ఆంధ్ర ప్రదేశ్
Kakinada Shares Case: కాకినాడ షేర్ల కేసు, విజయసాయిరెడ్డితో పాటు మరో ఇద్దరికీ లుకౌట్ సర్క్యులర్ జారీ, రూ. 3600 కోట్ల విలువైన వాటాలను బెదిరించి లాక్కున్నారని ఆరోపించిన కర్నాటి వెంకటేశ్వరరావు
Hazarath Reddyరాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డితో పాటు ఆయన అల్లుడు శరత్‌చంద్రారెడ్డి, వైఎస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కుమారుడు వైవీ విక్రాంత్‌రెడ్డిలపై లుకౌట్ సర్క్యులర్ జారీ అయింది.
Pushpa 2 The Rule: బన్నీ ఫ్యాన్స్ ముసుగులో రెచ్చిపోయిన ఆకతాయిలు, ఆళ్లగడ్డ ప్రతాప్ థియేటర్ లో సినిమా స్క్రీన్ చించివేత, వీడియో ఇదిగో..
Hazarath Reddyఆళ్లగడ్డలో బన్నీ ఫ్యాన్స్ ముసుగులో ఆకతాయిలు రెచ్చిపోయారు. ప్రతాప్ థియేటర్ లో సినిమా స్క్రీన్ చింపేశారు. సినిమా ప్రదర్శింస్థుడగానే రెండవ పాట ఫీలింగ్స్ పాటకు స్క్రీన్ ముందు స్టెప్పులు వేసిన ఫ్యాన్స్. అదే సమయంలో స్క్రీన్ ను చింపేశారు.
Andhra Pradesh: అనంతపురం జిల్లాలో విషాదం, రైలు నుండి దూకి మెడికల్ విద్యార్థిని ఆత్మహత్య, సీటు రాకపోవడంతోనే సూసైడ్ చేసుకున్నట్లుగా వార్తలు
Hazarath Reddyఏపీలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణ శివారులోని రైలు నుండి దూకి డాక్టర్ కావలసిన తనుజ అనే యువతి ఆత్మహత్య చేసుకుంది. కర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గా జిల్లా సేడం పట్టడానికి చెందిన తనుజ అనే వ్యక్తి ఇటీవల డాక్టర్ కోర్స్ కోసం పరీక్షలు రాసింది.
Chalamalasetty Ramesh Babu: వెనక్కి తగ్గిన జనసేన నేత చలమలశెట్టి రమేశ్.. పుష్ప 2 సినిమాపై తాను చేసిన కామెంట్స్ వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటన..వీడియో ఇదిగో
Arun Charagondaపుష్ప-2 సినిమా పై నేను చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపారు కృష్ణా జిల్లా జనసేన నేత చలమలశెట్టి రమేశ్. ఈ మేరకు వీడియో రిలీజ్ చేశారు. అల్లు అర్జున్ పోకడ జనసైనికులు, మెగా అభిమానులకు చాలా బాధను కలిగించిందని... పవన్ కళ్యాణ్, చిరంజీవి, నాగబాబు కాళ్లు కడిగి నెత్తిన నీళ్లు చల్లుకోవాలని లేదంటే పుష్ప 2 సినిమాను అడ్డుకుంటామని హెచ్చరించారు రమేశ్ బాబు.
TTD: తిరుమలలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఆకస్మిక తనిఖీలు, ఆక్రమణలు గుర్తించిన చైర్మన్..నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక
Arun Charagondaటీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ఆకస్మిక తనిఖీ చేపట్టారు. వరాహస్వామి అతిథిగృహం వద్ద దుకాణాలు, హాకర్ లైసెన్సులను పరిశీలించారు. తిరుమల అందాలను చెడగొట్టేలా ఇష్టానుసారం ఆక్రమణలు గుర్తించారు. అనాధికార హాకర్లను వెంటనే తొలగించాలని రెవెన్యూ అధికారులను అదేశింశారు. టీటీడీ నిభందనలకు లోబడి వ్యాపారాలు చేసుకోవాలి, నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
TDP Vs YCP At Pushpa 2 Theatre: తిరుపతిలో టీడీపీ వర్సెస్ వైసీపీ, పుష్ప 2 థియేటర్ వద్ద కొట్టుకున్న ఇరు పార్టీల నేతలు..కర్రలు, రాళ్లతో దాడి వీడియో ఇదిగో
Arun Charagonda'పుష్ప 2' థియేటర్ వద్ద టీడీపీ, వైసీపీ నేతలు కొట్టుకున్నారు. తిరుపతి జిల్లా పాకాలలోని శ్రీరామకృష్ణ థియేటర్ వద్ద 'పుష్ప-2' సినిమాకు సపోర్టుగా వెలిశాయి వైసీపీ నేతల ఫ్లెక్సీలు. బన్నీతో పాటు మాజీ సీఎం జగన్, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. మంచి చేసి మోసపోయిన ఎమ్మెల్యే తాలూకా అంటూ వైసీపీ నేతలు ప్లెక్సీలు ఏర్పాటు చేయగా టీడీపీ నేతలు అభ్యంతరం చెప్పడంతో రాళ్లు, కర్రలు, వేడి నీటితో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.
