ఆంధ్ర ప్రదేశ్

AP Three Capitals: సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి మరోసారి నిరాశ, హైకోర్టులో విచారణలో ఉన్నందున పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాల స్టేటస్ కో అంశంపై జోక్యం చేసుకోలేమని వెల్లడి

Hazarath Reddy

మూడు రాజధానుల అంశంపై ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో (Supreme Court) మరోసారి నిరాశే ఎదురయింది. పాలనా వికేంద్రీకరణ (Three capitals), సీఆర్డీఏ రద్దు చట్టాలపై (CRDA Repeal petition) ఏపీ హైకోర్టు ఇచ్చిన స్టేటస్‌ కో ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌‌పై విచారణ జరగ్గా.. పిటిషన్‌ను జస్టిస్‌ అశోక్‌భూషణ్‌ , జస్టిస్‌ ఆర్.సుభాష్‌రెడ్డి, జస్టిస్‌ ఎం.ఆర్‌.షాలతో కూడిన ధర్మాసనం తోసిపుచ్చింది. హైకోర్టు (High Court) విచారణ చేస్తున్నందున ఈ దశలో జోక్యం చేసుకోలేమంది. హైకోర్టు విచారణ చేస్తున్నందున ఈ దశలో జోక్యం చేసుకోలేమని సుప్రీం తెలిపింది.

Special Courts in AP: ఆడపిల్లల రక్షణ కోసం ఎనిమిది స్పెషల్‌ కోర్టులు, కీలక ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ సర్కారు, జిల్లా జడ్జి క్యాడర్‌తో ప్రత్యేక కోర్టులు ఏర్పాటు, దిశ తరహాలో అవినీతి నిర్మూలనకు కొత్త బిల్లు

Hazarath Reddy

పరిపాలనలో దూసుకుపోతున్న ఏపీ సర్కారు ( AP Govt) మహిళల రక్షణకు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎనిమిది స్పెషల్‌ కోర్టులను మంజూరు చేస్తూ ప్రభుత్వం (Government of Andhra Pradesh) ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్రంలోని చిన్నపిల్లలపై జరిగే లైంగిక నేరాల కేసులు (POSCO) విచారణ కోసం ఈ ప్రత్యేక కోర్టులు పనిచేస్తాయని ప్రభుత్వం తన ఉత్తర్వులో పేర్కొంది. వందకు పైగా పోక్సో కేసులు పెండింగ్ లో ఉన్న చోట కోర్టులు (Special Courts in AP) ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించింది.

Reverse Tendering Orders: పనులు రూ.కోటి దాటితే రివర్స్ టెండరింగ్, ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం, టెండర్ కమ్ రివర్స్ ఆక్షన్ విధానం ద్వారానే కొనుగోళ్లు చేయాలని ఆదేశాలు జారీ

Hazarath Reddy

అవినీతి నిర్మూలనకు ఏపీ ప్రభుత్వం (Government of Andhra Pradesh) మరో కీలక నిర్ణయం తీసుకుంటూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల్లో భాగంగా కోటి రూపాయలు దాటిన వస్తు, సేవల కొనుగోళ్లకు ఏపీ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ (Reverse Tendering) చేపట్టనుంది. వ్యాపార కొనుగోళ్లలో పారదర్శకత కోసం రివర్స్ టెండరింగ్ విధానాన్ని అమలు చేయాల్సిందిగా జగన్ సర్కారు (YS Jagan Govt) ఆదేశించింది. కోటి రూపాయల విలువదాటిన ప్రతీ లావాదేవీని రివర్స్ టెండరింగ్ ద్వారా చేపట్టాలని, టెండర్ కమ్ రివర్స్ ఆక్షన్ విధానం ద్వారానే కొనుగోళ్లు చేయాలని ప్రభుత్వశాఖలకు ఆదేశాలు జారీ చేసింది.

