ఆంధ్ర ప్రదేశ్
Interstate Bus Services Stand-Off: రూట్ వైజ్ క్లారిటీ ఇవ్వాలని కోరిన తెలంగాణ, ఏ రాష్ట్రం ఇలాంటి ప్రతిపాదన ఇవ్వలేదని తెలిపిన ఏపీ, తేలని ఆర్టీసీ వ్యవహారం, మరో రెండు రోజుల్లో మళ్లీ సమావేశం
Hazarath Reddyరెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ చర్చలు(Interstate bus services) ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ఏపీ, తెలంగాణ మధ్య ఆర్టీసీ బస్సు సర్వీసుల పునరుద్ధరణపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన ఆర్టీసీ ఉన్నతాధికారుల సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో అంతర్‌రాష్ట్ర బస్సు సర్వీసుల పునరుద్ధరణ (Interstate Bus Services Stand-Off), కిలోమీటర్లపై చర్చ జరిగింది. సమావేశం అనంతరం ఏపీ ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు మీడియాతో మాట్లాడారు.
Andhra Pradesh Floods: ఏపీలో భారీ వర్షాలు, మరో రెండు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని తెలిపిన వాతావరణ శాఖ, నిండుకుండలా జలాశయాలు, ప్రకాశం బ్యారేజీ ఏడు గేట్లు ఎత్తివేత
Hazarath Reddyపశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆంధ్రప్రదేశ్‌ తీరానికి సమీపంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. దీనికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాగల రెండు రోజుల పాటు రాష్ట్రంలో చాలా చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు (Andhra Pradesh Rains), అనేక చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి.
Polavaram Project Funds: పోలవరం నిధులు త్వరలో విడుదల చేస్తామని తెలిపిన ఆర్థిక మంత్రి, పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన నిధులపై రాజ్యసభలో ప్రస్తావించిన వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి
Hazarath Reddyఏపీ జీవనాడి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రం నుంచి రావాల్సిన రూ. 3,805 కోట్ల బకాయిలను (Polavaram Project Funds) త్వరగా విడుదల చేయాలని రాజ్యసభలో వైయస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్ర ఆర్థికమంత్రిని కోరారు. ఈ సంధర్భంగా కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ త్వరలోనే విడుదల చేస్తామని (Polavaram Grants Release) హామీ ఇచ్చినట్లు వైఎస్సార్‌సీపీ ఎంపీ (YSRCP MP Vijaya Sai Reddy) పేర్కొన్నారు. రాజ్యసభ సమావేశాల సందర్భంగా మంగళవారం విజయసాయిరెడ్డి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన నిధులపై రాజ్యసభలో ప్రస్తావించారు.
CM YS Jagan VC with MPs: ప్రత్యేక హోదానే ఎజెండా కావాలి, పెండింగ్ నిధులు ఇవ్వాలని నిలదీయండి, పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఎంపీలకు ఏపీ సీఎం వైయస్ జగన్ దిశా నిర్దేశం
Hazarath Reddyపార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఢిల్లీలో ఉన్న వైయస్సార్సీపీ ఎంపీలతో ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లిలోని తన నివాసం నుంచి వీడియో కాన్ఫరెన్స్ (CM YS Jagan VC with MPs) నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీలకు (YSRCP MPs) రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడాల్సిన వాటి గురించి చర్చించారు. రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో పార్టీ ఎంపీలు కృషి చేయాలని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడం కోసం నిరంతరం ప్రయత్నించాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కోరారు.
AP Coronavirus Report: ఏపీలో కోటిమందికి కరోనా వచ్చి పోయింది, సీరో సర్వేలో వెల్లడి, తాజాగా 7,956 మందికి కరోనా, 9,764 మంది కరోనా నుంచి కోలుకోని డిశ్చార్జ్‌, రాష్ట్రంలో యాక్టివ్‌గా 93,204 కేసులు
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 7,956 మందికి కరోనావైరస్ (AP Coronavirs Report) సోకింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 5,75,079కు (Coronavirus) చేరింది. కొత్తగా 60 మంది మరణించగా మొత్తం ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,972 చేరింది.కాగా ఆంధ్రప్రదేశ్‌లో రికార్డు స్థాయిలో కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. సోమవారం నాటికి 46,61,355 టెస్టులు పూర్తయ్యాయి. గడిచిన 24 గంటల్లో 61,529 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా వీరిలో 7,956 మందికి పాజిటివ్‌గా తేలింది.
