ఆంధ్ర ప్రదేశ్

AP Cabinet: రోడ్లు భవనాల శాఖ మంత్రిగా శంకర్‌ నారాయణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, బాధ్యతలు చేపట్టిన ఇద్దరు మంత్రులు

Hazarath Reddy

ఏపీలో కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకున్న ముంత్రులకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి (AP CM YS Jagan) బాధ్యతలను అప్పజెప్పారు. ఇందులో భాగంగా మంత్రి శంకర్‌ నారాయణ (Malagundla Sankaranarayana) బుధవారం రోడ్లు, భవనాలశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ (Chellaboina venugopal krishna) రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ నూతన మంత్రులుగా సీదిరి అప్పలరాజు (Sidiri Appalaraju), చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ప్రమాణ స్వీకారం చేశారు.

Atchannaidu Bail Petition: అచ్చెన్నాయుడు బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసిన ఏపీ హైకోర్టు, మిగిలినవారి బెయిల్ పిటిషన్లు కొట్టివేత, ఈఎస్‌ఐ కుంభకోణంలో అరెస్టయిన మాజీ మంత్రి

Hazarath Reddy

ఈఎస్‌ఐ కుంభకోణంలో అరెస్టయిన టీడీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకి ఏపీ హైకోర్టులో మరోసారి చుక్కెదురైంది. ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌ను (TDP leader Atchannaidu Bail Petition) హైకోర్టు కొట్టివేసింది. ఈ పిటిషన్‌తో పాటు మిగిలినవారి బెయిల్ పిటిషన్లను కోర్టు (AP High Court Rejects) కొట్టివేసింది. కార్మిక మంత్రిగా పనిచేసిన సమయంలో అచ్చెన్నాయుడు (Atchannaidu) అవకతవకలకు పాల్పడినట్లు అభియోగాలు నమోదైన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయనను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించారు. ప్రస్తుతం ఆయన గుంటూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

AP Capital Shifting Row: రాజధాని తరలింపులో కీలక ట్వీస్టు, రంగంలోకి సచివాలయ ఉద్యోగులు, అమరావతి పరిరక్షణ సమితి అన్నీ అబద్దాలు చెప్పిందంటూ హైకోర్టులో అనుబంధ పిటిషన్‌

Hazarath Reddy

ఏపీ మూడు రాజధానుల వ్యవహారంలో కీలక మలుపులు (ap three capitals Row) చోటు చేసుకుంటున్నాయి. తాజాగా అమరావతి నుంచి విశాఖపట్నంకు పరిపాలనా రాజధాని తరలింపు వ్యవహారంలో ట్విస్టు (AP Capital Shifting Row) చోటు చేసుకుంది. మూడు రాజధానులు, విశాఖకు రాజధాని తరలింపు అంశాలపై కోర్టులో విచారణ జరుగుతుండగా, మంగళవారం అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి హైకోర్టులో (AP High Court) ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం (AP Secretariat employees Union) ఇంప్లీడ్‌ పిటిషన్‌ను వేశారు.

COVID-19 Cases in AP: ఒక్కరోజే 3,064 మంది డిశ్చార్జ్, ఏపీలో 24 గంటల్లో 7,948 మందికి కోవిడ్-19 పాజిటివ్, రాష్ట్ర వ్యాప్తంగా 1,10,297కు చేరుకున్న కరోనా కేసులు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 62,979 శాంపిల్స్ పరీక్షించగా.. 7,948 మందికి పాజిటివ్ వచ్చిందని (COVID-19 Cases in AP) ఆరోగ్య శాఖ బులిటెన్‌లో వెల్లడించింది. తూర్పుగోదావరి జిల్లాలో (New corona positive cases) 1367 మందికి, కర్నూలు జిల్లాలో 1146 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. తాజాగా నమోదైన కేసులతో ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో మొత్తం క‌రోనావైరస్ బారినపడిన వారి సంఖ్య 1,10,297కి (AP Corona Positive Cases) చేరింది. అందులో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 2,461 మంది, విదేశాల నుంచి తిరిగి వ‌చ్చిన వారు 434 మంది ఉన్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో 52,622 మంది క‌రోనా నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 56,527 మంది రాష్ట్రంలోని వేర్వేరు ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు.