Andhra Pradesh Horror: దారుణం, క్లాస్ రూమ్‌లోనే ఉపాధ్యాయుడిని కొట్టి చంపిన 9వ తరగతి విద్యార్థులు, యచోటి జిల్లా పరిషత్ ఉర్దూ హైస్కూల్లో ఘటన
Hazarath Reddyఅన్నమయ్య జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. రాయచోటి జిల్లా పరిషత్ ఉర్దూ హైస్కూల్లో పని చేస్తున్న ఏజాస్ అనే ఉపాధ్యాయుడిని 9వ తరగతి విద్యార్థులు క్లాస్ రూమ్ లోనే కొట్టి చంపేశారు. అయితే విద్యార్థులు అల్లరి చేయడంతో ఏజాస్ మందలించారు..
Pushpa 2: The Rule: వీడియో ఇదిగో, విజయవాడలో పుష్ప 2 మేనియా, శైలజ థియేటర్ ముందు టఫాసులు పేలుస్తూ ఫ్యాన్స్ హంగామా
Hazarath Reddyథియేటర్ల వద్ద ఉదయం నుంచే సందడి నెలకొంది. తాజాగా నటుడు అల్లు అర్జున్ అభిమానులు ఈరోజు రాత్రి 'పుష్ప 2: ది రూల్' ప్రీమియర్ షోకి ముందు విజయవాడలోని శైలజ థియేటర్ వెలుపల పటాకులు పేల్చారు.
YS Jagan Slams Chandrababu: చంద్రబాబులాగా బాదుడు భారతదేశ చరిత్రలోనే ఎవ్వరూ చేసి ఉండరు, కూటమి ప్రభుత్వంపై మండిపడిన జగన్
Hazarath Reddyటీడీపీ జనసేన బీజేమీ కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధినేత జగన్ విమర్శలు గుప్పించారు. తాడేపల్లిలో పార్టీ ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, జిల్లాల అధ్యక్షులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Andhra Pradesh: వీడియో ఇదిగో, విశాఖలో అంగన్‌వాడీ టీచర్‌పై యాసిడ్ దాడి, బాధితురాలికి తీవ్ర గాయాలు
Hazarath Reddyవిశాఖపట్నంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. అంగన్‌వాడీ టీచర్‌పై గుర్తు తెలియని వ్యక్తి యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. విశాఖలోని నాలుగో పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలో నేడు దారుణ ఘటన చోటుచేసుకుంది. అంగన్‌వాడీ టీచర్ మున్నీసా బేగంపై గుర్తు తెలియని వ్యక్తి యాసిడ్ దాడి చేశాడు
Pushpa 2: The Rule: ఒళ్లు కొవ్వెక్కి మెగా ఫ్యామిలీకి దూరంగా ఉన్నావు, చిరంజీవి కాళ్ళు కడిగి నెత్తిన చల్లుకో, అల్లు అర్జున్‌పై జనసేన నేత చలమలశెట్టి రమేష్ బాబు తీవ్ర వ్యాఖ్యలు
Hazarath Reddyఅల్లు అర్జున్ మెగా ఫ్యామిలీకి క్షమాపణలు చెప్పకపోతే పుష్ప-2 సినిమాను అడ్డుకుంటామని జనసేన నేత రమేష్ తెలిపారు. మెగా ఫ్యామిలీని యావత్ ప్రపంచమే ఇష్టపడుతుంది. నువ్వు ఒక్కడివే ఒళ్లు కొవ్వెక్కి వారికి వ్యతిరేకంగా ఉంటున్నావని మండిపడ్డారు.
Pushpa 2: The Rule: వీడియో ఇదిగో, పిఠాపురంలో 'పుష్ప 2' పోస్టర్లు చించివేత, పని చేసినవారెవరో విచారించే పనిలో ఉన్న బన్నీ ఫ్యాన్స్
Hazarath Reddyఅల్లు అర్జున్ నటించిన పుష్ప-2 సినిమా రేపు(డిసెంబర్ 5) భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇక పుష్ప-2 సినిమాకు మొదటి నుంచి కూడా వైసీపీ శ్రేణులు మద్దతుగా నిలుస్తున్నాయి. ఇక పిఠాపురంలో 'పుష్ప 2' పోస్టర్లు చించివేత కలకలం రేపింది.