Andhra Woman Dies in US: అమెరికాలో ఏపీ యువతి మృతి, సెల్పీ దిగుతూ ప్రమాదవశాత్తూ బాల్డ్ జలపాతంలో జారిపడిన యువతి, మృతదేహాన్ని భారత్‌ తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు
Hazarath Reddyఅమెరికాలోని ఒక జలపాతం వద్ద సెల్ఫీ దిగుతూ ప్రమాదవశాత్తు జారి పడిపోవడంతో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక యువతి (Andhra Woman Dies in US) చనిపోయింది. తన కాబోయే భర్తతో సెల్ఫీ తీసుకునేటప్పుడు మహిళ జారిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. వివరాల్లోకెళితే.. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరుకు (Gudlavaleru in Krishna district) చెందిన పోలవరపు లక్ష్మణరావు, అరుణ దంపతులకు ఇద్దరు కుమార్తెలు.
Heavy Rains in Telugu States: ఏపీ, తెలంగాణను ముంచెత్తిన భారీ వర్షాలు, మరో రెండు రోజుల పాటు కొనసాగనున్న వర్షాలు, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావమే కారణం
Hazarath Reddyపశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఏపీ, తెలంగాణలో పలు చోట్ల వర్షాలు (Heavy Rains in Telugu States) కురుస్తున్నాయి. మరో రెండు రోజులపాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. కృష్ణా, పశ్చిమ గోదావరి, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నాయి. రాయలసీమ జిల్లాలో కూడా పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర కోస్తా జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై ఉంది.
Vijayawada COVID Centre Fire: రమేష్‌ ఆస్పత్రిపై విచారణకు ఏపీ ప్రభుత్వానికి గ్రీన్‌సిగ్నల్‌, ఏపీ హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించిన సుప్రీంకోర్టు, డా.రమేష్ పూర్తిగా సహకరించాలని ఆదేశాలు
Hazarath Reddyఏపీలో 10 మంది కరోనా బాధితుల మృతికి కారణమైన విజయవాడ రమేష్‌ ఆస్పత్రిపై (Ramesh Hospitals) చర్యలు తీసుకునేందుకు అత్యున్నత న్యాయస్థానం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఈ మేరకు ఏపీ హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు (Supreme Court) స్టే విధించింది. స్వర్ణ ప్యాలెస్‌ ఘటనలో రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు చేపట్టవచ్చని స్పష్టం చేసింది. ప్రమాద కారకులపై (Vijayawada COVID Centre Fire) ఎలాంటి చర్యలు తీసుకోకుండా హైకోర్టు (Andhra Pradesh High Court) ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం (AP Govt) దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం జస్టిస్‌ నారీమన్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది.
CM YS Jagan VC With MPs: ముగ్గురు వైసీపీ ఎంపీలకు కరోనా, వైఎస్సార్‌సీపీ ఎంపీలతో సీఎం జగన్ వర్చువల్ మీటింగ్‌, ప్రత్యేక హోదా అంశాన్ని పార్లమెంట్‌లో చర్చకు తీసుకురావాలని సూచించే అవకాశం
Hazarath Reddyపార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం అయిన నేపథ్యంలో ఎంపీలందరికీ కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలో ఏపీ నుంచి ముగ్గురు ఎంపీలకు కరోనా పాజిటివ్ గా ( 3 lok sabha mps tested positive for coronavirus) నిర్థారణ అయింది. చిత్తూరు వైఎస్సార్‌సీపీ ఎంపీ రెడ్డప్ప (Chittoor MP Reddappa), కాకినాడ ఎంపీ వంగా గీత ( Kakinada MP Vanga Geetha), అరకు ఎంపీ గొడ్డేటి మాధవిలకు (Araku MP Goddeti Madhavi) కోవిడ్ పాజిటివ్ గా నిర్థారణ అయింది.
