ఆంధ్ర ప్రదేశ్

#AmphanCyclone: పెను తుఫానుగా మారిన అంఫాన్, ఒడిశాకు చేరుకున్న ఎన్డీఆర్‌ఎఫ్‌ దళాలు, రేపు తీరం దాటే అవకాశం, ఒడిశా, బెంగాల్‌కు పొంచి ఉన్న ముప్పు, ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమీక్ష

Hazarath Reddy

పశ్చిమ, మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ‘అంఫాన్‌' తుఫాన్‌ (Cylcone Amphan) మహాతుఫానుగా (super cyclone) మారినట్లు భారత వాతావరణ విభాగం (IMD) తెలిపింది. ఈ తుఫాను తాకిడికి గంటకు 200 కిమీవేగంతో పెనుగాలులు వీస్తున్నాయని ఐఎండీ తెలిపింది. దీని ప్రభావంతో ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హెచ్చరించింది. బుధవారం మధ్యాహ్నానికి ఇది అతి తీవ్ర తుఫాన్‌గా బలహీనపడి, పశ్చిమ బెంగాల్‌లోని దిఘా, బంగ్లాదేశ్‌లోని హతియా దీవుల మధ్య తీరం దాటే అవకాశం ఉందని ఎన్డీఆర్‌ఎఫ్‌ చీఫ్ ఎస్ఎన్ ప్రధాన్ ( NDRF chief SN Pradhan) తెలిపారు.

APSRTC: ఏపీలో రవాణాకు బస్సులు సిద్ధం, ముఖ్యమంత్రి నుంచి ఆదేశాలు రాగానే బస్సు సర్వీసులను ప్రారంభిస్తామని తెలిపిన రవాణా శాఖ మంత్రి పేర్ని నాని, ఏపీలో 2,282కి చేరిన కోవిడ్ 19 కేసులు

Hazarath Reddy

ఏపీలో ప్రజా రవాణాపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నిర్ణయం (AP CM YS Jagan) తీసుకుంటారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పేర్ని నాని (Transport Minister Perni Nani) తెలిపారు. ముఖ్యమంత్రి నుంచి ఆదేశాలు రాగానే కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలకు అనుగుణంగా బస్సు సర్వీసులను పునఃప్రారంభించేందుకు ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. రాష్ట్రాల మధ్య, రాష్ట్రం లోపల బస్సులు నడిపేందుకు అన్ని జాగ్రత్తలతో బస్సులు తిరిగేందుకు ఏర్పాట్లు చేశామని మంత్రి పేర్ని నాని తెలిపారు. లాక్‌డౌన్‌ (Lockdown) నేపథ్యంలో కేంద్ర నిబంధనలు, రాష్ట్రంలో పరిస్థితుల అనుగుణంగా బస్సులు నడుపుతామని తెలిపారు.

Andhra Pradesh: శ్రీవారి దర్శనం ఇప్పట్లో లేనట్లే, ఏపీలో మే 31 వరకు దేవాలయాల్లోకి భక్తులకు నో ఎంట్రీ, ఈ నెల 28న టీటీడీ పాలకమండలి సమావేశం

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని దేవాలయాల్లోకి ఈ నెల 31 వరకు భక్తులకు ప్రవేశముండబోదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల నేపధ్యంలో లాక్ డౌన్ (Lockdown) కాలపరిమితిని మే నెల 31 వ తేదీ వరకు పొడిగించినందున రాష్ట్రంలోని అన్ని దేవాలయాలలో భక్తులకు దర్శనాలను నిలిపివేస్తున్నట్లు దేవాదాయ శాఖా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ రావు (AP minister Vellampalli Srinivas Rao) వెల్లడించారు. అంటే గతంలో ఇచ్చిన ఆదేశాలే అప్పటివరకు అమల్లో ఉంటాయని తెలిపారు.

