తెలంగాణ

PM Modi In Hyderabad: హెచ్ఐసీసీలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రారంభం, ప్రధాని మోదీ హాజరు, కీలక అంశాలపై చర్చించే అవకాశం...

Krishna

భారతీయ జనతా పార్టీ (బిజెపి) రెండు రోజుల జాతీయ కార్యవర్గంలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోడీ శనివారం హైదరాబాద్ చేరుకున్నారు. నగరంలోని బేగంపేట విమానాశ్రయంలో దిగిన అనంతరం హెలికాప్టర్‌లో సభా వేదిక హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ (హెచ్‌ఐసీసీ)కి బయల్దేరి వెళ్లారు.

KCR On PM Modi: మోదీ ఎనిమిదేళ్ల పాల‌న‌లో సామాన్యుడు బ‌తుక‌లేని ప‌రిస్థితి, విదేశాల‌నుంచి బొగ్గు కొనాల‌ని రాష్ట్రాలకు కేంద్రం హుకుం, ఇదేనా మీ పాలన మోదీ, కేసీఆర్ విమర్శల బాణాలు..

Krishna

“నరేంద్ర మోదీ భారతదేశానికి 15వ ప్రధానమంత్రి. ఆయన కంటే ముందు 14 మంది ప్రధానులు ఉన్నారు. మోదీ స్థాయిలో వారు దేశ ప్రతిష్టను తగ్గించలేదన్నారు. మీకు వ్యతిరేకంగా మాట్లాడే వారిని మీరు వేధిస్తారు. మీరు ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్నారు. మీరు ఇప్పటికి 9 రాష్ట్ర ప్రభుత్వాలను నాశనం చేశారు’’ అని కేసీఆర్ దుయ్యబట్టారు.

BJP Office Bearers Meeting Starts: హైదరాబాద్ లో జేపీ నడ్డా అధ్యక్షతన ప్రారంభమైన బీజేపీ జాతీయ పదాధికారుల సమావేశం, కాసేపట్లో NEC సమావేశానికి హాజరుకానున్న ప్రధానిమోదీ..

Krishna

బీజేపీ పార్టీ జాతీయ పదాధికారుల సమావేశం శనివారం హైదరాబాద్ లో ప్రారంభమైంది. జాతీయ పదాధికారులందరూ హాజరైన సమావేశాన్ని పార్టీ అధినేత జేపీ నడ్డా ప్రారంభించారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన సమావేశం మధ్యాహ్నం 1.30 గంటలకు ముగిసే అవకాశం ఉంది.

Yashwanth Sinha In Hyderabad: రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు ఘనస్వాగతం పలికిన సీఎం కేసీఆర్, ఒకే వాహనంలో జలవిహార్ బయలుదేరిన కేసీఆర్, సిన్హా, 5 వేల బైకులతో భారీ ర్యాలీ..

Krishna

యూపీఏ రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హా హైదరాబాద్ చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయంలో ఆయనకు సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గాడ్, ఎంపీ నామా నాగేశ్వరరావు తదితర నేతలు ఘన స్వాగతం పలికారు.

Advertisement

Yashwant Sinha Hyd Visit: హైదరాబాదుకు చేరుకున్న యశ్వంత్ సిన్హా, ఘన స్వాగతం పలికిన సీఎం కేసీఆర్, జలవిహార్ వద్ద టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కోలాహలం

Hazarath Reddy

దేశంలోనే అత్యున్నత పదవి అయిన రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల తరపున పోటీ చేస్తున్న యశ్వంత్ సిన్హా హైదరాబాదుకు చేరుకున్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన ప్రత్యేక విమానంలో ఆయన బేగంపేట ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయ్యారు. సిన్హాకు కేసీఆర్, తెలంగాణ కేబినెట్ మంత్రులు ఘన స్వాగతం పలికారు.

UP CM Yogi Visit Bhagyalakshmi Temple: చార్మినార్ భాగ్యలక్ష్మీ గుడిని సందర్శించనున్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, పాతబస్తీలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు..

Krishna

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ జూలై 2వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి ఆలయాన్ని సందర్శించనున్నారు. రెండు రోజుల బీజేపీ కార్యవర్గ సమావేశం దృష్ట్యా నగరంలోని పాత ప్రాంతాల్లో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.

Traffic Diversions in Hyd: హైదరాబాద్‌ లో ట్రాఫిక్ డైవర్షన్లు, ఈ రూట్లలో వెళ్తున్నారా? అయితే చుక్కలు కనిపిస్తాయి, ట్రాఫిక్ ప్రత్యామ్నాయ మార్గాల ఇవే!