Pushpa 2: The Rule: పుష్ప-2 ఫ్లెక్సీలో వైఎస్ జగన్ ఫోటో, మా కోసం నువ్వు వచ్చావు...మీ కోసం మేము వస్తాం అంటూ అభిమానులు కొటేషన్
Hazarath Reddyఅల్లు అర్జున్ నటించిన పుష్ప-2 సినిమా రేపు(డిసెంబర్ 5) భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇక పుష్ప-2 సినిమాకు మొదటి నుంచి కూడా వైసీపీ శ్రేణులు మద్దతుగా నిలుస్తున్నాయి. తాజాగా సినిమా విడుదల సమయంలో అనంతపురం జిల్లా గుత్తిలో వైసీపీ అభిమానులు భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
Andhra Pradesh: మద్యం తాగవద్దు అన్నందుకు మనస్థాపం చెంది యువకుడు ఆత్మహత్య, తోటలో బాదం చెట్టుకు ఉరివేసుకుని విగతజీవిగా..
Hazarath Reddyమద్యం తాగవద్దు అన్నదానికి మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్న యువకుడు...అన్నమయ్య జిల్లా రౌతు కుంట గ్రామానికి చెందిన రామాంజనేయులు తన సొంత పొలంలో బాదం చెట్టుకు ఉరి వేసుకొని విగత జీవిగా కనిపించాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
TTD: తిరుమలలో ఇస్రో శాస్త్రవేత్తలు..పీఎస్‌ఎల్వీ సీ59 రాకెట్ ప్రయోగం నేపథ్యంలో శ్రీవారి దర్శనం, ప్రత్యేక పూజలు
Arun Charagondaతిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు. శ్రీవారిని సుప్రభాత సేవలో దర్శించుకుంది ఇస్రో టీం. ఇవాళ సాయంత్రం పీఎస్ఎల్వీ సీ59 రాకెట్ ప్రయోగానికి కౌంట్ డౌన్ మొదలుకానున్న నేపథ్యంలో రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలని ముందుగా శ్రీవారి దర్శనం చేసుకున్నారు ఇస్రో సైంటిస్టులు.
Andhra Pradesh: పాత మిద్దె కూలి ముగ్గురి మృతి, మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు..అనంతపురంలో విషాదం
Arun Charagondaఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. అనంతపురం జిల్లా కుందుర్పి మండలం రుద్రంపల్లిలో పాత మిద్దె కూలి ముగ్గురు మృతి చెందారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన గంగన్న, శ్రీదేవి, సంధ్య లుగా గుర్తించారు. దీంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.
Earthquake In Vijayawada: తెలుగు రాష్ట్రాలను వణికించిన భూకంపం, విజయవాడలో భూప్రకంపనలతో ఇళ్ల నుండి బయటకు పరుగులు తీసిన ప్రజలు..సెకన్ల పాటు కంపించిన భూమి..వీడియో
Arun Charagondaతెలుగు రాష్ట్రాల్లో భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఏపీలోని విజయవాడ, జగ్గయ్య పేట, తిరువూరు, గంపలగూడెం పరిసర గ్రామాల్లో పలు సెకన్ల పాటు భూమి కంపించింది. దీంతో ప్రజలు భయంతో ఇంట్లో నుండి బయటకు పరుగులు తీశారు.అలాగే హైదరాబాద్, హనుమకొండ, సిద్దిపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మణుగూరు, గోదావరి ఖని, భూపాలపల్లి, చర్ల, చింతకాని, ములుగు, భద్రాచలం ఏరియాల్లో సైతం భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి.
Andhra Pradesh Horror: గుడివాడలో దారుణం, బ్లేడుతో భర్త పీక కోసి పరారైన భార్య, కుటుంబ కలహాలే కారణమని అనుమానిస్తున్న పోలీసులు
Hazarath Reddyఏపీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ కసాయి భార్య కట్టుకున్న భర్త పీక కోసి అత్యంత కిరాతకంగా హత్య చేసింది. గుడివాడలో 22వ వార్డు రైలు పేటలో ఈ ఘటన చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో భర్త చిన్న(36)ను.. బ్లేడుతో పీక కోసి ఇద్దరు పిల్లలతో భార్య జ్యోతి పరారైంది.
AP Cabinet Meeting Highlights: ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు ఇవిగో, జల్ జీవన్ మిషన్ పథకం ఆలస్యంపై అసంతృప్తి వ్యక్తం చేసిన చంద్రబాబు
Hazarath Reddyముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ క్యాబినెట్ సమావేశం ముగిసింది. పలు రంగాల్లో ప్రభుత్వ విధానాలకు ఈ సమావేశంలో క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఏపీ మారిటైమ్ పాలసీ, టెక్స్ టైల్స్ గార్మెంట్ పాలసీ, ఐటీ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ పాలసీ (4.0)లకు రాష్ట్ర మంత్రివర్గం పచ్చజెండా ఊపింది.