్త కేసులు, ఏపీలో తాజాగా 338 మందికి కోవిడ్

Hazarath Reddy

భారత్‌లో గత 24 గంటల్లో 20,036 మందికి కరోనావైరస్ (Coronavirus Outbreak) పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కరోనా కేసుల తాజా వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం.. కొత్తగా 23,181 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,02,86,710కు (Coronavirus Outbreak in India) చేరింది.

Covid in AP: ఏపీలో యూకే కొత్త కరోనా వైరస్ అలజడి, రాజమండ్రికి చెందిన మహిళకు కొత్త కోవిడ్ స్ట్రెయిన్, రాష్ట్రంలో తాజాగా 326 మందికి కోవిడ్ పాజిటివ్, కొత్త వైరస్‌ స్ట్రెయిన్‌పై అప్రమత్తంగా ఉన్నామని తెలిపిన వైద్యారోగ్య శాఖ కమిషనర్‌

Hazarath Reddy

కొత్త వైరస్‌ స్ట్రెయిన్‌పై (New Covid Strain in AP) అప్రమత్తంగా ఉన్నామని వైద్యారోగ్య శాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్ తెలిపారు. మీడియాతో మాట్లాడుతూ రాజమండ్రికి చెందిన మహిళకు మాత్రమే స్ట్రెయిన్‌ వచ్చిందని, ఆమెతో సన్నిహితంగా ఉన్న కుమారుడికి నెగిటివ్‌ వచ్చిందన్నారు.

YCP Ministers vs Pawan: నువ్వొక బోడి నాయుడివి, పకీర్ సాబ్‌వి, బోడి లింగం కాబట్టే రెండు చోట్ల తొక్కి పడేశారు, పవన్ కళ్యాణ్ శతకోటి లింగాల్లో బోడి లింగం వ్యాఖ్యలకు కౌంటర్ విసిరిన వైసీపీ మంత్రులు

Hazarath Reddy

గుడివాడ, మచిలీపట్నంలలో సోమవారం పర్యటించిన పవన్... మంత్రి కొడాలి నానిపై పంచ్ డైలాగులతో విమర్శల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై వైసీపీ మంత్రులు కౌంటర్ (YCP Ministers Counter to Pawan Kalyan) విసిరారు.

YSR Rythu Bharosa: రైతులకు ఏపీ సర్కారు మరో కానుక, వైఎస్సార్‌ రైతుభరోసా–పీఎం కిసాన్‌ మూడోవిడత నిధులు విడుదల, నివర్‌ తుపాను ఇన్‌పుట్‌ సబ్సిడీ నిధులు బ్యాంకు ఖాతాల్లో జమ

Hazarath Reddy

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం రైతులకు మరో కానుక అందించింది. వైయస్సార్ రైతు భరోసా (YSR Rythu Bharosa) కింద అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో మంగళవారం రూ.1,766 కోట్లను జమచేసింది. వైఎస్సార్‌ రైతుభరోసా–పీఎం కిసాన్‌ పథకం మూడోవిడత నిధులు (YSR RYTHU BHAROSA-PM KISAN), అక్టోబరులో వచ్చిన నివర్‌ తుపాను వల్ల పంటలు దెబ్బతిన్న రైతులకు పెట్టుబడి రాయితీ (ఇన్‌పుట్‌ సబ్సిడీ) కింద ఇస్తామన్న నిధుల్ని ప్రభుత్వం జమచేసింది.

Advertisement

APTIDCO Row: ఏపీ సర్కారుకు హైకోర్టులో ఊరట, టిడ్కో ఇళ్ల లబ్దిదారుల పిటిషన్‌పై మధ్యంతర ఉత్తర్వులు జారీకి హైకోర్టు నిరాకరణ, తదుపరి విచారణను జనవరి 5కు వాయిదా

Hazarath Reddy

ఏపీ విశాఖ జిల్లా అనకాపల్లి మునిసిపాలిటీ పరిధిలో టిడ్కో (Andhra Pradesh Township and Infrastructure Development Corporation) ఇళ్ల లబ్దిదారుల జాబితా నుంచి 904 మందిని తొలగించడంపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు (AP High Court) నిరాకరించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ రాకేశ్‌ కుమార్, జస్టిస్‌ దొనడి రమేశ్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.

New Covid Strain in AP: ఏపీలో కొత్త కరోనావైరస్ అలజడి, యూకే నుంచి వచ్చిన 11 మందికి కోవిడ్ పాజిటివ్, 1363కు చేరిన యూకే నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన వారి సంఖ్య

Hazarath Reddy

ఒక్క గుంటూరు జిల్లాలోనే ఎనిమిది మందికి పాజిటివ్‌ కాగా, తూ.గో.జిల్లాలో ముగ్గురికి, నెల్లూరులో ఒకరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిం

Antarvedi Temple: అనుకున్న సమయానికే..పూర్తయిన అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి నూతన రథం, ట్రయల్ రన్ సక్సెస్, . ఏడంతస్తుల రథం పూర్తి స్ట్రక్చర్ నిర్మాణం పూర్తి

Hazarath Reddy

అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి నూతన రథం​ పూర్తయింది. ఏడంతస్తుల రథం పూర్తి స్ట్రక్చర్ నిర్మించడంతో పాటు చక్రాలు కూడా ఏర్పాటు చేశారు. తూర్పుగోదావరి జిల్లాలలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అంతర్వేదిలో లక్ష్మీ నరసింహ స్వామి రథం (Sri Lakshmi Narasimha Swamy Devasthanam) గతంలో మంటల్లో కాలిపోయిన సంగతి విదితమే.

