ఆంధ్ర ప్రదేశ్
COVID19 in AP: ఆంధ్రప్రదేశ్‌లో మరో 9,276 పాజిటివ్ కేసులు నమోదు, రాష్ట్రంలో 1 లక్షా 50 వేలు దాటిన కొవిడ్ బాధితుల సంఖ్య, గత 24 గంటల్లో 12 వేలకు పైగానే డిశ్చార్జ్
Team Latestlyనిన్నటి నుండి ఈరోజు వరకు అత్యధికంగా 12,750 మంది బాధితులు కొవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇలా ఇప్పటివరకు 76,614 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 72,188 ఆక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ...
Vishakhapatnam: విశాఖపట్నంలో ఘోర ప్రమాదం, భారీ క్రేన్ కూలి 10 మంది దుర్మరణం, అవసరమైన తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన సీఎం వైఎస్ జగన్
Team Latestlyఈ ఘోర ప్రమాదంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరా తీశారు. ప్రమాద ఘటన వివరాలను అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అవసరమయ్యే తక్షణ చర్యలు తీసుకోవాలని విశాఖపట్నం జిల్లా కలెక్టర్‌, విశాఖ నగర పోలీస్‌ కమిషనర్‌ను సీఎం జగన్ ఆదేశించారు...
Rain Alert in Telugu States: తెలుగు రాష్ట్రాలకు 3 రోజుల పాటు భారీ వర్ష సూచన, ఆగస్టు 4న‌ అల్పపీడనం ఏర్పడే అవకాశం, వెల్లడించిన వాతావరణ శాఖ
Hazarath Reddyరానున్న‌ మూడు రోజులపాటు రెండు తెలుగు రాష్ట్రాలో ఓ మాదిరి నుంచి భారీ వర్షాలు (Rain Alert in Telugu States) కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. వచ్చే మూడు రోజులపాటు తెలంగాణ రాష్ట్రంలో (Telangana) వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరఠ్వాడా నుంచి ఉత్తర తమిళనాడు వరకు ఇంటీరియర్ కర్ణాటక మీదుగా 1.5 కిలోమీటర్ల ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి ఏర్పడిందని వాతావ‌ర‌ణ కేంద్రం అధికారులు వెల్ల‌డించారు.
AP Coronavirus Update: ఆ ఏడు జిల్లాల్లోనే 90 వేలకు పైగా కేసులు, ఏపీలో మరో 10376 కొత్త కేసులు, రాష్ట్ర వ్యాప్తంగా 1,38,038కి చేరిన కోవిడ్-19 పాజిటివ్ కేసుల సంఖ్య, 1,349కి పెరిగిన మృతుల సంఖ్య
Hazarath Reddyఏపీలోని 13 జిల్లాలకు గానూ ఏడు జిల్లాల్లోనే 90 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. జిల్లాల వారీగా చూస్తే.. అనంతపురంలో ఇప్పటిదాకా 14,699 కేసులు నమోదయ్యాయి. చిత్తూరులో ఇప్పటిదాకా 10,379 కేసులు నమోదయ్యాయి. ఈస్ట్ గోదావరిలో ఇప్పటిదాకా 20,395 కేసులు నమోదయ్యాయి. గుంటూరులో ఇప్పటిదాకా 14,669 కేసులు నమోదయ్యాయి. కర్నూలులో ఇప్పటిదాకా 16,847 కేసులు నమోదయ్యాయి.విశాఖపట్నంలో ఇప్పటిదాకా 10,765 కేసులు నమోదయ్యాయి. వెస్ట్ గోదావరిలో ఇప్పటిదాకా 12,310 కేసులు నమోదయ్యాయి
Nimmagadda Ramesh Kumar: వివాదాల నడుమ ఏపీ ఎస్ఈసీగా మళ్లీ నిమ్మగడ్డ నియామకం, అర్థరాత్రి ఉత్తర్వులు ఇచ్చిన ఏపీ ప్రభుత్వం, స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌లో వచ్చే తుది తీర్పునకు లోబడి నియామకం
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ను (Nimmagadda Ramesh Kumar) పునర్నియమిస్తూ ఏపీ ప్రభుత్వం (AP Govt) గురువారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఆయనను తిరిగి నియమిస్తున్నట్లు గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ (Governor Biswabhushan Harichandan) పేరుతో ఈ ప్రకటన జారీ చేశారు. ఈ మేరకు రాజపత్రం (గెజిట్‌) విడుదల చేయాలని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఉత్తర్వులు ఇచ్చారు.
