Select Committee Formation: టీడీపీకీ భారీ షాక్, సెలక్ట్ కమిటీ ఫైళ్లను తిప్పి పంపిన మండలి కార్యదర్శి, రూల్ 154 కింద సెలక్ట్ కమిటీ వేయడం చెల్లదన్న శాసనమండలి కార్యాలయం
మూడు రాజధానులు (Three Capitals), సీఆర్డీఏ చట్టం (CRDA Bill) రద్దు బిల్లులపై శాసన మండలి సెలక్ట్ కమిటీలను ఏర్పాటు చేస్తూ మండలి చైర్మన్ షరీఫ్ కీలక నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. అయితే ఈ విషయంలో టీడీపీ పార్టీకి (TDP) భారీ ఎదురుదెబ్బ తగిలింది. సెలక్ట్ కమిటీలను (Celect Committee) ఏర్పాటు చేయకుండా ఆ ఫైళ్లను శాసన మండలి చైర్మన్ షరీఫ్‌కు రాష్ట్ర అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు తిప్పిపంపారు.
Amaravathi, Febuary 11: మూడు రాజధానులు (Three Capitals), సీఆర్డీఏ చట్టం (CRDA Bill) రద్దు బిల్లులపై శాసన మండలి సెలక్ట్ కమిటీలను ఏర్పాటు చేస్తూ మండలి చైర్మన్ షరీఫ్ కీలక నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. అయితే ఈ విషయంలో టీడీపీ పార్టీకి (TDP) భారీ ఎదురుదెబ్బ తగిలింది. సెలక్ట్ కమిటీలను (Celect Committee) ఏర్పాటు చేయకుండా ఆ ఫైళ్లను శాసన మండలి చైర్మన్ షరీఫ్‌కు రాష్ట్ర అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు తిప్పిపంపారు.
ఏపీ శాసనమండలి రద్దుకు ఏకగ్రీవ తీర్మానం
నిబంధన 154 ప్రకారం సెలక్ట్ కమిటీకి బిల్లులను పంపకపోవడంతో మరోసారి సమీక్ష చేయాలంటూ ఆ ఫైళ్లను తిప్పి పంపుతున్నట్లుగా శాసనమండలి కార్యాలయం తెలిపింది.
పెద్దల సభ రద్దుకు అసెంబ్లీ ఆమోదం, కేంద్రం చెంతకు రద్దు తీర్మానం
పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులపై శాసన మండలిలో జరిగిన చర్చ సందర్భంగా ఆ బిల్లులను సెలక్ట్ కమిటికీ నిబంధన 154 కింద పంపుతున్నట్లు చైర్మన్ (Chairman MA Shariff) గతంలో ప్రకటించారు. ఈ మేరకు ఆ బిల్లులకు సంబంధించి సెలక్ట్ కమిటీల పేర్లను కూడా ఖరారు చేస్తూ సెక్రటరీకి చైర్మన్ లేఖ కూడా పంపారు. త్వరలో ఈ మేరకు సెలక్ట్ కమిటీలను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేస్తారని భావిస్తున్న తరుణంలో ఆ ఫైళ్లను తిరిగి చైర్మన్‌కు పంపించడంతో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలినట్లయింది.
ఏపీ శాసనమండలి ఎప్పుడు ప్రారంభమైది,దాని చరిత్ర ఏమిటీ..?
ఈ విషయమై మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, బొత్స సత్యనారాయణ కూడా కార్యదర్శిని కలిసి మంతనాలు సాగించారు. విషయం తెలిసి టీడీపీ ఎమ్మెల్సీలు బుద్దా వెంకన్న, బచ్చుల అర్జునుడు, అశోక్ బాబు తదితరులు సెక్రటరీని సోమవారం కలిశారు. చైర్మన్ ఆదేశాల మేరకు సెలక్ట్ కమిటీని ఏర్పాటు చేయాలని కోరారు. చైర్మన్ ఆదేశాలు పాటించాలని తెలిపారు.