Advertisement

CM Jagan Video Conference: తప్పుడు లెక్కలు అవసరం లేదు, లక్ష కేసుల్లో సగం మందికి పైగా డిశ్చార్జ్ అయ్యారు, వ్యాక్సిన్‌ వచ్చేంతవరకూ ఎదురు చూద్దాం, కలెక్టర్లతో ఏపీ సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్

Hazarath Reddy

కరోనా నివారణ చర్యలు, జిల్లాల్లో పరిస్థితిపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ వీడియో కాన్ఫరెన్స్ (AP CM YS Jagan Video Conference) ద్వారా కలెక్టర్లతో స్పందన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్రంలో కేసులు (AP Coronavirus) లక్ష దాటాయని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అందులో సగం మందికి పైగా డిశ్చార్జ్ అయ్యారని సీఎం తెలిపారు. కింది స్థాయి నుంచి పై స్థాయి వరకూ రాష్ట్రంలోని ప్రతి అధికారి సీరియస్‌గా పనిచేస్తున్నారని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు.

Somu Veerraju: ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు నియామకం, కన్నా లక్ష్మీనారాయణకు ఉద్వాసన, కీలక నిర్ణయం తీసుకున్న పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణకు (Kanna Lakshmi Narayana) పార్టీ అధిష్టానం ఉద్వాసన పలికింది. ఆయన స్థానంలో అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ సోము వీర్రాజు (Somu Veerraju) నియమించింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (BJP national president, Jagat Prakash Nadda) ఆదేశాల మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి అరుణ్‌ సింగ్‌ సోమవారం ఈ ఉత్తర్వులు జారీ చేశారు.

AP Corona Bulletin: ఏపీలో లక్ష దాటిన కరోనా కేసులు, తూర్పు గోదావరిలో ఆగని కోవిడ్-19 కల్లోలం, ఏపీలో 1,090కు చేరిన మృతుల సంఖ్య, కర్ణాటకలో లక్ష దాటిన కరోనా కేసులు

Hazarath Reddy

ఏపీలో గత 24 గంటల్లో 6,051 కొత్త కేసులు (AP Corona Bulletin) నమోదయ్యాయి, సోమవారం నమోదైన కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య లక్ష (Coronavirus positive cases) దాటింది. మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ తర్వాత లక్ష కేసులు నమోదు చేసిన రాష్ట్రంగా ఏపీ రికార్డు సృష్టించింది. ఈ రోజు 43,127 మందికి కరోనా టెస్టులు చేశారు. ఈ టెస్టుల్లో 6,051 మంది కొవిడ్- 19 పాజిటివ్ నిర్ధారించారు. ఈ కేసులతో కలిపి 1,02,349కి కరోనా కేసులు చేరాయి. ప్రస్తుతం ఏపీలో 51,701 యాక్టివ్‌ కేసులున్నాయి.

Rayalaseema Lift Irrigation Project: రూ.3278.18 కోట్లతో 30 నెలల్లో పనులు పూర్తి చేయాలి, రాయలసీమ ఎత్తిపోతల పథకం టెండర్‌కు ఏపీ ప్రభుత్వం పిలుపు

Hazarath Reddy

రాయలసీమ ఎత్తిపోతల పథకం టెండర్‌కు (Rayalaseema Lift Irrigation Project Tenders) ఏపీ ప్రభుత్వం పిలుపు నిచ్చింది. ఈ రోజు(సోమవారం) నుంచి టెండర్లు స్వీకరించేందుకు వైయస్ జగన్ ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారి చేసింది. జ్యూడిషియల్‌ పర్వ్యూ అనుమతితో టెండర్లకు నోటిఫికేషన్‌ విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. ఈపీసీ విధానంలో 3278.18 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 30 నెలల్లో పనులు పూర్తి చేసేలా టెండర్లను ఆహ్వానించినట్లు అధికారులకు వెల్లడించారు.