AP Decentralisation Bill: మూడు రాజధానులకు సై, రాజధాని వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లుకు ఆమోదం తెలిపిన గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌
Hazarath Reddyఏపీలో శుక్రవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ ప్రభుత్వం ప్రతిపాదించిన రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు (AP Decentralisation Bill) గవర్నర్ బిశ్వభూషణ్ ఆమోదం తెలిపారు. దీంతోపాటుగా సీఆర్డీఏ రద్దు బిల్లును కూడా ఆయన (governor biswabhusan harichandan) ఆమోదించారు. దీంతో.. ఇప్పటివరకూ ఏపీ రాజధానిగా ఉన్న అమరావతి ఇక నుంచి శాసన రాజధానిగా మారనుంది. ఏపీ కార్యనిర్వాహక రాజధానిగా విశాఖపట్నం, న్యాయ రాజధానిగా కర్నూలు మారనున్నాయి. వికేంద్రీకరణ బిల్లును 3 వారాల క్రితం జగన్ సర్కార్ గవర్నర్‌కు పంపింది. ఇప్పుడు.. గవర్నర్ ఆమోదించడంతో మూడు రాజధానులకు లైన్ క్లియర్ అయినట్టయింది.
Vidya Varadhi Mobile Vehicles: ఏపీలో సరికొత్త పథకం, విద్యా వారధి మొబైల్‌ వాహనాలను ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం, ప్రతి జిల్లాలోని విద్యార్థులకు వీటి ద్వారా సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన
Hazarath Reddyఏపీ రాష్ట్ర వ్యాప్తంగా విద్యా వారధి మొబైల్‌ వాహనాలు (Vidya Varadhi Mobile Vehicles) అందుబాలోకి తీసుకు వచ్చినట్లు ఆంధ్రప్రదేశ్‌ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ పేర్కొన్నారు. విద్యా వారధి మొబైల్‌ వాహనాలను మంత్రి సురేష్‌ (Education Minister Adimulapu Suresh) శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా సమయంలో విద్యకు దూరంగా ఉండకూడదు అనే ఉద్దేశ్యంతో సప్తగిరి ఛానెల్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు.
RS 5000 to Plasma Donors: ప్లాస్మా ఇస్తే రూ.5వేల ప్రోత్సాహక నగదు, కీలక నిర్ణయాన్ని ప్రకటించిన ఏపీ సీఎం వైయస్ జగన్‌, ప్రతి ఆస్పత్రిలో బ్లాక్‌ బోర్టులో బెడ్ల వివరాలు ఉండాలని ఆదేశాలు
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. కరోనా వైరస్ బారినపడి కోలుకున్న వారు ప్లాస్మా దానం చేస్తే వారికి రూ.5 వేల ప్రోత్సాహక నగదు (Five Thousand for Plasma Donors) అందజేస్తామని ప్రకటించింది. శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో (CM Office) కరోనా వైరస్ నిర్మూలన, ఆస్పత్రుల్లో వైద్యం, విద్యావ్యవస్థ, నాడు-నేడుపై (AP CM YS Jagan review meeting) ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులతో సమీక్షించారు. ఈ సమీక్షలో ప్లాస్మా థెరపీపై అవగాహన కల్పించాలని సీఎం తెలిపారు. దీనివల్ల మంచి ఫలితాలు ఉంటే ప్రోత్సాహించాలి. ప్లాస్మా ఇచ్చేవారికి 5వేల రూపాయలు ఇవ్వండి. మంచి భోజనం, వారి ఆరోగ్యం కోసం ఈ డబ్బు ఉపయోగపడుతుంది’ అని సీఎం జగన్ తెలిపారు.
Kurichedu Sanitizer Deaths: కురిచేడులో శానిటైజర్ తాగి పది మంది మృతి, విషాద ఘటనపై లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపిన జిల్లా ఎస్పీ సిద్ధార్థ్‌ కౌశల్‌
Hazarath Reddyప్రకాశం జిల్లా కురిచేడులో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. కురిచేడులో శానిటైజర్‌ తాగిన ఘటనలో పది మంది మృతిచెందారు. నిన్న అర్ధరాత్రి ముగ్గరు మరణించగా, శుక్రవారం మరో ఏడు మంది మృతిచెందారు. మృతుల్లో ముగ్గురు భిక్షాటన చేసే వ్యక్తులు కాగా, మరో ఆరుగురు గ్రామస్తులు ఉన్నారు. చనిపోయిన వారిని అనుగొండ శ్రీను బోయ(25), భోగేమ్ తిరుపతయ్య (37), గుంటక రామిరెడ్డి (60), కడియం రమణయ్య (30), కొనగిరి రమణయ్య (65), రాజారెడ్డి (65), బాబు (40), ఛార్లెస్‌ (45), అగస్టీన్‌ (47) గా గుర్తించారు.
