ఆంధ్ర ప్రదేశ్

Lanka Dinakar Suspended From BJP: లంకా దినకర్‌పై వేటు, పార్టీ నుంచి సస్పెండ్ చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, షోకాజ్‌ నోటీసుకు సమాధానం ఇవ్వని దినకరన్

Hazarath Reddy

ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పార్టీ నియమావళి విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ నిర్ణయాలు, నియమావళికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న బీజేపీ నేత లంకా దినకర్‌ను (Lanka Dinakar Suspended From BJP) ఆ పార్టీ షాకిచ్చింది. పార్టీ విధానానికి, అభిప్రాయాలకు వ్యతిరేకంగా సొంత అజెండాతో చర్చల్లో పాల్గొంటున్నారని పార్టీ సీరియస్ అయ్యింది.

Heavy Rain Alert: మరో రెండు రోజులు..భారీ వర్షాల హెచ్చరిక, తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపిన వాతావరణ శాఖ,అధికారులు అప్రమత్తం

Hazarath Reddy

తెలుగు రాష్ట్రాలను వర్షాలు కుదిపేస్తున్నాయి. తీవ్ర స్థాయిలో ఆస్తి, ప్రాణ నష్టం సంభవిస్తోంది. ఈ వర్షాలు ఇప్పట్లో పోయేలా లేవు. తాజాగా రాష్ట్రానికి భారీ వర్షసూచన (Heavy Rain Alert) ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. రానున్న రెండ్రోజులపాటు రాష్ట్రంలో పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు (heavy rains) కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. మధ్య బంగాళా ఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో 5.8 కి.మీ. ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఆ ప్రభావంతో మధ్య బంగాళాఖాతంలో మంగళవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

AP Coronavirus: ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి డిశ్చార్జి అయ్యే వరకు మొత్తం బాధ్యత ప్రభుత్వానిదే, స్పష్టం చేసిన వైద్య ఆరోగ్యశాఖమంత్రి ఆళ్ల నాని, ఏపీలొ తాజాగా 2,918 మందికి కోవిడ్-19

Hazarath Reddy

ఏపీలో తాజాగా విడుదలైన కరోనా బులెటిన్ ప్రకారం... గత 24 గంటల్లో 2,918 కొత్త కేసులు (AP Coronavirus Report) వచ్చాయి. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 468 పాజిటిట్ కేసులు రాగా, అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 44 మందికి కరోనా నిర్ధారణ అయింది.అదే సమయంలో ఏపీలో 24 మంది మృతి చెందారు. దాంతో మొత్తం మరణాల సంఖ్య 6,453కి పెరిగింది. తాజాగా 4,303 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 7,86,050కి చేరుకుంది. 7,44,532 మందికి కరోనా నయం కాగా, ఇంకా 35,065 మంది చికిత్స పొందుతున్నారు.

AP CM Religion Row: సీఎం జగన్ క్రిస్టియన్ అయితే నిరూపించండి, ఆధారాలు లేకుండా ఎలా మాట్లాడతారు? పిటిషనర్‌ను ప్రశ్నించిన ఏపీ హైకోర్టు, ఏపీ సీఎం మతం ఏంటో చెప్పాలని పిటిషన్

Hazarath Reddy

ఏపీ సీఎం మతంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. సీఎం వైయస్ జగన్ మతం (Andhra Pradsh Cm religion Row) ఏంటో ఆయనే బహిర్గత పరచాలని, ఇందుకు ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేయాలని గుంటూరుకు చెందిన ఆలోకం సుధాకర్‌బాబును హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసారు. ఈ పిటిషన్ పై ఏపీ అత్యున్నత ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. తగిన ఆధారాలు, సమాచారం లేకుండా కోర్టులను ఆశ్రయించడం న్యాయ ప్రక్రియను దుర్వినియోగం చేయడమే అవుతుందని హైకోర్టు (AP High Court) వ్యాఖ్యానించింది.