Advertisement

Woman Fraudulent Marriages: నిత్య పెళ్లికూతురు బాగోతం బట్టబయలు, పోలీసులను ఆశ్రయించిన మూడో భర్త, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ప్రకాశం జిల్లా పోలీసులు

Hazarath Reddy

ఏపీలో ప్రకాశం జిల్లాలోని దొనకొండలో ఓ నిత్య పెళ్లి కూతురు బాగోతం (Woman Fraudulent Marriages) బట్టబయలైంది. జీవితంలో సెటిల్ అయిన అబ్బాయిలను మాట్రిమోనిలో చూడడం.. పెళ్లి చేసుకుని కొంతకాలం కాపురం చేయడం, ఆ తర్వాత సెటిల్ చేసుకోవడం ఈ నిత్య పెళ్లి కూతురుకి (fraudulent marriages) వెన్నతో పెట్టిన విద్య. కాదని ఎవరైనా అడ్డం తిరిగితే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసి బెదిరించి సెటిల్ మెంట్ చేసుకుంటూ ఉంటుంది. ఇప్పుడు మూడో భర్త ఫిర్యాదుతో ఆమె బాగోతం బట్టబయలైంది.

Rapid Antigen Tests in AP: కరోనా టెస్టులపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం, ర్యాపిడ్‌ ఆంటీజన్‌ టెస్టుకి రూ.750 మించి వసూలు చేస్తే కఠిన చర్యలు, ఐసీఎంఆర్‌ అనుమతించిన ల్యాబ్‌లలో కోవిడ్ టెస్టులు

Hazarath Reddy

ఏపీలో కోవిడ్-19 విజృంభిస్తోంది. ఈ క్రమంలో ప్రైవేట్‌ ల్యాబ్‌ల్లో కరోనా వైద్య పరీక్షల నిర్వహణపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ర్యాపిడ్‌ ఆంటీజన్ టెస్టులకు (Rapid Antigen Test in AP) ప్రభుత్వ అనుమతి తప్పనిసరి చేసింది. ఈ మేరకు ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. ఐసీఎంఆర్‌ (ICMR) అనుమతించిన ల్యాబ్‌లలో కోవిడ్ టెస్టులు జరపాలని, ర్యాపిడ్‌ ఆంటీజన్‌ టెస్టుకి రూ.750 మించి వసూలు చేయొద్దని ప్రభుత్వం (AP Govt) ఆదేశించింది. ఆ నమూనాని విఆర్‌డిఎల్ పరీక్షకు పంపితే రూ.2800 మించి వసూలు చేయొద్దని ఉత్తర్వుల్లో పేర్కొంది.

Child Trafficking Case: విశాఖలో చిన్న పిల్లల అక్రమ రవాణా గుట్టు రట్టు, కీలక సూత్రధారి పచ్చిపాల నమ్రతతో పాటు మరో ఆరుగురు ఆరెస్ట్, కేసు వివరాలను వెల్లడించిన సీపీ ఆర్కే మీనా

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం కేంద్రంగా పసికందులను విక్రయిస్తున్న ఆస్పత్రి గుట్టును (Child trafficking racket in Vizag) విశాఖ నగర పోలీసులు రట్టు చేశారు. ఈ కేసులో కీలక సూత్రధారి, ప్రధాన నిందితురాలు డాక్టర్‌ పచ్చిపాల నమ్రతతో పాటు మరో ఆరుగురిని అరెస్ట్‌ చేశారు. సెల్ఫోన్ సిగ్నల్ ఆధారంగా కర్ణాటక రాష్ట్రం దావణగిరి ప్రాంతంలో డాక్టర్‌ నమ్రతను అదుపులోకి తీసుకున్నారు. నిందితులను ఇవాళ సాయంత్రం విశాఖ కోర్టులో హాజరు పరచనున్నారు. అలాగే నిందితుల‌ కస్టడీ కోసం పోలీసులు పిటిషన్ దాఖలు చేయనున్నారు. దీనిపై పోలీసులు కూపి లాగితే దిమ్మతిరిగే నిజాలు తెలిసాయి.