AP COVID-19 Report: ఏపీని వణికిస్తున్న కోయంబేడు మార్కెట్, కొత్తగా నమోదవుతున్న కేసులన్నీ అక్కడివే, ఏపీలో 2,282కి చేరిన కోవిడ్ 19 కేసుల సంఖ్య

Hazarath Reddy

ఏపీ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 52 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య (AP COvid-19 Report) 2,282కి చేరింది. ఈ వైరస్‌ వల్ల రాష్ట్రంలో (Andhra Pradesh) ఇప్పటివరకు 50 మంది మరణించారు. ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో ప్రస్తుతం 705 యాక్టివ్‌ కేసులు ఉండగా, 1,527 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జి అయ్యారు.

Advertisement

Cyclone Amphan: ఉగ్రరూపం దాల్చిన అంఫాన్ తుఫాన్, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌కు భారీ వర్ష ముప్పు, ఏపీలో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం

Hazarath Reddy

ఆగ్నేయ బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్నఅంఫాన్‌ తుపాన్‌ (Cyclone Amphan) ఉత్తర దిశగా ప్రయాణిస్తూ ఆదివారం మ. 2.30 గంటలకు అతి తీవ్ర తుపాన్‌గా మారింది. ఒడిశాలోని పారాదీప్‌కు దక్షిణ దిశగా 930 కిమీ దూరంలోనూ, పశ్చిమ బెంగాల్‌లోని దిఘాకు నైరుతి దిశలో 1,080 కిమీ దూరంలో, బంగ్లాదేశ్‌లోని ఖేపుపురకు దక్షిణ నైరుతి దిశగా 1,200 కిమీ దూరంలో కేంద్రీకృతమై ఉంది.

Telangana: తెలంగాణలో 1551కి పెరిగిన కోవిడ్-19 కేసులు, ఈరోజు రాష్ట్ర మంత్రివర్గం ఆకస్మిక భేటీ, లాక్‌డౌన్ 4.0 తాజా మార్గదర్శకాలపై చర్చ

Team Latestly

సీఎం కేసీఆర్ ఇంకా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది ఈరోజు రాత్రి వరకు తెలుస్తుంది. ఇప్పటికే కేంద్రం కంటే ఒకడుగు ముందుంటున్న కేసీఆర్, ఇంతకుముందే తెలంగాణలో లాక్డౌన్ ను మే 29 వరకు విధించారు. మరి ఇప్పుడు కేంద్రం మే31 వరకు విధించిన నేపథ్యంలో అక్కడితో ముగిస్తారా....

Lockdown 4.0: దేశవ్యాప్తంగా మే 31 వరకు లాక్‌డౌన్ పొడగింపు, నేటి నుంచే లాక్‌డౌన్ 4.0 అమలు, నూతన లాక్‌డౌన్ మార్గదర్శకాలు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం, కొత్తగా ఏం మార్పులు జరిగాయో చూడండి

Team Latestly

కంటైన్మెంట్ మరియు రెడ్ జోన్లు మినహా మిగతా అన్ని జోన్లలో వాహనాలు తిరగవచ్చు. ఇరుగు-పొరుగు రాష్ట్రాలు మరియు యూటీల పరస్పర అంగీకారంతో బస్సులు మరియు ప్రయాణీకుల వాహనాలకు అంతరాష్ట్ర ప్రయాణాలకు అనుమతి ఉంటుంది.....

COVID19 in AP: ఆంధ్రప్రదేశ్‌లో స్వల్పంగా తగ్గిన కరోనా తీవ్రత, గత 24 గంటల్లో 25 పాజిటివ్ కేసులు మాత్రమే నమోదు, రాష్ట్రంలో 2230కి చేరిన మొత్తం కోవిడ్-19 బాధితుల సంఖ్య

Team Latestly

లాక్డౌన్ కారణంగా సుమారు రెండు నెలలుగా ప్రజారవాణా వ్యవస్థను పూర్తిగా నిలిచిపోయింది. ప్రజలు ఎక్కడి వారు అక్కడే ఉండి పోయారు. ఈ నేపథ్యంలో ఏపీఎస్ ఆర్టీసీ సర్వీసులను పున: ప్రారంభించడానికి ప్రభుత్వం సమాయత్తమవుతోంది.....

