ఆంధ్ర ప్రదేశ్

AP Cabinet Meet Highlights: అమరావతిపై సస్పెన్స్ కొనసాగింపు, ఇప్పుడు రాజధాని నిర్మాణం చేస్తే, వేరే నగరాలతో ఎన్నటికి పోటీపడగలమని మంత్రి పేర్ని నాని వ్యాఖ్య, చంద్రబాబు హయాంలోని అవినీతిపై విచారణ, కేబినేట్ భేటీ ముఖ్యాంశాలు

Vikas Manda

గత ప్రభుత్వం ఊహిజనిత రాజధాని నిర్మాణంపై భ్రమింపజేసింది. రాజధాని కోసం రైతుల నుంచి 33 వేల ఎకరాలు సేకరించి, మరో 21 వేల ప్రభుత్వ భూములను కలిపి 54 వేల ఎకరాలలో రాజధాని నిర్మాణం కోసం 1లక్షా పదివేల కోట్ల రూపాయల ఖర్చు అవుతుందని అంచనా వేసింది. కానీ గడిచిన ఐదేళ్లలో కేవలం రూ. 5 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. ...

AP Cabinet Meet: నేడు అమరావతి భవితవ్యం తేలిపోనుందా? కొనసాగుతున్న ఏపీ మంత్రివర్గ సమావేశం, అమరావతి ప్రాంతంలో ఉధృతమైన ఆందోళనలు, జీఎన్ రావు కమిటీపై చర్చించనున్న కేబినేట్, చంద్రబాబు హయాంలో జరిగిన అవినీతిపై కూడా చర్చ

Vikas Manda

వెలగపూడిలో రోడ్డుకు అడ్డంగా మహిళలు చేపట్టిన ఆందోళనలు ఉద్రిక్తంగా మారాయి, ఈ క్రమంలో అడ్డుకున్న పోలీసులతో వాగ్వివాదానికి దిగారు, ఆ సమయంలో వచ్చిన కారు అద్దాలను ధ్వంసం చేశారు. ఈ ఘటనలో సీఐ, ఎస్సైలకు గాయాలయ్యాయి....

Amaravathi Protests: 'మా బతుకులకే గ్రహణం పట్టింది'! అమరావతి ప్రాంతంలో కొనసాగుతున్న నిరసనలు, మందడం వద్ద ఉద్రిక్తత, టీడీపి నేతల హౌజ్ అరెస్ట్, రేపటి ఏపీ కేబినేట్ భేటీపై ఉత్కంఠత

Vikas Manda

డిసెంబర్ 27న సీఎం జగన్ అధ్యక్షతన కేబినేట్ మీటింగ్ జరగనుంది. ఈ సమావేశంలో రాష్ట్రంలో వివిధ సంక్షేమ పథకాల అమలు, రాజధాని అంశం చర్చకు వచ్చే అవకాశం ఉంది. అమరావతిపై ఏం తేలుస్తారు? అంతకుముందు చెప్పినట్లుగా మూడు రాజధానుల నిర్ణయానికే కట్టుబడి ఉంటారా?...

AP Cabinet Meeting: 3 రోజుల్లో తేలిపోనున్న ఏపీ రాజధాని భవిష్యత్తు, ఈ నెల 27న విశాఖలో క్యాబినెట్ మీటింగ్, స్వాగతించిన టీడీపీ ఎమ్మెల్యే గంటా, చంద్రబాబుకి సవాల్ విసిరిన స్పీకర్ తమ్మినేని, అమరావతిలో కొనసాగుతున్న నిరసనలు

Hazarath Reddy

మరో మూడు రోజుల్లో ఏపీ రాజధాని భవిష్యత్తు తేలిపోనుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం (Ap Cabinet Meeting) డిసెంబర్ 27న విశాఖలో జరగనుంది. ఈ కేబినెట్ భేటీలో ఏపీ రాజధాని అంశంపై ఓ స్పష్టత రానుంది. విశాఖలో(Visakhapatnam) కేబినెట్ భేటీకి సంబంధించిన ఏర్పాట్లు చేయమని ప్రభుత్వం ఇప్పటికే సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ యంత్రాంగం కూడా ఆదిశగా చర్యలు చేపట్టింది. ఈ కేబినెట్ భేటీలోనే ఏపీ రాజధానిపై సీఎం జగన్ స్పష్టత ఇవ్వనున్నారు.