COVID19 in AP: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మరో 7,627 పాజిటివ్ కేసులు నమోదు, రాష్ట్రంలో 90 వేలు దాటిన కొవిడ్ బాధితుల సంఖ్య, వెయ్యి దాటిన కరోనా మరణాలు

Team Latestly

ఇటీవల కాలంగా రాష్ట్రంలో 50కి పైబడి కరోనా మరణాలు నమోదవడం ఆందోళన కలిగిస్తుంది. గడిచిన ఒక్కరోజులోనే కూడా మరో 56 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. తాజా మరణాలతో ఏపీలో కొవిడ్ మృతుల సంఖ్య 1041 కు పెరిగింది....

Advertisement

COVID19 in India: భారత్‌లో 14 లక్షలకు చేరువైన కొవిడ్ బాధితుల సంఖ్య, గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా భారీగా 48,661 కేసులు నమోదు, 32 వేలు దాటిన కరోనా మరణాలు

Team Latestly

దక్షిణ భారతదేశం నుంచి కొత్తగా వచ్చే పాజిటివ్ కేసుల సంఖ్యలో గణనీయమైన పెరుగుదల కనిపిస్తుంది. తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలు శనివారం వేల సంఖ్యలో కొవిడ్19 కేసులను నివేదించాయి....

COVID19 in AP: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మరో 7,813 పాజిటివ్ కేసులు నమోదు, ఒక్కరోజులోనే మరో 52 మంది మృతి, రాష్ట్రంలో 90 వేలకు చేరువైన కొవిడ్ బాధితుల సంఖ్య

Team Latestly

వైరస్ నిర్ధారణ పరీక్షల్లో ముందున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గడిచిన ఒక్కరోజులో కూడా భారీ స్థాయిలో 56,681 మంది శాంపుల్స్ పరీక్షించినట్లు తెలిపింది. ఈరోజు వరకు సుమారుగా 16 లక్షల మందికి వైరస్ నిర్ధారణ పరీక్షలు జరిపినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది....

Coronavirus In South India: సౌత్ ఇండియాలో కరోనా కల్లోలం, మూడు రాష్ట్రాల్లో రోజు రోజుకు రికార్డు స్థాయిలో నమోదవుతున్న కోవిడ్-19 కేసులు

Hazarath Reddy

భారతదేశంలో కరోనావైరస్ కేసులు ( COVID-19 Pandemic India) అంతకంతకూ పెరుగుతున్నాయి. నిన్న మొన్నటి వరకు సౌత్ ఇండియాలో (Coronavirus In South India)తక్కువ స్థాయిలో కేసులు నమోదు కాగా ఇప్పుడు భారీ స్థాయిలో నమోదవుతున్నాయి. తమిళనాడు (Tamil Nadu), ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh), కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో కోవిడ్ 19 కేసులు రోజు రొజుకు రికార్డు స్థాయిలో నమోదువుతున్నాయి. గత మూడు రోజుల నుంచి ఈ కేసులు (Coronavirus) భారీ స్థాయిలో బయటపడుతున్నాయి.

AP Coronavirus Report: భయపెడుతున్న తూర్పుగోదావరి, మొత్తం 11 వేలకు పైగా కోవిడ్-19 కేసులు నమోదు, ఏపీలో తాజాగా 8,147 పాజిటివ్‌ కేసులు నమోదు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 48,114 కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేయగా 8,147 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 2,380 మంది కరోనా నుంచి సంపూర్ణంగా కోలుకుని డిశ్చార్జ్ అయినట్లు వెల్లడించింది. కరోనా కారణంగా 49 మంది మృతిచెందారు. తూర్పుగోదావరిలో 11 మంది, కృష్ణాలో 9 మంది, కర్నూలులో 8 మంది, శ్రీకాకుళంలో ఏడుగురు, పశ్చిమగోదావరిలో ఐదుగురు, గుంటూరులో ముగ్గురు, విశాఖలో ముగ్గురు, చిత్తూరులో ఒకరు, ప్రకాశంలో ఒకరు, విజయనగరంలో ఒకరు కరోనాతో చనిపోయారు.