Antarvedi Fire Mishap: అంతర్వేదీ ఘటనలో కరోనా కలకలం, ఇన్విస్టిగేషన్ ఆఫీసర్‌కు కరోనా పాజిటివ్, 36 మంది నిందితుల్లో ఇద్దరికి కోవిడ్-19, స్వీయ నిర్భంధంలోకి పోలీసులు
Hazarath Reddyఏపీలో పెను ప్రకంపనలకు కారణమైన అంతర్వేది రథం దగ్థం ఘటనలో (Antarvedi Fire Mishap) కరోనా కలకలం రేపుతోంది. రథం దగ్ధమైనందుకు నిరసనగా పలువురు ఆందోళనలో కార్యక్రమం నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆందోళనకారులను పోలీసులు (Police) అరెస్ట్‌ చేశారు. అయితే వారికి కరోనా టెస్టులు (Corona Tests) నిర్వహించగా వారిలో కొంతమందికి కోవిడ్ పాజిటివ్‌గా తేలింది. 36 మంది నిందితుల్లో ఇద్దరికి కరోనాగా నిర్ధారణ కాగా.. ముందస్తు జాగ్రత్తగా పోలీసు అధికారులు కూడా పరీక్షలు చేసుకున్నారు.
AP Coronavirus Bulletin: ఏపీలో కరోనాపై భారీ ఊరట, రోజు రోజుకు పెరుగుతున్న డిశ్చార్జ్ కేసులు, తాజాగా 9,536 మందికి కరోనా, 10,131 మంది కోలుకుని డిశ్చార్జ్‌, యాక్టివ్‌గా 95,072 కేసులు
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌లో గడచిన 24 గంటల్లో కొత్తగా 9,536 కరోనా పాజిటివ్‌ కేసులు ( new corona cases) నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ తెలిపింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 5,67,123కు (Andhra Pradesh Coronavirus) చేరింది. ప్రస్తుతం 95,072 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటి వరకు 4,67,139 మంది కోలుకున్నారు. ఒక్క రోజు వ్యవధిలో 66 మంది మరణించారు. కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 4,912కు పెరిగింది. 24 గంటల్లో 10,131 మంది కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు.
Cheating Cases Filed on Nutan Naidu: తవ్వే కొద్దీ బయటకు వస్తున్న నూతన్ నాయుడు మోసాలు, తాజాగా మరో రెండు కేసులు నమోదు, కస్టడీలోకి తీసుకున్న విశాఖ పోలీసులు
Hazarath Reddyబిగ్ బాస్ ఫేమ్ నూతన్ నాయుడు ఆగడాలు ఒకొక్కటిగా బయటపడుతున్నాయి. యువకునికి శిరోముండనం కేసులో అరెస్టైన నూతన్ నాయుడుపై కొత్త కొత్త కేసులు (Cheating Cases on Nutan Naidu) నమోదవుతున్నాయి. మాజీ ఐఏఎస్ అధికారి పేరుతో ఫోన్ కాల్ చేసి పనులు చేయించుకున్న సంగతి వెలుగులోకి రావడంతో పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. పోలీసులు అనుమానించినట్టుగానే ఒక్కొక్కటిగా నూతన్ నాయుడు (Nutan Naidu) మోసాల చిట్టా బయటపడుతోంది.
