ఆంధ్ర ప్రదేశ్

Gold Found on Uppada Beach: ఉప్పాడ తీరంలొ ఇంకా కొనసాగుతున్న బంగారం వేట, సముద్రం వైపు రావొద్దని అధికారులు ఆదేశాలు, వదంతులు నమ్మవద్దని హెచ్చరిక

Hazarath Reddy

తూర్పుగోదావరి జిల్లా యు కొత్తపల్లి మండలం ఉప్పాడ తీరం సముద్రం ఒడ్డున బంగారం ముక్కలు (Gold Found on Uppada Beach) కనిపించాయని ఓ మహిళ చెప్పడంతో జనమంతా ఎగబడ్డారు. ఇసుకలో చిన్న చిన్న బంగారు ముక్కలు కనిపించడంతో స్థానికులు వాటిని ఏరుకునేందుకు పోటీ పడ్డారు. దీంతో ఉప్పాడ శివారు పాత మార్కెట్‌ సమీపంలోని (Uppada Village) తీర ప్రాంతంలో మూడు రోజులుగా పసిడి వేట కొనసాగుతోంది. శనివారం కూడా స్థానిక మత్స్యకారులు బంగారం కోసం వెతికారు.

Covid Cases in Telugu States: తెలుగు రాష్ట్రాల్లో కరోనా తగ్గుముఖం, ఏపీలో తాజాగా 625 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ, తెలంగాణలో 805 కరోనా కేసులు నమోదు

Hazarath Reddy

తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు తగ్గుముఖం (Covid Cases in Telugu States) పడుతున్నాయి. ఆంధ్రపదేశ్‌లో గత 24 గంటల్లో 49,348 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 625 మందికి పాజిటివ్‌గా (AP Coronavirus) నిర్ధారణ అయ్యింది. తెలంగాణలో గత 24 గంటల్లో 805 కరోనా కేసులు (TS Coronavirus) నమోదయ్యాయి.

Rain Alert in AP: ఏపీకి మళ్లీ తుఫాను గండం, మూడు రోజుల పాటు భారీ వర్షాలు, హెచ్చరించిన భారత వాతావరణ శాఖ, తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సీఎం ఏరియల్ సర్వే, నివర్‌ తుపాన్‌ మృతులకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా

Hazarath Reddy

నివర్ తుఫాను కల్లోలం మరచిపోకముందే మళ్లీ ఏపీని భారీ వర్షాలు (Rain Alert in AP) ముంచెత్తనున్నాయి. అగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. రాగల 48 గంటల్లో అల్పపీడనం వాయుగుండంగా మారనుందని వాతావరణ శాఖ తెలిపింది. డిసెంబర్‌ 2న దక్షిణ తమిళనాడు-పాండిచ్చేరి మధ్య తీరందాటే అవకాశం ఉందని పేర్కొంది.

Cyclone Nivar Updates: ఇంకా 6 గంటలు..ఏపీలో వణికిన 8 జిల్లాలు, ఈ రోజు కూడా కొనసాగనున్న నివర్ తుఫాను బీభత్సం, వేల ఎకరాల్లో పంట నష్టంతో కుదేలైన రైతన్న

Hazarath Reddy

మూడు రాష్ట్రాలను అతలాకుతలం చేసిన నివర్ తుఫాన్ (Cyclone Nivar Updates) క్రమంగా బలహీనపడింది. ప్రస్తుతం తుపాను దక్షిణ రాయలసీమ పరిసరాల్లో కేంద్రీకృతమై, అల్పపీడనంగా మార్పుతున్నట్లు (Weather Forecast Today) వాతావరణశాఖ తెలిపింది. రాబోయే ఆరు గంటల్లో క్రమంగా ఇది మరింత బలహీనపడే అవకాశం ఉందని.. దీని ప్రభావంతో చిత్తూరు, నెల్లూరు, కడప, ప్రకాశం, కర్నూలు జిల్లాలో పలుచోట్ల వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

Advertisement

AB Venkateswara Rao Case: ఏబీవీకి సుప్రీంకోర్టులో చుక్కెదురు, ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆర్డర్‌పై స్టే విధించిన అత్యున్నత న్యాయస్థానం

Hazarath Reddy

ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ విషయంలో ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఇచ్చిన ఆర్డర్‌పై సర్వోన్నత న్యాయస్థానం (Supreme Court) స్టే విధించింది.