English Medium Row: ఇంగ్లీష్ మీడియానికే కట్టుబడి ఉన్నాం, ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే ఏడాది నుంచి ఎల్‌కేజీ,యూకేజీ విద్య అమలు, మీడియాతో ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూల‌పు సురేష్
Hazarath Reddyఇప్పటికీ ఇంగ్లీషు మీడియం స్కూళ్లకే కట్టుబడి ఉన్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ (Education Minister Adimulapu Suresh) స్పష్టంచేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యావిధానంపై (National Education Policy (NEP) ఆయన స్పందించారు. గురువారం రాష్ట్ర ఉన్నత విద్యామండలిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎస్‌సీఈఆర్‌టీ (SCERT) మార్గదర్శకాలను పరిగణనలోనికి తీసుకొనే తాము విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి అభిప్రాయాలు తీసుకున్నామని చెప్పారు. 97శాతం మంది తల్లిదండ్రులు ఇంగ్లీషు మీడియం (English Medium) కావాలన్నాన్నారు.
BJP on AP Capital: రాజధానిని మార్చుకోండి, కేంద్రం రాజధాని మార్పు విషయంలో జోక్యం చేసుకోదని తెలిపిన ఏపీ బీజీపీ అధ్యక్షుడు సోము వీర్రాజు
Hazarath Reddyఏపీ రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోదని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు (BJP AP President Somu Veerraju) స్పష్టం చేశారు. దేశంలో అనేక చోట్ల రాజధానులు (Capitals) ఏర్పాటు చేస్తున్నారని, ఆయా రాష్ట్ర ప్రభుత్వాల (State Govt)నిర్ణయంలో కేంద్రం ఎప్పుడూ జోక్యం చేసుకోలేదని గుర్తుచేశారు. రాజధాని పేరుతో సింగపూరు, జపాన్, చైనా అంటూ గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandra Babu Naidu) ప్రజలను మభ్యపెడుతూ.. కథలు చెప్పారని విమర్శించారు. గురువారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సోము వీర్రాజు మాట్లాడారు.
Water War: కృష్ణా, గోదావరి నదీ జలాల్లో చుక్క నీటిని కూడా వదులుకోం! నదీ జలాల వాటాలపై సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్ష, తెలంగాణ వాదనను బలంగా వినిపించాలని తీర్మానం
Team Latestlyఉమ్మడి రాష్ట్రంలో తీవ్రంగా నష్టపోయిన మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలకు సాగునీరందించేందుకు నిర్మిస్తున్న పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చి పూర్తి చేసి తీరాలని, అవాంతరాల్ని లెక్క చేయకుండా ముందుకు సాగాలని సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించించింది....
COVID19 in AP: ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి 10 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు, రాష్ట్రంలో 1 లక్షా 30 వేలు దాటిన కొవిడ్ బాధితుల సంఖ్య, గత 24 గంటల్లో 70 వేలకు పైగానే టెస్టుల నిర్వహణ
Team Latestlyగడిచిన ఒక్కరోజులో భారీ స్థాయిలో 70, 068 మంది శాంపుల్స్ పరీక్షించినట్లు తెలిపింది. ఈరోజు వరకు 18,90,077 మందికి వైరస్ నిర్ధారణ పరీక్షలు జరిపినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది....
Krishna Water Tussle: ఏపీ- టీఎస్ నీటి పంచాయితీలో మరో మలుపు, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంను నిలిపివేయాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు ఆదేశాలు
Team Latestlyశ్రీశైలం ప్రాజెక్టు నుంచి కృష్ణా నీటిని అక్రమంగా మళ్లించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం పునర్విభజన చట్టానికి విరుద్దమైందని చెబుతూ కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది.....
Kollu Ravindra's Bail Petition: కొల్లు రవీంద్ర బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసిన కోర్టు, బయటికి వస్తే కేసును ప్రభావితం చేసే అవకాశం ఉందని వాదించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్, ఏకీభవించిన ధర్మాసనం
Hazarath Reddyవైఎస్సార్‌సీపీ సీనీయర్‌ నాయకుడు, మచిలీపట్నం మార్కెట్‌ యార్డు మాజీ చైర్మన్‌ మోకా భాస్కరరావు హత్య కేసులో నిందితుడు అయిన మాజీ మంత్రి, టీడీపీ నేత కొల్లు రవీంద్రకు జిల్లా కోర్టులో చుక్కెదురైంది. కొల్లు రవీంద్ర బెయిల్‌ పిటిషన్‌ను (Kollu Ravindra's Bail Petition) జిల్లా కోర్టు గురువారం కొట్టేసింది. ఆయన బయటికి వస్తే కేసును ప్రభావితం చేసే అవకాశం ఉందన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్(పీపీ) వాదనతో న్యాయమూర్తి ఏకీభవించారు. అతనికి బెయిల్‌ ఇవ్వరాదని తేల్చి చెప్పారు. కొల్లు రవీంద్రతో పాటు మిగతా నిందితులకు కూడా కూడా కోర్టు బెయిల్‌ (Kollu Ravindra bail petition dismissed) నిరాకరించింది.