Telugu States Covid Updates: తిరుపతి ఎమ్మెల్యే భూమనకు కరోనా, జగిత్యాల అడిషనల్‌ ఎస్పీ కోవిడ్‌తో మృతి, మహబూబాబాద్‌ కలెక్టర్‌కు కరోనా

Hazarath Reddy

తిరుపతి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌ రెడ్డి (Bhumana Karunakar Reddy) కరోనావైరస్ బారిన పడ్డారు. చికిత్స నిమిత్తం ఆయన రుయా ఆస్పత్రిలో చేరారు. జగిత్యాల అడిషనల్ ఎస్పీగా పని చేస్తున్న దక్షిణ మూర్తి (Jagtial Additional SP Dakshinamurthy) కరోనాతో మృతి చెందారు. మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్‌ కరోనా వైరస్‌ బారినపడ్డారు.

Advertisement

COVID19 in AP: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మరో 9,927 పాజిటివ్ కేసులు నమోదు, రాష్ట్రంలో 3 లక్షల 71 వేలు దాటిన మొత్తం కొవిడ్ బాధితుల సంఖ్య, 3460కు పెరిగిన కరోనా మరణాలు

Team Latestly

నిన్నటి నుండి ఈరోజు వరకు మరో 9,419 మంది బాధితులు కొవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇలా ఇప్పటివరకు 2,78,247 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో...

CM YS Jagan Review: శత్రువులు ఎక్కువ, అందుకే వివిధ వేదికలపై పోరాటం చేయాల్సి వస్తోంది, సమయం పట్టినా చివరకు న్యాయమే గెలుస్తుందని తెలిపిన ఏపీ సీఎం వైయస్ జగన్, పలు అంశాలపై క్యాంపు కార్యాలయంలో సీఎం సమీక్ష

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS Jagan Mohan Reddy) ఏపీలో జరుగుతున్న పరిణామాలు, కీలక పథకాలపై ఈ రోజు సమీక్ష సమావేశం (CM YS Jagan Review) నిర్వహించారు. ఇళ్ల పట్టాల పంపిణీ సహా వివిధ అంశాలపై సీఎం వైఎస్ జగన్ (AP CM YS Jagan) మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఇళ్ల పట్టాల సమీక్ష సంధర్భంగా ఏపీ సీఎం మాట్లాడుతూ.. ప్లాట్ల అభివృద్ధి, మార్కింగ్, ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ (house pattas distribution) ప్రక్రియ త్వరంగా పూర్తి చేయాలని ఆదేశించారు

CM Jagan Video Conference: కరోనా చికిత్సకు ఎక్కువ రేట్లు వసూలు చేస్తే కఠిన చర్యలు, ఆస్పత్రులు కరోనా బాధితుల పట్ల మానవత్వం చూపించాలని కోరిన ఏపీ సీఎం జగన్

Hazarath Reddy

ఏపీలో కోవిడ్‌ చికిత్సలకు అధిక రేట్లు వసూలు చేయడం పట్ల ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS Jagan) ఆగ్రహం వ్యక్తం చేశారు. కోవిడ్‌ ఆస్పత్రుల నిర్వహణపై కలెక్టర్లు దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. స్పందన కార్యక్రమంపై (AP CM YS Jagan) మంగళవారం సీఎం జగన్‌ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన జీవోలో పేర్కొన్న దాని కంటే.. కోవిడ్‌ రోగుల వద్ద నుంచి ఎక్కువ వసూలు చేస్తే కచ్చితంగా చర్యలు ఉంటాయని ముఖ్యమంత్రి హెచ్చరించారు. కరోనా బాధితుల పట్ల మానవత్వం చూపించాలన్నారు. కోవిడ్ బాధితుడికి అరగంటలోగా బెడ్ ఇవ్వాల్సిన బాధ్యత కలెక్టర్లదే అని తెలిపారు. 104, 14410 కాల్‌ సెంటర్లకు వచ్చే ఫోన్ కాల్స్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

AP Weather Update: మరో అల్ప పీడనం, రానున్న మూడు రోజులు ఏపీని ముంచెత్తనున్న భారీ వర్షాలు, మెరుపులతో కూడిన వాన, వెల్లడించిన విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం

Hazarath Reddy

తెలుగు రాష్ట్రాలకు వాన గండం తప్పేలా లేదు. గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాలను వర్షాలు (Telugu states Rains) ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జలాశయాలు నిండుకుండల్లా మారాయి. అయితే, మరో మూడు రోజుల పాటు వర్షాలు (Heavy Rain Fall Alert) కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉరుములు మెరుపులతో కూడిన వాన (Andhra Pradesh weather forecast) పడవచ్చని అటు విశాఖలోని తుఫాన్ హెచ్చరికల కేంద్రం అధికారులు చెబుతున్నారు.