Advertisement

CM YS Jagan Review Meeting: కరోనా చికిత్సకు వచ్చే 6 నెలల్లో రూ.1000 కోట్లు ఖర్చు, మరణాలు తగ్గించడంపై దృష్టి పెట్టాలని అధికారులకు ఏపీ సీఎం ఆదేశాలు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌పై ఏపీ సీఎం ఫోకస్

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్-19 బాధితుల చికిత్స కోసం వచ్చే 6 నెలల్లో అదనంగా రూ.1000 కోట్లు ఖర్చు చేయాలని ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి (CM YS Jagan Mohan Reddy) తెలిపారు. ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు, ఆరోగ్య సిబ్బంది నియామకాల కోసం వీటిని ఖర్చు చేయాలని సూచించారు. అవసరమైన సిబ్బందిని నియమించుకుని మరణాలు తగ్గిచండంపై దృష్టిపెట్టాలని సీఎం ఆదేశించారు.

Supreme Court on AP SEC Issue: గవర్నర్ ఆదేశాలు అమలు చేయండి, ఏపీ సర్కారును ఆదేశించిన సుప్రీంకోర్టు, నిమ్మగడ్డ కేసులో స్టే ఇచ్చేందుకు నిరాకరణ

Hazarath Reddy

ఏపీ ఎన్నికల అధికారి విషయంలో జగన్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. నిమ్మగడ్డ అంశంలో కోర్టు ధిక్కరణ ప్రొసీడింగ్స్ పై స్టే ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ వేసింది. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. కేసు విచారణ సంధర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. గవర్నర్ లేఖ పంపినా నిమ్మగడ్డకు పోస్టింగ్ ఇవ్వకపోవడమేంటని సీజేఐ ప్రశ్నించింది.

Groom Tests Positive: రేపు పెళ్లి..వరుడికి కరోనా పాజిటివ్, తూర్పుగోదావరి జిల్లా పెళ్లింట్లో కరోనా అలజడి, రెండు కుటుంబాలను భయపెడుతున్న కోవిడ్-19

Hazarath Reddy

తూర్పుగోదావరి జిల్లాలోని (East Godavari district) కొత్తపేటలోని ఓ కుటుంబం పెళ్లింట్లో కరోనా కలకలం సృష్టించింది. ఇరవై నాలుగు గంటల్లో వివాహం (Andhra couple's weddin) జరగనున్న పెళ్లింట్లో పెళ్లి కుమారుడికి కరోనా పాజటివ్‌ (Groom Tests Positive) అని నిర్ధారణ కావడంతో పెళ్లి వాయిదా పడింది. వివరాల్లోకెళితే.. కొత్తపేట గ్రామానికి చెందిన యువకుడికి ఇదే మండల పరిధిలోని బిళ్లకుర్రుకు చెందిన యువతికి వివాహం నిశ్చయమైంది. ఈ నెల 24న వివాహానికి ముహూర్తం నిర్ణయించారు.

Rains In Telugu States: తెలుగు రాష్ట్రాలను ముంచెత్తిన వానలు, ఉపరితల ద్రోణికి నైరుతి రుతుపవనాలు తోడు, రానున్న రెండు రోజుల పాటు కుండపోత వర్షాలు కురిసే అవకాశం

Hazarath Reddy

చత్తీస్‌ఘఢ్‌ నుంచి తెలంగాణ, కోస్తాంధ్ర మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి ఏర్పడింది. దీనికి నైరుతి రుతుపవనాల ప్రభావం (Southwest Monsoon) కూడా తోడయింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో (Rains In Telugu States) కుండపోతగా వానలు కురుస్తున్నాయి. గురువారం కోస్తా జిల్లాల్లో ఆకాశం మేఘావృతమైంది. రాయలసీమ, ఉత్తరాంధ్ర, దక్షిణకోస్తా జిల్లాల్లో చెదురుమదురు నుంచి ఓ మోస్తరు జల్లులు పడ్డాయి. ఉభయగోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. పశ్చిమగోదావరి జిల్లాలో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో (Telugu States RainFall) గురువారం పలుచోట్ల భారీ నుంచి అతి భారీవర్షాలు కురిశాయి. పలుచోట్ల వాగులు ఉధృతంగా ప్రవహించడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

Advertisement
Advertisement