Advertisement

Weather Update: హైదరాబాద్‌లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం, జలమయమైన రోడ్లు, రాగల 24 గంటల్లో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడి

Team Latestly

ఉత్తర ఒడిశా-పశ్చిమ బెంగాల్‌ తీరాల మధ్య ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఒడిశాలోని పారాదీప్‌కు 1100కి.మీ దూరంలో కేంద్రీకృతమైంది. మరో 12 గంటల్లో వాయుగుండం కాస్తా 'అంఫాన్' తుఫానుగా మారే అవకాశం ఉందని....

Corona in AP: ఆంధ్రప్రదేశ్‌లో 2205కు చేరిన కోవిడ్-19 బాధితుల సంఖ్య, గత 24 గంటల్లో రాష్ట్రంలో 48 పాజిటివ్ కేసులు నమోదు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కేసులను విడిగా చూపుతున్న అధికారులు

Team Latestly

గత 24 గంటల్లో కొత్తగా మరో 48 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 2205కు చేరింది. ఈరోజు కర్నూలులో మరొక కోవిడ్-19 పేషెంట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు....

Srikakulam DSP Suicide: ఏపీలో డీఎస్పీ ఆత్మహత్య, శ్రీకాకుళం డీఎస్పీ కృష్ణవర్మ మృతిపై కేసు నమోదు చేసిన ఎంవీపీ పోలీసులు, అనారోగ్యమే కారణమా..?

Hazarath Reddy

అనారోగ్య కారణాలతో ఓ పోలీస్‌ అధికారి ఆత్మహత్యకు (Srikakulam DSP Suicide) పాల్పడ్డారు. శ్రీకాకుళం స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీగా (Srikakulam Special branch) విధులు నిర్వహిస్తున్న కృష్ణ వర్మ శుక్రవారం విశాఖ బీచ్‌ రోడ్డులోని తన నివాసంలో ఉరి వేసుకున్నారు. ఆయనకు ఇటీవలే హార్ట్‌ ఆపరేషన్‌ కూడా అయ్యింది. కృష్ణ వర్మ శ్రీకాకుళం జిల్లాలో (srikakulam) దాదాపు పదేళ్లపాటు ఎస్‌ఐగా పని చేశారు. అనంతరం డీఎస్పీగా పదోన్నతి లభించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు తరలించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

APSRTC: ఈనెల 16 నుంచి హైదరాబాద్‌కు ఏపీ బస్సులు, స్పందన పోర్టల్‌లో దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే ప్రయాణ సౌకర్యం, నిబంధనలు అంగీకరిస్తేనే ప్రయాణానికి అనుమతి

Hazarath Reddy

లాక్‌డౌన్ కారణంగా ఇతర రాష్ట్రాల్లో చాలామంది చిక్కుకుపోయిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఈ నెల 16న హైదరాబాద్‌ (Hyderabad) నుంచి ఆంధ్రప్రదేశ్‌కు బస్సులు (APSRTC) నడవనున్నాయి. అయితే నిబంధనలకు అంగీకరిస్తేనే ఈ బస్సుల్లో ప్రయాణించే అవకాశం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పందన పోర్టల్‌లో (Spandana Portal) దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే ఈ ప్రయాణానికి వెసులుబాటు ఉంటుంది. అంతేకాకుండా స్వస్థలాలకు చేరుకున్న తర్వాత సంబంధిత జిల్లాలో ఉండే క్వారంటైన్‌ కేంద్రంలో ఉంటామని అంగీకరిస్తేనే టికెట్లు జారీ చేయనున్నారు. అందుకు తగ్గట్టుగా ఉన్నతాధికారులు ఏర్పాట్లు చేపట్టారు. 16వ తేదీ నుంచి ఏపీకి బస్సులు నడపనున్నారు.