సెలెక్ట్ కమిటీకి 'రాజధాని' బిల్లులు
అయితే రూల్ 154 కింద చైర్మన్ ప్రకటన ఉంటుందని, ఆ ప్రకటనకు అనుగుణంగానే కమిటీ వేయాల్సి ఉంటుందని విపక్షాలు వాదిస్తున్నాయి. చైర్మన్ నుంచి ఫైలు వచ్చిన వెంటనే కమిటీ వేయని పక్షంలో ఈ సారి మండలి ధిక్కరణ నోటీసు ఇవ్వాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది. మంగళవారం ఉదయం నోటీసులు ఇవ్వాలని టీడీపీ ఎమ్మెల్సీలు నిర్ణయించారు.
3 రాజధానుల బిల్లు చర్చకు ముందే ఎమ్మెల్సీ పదవికి డొక్కా రాజీనామా
అనంతరం టీడీపీ ఎమ్మెల్సీలు మీడియాతో మాట్లాడుతూ శాసన మండలి చైర్మన్ (Legislative council chairman ma sharif) జారీ చేసిన ఆదేశాలను మళ్లీ సమీక్ష చేయమంటూ ఆయనకే పంపడం ఏమిటని ప్రశ్నించారు. కార్యదర్శి చట్టబద్ధంగా వ్యవహరించాలని, నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే, కోర్టును ఆశ్రయిస్తామన్నారు.
జరుగుతున్న వ్యవహారాన్ని గవర్నర్‌కు, కేంద్ర హోం మంత్రికి, రాష్టప్రతికి వివరిస్తామన్నారు. ప్రభుత్వం ఏదో రకంగా బిల్లులను పాస్ చేయించుకునేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
సభ నుంచి వెళ్లిపోయిన స్పీకర్ తమ్మినేని
రాష్ట్ర పరిపాలనా వికేంద్రీకరణ, సీఆర్డీయే రద్దుపై ఏపీ శాసనమండలిలో చర్చల నేపథ్యంలో.. సెలెక్ట్ కమిటీ కోసం మండలి ఛైర్మన్ షరీఫ్‌కు టీడీపీ, బీజేపీ, పీడీఎఫ్ పేర్లు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ సెలెక్ట్ కమిటీలో తాము ఉండబోమని, ఇది రాజ్యాంగ విరుద్ధమని, ఈ ప్రక్రియలో భాగస్వాములు కాబోమని అధికారపార్టీకి చెందిన నేత డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ లేఖలు రాశారు.
అమరావతిని చంపేశామని ఎవరన్నారన్న సీఎం జగన్
నోటి మాట ద్వారా సెలెక్ట్ కమిటీ ఏర్పాటు కాదని.. కమిటీ ఏర్పాటుకు కొన్ని విధానాలు ఉంటాయని మంత్రులు తెలిపారు. మండలి ఛైర్మన్ సెలెక్ట్ కమిటీకి రిఫర్ చేసే ప్రక్రియ పూర్తి కాలేదని.. అలాంటప్పుడు విచక్షణాధికారం ఉందని ఇష్టారాజ్యంగా చేయడానికి వీల్లేదన్నారు.
3 రాజధానుల బిల్లు అమోదం, టీడీపీ ఎమ్మెల్యేలపై మండిపడిన ఏపీ సీఎం వైయస్ జగన్
సీఆర్డీఏ రద్దు బిల్లు సెలక్ట్ కమిటీ చైర్మన్‌గా బొత్స సత్యనారాయణను మండలి చైర్మన్ నియమించారు. సభ్యులుగా టీడీపీ నుంచి ఎమ్మెల్సీలు దీపక్‌రెడ్డి, అర్జునుడు, రవిచంద్ర, శ్రీనివాసులు ఉండగా, వైసీపీకి చెందిన మహ్మద్ ఇక్బాల్, పీడీఎఫ్ నుంచి వెంకటేశ్వరరావు, బీజేపీకి చెందిన సోము వీర్రాజు ఇతర సభ్యులు.
వీధిరౌడీలను ఏరివేస్తే గానీ వ్యవస్థ మారదు. -సీఎం జగన్
పరిపాలన వికేంద్రీకరణ బిల్లు సెలక్ట్ కమిటీ చైర్మన్‌గా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నియమితులయ్యారు. సభ్యులుగా టీడీపీ నుంచి లోకేశ్, అశోక్‌బాబు, తిప్పేస్వామి, సంధ్యారాణి ఉండగా.. పీడీఎఫ్‌కి చెందిన లక్ష్మణరావు, బీజేపీకి చెందిన మాధవ్, వేణుగోపాల్‌రెడ్డి నియమితులయ్యారు.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)