Telugu States Coronaviurs: తెలుగు రాష్ట్రాల్లో కరోనా తగ్గుముఖం, ఏపీలో తాజాగా 831 మందికి కరోనా పాజిటివ్, తెలంగాణాలో తాజాగా 862 మందికి కోవిడ్ పాజిటివ్

Hazarath Reddy

రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు (Telugu States Coronaviurs) తగ్గుముఖం పడుతున్నాయి. సెకండ్ వేవ్ ముప్పు ముంచుకొస్తున్న నేపథ్యంలో ఇరు రాష్ట్రాల సీఎంలు కోవిడ్ మళ్లీ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకునేందుకు ఎప్పటికప్పుడు అధికారులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. కరోనావైరస్ సెకండ్ వేవ్ (Covid Second Wave) ఎదుర్కునేందుకు ప్రజలంతా తగిన జాగ్రత్తలతో రెడీ కావాలని పిలుపునిస్తున్నారు.

Nivar Cyclone: తీరాన్ని తాకిన నివర్ తుఫాను, అయినా పొంచి ఉన్న పెనుముప్పు, తమిళనాడు, ఏపీలో అతి భారీ వర్షాలు, పలు రైళ్ల రాకపోకలు రద్దు, తిరుమలలో విరిగిపడిన కొండ చరియలు

Hazarath Reddy

తమిళనాడు, పుదుచ్చేరి ప్రాంతాలకు ఈ తుఫాను కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. తుపాను తీరం దాటాక గంటకు 120 నుంచి 145 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అధికారులు వివరించారు.

Nivar Cyclone Effect: భారీ వర్షాలతో వణికిపోతున్న ఏపీ, తమిళనాడు రాష్ట్రాలు, తీవ్ర తుఫానుగా మారిన నివర్, తమిళనాడులో పలుచోట్ల 12 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదు, రాత్రికి తీరం దాటే అవకాశం

Hazarath Reddy

నివర్ తుఫాన్ తమిళనాడు, ఏపీని (Nivar Cyclone Effect) కుదిపేస్తోంది. భారీ వర్షాలు, ఈదురు గాలులతో తమిళనాడు తీర ప్రాంతం అతలాకుతలం అవుతుండగా తుఫాను ప్రభావంతో (Nivar Cyclone) ఏపీలో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి.

Advertisement

Amaravati Land Scam: అమరావతి భూముల స్కాం, హైకోర్టు గ్యాగ్ ఆర్డర్ పై స్టే విధించిన సుప్రీంకోర్టు, తదుపరి విచారణను జనవరి చివరి వరకు వాయిదా

Hazarath Reddy

అమరావతి భూ కుంభకోణం కేసుకు (Amravati land scam case) సంబంధించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన గ్యాగ్‌ ఆర్డర్‌పై (Andhra Pradesh High Court orders) సుప్రీంకోర్టు స్టే విధించింది. తదుపరి విచారణను జనవరి చివరి వరకు వాయిదా వేసిన సర్వోన్నత న్యాయస్థానం.. అప్పటి వరకు ఈ కేసును ఫైనల్‌ చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది.

AP Coronavirus Update: కరోనాను ఎదుర్కునేందుకు కోవిడ్ అత్యవసర నిధి రూ.981 కోట్లు సాయం ఇవ్వండి, కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రిని కలిసిన ఏపీ ఆర్థిక మంత్రి, రాష్ట్రంలో తాజాగా 1085 కేసులు నమోదు

Hazarath Reddy

కరోనావైరస్ ని మరింత సమర్థవంతంగా ఎదుర్కునేందుకు కేంద్రం కోవిడ్ అత్యవసర నిధి నుంచి ఏపీకి రూ.981 కోట్లు సాయం అందించాలని ఏపీ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఇందులో భాగంగా మంగళవారం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌తో (Union Health Minister Harshavardhan) జరిగిన సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై బుగ్గన రాజేంద్రనాథ్ చర్చించారు.