Advertisement

NRC-AP CM YS Jagan: ఎన్‌ఆర్సీపై బీజేపీకి ఏపీ సీఎం షాక్, రాష్ట్రంలో ఎన్‌ఆర్సీ అమలు చేసే ప్రసక్తే లేదు, మైనార్టీలకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపిన సీఎం వైయస్ జగన్, కడపలో నీటిపారుదల ప్రాజెక్టులకు, ఉక్కు పరిశ్రమకు శంకు స్థాపన

Hazarath Reddy

దేశ వ్యాప్తంగా వివాదానికి కేంద్రబిందువైన జాతీయ పౌరపట్టిక (ఎన్‌ఆర్సీ) అమలుపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (Andhra Pradesh CM YS Jagan Mohan Reddy) కీలక ప్రకటన చేశారు. తమ ప్రభుత్వం ఎన్‌ఆర్సీకి (National Register of Citizens)వ్యతిరేకమని, రాష్ట్రంలో అమలు చేసే ప్రసక్తే లేదని సీఎం జగన్ ప్రకటించారు.

AP Capital Political Row: తెరపైకి రాజధానిగా తిరుపతిని తీసుకువచ్చిన చింతా మోహన్, మంగళగిరి ఎమ్మెల్యే కనిపించడం లేదంటున్న అమరావతి రైతులు, ఆడపడుచులు రోడ్డెక్కారంటున్న చంద్రబాబు, కొనసాగుతున్న రైతుల ధర్నాలు, ప్రకంపనలు రేపుతున్న ఏపీ రాజధాని అంశం

Hazarath Reddy

ఏపీ రాజధాని అంశం (AP Capital Row)ఆంధ్రప్రదేశ్ రాజీకీయాల్లో పెను ప్రకంపనలే రేపుతోంది. మూడు రాజధానుల అంశం ( 3 Capitals) తెరపైకి రావడంతో అది రాజకీయ రంగును పులుముకుంది. అసెంబ్లీలో ఏపీ సీఎం జగన్ (AP CM YS Jagan)మూడు రాజధానులు ఉండొచ్చని చెప్పడం, జీఎన్ రావు కమిటీ (GN Rao Committee) తన నివేదికను సమర్పించడం, వారు రాజధాని గురించి మీడియాతో మాట్లాడటం వంటివి వేగంగా జరిగిపోవడంతో ఏపీ రాజధాని అంశం (AP Capital) ఇప్పుడు కీలక మలుపు తిరుగుతోంది.

AP Capital Suspense: ఏపీ రాజధానిపై కొనసాగుతున్న సస్పెన్స్, ఇంకా తేలని ప్రభుత్వ నిర్ణయం, ఎవరివాదనలు వారివే, తెరపైకి 25 జిల్లాలను తీసుకువచ్చిన వైసీపీ నేత విజయసాయి రెడ్డి, ఈ నెల 27న క్యాబినెట్ మీటింగ్‌లో సస్పెన్స్ కి తెరపడే అవకాశం

Hazarath Reddy

అసెంబ్లీలో సీఎం వైయస్ జగన్ (CM YS Jagan) మూడు రాజధానులు (3 Capitals) అంశం తెరపైకి తెచ్చినప్పటి నుంచి ఏపీలో రాజకీయ సమీకరణాలు( AP POlitics) పూర్తిగా మారిపోయాయి. ప్రతిపక్ష పార్టీలోని కొందరు నేతలు దీన్ని సమర్ధిస్తున్నారు. అలాగే కొన్ని జిల్లాలు ప్రజలు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. అమరావతి పరిసర ప్రాంతాల ప్రజలు ఈ నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు.