Advertisement

CM YS Jagan Review: ఇసుక రవాణాలో ఎక్కడా అవినీతి ఉండకూడదు, అందుబాటు ధరలో పూర్తి పారదర్శక విధానం ఉండాలి, అధికారులను ఆదేశించిన ఏపీ సీఎం వైయస్ జగన్

Hazarath Reddy

ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఇసుక విధానంపై (sand policy) తన క్యాంప్‌ కార్యాలయంలో అధికారులతో సోమవారం సీఎం సమీక్ష సమావేశం (AP CM YS Jagan Review Meeting) నిర్వహించారు. ఈ భేటీలో అధికారులకు మంత్రులకు సీఎం పలు సూచనలు, ఆదేశాలు జారీచేశారు. ఇసుక తవ్వకాలు, సరఫరాలో ఎక్కడా అవినీతికి తావు ఉండొద్దని ఆంధ్రప్రదేశ్‌ (AP CM) మరోసారి స్పష్టం చేశారు.

Atchannaidu Kinjarapu: ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు, తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా ఎల్ రమణ, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నారా లోకేష్, కమిటీలను ప్రకటించిన పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎమ్మెల్యే కింజారపు అచ్చెన్నాయుడును (Atchannaidu Kinjarapu) నియమించారు. ఈమేరకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandra Babu Naidu) సోమవారం కమిటీలను ప్రకటించారు. టీడీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా కళా వెంకట్రావు స్థానంలో అచ్చెన్నాయుడు నూతనంగా నియమితులయ్యారు. ఇక తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా ఎల్ రమణను ( L Ramana) కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా మరోసారి నారా లోకేష్‌ (Nara Lokesh) నియమితులయ్యారు.

AP Covid Update: ప్రతి పేదవాడికి మెరుగైన ఆరోగ్యం, కరోనా రికవరీలో దూసుకుపోతున్న ఏపీ, తాజాగా 3,986పాజిటివ్‌ కేసులు నమోదు, రాష్ట్రంలో మొత్తం 36,474యాక్టివ్‌ కేసులు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 74,945 నమూనాలు పరీక్షించగా 3,986పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 7,83,132 కు చేరింది. కొత్తగా 23 మంది కరోనా బాధితులు మృతి చెందడంతో ఆ సంఖ్య 6,429కి (Covid Deaths) చేరింది. ఈ మేరకు ఆదివారం రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. ఇక గడిచిన 24 గంటల్లో 4,591మంది కోవిడ్‌ను జయించి డిశ్చార్జ్‌ అయ్యారు. ఇప్పటి వరకు 70,66,203 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 36,474యాక్టివ్‌ కేసులు (Andhra Pradesh coronavirus Update) ఉన్నాయి.

CM YS Jagan Letter Row: ఏపీ సీఎం లేఖ ప్రకంపనలు, ఎస్‌సీబీఏ తీర్మానం సరికాదని తెలిపిన అధ్యక్షుడు దుష్యంత్‌ దవే, విచారణ జరిగితే వాస్తవం అదే బయటకు వస్తుందని తెలిపిన సీనియర్ న్యాయవాది

Hazarath Reddy

ఏపీ హైకోర్టు న్యాయమూర్తులపై, హైకోర్టు ఇచ్చే తీర్పులపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ (Dushyant Dave) ప్రభావితం చేస్తున్నారంటూ ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఫిర్యాదు చేయడాన్ని (CM YS Jagan Letter Row) ఖండిస్తూ సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌(SCBA) తీర్మానం చేసిన సంగతి విదితమే. అయితే ఈ తీర్మానాన్నిఆ సంఘం అధ్యక్షుడు, సీనియర్‌ న్యాయవాది దుష్యంత్‌ దవే (Supreme Court Bar Association president Dushyant Dave) తీవ్రంగా తప్పుపట్టారు. సైద్ధాంతికపరంగా ఆ తీర్మానాన్ని వ్యతిరేకిస్తున్నట్లు బార్‌ అసోసియేషన్‌ గౌరవ కార్యదర్శి రోహిత్‌ పాండేకు స్పష్టం చేశారు. ఈ మేరకు తాజాగా ఓ సమాచారం పంపారు.