Covid in AP: కాకినాడ ఎంపీకి కరోనా, ఏపీలో 4,57,008 మంది డిశ్చార్జ్, తాజాగా 9,901 మందికి కోవిడ్-19, మృతుల సంఖ్య 4,846కు చేరిక
Hazarath Reddyరాష్ట్రంలో రికార్డు స్థాయిలో కరోనా పరీక్షలు జరుగుతున్నాయి. 24 గంటల వ్యవధిలో 75,465 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. ఇందులో 31,255 ఆర్టీపీసీఆర్‌ టెస్టులు, 44,210 యాంటిజెన్‌ టెస్టులు ఉన్నాయి. శనివారం నాటికి రాష్ట్రంలో కరోనా టెస్టుల సంఖ్య 45,27,593కు (COVID-19 AP) చేరింది. గడిచిన 24 గంటల్లో 9,901 పాజిటివ్‌ కేసులు (new Covid cases) నమోదయ్యాయి. 10,292 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు.
Tax Increasing on Natural Gas: ఏపీలో సహజవాయువుపై వ్యాట్ పెంపు, 14.5 శాతం నుంచి 24.5 శాతానికి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం, పథకాలకు నిధులు అవసరమని తెలిపిన ప్రభుత్వం
Hazarath Reddyఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో సహజవాయువుపై వ్యాట్‌ను ఏపీ ప్ర‌భుత్వం (AP Govt) పెంచింది. ఏపీ వ్యాట్ చట్టం ప్రకారం నేచురల్ గ్యాస్ మీద పన్ను పెంచుతూ (Tax Increasing on Natural Gas) ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గ‌తంలో 14.5 శాతం ఉన్న వ్యాట్‌ను 24.5 శాతానికి విలువ ఆధారిత పన్నును పెంచుతూ (Andhra Pradesh govt enhances tax on natural gas) వాణిజ్య పన్నుల శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.
Guntur Collector vs Doctor: కలెక్టర్‌, వైద్యుడు మధ్య వాగ్వాదం, వైద్యుడిని అరెస్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేసిన గుంటూరు జిల్లా కలెక్టర్, నరసరావుపేటలో కోవిడ్ సమీక్షా సమావేశంలో ఘటన
Hazarath Reddyగుంటూరు జిల్లా నరసరావుపేటలో కరోనా వైరస్‌పై నిర్వహించిన సమీక్షా సమావేశంలో కలెక్టర్‌, వైద్యుడు మధ్య వాగ్వాదం (Guntur Collector vs Doctor) చోటుచేసుకుంది. స్థానికంగా కరోనా బాధితులకు అందిస్తున్న వైద్య సదుపాయాలపై జిల్లా కలెక్టర్‌ శామ్యూల్ ఆనంద్ కుమార్ కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు. కరోనా కట్టడికి ప్రభుత్వ పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటున్నా అధికారులు సరైన విధంగా విధులు నిర్వర్తించడంలేదని మందలించే ప్రయత్నం చేశారు.
AP DGP Gautam Sawang: అన్ని దేవాలయాలు, ప్రార్థనా మందిరాల్లో సీసీ కెమెరాలు, మత సామరస్యాన్ని దెబ్బతీస్తే కఠిన చర్యలు తప్పవు, హెచ్చరించిన ఏపీ డీజీపీ గౌతం సవాంగ్‌
Hazarath Reddyఏపీలో మత సామరస్య పరంగా కుట్రపూరిత చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని డీజీపీ గౌతం సవాంగ్‌ (AP DGP Gautam Sawang) హెచ్చరించారు. దేవాలయాలు, ప్రార్థనా మందిరాల పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత మనందరి పైన ఉందన్నారు. దేవాలయాలు (Temples), ప్రార్థనా మందిరాల (masque, church) వద్ద భద్రతాచర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని జిల్లా ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశామని డీజీపీ తెలిపారు. కొంతమంది ఆకతాయిలు ఉద్దేశపూర్వకంగా మతాల మధ్య చిచ్చు పెట్టి శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Srivari Brahmotsavam: సెప్టెంబర్ 19 నుంచి తిరుమల బ్రహ్మోత్సవాలు, హాజరుకానున్న ఏపీ సీఎం వైయస్ జగన్, కర్ణాటక సీఎం బి.ఎస్.యడ్యూరప్ప, శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్న ఏపీ సీఎం
Hazarath Reddyతిరుమల వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 19 నుంచి 27వ తేదీ వరకు జరగనున్నాయి. కరోనా నేపథ్యంలో ఈసారి బ్రహ్మోత్సవాలకు (Srivari Brahmotsavam) భక్తులను అనుమతించడంలేదు. దాంతో ఈ వేడుకను ఏకాంతంగా నిర్వహించనున్నారు. ఈసారి బ్రహ్మోత్సవాలకు (Tirumala Srivari Brahmotsavams) సీఎం జగన్ తో పాటు కర్ణాటక ముఖ్యమంత్రి బి.ఎస్.యడ్యూరప్ప (ap-cm-jagan-karnataka-cm-yediyurappa) కూడా హాజరవుతున్నారు. ఏటా బ్రహ్మోత్సవాల మొదటిరోజు రాష్ట్రప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీ.