Advertisement

Swarna Palace Incident: స్వర్ణప్యాలెస్‌ అగ్నిప్రమాదం, మృతుల కుటుంబాలకు రూ.50లక్షల చెక్కును అందజేసిన రాష్ట్ర మంత్రులు, పరారీలోనే రమేష్ ఆస్పత్రి డైరక్టర్

Hazarath Reddy

విజయవాడ రమేష్ ఆస్పత్రి స్వర్ణప్యాలెస్‌ అగ్నిప్రమాద ఘటనలో (Swarna Palace Incident) మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికం సాయం అందజేసింది. రాష్ట్ర మంత్రులు ఆళ్లనాని, కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాస్‌ మృతుల కుటుంబాలకు రూ.50లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెక్కులను (Rs 50 lakh ex gratia victims family) మంగళవారం అందజేశారు. జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది.

AP Coronavirus: కరోనా నుంచి కోలుకుని ఏపీలో 2,68,828 మంది డిశ్చార్జ్, యాక్టివ్‌గా 89,516 కేసులు, తాజాగా 8,601 మందికి కరోనా, రాష్ట్రంలో మొత్తం 32,92,501కి చేరిన కరోనా టెస్టులు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌ ( Andhra Pradesh ) లో గత 24గంటల్లో 54,463 కరోనా టెస్టులు చేయగా.. 8,601 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ వైరస్ కారణంగా 86మంది మరణించారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ వైద్యఆరోగ్యశాఖ ( AP Health Ministry ) సోమవారం సాయంత్రం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. తాజాగా గణాంకాల ప్రకారం.. మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,58,817కి పెరగగా.. ఇప్పటివరకు 3,368 మంది ఈ మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయారు.

Adimulapu Suresh Covid 19: ఏపీ విద్యాశాఖ మంత్రికి కరోనా, వాట్సాప్ స్టేటస్‌లో వెల్లడించిన ఆదిమూలపు సురేష్, తనను కలిసిన వారు కరోనా టెస్ట్ చేయించుకోవాలని సూచన

Hazarath Reddy

ఏపీలో సాధారణ ప్రజలతో పాటు పలువురు రాజకీయ నేతలకు కూడా కరోనా బారీన పడుతున్నారు. తాజాగా ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌కు కరోనా పాజిటివ్‌గా (AP Educational Minister Tests Corona Positive) నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆయన తన వాట్సాప్ స్టేటస్ ద్వారా తెలిపారు. స్వల్ప లక్షణాలు ఉండటంతో కరోనా పరీక్షలు చేయించుకున్నారని.. పరీక్షల్లో పాజిటివ్‌గా తేలిందని చెబుతున్నారు.

Husband-Wife Conflicts: భార్య-భర్తల మధ్య విభేదాలు, కృష్ణానదిలో దూకి డాక్టర్ ఆత్మహత్య, గోదావరి నదిలో దూకి మరొకరు ఆత్మహత్యా ప్రయత్నం, ఇంకో చోట భార్య నీటి కుంటలో దూకి కుమార్తెతో సహా ఆత్మహత్య

Hazarath Reddy

చిన్న చిన్న గొడవలతో పచ్చని సంసారాలు కకావికలమవుతున్నాయి. సర్దుకుపోయే మనస్తత్వం లేకపోవడంతో ప్రాణాలు తీసుకుంటూ కుటుంబానికి వేదన మిగిలుస్తున్నారు. రోజు ఇలాంటి ఘటనలో ఎక్కడో ఓ చోట జరగుతూనే ఉన్నాయి. భార్య భర్తల మధ్య విభేధాలు (Husband-Wife Conflicts) తలెత్తితే ఆత్మహత్య శరణ్యమనే విధంగా ఆలోచనలు చేస్తున్నారు. కొన్ని చోట్ల వివాహేతర సంబంధాలు పచ్చని సంసారాల్లో చిచ్చును పెడుతున్నాయి.