YSR Netanna Nestam Scheme: చేనేత కార్మికులకు ఏడాదికి రూ. 24 వేలు, పథకాన్ని ధర్మవరంలో ప్రారంభించిన ఏపీ సీఎం జగన్, మెసేజ్ వచ్చిందంటూ సోషల్ మీడియా ద్వారా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న చేనేత కార్మికులు

Hazarath Reddy

చేనేత కార్మికుల కష్టాల్ని తొలగించే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వైయస్సార్ నేతన్న నేస్తం (YSR Netanna Nestam) కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అనంతపురం జిల్లా ధర్మవరంలో (dharmavaram) వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకాన్ని సీఎం జగన్ (AP CM YS Jagan) ప్రారంభించారు. ఈ పథకం ద్వారా మగ్గం ఉన్న ప్రతి నేతన్న కుటుంబానికి ఏడాదికి రూ.24 వేలు అందిస్తామన్నారు.

Advertisement

AP Capital Row: ఉత్కంఠ రేపుతున్న ఏపీ రాజధాని అంశం, ఎవరి వాదనలు వారివే, ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉండబోతోంది ?, ఏపీ క్యాబినెట్ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతోంది ?,ఇప్పటి వరకు నాయకులు ఏమన్నారో వారి మాటల్లో...

Hazarath Reddy

మొన్నటి దాకా ఇసుక వార్ మీద నడిచిన ఏపీ రాజకీయాలు (Andhra pradesh politics) ఇప్పుడు రాజధాని (AP Capital Row) మీదకు తిరిగాయి. అసెంబ్లీ చివరి రోజు సమావేశాల్లో ఏపీ సీఎం వైయస్ జగన్ (CM YS Jagan) ఏపీ రాజధానిపై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Happy Birthday AP CM YS Jagan: ప్రజాబలం తోడుగా, ప్రతిపక్షాల బలహీనత నీడగా.., పాలనలో దూసుకుపోతున్న ఏపీ సీఎం వైయస్ జగన్, 47వ ఒడిలోకి అడుగుపెట్టిన వైయస్సార్ తనయుడు, ఐదేళ్లు ప్రతిపక్ష నేతగా..,ఎన్నో ఆటుపోట్లు, మరెన్నో విజయాలు, ఆయనపై ప్రత్యేక కథనం

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు (డిసెంబర్ 21) 47వ పుట్టిన రోజు(Happy Birthday AP CM YS JAGAN) జరుపుకొంటున్నారు. తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి (YS Rajasekhar Reddy) అకాల మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీ (Congress Party)నుండి బయటకు వచ్చి నాన్న ఆశయాల సాధన కోసం వైయస్సార్సీపీ పార్టీని( YSRCP)స్థాపించి ప్రజా క్షేత్రంలో దూసుకుపోతున్నాడు.

AP Capital-Breaking News: ఏపీ రాజధాని ఇక్కడే, సిఫార్సులు చేసిన జీఎన్ రావు కమిటీ, సీఎం జగన్‌కు నివేదిక అందజేసిన తరువాత ప్రెస్ మీట్, రాష్ట్రాన్ని 4 రీజియన్‌లుగా విభజించాలని సూచన

Hazarath Reddy

ఏపీ రాజధాని, (Andhra pradesh Capital)ఏపీ సమగ్రాభివృద్ధిపై అధ్యయనం కోసం ఏర్పాటైన జీఎస్‌రావు కమిటీ (GN Rao Committee)ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి (AP CM YS Jagan)తుది నివేదిక అందజేసింది. సచివాలయంలో సీఎం జగన్‌తో సమావేశమైన జీఎస్‌‌రావు కమిటీ సభ్యులు తాము తిరిగిన ప్రాంతాలు, అధ్యయనం చేసిన అంశాలను వివరించారు.

AP Capital Report: రాజధానిపై రిపోర్ట్ వచ్చేసింది, సీఎం వైయస్ జగన్‌కు నివేదిక ఇచ్చిన జీఎన్ రావు కమిటీ, డిసెంబర్ 27న ఏపీ కేబినెట్ భేటీ, ఆ తర్వాత ఏపీ రాజధానిపై స్పష్టత వచ్చే అవకాశం