Inter-State Bus Services: తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సుల రాకపోకలు, సెప్టెంబర్ 14న ఇరు రాష్ట్రాల రవాణా శాఖ మంత్రులు భేటీ వార్తలపై స్పందించిన తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
Hazarath Reddyరెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సులు (Inter-State Bus Services) నడపడానికి ఉన్న ప్రతిబంధకాలను తొలగించే లక్క్ష్యంతో ఇరు రాష్ట్రాల రవాణా శాఖ మంత్రులు (Transport ministers of Telugu States) పేర్ని నాని, పువ్వాడ అజయ్ సెప్టెంబర్ 14న హైదరాబాద్‌లో సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి రెండు రాష్ట్రాల ఆర్టీసీ ఎండీలు, సంబంధిత ఉన్నత అధికారులు హాజరుకానున్నారు. ఎలాగైనా ఆర్టీసీ సర్వీసులను పునరుద్ధరించేందుకు ఉన్న అవకాశాలను ఇరు రాష్ట్రాల రవాణా మంత్రులు చర్చించనున్నారు.
Three Capitals Row: మూడు రాజధానులు తప్పులేదు, ఏపీ హైకోర్టులో కేంద్రం అదనపు అఫిడవిట్ దాఖలు, విభజన చట్టంలో రాజధానికి అవసరమైన ఆర్థిక సాయం చేస్తామని మాత్రమే చెప్పామని హైకోర్టుకు స్పష్టం చేసిన కేంద్రం
Hazarath Reddyఏపీ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల విషయంలో కేంద్ర ప్రభుత్వం మరోసారి కార్లిటీ (Centre clarifies on 3 capitals in AP) ఇచ్చింది. ఇందులో భాగంగా మూడు రాజధానులపై ఏపీ హైకోర్టులో కేంద్రం అదనపు అఫిడవిట్ దాఖలు చేసింది. అందులో కేంద్ర ప్రభుత్వం పలు కీలక అంశాలను ప్రస్తావించింది. విభజన చట్టం ప్రకారం మూడు రాజధానులు (Three Capitals) తప్పులేదని కేంద్రం తేల్చిచెప్పింది. విభజన చట్టంలో (bifurcation Act) ఒకే రాజధాని ఉండాలని ఎక్కడా లేదని స్పష్టం చేసింది.
Capital Assigned Lands Case: రాజధాని అసైన్డ్‌ భూముల కేసు, హైకోర్టు దర్యాప్తును నిలిపివేయడంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు, 21వ తేదీలోపు పిటిషన్‌పై సమాధానం ఇవ్వాలని ప్రతివాదికి నోటీసులు జారీ
Hazarath Reddyగత ప్రభుత్వంలో ఏపీ రాజధాని అమరావతి పరిధిలో జరిగిన అసైన్డ్‌ భూముల బదలాయింపు వ్యవహారంలో (Capital Assigned Lands Case) సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇందులో అవకతవకలను, అక్రమాలను వెలికితీసేందుకు ఇప్పటి ప్రభుత్వం చేస్తున్నసీఐడీ దర్యాప్తును హైకోర్టు నిలిపివేయడంపై సుప్రీంకోర్టు (Supreme Court) అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం పలు కీలక వ్యాఖ్యలు చేసింది.