Cyclone Nivar: ముంచుకొస్తున్న మరో ముప్పు, తీవ్రరూపం దాల్చిన నివార్ తుఫాన్, ఏపీ, తమిళనాడులో భారీ నుంచి అతి భారీ వర్షాలు, తమిళనాడులో ఏడు జిల్లాల్లో హై అలర్ట్‌

Hazarath Reddy

ఈనెల 30 నాటికి దక్షిణ అండమాన్‌లో మరో అల్పపీడనం ఏర్పడనుంది. ఇది వాయుగుండంగా మారి తుపాన్‌గా రూపుదిద్దుకునే అవకాశం ఉంది. ఇది వాయువ్య దిశగా పయనించి డిసెంబర్‌ 2న నాగపట్టణం సమీపంలో తీరం దాటవచ్చని వాతావరణ కేంద్రం అంచనావేస్తోంది.

Guntur Badly Husband:డబ్బులు ఇస్తే భార్య నగ్న చిత్రాలు, డార్లింగ్‌ పేరుతో యూట్యూబ్‌లో వీడియోలు అప్‌లోడ్, గుంటూరులో వికృత భర్తను అరెస్ట్ చేసొన పోలీసులు

Hazarath Reddy

భార్య భర్తల సంబంధాలు మంటగలిసి పోతున్నాయనే దానికి ఈ స్టోరీ ప్రత్యక్ష ఉదాహరణ. గుంటూరులో డబ్బుల కోసం వికృత భర్త (Guntur Badly Husband) భార్య నగ్న చిత్రాలను యూట్యూబ్‌లో (Youtube) ఉంచి వాటిని కావాలనుకున్న వారికి అమ్మే ఘటన వెలుగులోకి వచ్చింది.

Advertisement

Covid in AP: కరోనాను ఏపీ జయించిందా ? తాజాగా అత్యంత తక్కువగా 545 కేసులు నమోదు, 1,390 మంది కోవిడ్‌ నుంచి కోలుకుని డిశ్చార్జ్‌, ఇప్పుడు యాక్టివ్‌ కేసులు 13,394 మాత్రమే

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో గడచిన 24 గంటల్లో 47,130 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 545 పాజిటివ్‌ కేసులు (Covid in AP) నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 86,2758కి (AP Coronavirus Report) చేరింది. గత 24 గంటల్లో 1,390 మంది కోవిడ్‌ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్‌ అయ్యారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 8,42,416 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది.

Family Members Committed Suicide: రాజమండ్రిలో విషాదం, ఒకే కుటుంబంలో నలుగురు వ్యక్తులు ఉరివేసుకొని ఆత్మహత్య, ఇంటి యజమాని రెండో పెళ్లి చేసుకోవడమే కారణమంటున్న స్థానికులు

Hazarath Reddy

ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి అంబేద్కర్‌ నగర్‌ రామాలయం వీధిలో విషాదకర ఘటన జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఉరివేసుకొని ఆత్మహత్య (Family Members Suicide) చేసుకున్నారు. విజయవాడకు చెందిన భర్త నాగేంద్ర కుమార్ రెండో పెళ్ళి చేసుకున్నాడనే మనస్తాపంతో ఆయన భార్య తన కుమార్తెలు, కుమారుడితో కలిసి ఆత్మహత్య (committed suicide) చేసుకున్నారు.

Rain Alert in AP: ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం, 24 గంటల్లో తుఫాన్‌గా మారే అవకాశం, 3 రోజుల పాటు కోస్తాంధ్ర, రాయలసీమలో విస్తారంగా వర్షాలు, వెల్లడించిన రాష్ట్ర విపత్తుల‌ నిర్వహణ శాఖ కమిషనర్ కె. కన్నబాబు

Hazarath Reddy

ఏపీని మళ్లీ వర్షాలు వణికించనున్నాయి. గత నెలలో భారీ వర్షాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని (Andhra Pradesh) అతలాకుతలం చేసిన నేపథ్యంలో మళ్లీ వర్షాల రూపంలో (Rain Alert in AP) మరో ముప్పు ముంచుకొస్తోంది. నైరుతి, దాని అనుసంధానంగా ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో (Bay of Bengal) కొనసాగుతున్న వాయుగుండం భారత వాతావరణ శాఖ (IMD) సూచనల ప్రకారం 24 గంటల్లో తుఫాన్‌గా బలపడనుందని రాష్ట్ర విపత్తుల‌ నిర్వహణ శాఖ కమిషనర్ కె. కన్నబాబు తెలిపారు.