Naresh. VNS

విప‌క్ష పార్టీల రాష్ట్రప‌తి అభ్యర్థి య‌శ్వంత్ సిన్హా శనివారంహైద‌రాబాద్ రానున్నారు. ఆయ‌న బేగంపేట విమానాశ్రయం నుంచి జలవిహార్ వరకు ర్యాలీ చేప‌ట్టనున్నారు. ఈ నేప‌థ్యంలో పోలీసులు ఆయా మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఉదయం 11 గంట‌ల‌ నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ట్రాఫిక్ మ‌ళ్ళింపులు ఉంటాయ‌ని చెప్పారు.

Covid in TS: తెలంగాణలో కొత్తగా 462 మందికి కరోనా, అత్యధికంగా హైదరాబాదులో 259 కొత్త కేసులు , ఇంకా 4,702 మందికి కొనసాగుతున్న చికిత్స

Hazarath Reddy

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 25,518 కరోనా పరీక్షలు నిర్వహించగా, 462 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. అత్యధికంగా హైదరాబాదులో 259 కొత్త కేసులు నమోదయ్యాయి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 40, రంగారెడ్డి జిల్లాలో 35 కేసులు గుర్తించారు.

Advertisement

Agnipath Scheme Row: బీజేపీ- కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ, పగిలిన వాహనాల అద్దాలు, ఇరువురిని తరిమికొట్టిన పోలీసులు, రేపు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం

Hazarath Reddy

సాయుధ దళాలకు రిక్రూట్‌మెంట్ కోసం అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా (Agnipath Scheme Row) కాంగ్రెస్ కార్యకర్తలు నిరసనకు వెళ్లడంతో శుక్రవారం మధ్యాహ్నం తెలంగాణలోని హన్మకొండలోని కాషాయం పార్టీ కార్యాలయం వెలుపల బిజెపి మరియు కాంగ్రెస్ కార్యకర్తలు ఘర్షణ పడ్డారని ( Congress, BJP workers clash in Telangana) పోలీసులు తెలిపారు.

Raghubar Das: హైదరాబాద్ పేరును భాగ్యనగర్‌గా మారుస్తాం, బీజేపీని అధికారంలోకి తీసుకురండి, జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి రఘుబర్ దాస్ సంచలన వ్యాఖ్యలు

Hazarath Reddy

తెలంగాణలో బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే హైదరాబాద్ పేరును భాగ్యనగర్‌గా మారుస్తామని జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ నాయకుడు రఘుబర్ దాస్ (Raghubar Das) శుక్రవారం అన్నారు.

Telangana: తెలంగాణ పుట్టుకనే ప్రశ్నించిన ప్రధాని మోదీ, హైదరాబాద్‌కు ఏ ముఖం పెట్టుకుని వస్తారు, బీజేపీ వల్ల దేశానికి ఉపయోగం లేదు, మండిపడిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

Hazarath Reddy

తెలంగాణకు కేంద్రం నుంచి ఒక మంచిపనైనా చేయించడం చేతగాని దద్దమ్మగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి (kisan Reddy) మిగిలిపోయారంటూ ఎమ్మెల్యే బాల్కసుమన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Yashwant Sinha to Visit Hyd: జూన్ 2న హైదరాబాద్‌కు రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హా, ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా రిసీవ్ చేసుకుంటారని తెలిపిన మంత్రి తలసాని

Hazarath Reddy

రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హా శనివారం ఉదయం హైదరాబాద్‌కు రానున్నట్లు (Yashwant Sinha to visit Hyd) పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌ తెలిపారు. ఈ మేరకు జలవిహార్‌లో మంత్రి తలసాని మాట్లాడుతూ.. 'యశ్వంత్‌సిన్హా పర్యటనలో ముఖ్యమంత్రి సహా మంత్రులు, గ్రేటర్‌ ప్రజాప్రతినిధులు హాజరవుతారు.

Advertisement

PM Modi to Visit Hyd: హైదరాబాద్‌లో ప్రధాని మోదీ పర్యటన పూర్తి షెడ్యూల్ ఇదే, ఈ నెల 3న రాజ్‌భవన్‌లో ప్రధాని నరేంద్ర మోదీ బస, పరేడ్‌ గ్రౌండ్స్‌లో ఈ నెల 3న బీజేపీ బహిరంగ సభ

Hazarath Reddy

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు భాగ్యనగరం సిద్ధమైంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రధాని నరేంద్ర మోదీ ఆ సమావేశాలకు (PM Modi to Visit Hyderabad) హాజరవుతున్నారు. మోదీతో పాటు సుమారు 35– 40 మంది కేంద్ర మంత్రులు, 18 రాష్ట్రాల ముఖ్య మంత్రులు పాల్గొననున్నారు. ప్రధాని మోదీ పర్యటనకు సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు.