Special ST Commission in AP: జగన్ సర్కారు మరో కీలక నిర్ణయం, ప్రత్యేక ఎస్టీ కమిషన్‌ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ, ఏపీలో పూర్తయిన అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి నూతన రథం

Hazarath Reddy

పరిపాలనలో దూసుకుపోతున్న ఏపీ సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రత్యేక ఎస్టీ కమిషన్‌ ఏర్పాటు (Special ST Commission in AP) చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్రం ఆమోదంతో ప్రత్యేక ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం.. ప్రత్యేక ఎస్టీ కమిషన్ ఏర్పాటు నోటిఫికేషన్ విడుదల చేసింది.

Advertisement

AP Covid Update: ఏపీలో కొత్తగా 212 కరోనా కేసులు, నలుగురు మృతితో 7098కి చేరిన మరణాల సంఖ్య, మొత్తం 3423 యాక్టివ్‌ కేసులు, కొత్త కరోనావైరస్ కేసులతో వణుకుతున్న తమిళనాడు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో 37,381 కరోనా పరీక్షలు నిర్వహించగా, 212 మందికి పాజిటివ్‌గా (AP Covid Update) నిర్థారణ అయ్యింది. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా వైరస్‌ సోకిన వారి సంఖ్య 88,1273కి చేరుకుంది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. గడచిన 24 గంటల్లో కరోనా బారినపడి పశ్చిమ గోదావరిలో ఇద్దరు, గుంటూరు, విశాఖపట్నంలో ఒక్కొక్కరు చొప్పున నలుగురు మృతిచెందగా, దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో (Andhra Pradesh) కరోనాతో మరణించిన వారి సంఖ్య 7098కి చేరుకుంది.

COVID-19 Vaccine Dry Run: కృష్ణా జిల్లాలో కరోనావైరస్‌‌ వ్యాక్సిన్‌ డ్రై రన్‌, జిల్లాలోని ఐదు సెంటర్‌లలో కోవిడ్ వ్యాక్సిన్ డ్రై రన్‌ కార్యక్రమం ప్రారంభించిన కలెక్టర్ ఇంతియాజ్, 125 మందితో డ్రై రన్‌

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణాజిల్లాలో (Andhra Pradesh’s Krishna District) కరోనావైరస్‌‌ వ్యాక్సిన్‌ డ్రై రన్‌ ప్రారంభమైంది. ప్రకాశ్ నగర్ అర్బన్ హెల్త్ కేర్ సెంటర్‌లో డమ్మీ వ్యాక్సినేషన్ డ్రై రన్‌ను (COVID-19 Vaccine Dry Run) జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ ప్రారంభించారు

New Covid Strain in AP: ఏపీని వణికిస్తున్న కొత్త కరోనా స్ట్రెయిన్ భయం, యూకే నుంచి వచ్చిన ఆరుమందికి కోవిడ్ పాజిటివ్, ఏపీలో తాజాగా 282 మందికి కరోనావైరస్ పాజిటివ్

Hazarath Reddy

యూకేలో కొత్త జన్యువును సంతరించుకున్న కరోనా వైరస్ కల్లోలం రేపుతున్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలో ఆ దేశానికి రాకపోకలను పూర్తిగా నిషేధించారు. అయినప్పటికీ నిషేధానికి ముందే భారతదేశానికి చాలామంది తిరిగివచ్చారు. ఏపీకి కూడా యూకె నుంచి వెళ్లిన వారు వచ్చిన నేపథ్యంలో వారికి పరీక్షలు నిర్వహించగా వారిలో ఆరుగురికి కరోనా పాజిటివ్‌గా (New Covid Strain in AP) నిర్ధారణ అయిందని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ కాటంనేని భాస్కర్‌ తెలిపారు.

Polavaram:పోలవరంపై కేంద్రం గుడ్ న్యూస్.. పోలవరం ప్రాజెక్ట్‌కు కేంద్రం ఆమోదించిన వ్యయం రూ. 55,548.87కోట్లు, సానుకూల ప్రకటన చేసిన మోదీ సర్కారు, మరో రూ. 2234 కోట్లు త్వరలో విడుదల

Hazarath Reddy

ఏపీ ప్రభుత్వం వీలయినంత త్వరగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం శుభవార్తను అందించింది. పోలవరం అంచనా వ్యయంపై కొనసాగుతున్న సస్పెన్స్‌కు తెరదించుతూ కేంద్రం సానుకూల ప్రకటన చేసింది. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదించిన వ్యయం 55,548.87కోట్ల రూపాయలని జలశక్తి శాఖ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో సంవత్సర సమీక్షలో శనివారం వెల్లడించింది.

Advertisement
Advertisement