Advertisement

AP Coronavirus: కర్నూలులో నేడు జీరో కేసులు నమోదు, ఏపీలో 2157కు చేరుకున్న కరోనా కేసుల సంఖ్య, తాజాగా 57 కోవిడ్19 కేసులు నమోదు

Hazarath Reddy

ఏపీలో శుక్రవారం తాజాగా మరో 57 కరోనా పాజిటివ్‌ కేసులు (AP Coronavirus) నమోదైనట్లు వైద్యారోగ్యశాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2157కు చేరింది. రాష్ట్రంలో కొత్తగా నమోదైన పాజిటివ్‌ కేసుల్లో (COVID 19 in AP) అనంతపురం 4, చిత్తూరు 14, కడప 2, కృష్ణా 9, కర్నూలు 8,నెల్లూరు 14, విజయనగరం 3, విశాఖపట్నం 2, తూర్పు గోదావరి 1 ఉన్నాయి. కాగా ఇప్పటి వరకు వైరస్‌ నుంచి పూర్తిగా కోలుకుని 1252 మంది డిశ్చార్జ్‌ కాగా, 48 మంది మరణించారు.

Cyclone Amphan: బలపడిన అల్పపీడనం, ఏపీని ముంచెత్తనున్న భారీ వర్షాలు, అంఫాన్ తుఫానుతో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ కేంద్రం హెచ్చరిక

Hazarath Reddy

ఆగ్నేయ బంగాళాఖాతం, దానికి ఆనుకుని దక్షిణ అండమాన్‌ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇది వాయుగుండంగా మారి శుక్రవారానికి దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ప్రవేశించనున్నది. 16వ తేదీ సాయంత్రం లేదా 17వ తేదీ ఉదయానికి ఇది తుఫాన్‌గా (Cyclone Amphan) మారనున్నది. తొలుత వాయవ్యంగా, తర్వాత ఉత్తర ఈశాన్యంగా పయనించే క్రమంలో తుఫాన్‌ (Cyclonic Storm) మరింత బలపడుతుందని వాతావరణ నిపుణులు అంచనా వేశారు.

YSR Rythu Bharosa-PM Kisan: రైతుల అకౌంట్లోకి నేరుగా రూ.7,500, నేడు సీఎం చేతుల మీదుగా వైఎస్సార్‌ రైతు భరోసా–పీఎం కిసాన్‌ పథకం ప్రారంభం, తొలివిడతగా రైతుల ఖాతాల్లో రూ.2800 కోట్లు జమ

Hazarath Reddy

తొలివిడతగా నేడు రైతుల ఖాతాల్లోకి రూ.2,800 కోట్లు జమ కానుంది. ప్రతి రైతు కుటుంబానికి తొలివిడతగా రూ.7,500 నేరుగా అకౌంట్లో వేయనున్నారు. ఈసారి 49.43 లక్ష కుటుంబాలకు పెట్టుబడి సాయంగా అందనుంది.ఎన్నికల హామీ మేరకు వరుసగా రెండో ఏడాది అన్నదాతలకు ఏపీ సీఎం సాయం చేయనున్నారు.

Naguluppalapadu Road Accident: కూలీలను వెంటాడిన మృత్యువు, ప్రకాశం జిల్లాలో విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన ట్రాక్టర్, 9 మంది అక్కడికక్కడే దుర్మరణం

Hazarath Reddy

ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నాగులుప్పలపాడు మండలం రాపర్ల దగ్గర విద్యుత్ స్తంభాన్ని ట్రాక్టర్ (Naguluppalapadu Road Accident) ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 9 మంది కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో ఏడుగురు మహిళలు కాగా ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. మిర్చి పనులకు వెళ్లి వస్తుండగా ప్రమాదం (Prakasam tractor accident) జరిగింది. వీరంతా మాచవరానికి చెందిన వారిగా గుర్తించారు. ఈ ఘటనతో మాచవరంలో విషాదఛాయలు అలముకున్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