Hazarath Reddy

ఏపీ రాజధానిపై అతి త్వరలోనే సస్పెన్స్ వీడబోతుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠగా మారిన రాజధానికి సంబంధించిన జీఎన్ రావు రిపోర్టు (GN Rao Committee) ఎట్టకేలకు సీఎం జగన్ (AP CM YS Jagan) చెంతకు చేరింది. తాడేపల్లిలోని సీఎం నివాసంలో..కమిటీ సభ్యులు జగన్‌ను కలిశారు. తమ నివేదికను సీఎం జగన్ కి అందచేశారు. రాజధాని సహా రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం సూచనలు ఇవ్వడం కోసం రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ జీఎన్ రావు అధ్యక్షతన నిపుణుల కమిటీని జగన్ సర్కారు సెప్టెంబర్ 13న ఏర్పాటు చేసిన సంగతి విదితమే.

Advertisement

MP Gorantla Madhav: నిన్ను బజారుకీడ్చిన సంగతి గుర్తించుకో, నేను జస్ట్ ట్రయిల్ వేస్తేనే ఎంపీనయ్యాను, జేసీ దివాకర్ రెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన ఎంపీ గోరంట్ల మాధవ్, పోలీసుల బూట్లు తుడిచి, ముద్దాడిన వైసీపీ ఎంపీ

Hazarath Reddy

పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డిపై (JC Diwakar Reddy) హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ హిందూపురం ఎంపీ మాదవ్ (YSRCP MP Gorantla Madhav) జేసీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఆయన మాటలకు కౌంటర్‌గా అమర పోలీసు బూటును మాధవ్ ముద్దాడారు.

Amaravathi Stir: ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని రగడ, సీఎం జగన్ మూడు రాజధానుల ప్రకటనతో అమరావతి ప్రజల ఆందోళన, బంద్ పాటిస్తున్న గ్రామస్తులు, హైకోర్టుకు చేరిన వ్యవహారం

Vikas Manda

సీఎం ప్రకటనపై విశాఖ మరియు రాయలసీమ ప్రాంతాల ప్రజలపై సానుకూలత వ్యక్తం చేస్తుండగా, అమరావతి పరిసర ప్రాంతాల ప్రజలు మాత్రం దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అమరావతి పరిధిలోని గ్రామాల ప్రజలు సీఎం ప్రకటనను వ్యతిరేకిస్తూ గురువారం బంద్ కు పిలుపునిచ్చారు....

Andhra Pradesh: సీఎం జగన్ మరో కీలక నిర్ణయం, ఉద్యమ సమయంలో పెట్టిన కేసులు ఎత్తివేత, ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం

Hazarath Reddy

పరిపాలనలో దూకుపోతున్న వైయస్ జగన్ సర్కారు( YS Jagan GOVT) మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో జరిగిన పలు ఉద్యమాల్లో పెట్టిన పోలీసు కేసులను ఎత్తివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం విడుదల చేసింది.

AP Capital News: ఏపీకి 3 రాజధానుల అవసరం ఉంది, బహుశా 3 రాజధానులు వస్తాయేమోనన్న ఏపీ సీఎం వైయస్ జగన్, రేసులో అమరావతి, విశాఖ,కర్నూలు, కమిటీ నివేదిక వచ్చిన తరువాత నిర్ణయం తీసుకుంటామని తెలిపిన ఏపీ సీఎం

Hazarath Reddy

ఏపీ శాసనసభ సమావేశాల్లో (AP Assembly session)ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్(AP CM YS Jagan) సంచలన ప్రకటన చేశారు. ఏపీ రాజధానిపై (AP Captial) అసెంబ్లీ వేదికగా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఏపీలో మూడు రాజధానులు (3 Captials) అవసరం ఉందన్నఏపీ సీఎం జగన్.. రాష్ట్రానికి 3 రాజధానులు వస్తాయేమో అని సంచలన ప్రకటన చేశారు. పాలన ఒక దగ్గర, జుడీషియల్ ఒక దగ్గర ఉండొచ్చు అన్నారు. అమరావతిలో లెజిస్లేటివ్ కేపిటల్, విశాఖలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్ రావొచ్చన్నారు.