Advertisement

BC Corporations in AP: బీసీ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లను ప్రకటించిన ఏపీ ప్రభుత్వం, 139 బీసీ కులాలకు గానూ 56 కార్పొరేషన్లు ఏర్పాటు

Hazarath Reddy

ఏపీలో బీసీల అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం (Andhra Pradesh government) ఏర్పాటు చేసిన 56 బీసీ కార్పొరేషన్ల పాలక మండళ్ల ప్రకటన (BC Corporations in AP) వెలువడింది. బీసీ కార్పొరేషన్‌ల చైర్మన్లు , డైరెక్టర్ల పేర్లను ఆదివారం తాడేపల్లిలో మంత్రులు ప్రకటించారు. మొత్తం 139 బీసీ కులాలకు గానూ ప్రస్తుతం 56 కార్పొరేషన్లు ఏర్పాటు అయ్యాయి. వీటిలో ఒక్కో కార్పొరేషన్‌కు చైర్మన్‌తో (bc corporation chairman posts) పాటు 12 మంది డైరెక్టర్లను ప్రభుత్వం నియమించింది.

Rain Alert for Telugu States: మరో హెచ్చరిక, తెలుగు రాష్ట్రాలకు పొంచి ఉన్న మరో ముప్పు, వాయుగుండంగా మారనున్న అల్పపీడనం, అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ ఆదేశాలు

Hazarath Reddy

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ మరో హెచ్చరిక జారీ (Rain Alert for Telugu States) చేసింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, దీని ప్రభావంతో రానున్న నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం (Heavy Rains thundershowers)ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది. ఇక దక్షిణ కోస్తాంధ్రకు సమీపంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. అదేవిధంగా దక్షిణ కోస్తాకు దగ్గర్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతం నుంచి తూర్పు మధ్య అరేబియా సముద్రం వరకూ అల్పపీడనం, దానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం, ద్రోణి బలహీనపడ్డాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది.

#AndhrapradeshRains: భారీ వర్షాలతో రూ.4,450 కోట్ల మేర నష్టం, వెంటనే ఆదుకోవాలని హోం మంత్రి అమిత్ షాకు ఏపీ సీఎం లేఖ, తక్షణమే ముందస్తుగా రూ.1,000 కోట్లు మంజూరు చేయాలని వైయస్ జగన్ వినతి

Hazarath Reddy

ఏపీలో అకాల వర్షాలకు పంటలన్నీ దెబ్బతిన్నాయి. విరుచుకుపడిన భారీ వర్షాలు, వరదలతో రాష్ట్రంలో జన జీవితం అస్తవ్యస్తమైంది. ఈ నేపథ్యంలో తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రాన్ని వెంటనే ఆదుకోవాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాకు (CM YS Jagan Writes To Amit Shah) విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆదుకునేందుకు రూ.2,250 కోట్ల ఆర్థిక సహాయం (Seeks Assistance From Centre) చేయాలని కోరారు.

AP Coronavirus Report: ఏపీలో 37 వేలకు దిగివచ్చిన యాక్టివ్ కేసులు, తాజాగా 3,676 మందికి కరోనా, 6,406కి చేరిన మృతుల సంఖ్య, 7,79,146కు చేరిన మొత్తం కేసుల సంఖ్య

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 70,881 నమూనాలు పరీక్షించగా 3,676పాజిటివ్‌ కేసులు (AP Coronavirus Report) నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 7,79,146కు చేరింది. కొత్తగా 24 మంది కరోనా బాధితులు మృతి చెందడంతో ఆ సంఖ్య 6,406కి (COVID Deaths) చేరింది. ఈ మేరకు శనివారం రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది.