AP SSC Exams 2020:ఏపీలో జూలై 10 నుంచి 15 వరకు టెన్త్ పరీక్షలు, 11 పేపర్లను 6 పేపర్లుగా కుదించిన ఏపీ ప్రభుత్వం, ప్రతి పేపర్‌కు 100 ​మార్కులు

Hazarath Reddy

కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఏపీలో పదవ తరగతి పరీక్షలు (AP SSC Exams 2020) వాయిదాపడిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో పదో తరగతి పరీక్షలపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం (AP Govt) కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం 11 పేపర్లను 6 పేపర్లుగా కుదించింది. భౌతిక దూరం పాటిస్తూ జూలై 10వ తేదీ నుంచి 15 వరకూ పరీక్షలు (July 10 To 15) నిర్వహించనుంది. ప్రతి పేపర్‌కు 100 ​మార్కులు ఉంటాయి.

AP Coronavirus Report: నెల్లూరులో 15 కొత్త కేసులు, ఏపీని వణికిస్తున్న థానే,కోయంబేడు, 2100కు చేరుకున్న మొత్తం కోవిడ్ 19 కేసులు, శ్రీకాకుళంలో మరో రెండు తాజా కేసులు

Hazarath Reddy

ఏపీలో గత 24 గంటల్లో కొత్తగా 36 కరోనా కేసులు నమోదవగా, ఒకరు మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య (AP Coronavirus Report) 2100కి చేరగా, మరణాల సంఖ్య 48కి పెరిగింది. ప్రాణాంతక కరోనావైరస్‌ (Coronavirus) బారిన పడిన వారిలో ఇప్పటివరకు 1192 మంది కోలుకోగా, 860 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఈ రోజు నమోదైన పాజిటివ్‌ కేసుల్లో నెల్లూరులో 15, చిత్తూరులో 9, గుంటూరులో 5 ఉండగా, కడప, కృష్ణా, శ్రీకాకుళం జిల్లాల్లో రెండు చొప్పున, పశ్చిమగోదావరిలో మరో కేసు నమోదయ్యాయి. ఇవాళ మరణించిన వ్యక్తి కర్నూలు జిల్లాకు సంబంధించినవారు.

English Medium in Public Schools: ఏపీ విద్యా వ్యవస్థలో కీలక మార్పులు, తెలుగు సబ్జెక్ట్‌ తప్పనిసరి, ఇంగ్లీష్ మీడియంపై జీవో జారీ చేసిన ఏపీ సర్కారు, కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీలకు చెక్ పెట్టేలా కొత్త నిర్ణయం

Hazarath Reddy

ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 2020–21 విద్యా సంవత్సరం నుంచి 1 నుంచి 6వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడుతూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం (Andhra Pradesh government) బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. ఇక పాఠశాల విద్యాశాఖ, పంచాయతీరాజ్, మున్సిపల్, గిరిజన సంక్షేమ శాఖల పరిధిలోని పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం (English Medium in AP) అమలు కానుంది. మైనార్టీ భాషా మాధ్యమం స్కూళ్లు యధాతథంగా కొనసాగనున్నాయి.

AP COVID-19 Report: చిత్తూరులో క్రమంగా పెరుగుతున్న కరోనా కేసులు, ఏపీలో 2137కు చేరిన కేసుల సంఖ్య, 1142 మంది కోవిడ్ 19 నుండి కోలుకుని డిశ్చార్జి

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ కేసుల (AP COVID-19 Report) సంఖ్య తగ్గుముఖం పడుతున్నట్లుగా తెలుస్తోంది . ఏపీలో గడిచిన 24 గంటంల్లో కొత్తగా 48 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు ఆ రాష్ట్ర వైద్యాధికారులు వెల్లడించారు. దీంతో ఏపీలో (Andhra Pradesh) పాజిటివ్‌ కేసుల సంఖ్య 2137కు చేరింది.

Advertisement
Advertisement