Advertisement

Apex Council Meeting Postponed: నదీ జలాల వివాదం, మళ్లీ అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం వాయిదా, రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కృష్ణా, గోదావరి బోర్డులకు లేఖ రాసిన కేంద్ర జలశక్తి శాఖ

Hazarath Reddy

కృష్ణా, గోదావరి నదీ జల వివాదాలకు (water sharing issues) సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర జలశాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ అధ్యక్షతన ఈ నెల 25న నిర్వహించాల్సిన అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం వాయిదా (Apex Council Meeting Postponed) పడింది. ఈమేరకు కేంద్ర జలశక్తి శాఖ అధికారికంగా ప్రకటించింది. దీనిపై రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కేంద్ర జల సంఘం, కృష్ణా, గోదావరి బోర్డులకు కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి ఏసీ మల్లిక్‌ లేఖలు రాశారు.

Interstate Travel Row: తెలంగాణ నుంచి ఏపీకి బస్సులు, త్వరలో రెండు రాష్ట్రాల ఆర్టీసీ అధికారుల సమావేశం, అధికారులకు తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక సూచనలు..

Hazarath Reddy

మరికొద్ది రోజుల్లో అన్‌లాక్ 3 ముగియనుండటంతో కేంద్రం అంతరాష్ట్ర సర్వీసులపై (Interstate Travel) కీలక ఆదేశాలు జారీ చేసిన సంగతి విదితమే. అన్‌లాక్ సీజన్ లో భాగంగా, ఏ రాష్ట్రాల మధ్య కూడా ప్రయాణికులకు ఆటంకాలు కల్పించవద్దని, ఎవరు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించేందుకు వీలు కల్పించాలని కేంద్రం ఆదేశించింది. ఇందులొ భాగంగా తెలుగు రాష్ట్రాల (Telugu States) మధ్య బస్సులను తిరిగి పునరుద్దరించేందుకు ఏపీఎస్ ఆర్టీసీ, టీఎస్ ఆర్టీసీ (APSRTC And TSRTC) అధికారుల మధ్య త్వరలో హైదరాబాద్‌లో చర్చలు (Interstate-travel discussions) జరుగనున్నాయని వార్తలు వస్తున్నాయి.

COVID19 in AP: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మరో 7,895 పాజిటివ్ కేసులు నమోదు, రాష్ట్రంలో 3,53,111కు చేరిన మొత్తం కొవిడ్ బాధితుల సంఖ్య, 3282కు పెరిగిన కరోనా మరణాలు

Team Latestly

నిన్నటి నుండి ఈరోజు వరకు మరో 7,449 మంది బాధితులు కొవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇలా ఇప్పటివరకు 2,60,087 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 89,742 ఆక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ...

COVID19 in AP: ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి 10 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు, రాష్ట్రంలో 3,45,216కు చేరిన మొత్తం కొవిడ్ బాధితుల సంఖ్య, 3189కి పెరిగిన కరోనా మరణాలు

Team Latestly

రో 8,593 మంది బాధితులు కొవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇలా ఇప్పటివరకు 2,52,638 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 89,389 ఆక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ...