Advertisement

Undavalli Arun Kumar: చంద్రబాబు కేసులు ప్రజలకు తెలియాలి, ప్రజాప్రతినిధుల కేసులు వర్చువల్‌ కోర్టుల్లో విచారించాలి, మీడియా సమావేశంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్

Hazarath Reddy

ఏపీ సీఎం జగన్‌ రాసిన లేఖలోని అంశాలు ప్రజలకు తెలియాలని అన్నారు. హైకోర్టు గ్యాగ్‌ ఆర్డర్ (High Court Gag order) ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చిందని ఉండవల్లి ప్రశ్నించారు. కోర్టు డీజీపీని పిలిపించడం సరైంది కాదని అభిప్రాయపడ్డారు. గతంలో జడ్జీలపై ఎఫ్‌ఐఆర్‌ కట్టిన సందర్భాలున్నాయని గుర్తు చేశారు.

Weather Alert in Telugu States: మళ్లీ దూసుకొస్తున్న ముప్పు, 19న బంగాళఖాతంలో అల్ప పీడనం, రానున్న రెండు రోజులు పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం, హెచ్చరించిన వాతావరణ శాఖ

Hazarath Reddy

తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేసిన వర్షాలు ఇప్పట్లో ఆగే సూచనలు కనపడటం లేదు. ఇప్పటికే భారీ వర్షాలతో తీవ్ర నష్టాలను చవి తెలుగు రాష్ట్రాలపై ( Heavy Rains in Telugu States) మరో ముంపు కాచుకూర్చుని ఉంది. మధ్య బంగాళాఖాతంలో (Bay of Bengal) ఈ నెల 19న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ (meteorological department) పేర్కొంది. ఇది ఏర్పడిన 24 గంటల తర్వాత తీవ్ర అల్పపీడనంగా (Low pressure) మారే అవకాశముందని తెలిపింది. దీంతో రాష్ట్రంలో నేడు, రేపు పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

AP Coronavirus Update: ఏపీలో ఎక్కువ టెస్టుల ఫలితం, ఇప్పుడు యాక్టివ్ కేసులు 38, 979 మాత్రమే, రోజు రోజుకు పెరుగుతున్న డిశ్చార్జ్ కేసులు, తాజాగా 3,967మందికి కరోనా

Hazarath Reddy

రాష్ట్రవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 74,337 సాంపిల్స్‌ పరీక్షించగా.. 3,967మందికి కరోనా (AP Coronavirus ) పాజిటివ్‌గా నిర్థారణ అయింది. దీంతో రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 7,75,470కి (Coronavirus in AP) చేరుకుంది. కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య మరింత పెరిగింది. 24 గంటల్లో కొత్తగా 5,010 మంది కరోనా వైరస్‌ (Covid 19) బారి నుంచి కోలుకోగా.. మొత్తం సంఖ్య 7,30,109 కు చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 38, 979 కరోనా యాక్టివ్‌ కేసులున్నాయి.

Schools Reopening Date in AP: నవంబర్ 2 నుంచి ఏపీలో స్కూల్స్ ప్రారంభం, సిలబస్ తగ్గింపు, స్కూల్స్ ప్రారంభమయ్యేలోపు విద్యా క్యాలెండర్ విడుదల చేస్తామని తెలిపిన మంత్రి సురేష్

Hazarath Reddy

ఏపీలో నవంబర్ 2వ తేదీ నుంచి స్కూల్స్ (Schools Reopening Date in AP) ప్రారంభిస్తామని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కరోనా వైరస్ కారణంగా ఇప్పటికే నాలుగైదు నెలలుగా స్కూల్స్ ప్రారంభించలేకపోయామని చెప్పారు. ఇంటర్‌లో 30 శాతం సిలబస్ తగ్గించామని, అదే పద్ధతిలో హైస్కూల్ విద్యార్థులకు కూడా సిలబస్ కుదిస్తామని మంత్రి తెలిపారు

Advertisement

YV Subba Reddy Covid: టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి కరోనా, ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న వైసీపీ నేత, హైదరాబాద్ అపోలోలో చేరిన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్

Hazarath Reddy

ఏపీలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ (YV Subba Reddy tests positive for coronavirus) అయింది. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో ఆయన చికిత్స తీసుకుంటున్నట్లు తెలిసింది. ఇటీవల నిర్వహించిన టీటీడీ సమావేశంలో వైవీ సుబ్బారెడ్డి (TTD chairman YV Subba Reddy) పాల్గొన్నారు. దీంతో ఆయనను కలిసిన వారిలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నెల 12న వైవీ సుబ్బారెడ్డి తల్లి జన్మదినం జరిగింది. ఆ వేడుకల్లోనూ ఆయన పాల్గొని తల్లి ఆశీర్వాదం తీసుకున్నారు.