Abhayam App in AP: మహిళలు, చిన్నారుల రక్షణ కోసం అభయ్‌ యాప్, దీన్నిఎలా వాడాలి, మహిళలను, చిన్నారులను అభయ్ యాప్ ఎలా రక్షిస్తుందో ఓ సారి తెలుసుకుందాం

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలు, చిన్నారుల రక్షణ కోసం (Women's safety) వైయస్ జగన్ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న అభయ్‌ ప్రాజెక్టును (Abhayam App in AP) ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. రవాణాశాఖ పర్యవేక్షణలో ఈ ప్రాజెక్ట్ అమలవుతుంది.

Advertisement

AP Coronavirus: కరోనాకు ముందుగా భారత్ నుంచే వ్యాక్సిన్ వస్తుంది, డబ్ల్యూహెచ్‌వో చీఫ్‌ సైంటిస్ట్‌ సౌమ్యా స్వామినాథన్ వెల్లడి‌, ఏపీలో తాజాగా 1 ,121 మందికి కోవిడ్ పాజిటివ్, మొత్తం 8,41,026 మంది డిశ్చార్జ్‌

Hazarath Reddy

ఏపీలో గడిచిన 24 గంటల్లో 71,913 మందికి కరోనా పరీక్షలు చేయగా 1 ,121 మందికి పాజిటివ్‌ (New positive cases) వచ్చింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,62,213కు (COVID Report) చేరింది. నిన్న ఒక్క రోజే కరోనా నుంచి కోలుకుని 1,631 మంది డిశ్చార్జ్ అవ్వగా.. మొత్తం 8,41,026 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.

Fishing Harbours in AP: ఏపీ ప్రభుత్వం మరో కీలక ముందడుగు, ప్రపంచ మత్స్యకార దినోత్సవం రోజున బృహత్తర ప్రాజెక్టుకు శ్రీకారం, నాలుగు ఫిషింగ్‌ హార్బర్లకు సీఎం వైఎస్‌ జగన్‌ శంకుస్థాపన

Hazarath Reddy

నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె, తూర్పు గోదావరి జిల్లా ఉప్పాడ, గుంటూరు జిల్లా నిజాంపట్నం, కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నిర్మించనున్న నాలుగు ఫిషింగ్‌ హార్బర్లకు సీఎం వైఎస్‌ జగన్‌ వర్చువల్‌ విధానంలో శనివారం శంకుస్థాపన (CM Jagan Lays Foundation for Fishing Harbours) చేశారు.

Jagananna Vidya Kanuka: నవంబర్ 23 నుంచి జగనన్న విద్యాకానుక వారోత్సవాలు, జగనన్న విద్యాకానుక గురించి అవగాహన కల్పించేలా విద్యా శాఖ నిర్ణయం, వారం రోజుల పాటు విద్యా కానుక ఉత్సవాలు

Hazarath Reddy

ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న విద్యాకానుకపై (Jagananna Vidya Kanuka) జగన్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఈనెల 23 నుంచి 28వ తేదీ వరకు జగనన్న విద్యాకానుక వారోత్సవాలు (Jagananna Vidya Kanuka Varotsavalu) నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈ పథకం కింద రూ.650 కోట్లకు పైగా వెచ్చించి 2020–21 విద్యా సంవత్సరానికి అన్ని ప్రభుత్వ యాజమాన్య, ఎయిడెడ్‌ పాఠశాలల్లో 1 నుంచి పదోతరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు స్టూడెంట్‌ కిట్లు పంపిణీ చేసిన సంగతి తెలిసిందే.

AP Coronavirus Update: ఏపీలో తాజాగా 1,221 మందికి కరోనా, ప్రారంభమైన తుంగభద్ర పుష్కరాలు, ప్రత్యేక పూజలు నిర్వహించి పుష్కరాలను ప్రారంభించిన ఏపీ సీఎం వైయస్ జగన్

Hazarath Reddy

12 ఏళ్లకు ఓ సారి వచ్చే తుంగభద్ర పుష్కరాలు (Tungabhadra Pushkaralu) ప్రారంభం అయ్యాయి. కోవిడ్‌ నేపథ్యంలో కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య భక్తుల మనోభావాలకు అనుగుణంగా..లక్షలాది మంది భక్తి శ్రద్ధలతో పుణ్య స్నానమాచరించే ఈ పుష్కరాలను రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటాలు లేకుండా, శాస్త్రోక్తంగా ప్రారంభించింది.

Advertisement
Advertisement