Advertisement

Amaravati Land Scams: అసెంబ్లీలో రాజధాని రచ్చ, అమరావతిలో అన్నీ అక్రమాలే జరిగాయన్న ఆర్థికమంత్రి బుగ్గన, అమరావతి ప్రజా రాజధాని అన్న చంద్రబాబు, సభను అడ్డుకున్న 9మంది టీడీపీ సభ్యుల సస్పెన్సన్

Hazarath Reddy

ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో(AP Assembly session) చివరి రోజు రాజధానిపై చర్చ జరిగింది. ఏపీ రాజధాని అమరావతి (Amaravathi) మీద అధికార ప్రతిపక్ష పార్టీలు వాదోపవాదాలు చేశాయి. ఈ నేపథ్యంలో ఆర్థిక మంత్రి బుగ్గన (Finance Minister Buggana Rajendranath Reddy)రాజధాని అమరావతిలో అన్నీ అక్రమాలే జరిగాయంటూ వాస్తవాలను అసెంబ్లీలో వినిపించారు.

AP Assembly Sessions End Today: నేటితో ముగియనున్న అసెంబ్లీ సమావేశాలు, నిన్న ఒక్కరోజే 13 కీలక బిల్లులకు ఏపీ అసెంబ్లీ అమోదం, శాసనమండలిలో ఆరు కీలక బిల్లులకు ఆమోదం, బ్లాక్‌లో మద్యం అమ్మితే 6 నెలలు జైలు శిక్ష, రూ. 2 లక్షల జరిమానా

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ శీతాకాల అసెంబ్లీ సమావేశాలు (ap assembly winter session 2019) హీట్ పుట్టిస్తున్నాయి. నేడు 7వ రోజుకు చేరుకున్నాయి. డిసెంబర్ 9వ తేదీన మొదలైన సమావేశాలు నేటితో అంటే17 డిసెంబర్ 2019తో ముగియనున్నాయి. ఆర్టీసీ విలీన బిల్లు(RTC Merger BIll) తో పాటు ఇంగ్లీషు మీడియం బిల్లును, (English Medium bill) అలాగే దిశ బిల్లును(Disha Bill) ప్రభుత్వం సభలో ప్రవేశ పెట్టింది.

Tirumala Temple: శ్రీవారి ఆలయం మూసివేత, డిసెంబర్ 25 రాత్రి 11 గంటల నుంచి 26 మధ్యాహ్నం 12గంటల వరకు ఆలయం క్లోజ్, డిసెంబర్ 26న ఏర్పడనున్న సూర్యగ్రహణమే కారణం

Hazarath Reddy

శ్రీవారి ఆలయం(Sri Venkateswara temple) మూసివేయనున్నారు. డిసెంబర్ 25 రాత్రి 11 గంటల నుంచి 26 రాత్రి మధ్యాహ్నం 12గంటల వరకూ ఆలయం మూసివేసి ఉంటుందని టీటీడీ(TTD) తెలిపింది. డిసెంబర్ 26న సూర్యగ్రహణం(solar eclipse) ఏర్పడనుండటంతో తిరుమల శ్రీవారి ఆలయాన్ని ఆలయ అర్చకులు 13 గంటల పాటు మూసివేయనున్నట్లు ఆలయాధికారులు తెలిపారు.

AP Assembly Sessions Day-6: 3 లక్షల ఇళ్లకు రూ.2 వేల 626 కోట్ల దోపిడి, బాబుది మద్యం తాగించు పాలసీ, వైయస్ జగన్‌ది మద్యం మాన్పించు పాలసీ, రూ.8 వేలకు రూ.80 వేల అద్దె చెల్లిస్తున్నారు, హాట్ హాట్‌గా సాగుతున్న ఏపీ అసెంబ్లీ 6వ రోజు సమావేశాలు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు ఆరో రోజు (AP Assembly Winter Sessions 2019 Day-6) హాట్ హాట్ గా సాగుతున్నాయి. అసెంబ్లీలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య ఇళ్ల నిర్మాణంలో రివర్స్ టెండరింగ్‌ (Reverse Tendering Scheme), మద్యం పాలసీల (Debate on alcohol bans)పైన వాదోపవాదాలు నడుస్తున్నాయి. ఈ విషయం మీద మాటల యుద్ధం నడుస్తోంది.

Advertisement
Advertisement