Guntur Road Accident: గుంటూరులో ఘోర రోడ్డు ప్రమాదం, కాల్వలోకి దూసుకెళ్లిన కారు, నలుగురు మృతి, చనిపోయిన వారిని ధర్మపురి వాసులుగా గుర్తించిన పోలీసులు

Hazarath Reddy

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Guntur Road Accident) జరిగింది. అతి వేగంగా వెళ్తున్న ఓ కారు కాల్వలోకి దూసుకెళ్లిన ఘటనలో (Car Falls into Canal) నలుగురు వ్యక్తులు మృతి చెందారు. శుక్రవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. మృతులంతా జ‌గిత్యాల (Jagtial) జిల్లా ధ‌ర్మపురికి చెందిన‌వార‌ని పోలీసులు వెల్లడించారు. శుక్రవారం తెల్లవారు జామున రొంపిచర్ల - సుబ్బయ్యపాలెం మధ్య తంగేడుపల్లి వద్ద చోటు చేసుకుంది.

Caste & Religion Column Removed: ఏపీ సర్కారు మరో సంచలన నిర్ణయం, స్కూలు అటెండెన్స్ రిజిస్టర్‌లో కుల, మత వివరాలు నమోదు చేయకూడదని అన్ని స్కూళ్లకు ఆదేశాలు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్కూల్ అటెండెన్స్ రిజిస్టర్‌పై కీలక ఉత్తర్వులు జారీ అయ్యాయి. విద్యార్థుల అటెండెన్స్ రిజిస్టర్‌లో కుల, మత వివరాలు నమోదు చేయకూడదని (Caste & Religion Column Removed) ఏపీ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ (Director of School Education) ఆదేశాలు జారీ చేశారు. కొన్ని స్కూళ్లలో విద్యార్థుల కుల, మత వివరాలను (Caste & Religion) రిజిష్టర్‌లో నమోదు చేస్తున్నట్టు సమాచారం రావడంతో స్పందించిన స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ వాటిని వెంటనే తొలగించాలని సర్క్యులర్ జారీ చేశారు.

Kanaka Durga Flyover Inauguration: దేశంలో మూడో ప్రాజెక్టు, బెజవాడ వాసుల కష్టాలను తీరుస్తూ కనకదుర్గ ఫ్లైఓవర్ ప్రారంభం, రూ.502 కోట్లతో ఆరు వరుసలతో 2.6 కి.మీ మేర దుర్గ గుడి వంతెన

Hazarath Reddy

బెజవాడ నగరవాసుల ట్రాఫిక్‌ కష్టాలు తీర్చేందుకు రూపుదిద్దుకున్న కనకదుర్గ ఫ్లైఓవర్ (Kanaka Durga Flyover Inauguration) నేటి నుంచి అందుబాటులోకి వచ్చింది. కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ ( Nitin Gadkari), ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిలు (AP CM ys jagan Mohan Reddy) శుక్రవారం వర్చువల్‌ కార్యక్రమం (Virtual Inauguration) ద్వారా ఈ ఫ్లైఓవర్‌ను ప్రారంభించారు. అనంతరం రూ.7584 కోట్ల రూపాయల విలువైన మరో 16 ప్రాజెక్టులకు వారు భూమిపూజ చేశారు. మొత్తం రూ.15,592 కోట్ల రూపాయల పనులకు భూమిపూజ, ప్రారంభోత్సవాలు చేశారు.

Advertisement
Advertisement