Vizag Central Prison: విశాఖ సెంట్రల్‌ జైల్లో కరోనా కలకలం, మొద్దు శీను హంతకుడికి కరోనా పాజిటివ్, ఆయనతో పాటు 10 మంది సిబ్బంది, 27 మంది జీవితఖైదీలకు కోవిడ్-19 పాజిటివ్
Hazarath Reddyఏపీలోని విశాఖ సెంట్రల్‌ జైల్లో (Visakhapatnam Central Prison) కరోనా వైరస్‌ కలకలం రేపింది. కారాగారంలోని 10 మంది సిబ్బంది, 27 మంది జీవితఖైదీలకు తాజాగా నిర్వహించిన పరీక్షల్లో పాజిటివ్‌గా తేలింది. మాజీమంత్రి, టీడీపీ నేత పరిటాల రవీంద్ర హత్య కేసులో ప్రధాన నిందితుడైన మొద్దు శ్రీనును హత్య చేసి ఓం ప్రకాశ్‌కు (Mallela Om Prakash) కూడా పాజిటివ్‌గా తేలింది.
Apex Council Meeting: జల వివాదం, ఆగస్టు 5న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ, అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశాన్ని ఏర్పాటు చేసిన కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌
Hazarath Reddyతెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో (Telugu States CMs) అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశాన్ని (Apex Council Meeting) నిర్వహించేందుకు ముహూర్తం ఖరారైంది. వచ్చేనెల ఐదున వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఈ సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర జల్‌శక్తిశాఖ కార్యదర్శి యూపీ సింగ్‌ (water resources secretary UP Singh) బుధవారం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులకు లేఖ రాశారు.
AP Coronavirus Report: ఒక్కరోజే 10,093 కరోనా కేసులు, రాష్ట్రంలో 1,20,390కి చేరిన కోవిడ్-19 కేసులు, రోజు రోజుకు పెరుగుతున్న డిశ్చార్జ్ కేసుల సంఖ్య, రికార్డు స్థాయిలో కరోనా పరీక్షలు
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నడు లేని విధంగా ఈ రోజు 10 వేలకు పైగా కేసులు (AP Coronavirus Cases) నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 70,584 మందికి కరోనా పరీక్షలు చేశారు. ఈ పరీక్షల్లో 10,093 మందికి వైరస్ నిర్ధారణ అయింది. దీంతో ఏపీలో కరోనా కేసుల సంఖ్య 1,20,390కి చేరింది. ఈరోజు 2,784 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 55,406 మంది కరోనాను జయించి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 63,771 యాక్టివ్ కేసులున్నాయి. నేటి వరకు రాష్ట్రంలో 18,20,009 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.
AP News Bulletin: ప్రాణ హాని ఉందని కేంద్రానికి ఎంపీ రఘురామకృష్ణంరాజు లేఖ, ప్రపంచ పులుల దినోత్సవం సంధర్భంగా అటవీ శాఖ అధికారులకు సీఎం జగన్ అభినందనలు, మరిన్ని వార్తా విశేషాలు లోపల కథనంలో..
Hazarath Reddyఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ చికిత్సల కోసం తాత్కాలిక ప్రాతిపదికన వైద్యులను నియమించుకోవాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. వైద్య నిపుణులకు నెలకు రూ. 1.5లక్షల గౌరవ వేతనం, జనరల్ డ్యూటీ డాక్టర్లకు నెలకు రూ. 70 వేల చొప్పున చెల్లించనున్నారు. ఈ మేరకు కోవిడ్‌ నియంత్రణ చర్యల్లో భాగంగా వచ్చే ఆరు నెలలపాటు వారి సేవల్ని వినియోగించుకునేలా ఒప్పందం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Heavy Rains Alert in AP: రానున్న మూడు రోజులు ఏపీలో భారీ వర్షాలు, పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతాలలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం, వెల్లడించిన అమరావతి వాతావరణ కేంద్రం
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌లో రాగల మూడు రోజులు మోస్తారు నుంచి భారీ వర్షాలు (అమరావతి వాతావరణ కేంద్రం) కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాగల మూడు రోజులు రాష్ట్రంలో ప్రాంతాల వారీగా వాతావరణ స్థితిగతులు ఎలా ఉంటాయనే దానిపై వాతావరణ కేంద్రం (Meteorological Center) ప్రకటన విడుదల చేసింది. నైరుతి బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం (West Central Bay of Bengal) ప్రాంతాలలో దక్షిణ కోస్తా ఆంధ్ర, ఉత్తర తమిళనాడులకు 5.8 కిమీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.