Advertisement

AP Coronavirus: కోవిడ్‌-19 పై సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్ష, ఏపీలో కొత్తగా 9,544 మందికి కరోనా, 91 మంది మృతి, రాష్ట్రంలో 3,34,940కు చేరిన కోవిడ్-19 కేసుల సంఖ్య

Hazarath Reddy

ఏపీలో గడచిన 24 గంటల్లో 9,544 పాజిటివ్ కేసులు (AP Coronavirus) వెల్లడి కాగా, అదే సమయంలో 91 మంది వైరస్ మహమ్మారికి బలయ్యారు. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 16 మంది మరణించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 13 మంది, నెల్లూరు జిల్లాలో 12 మంది, తూర్పు గోదావరి జిల్లాలో 11 మంది మృతి (Coronavirus Deaths) చెందారు. రాష్ట్రంలో ఇప్పటిరకు కరోనాతో కన్నుమూసిన వారి సంఖ్య 3,092కి పెరిగింది. కాగా, చిత్తూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో తాజాగా వెయ్యికి పైగా పాజిటివ్ కేసులు గుర్తించారు.

Chittoor Ammonia Gas Leakage: చిత్తూరు పాల డెయిరీలో గ్యాస్ లీకేజి, 14 మందికి అస్వస్థత, అమ్మోనియం గ్యాస్‌ లీక్‌ కావడంతో ఘటన, బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Hazarath Reddy

ఏపీలోని చిత్తూరు జిల్లాలోని పూతలపట్టు మండలంలో గురువారం రాత్రి అమ్మోనియం గ్యాస్‌ లీక్‌ (Chittoor Ammonia Gas Leakage) కావడంతో 20మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో 100మందికి పైగా కార్మికులు ఉండగా వారిలో 14మంది మహిళా కార్మికులు ఆస్పత్రి పాలయ్యారు. పూతలపట్టు మండలం బండపల్లి (Bandapalli village) హట్సన్‌ పాల డెయిరీలో ఈ సంఘటన చోటుచేసుకుంది. పాలు కోల్డ్‌ స్టోరేజ్‌ కోసం అ‍మ్మోనియం వాయువును ఉపయోగిస్తుంటారు. ఆ వాయువు లీక్‌ కావడంతో 14మంది అస్వస్థతకు గురైయ్యారు. వెంటనే ఫ్యాక్టరీ నిర్వాహకులు చిత్తూరు, గుడిపాల ఆస్పత్రులకు తరలించారు. ఇద్దరు అపస్మారక స్థితిలో ఉన్నారు.

Swarna Palace Fire: పరారీలో రమేష్ ఆస్పత్రి డైరెక్టర్, ఆచూకి తెలిపిన వారికి రూ. లక్ష రివార్డు ప్రకటించిన విజయవాడ నగరపోలీసు కమిషనర్‌, రంగంలోకి దిగిన ఎనిమిది ప్రత్యేక బృందాలు

Hazarath Reddy

విజయవాడ స్వర్ణ ప్యాలెస్‌ హోటల్‌లో అగ్ని ప్రమాదం (Swarna Palace Fire) ఘటన జరిగిన తరువాత పరారీలో ఉన్న ఆస్పత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్‌ రమేష్‌బాబు (Dr Pothineni Ramesh Babu), స్వర్ణ ప్యాలెస్ హోటల్ యజమాని ముత్తవరపు శ్రీనివాసరావుల (Mutthavarapu Srinivas Rao) ఆచూకీ తెలిపిన వారికి రూ.లక్ష బహుమతి ఇస్తామని విజయవాడ నగరపోలీసు కమిషనర్‌ బి. శ్రీనివాసులు ప్రకటించారు. పోలీసు కమిషనరేట్‌ కార్యాలయంలో గురువారం మీడియాతో కమిషనర్ మాట్లాడారు.

Srisailam Fire Accident: శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం, మంటల్లోనే చిక్కుక్కున్న పలువురు సిబ్బంది, రక్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్న రెస్క్యూ టీమ్స్

Team Latestly

ప్రమాదం జరిగిన సమయంలో ఘటనాస్థలంలో సుమారు 30 మంది సిబ్బంది ఉన్నట్లు చెబుతున్నారు. వీరిలో 15 మంది అత్యవసర సొరంగ మార్గం ద్వారా బయటకు రాగా, మరో ఆరు మందిని రెస్క్యూ టీమ్ రక్షించింది. మిగతా 9 మంది లోపలే చిక్కుకుపోయినట్లు సమాచారం....

Advertisement
Advertisement