TS TET Results 2022: తెలంగాణ టెట్‌ ఫలితాలు విడుదల, మీ ఫలితాలను tstet.cgg.gov.in లింక్ ద్వారా ద్వారా చెక్ చేసుకోండి

Hazarath Reddy

తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(TET) ఫలితాలు విడుదలయ్యాయి. శుక‍్రవారం ఉదయం 11.30 గంటలకు ఫలితాలను (TS TET Results 2022) అధికారులు వెల్లడించారు. కాగా, ఇప్పటికే టెట్‌ ఫైనల్‌ కీని టెట్ కన్వీనర్ రాధారెడ్డి విడుదల చేసిన విషయం తెలిసిందే.

TSRTC: తిరుమల దర్శనం టికెట్ దొరకలేదా.. అయితే టీఎస్‌ఆర్టీసీ వెబ్‌సైట్ నుంచి బస్ టికెట్ బుక్ చేసుకుని దర్శనం టికెట్ పొందండి, సదుపాయాన్ని కల్పించిన టీఎస్‌ఆర్టీసీ

Hazarath Reddy

తెలంగాణ నుంచి తిరుమలకు వెళ్లే భక్తులకు టీఎస్‌ఆర్టీసీ (TSRTC) శుభవార్తను అందించింది. ఇకపై బస్‌ టికెట్‌ రిజర్వేషన్ సమయంలో దర్శనం టిక్కెట్టును (Tirumala darshan ticket ) బుక్ చేసుకునే సదుపాయాన్ని కల్పించింది. ఈ సదుపాయం శుక్రవారం నుంచే అమలులోకి రానుంది.

Telangana Rythu Bandhu: రైతు బంధు మూడో రోజు రూ.1312.46 కోట్లు జమ, 10, 78,634 మంది రైతుల ఖాతాల్లోకి, మూడు రోజులలో 47,09,219 రైతుల ఖాతాల్లో రూ.3133.21 కోట్లు జమ చేశామని తెలిపిన మంత్రి

Hazarath Reddy

రాష్ట్రంలోని ల‌బ్ధిదారులంద‌రికీ రైతుబంధు (Telangana Rythu Bandhu) జ‌మ చేస్తున్నామ‌ని రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి నిరంజ‌న్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. రైతుబంధుపై ఆంక్ష‌లు పెడుతామ‌ని కొంద‌రు త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నార‌ని, ఎలాంటి ఆంక్ష‌లు లేవ‌ని ఆయ‌న తేల్చిచెప్పారు

Advertisement

BJP-TRS Hoarding War: టీఆర్ఎస్-బీజేపీల మధ్య ముదిరిన ఫ్లెక్సీల వార్, సాలు దొర సెలవు దొర అంటున్నకమల దళం, సాలు మోదీ సంపకు మోదీ అంటున్న కారు దళం

Hazarath Reddy

హైదరాబాద్ లో జులై 2 నుంచి బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు మొదలు కానున్నాయి. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఇతర కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, దేశం నలుమూలల నుంచి ప్రముఖ బీజేపీ నేతలు హాజరు కానున్నారు

TS SSC Supplementary Exams: ఆగ‌స్టు 1 నుంచి పదోతరగతి స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌లు, ఫెయిలైన విద్యార్థులు జులై 18వ తేదీ లోపు సంబంధిత పాఠ‌శాల‌ల్లో ఫీజు చెల్లించాలని తెలిపిన మంత్రి

Hazarath Reddy

తెలంగాణ ప‌దో త‌ర‌గ‌తి అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌లు ఆగ‌స్టు 1 నుంచి నిర్వ‌హించనున్న‌ట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి ప్ర‌క‌టించారు. ఈ ప‌రీక్ష‌లు 10వ తేదీ వ‌ర‌కు కొన‌సాగుతాయ‌ని వెల్ల‌డించారు. ఉద‌యం 9:30 నుంచి మ‌ధ్యాహ్నం 12:45 గంట‌ల వ‌ర‌కు నిర్వ‌హించ‌నున్నారు.

TS SSC Results 2022: పదోతరగతి ఫలితాలు విడుదలయ్యాయి, విద్యార్థులు తమ ఫలితాలను bse.telangana.gov.in, bseresults.telangana.gov.in ద్వారా చెక్ చేసుకోండి

Hazarath Reddy

పదో తర‌గతి వార్షిక పరీ‌క్షల ఫలి‌తాలు విడు‌దల అయ్యాయి. జూబ్లీ‌హి‌ల్స్‌‌లోని ఎంసీ‌ఆ‌ర్‌‌హె‌చ్చా‌ర్డీలో విద్యా‌శాఖ మంత్రి పీ సబి‌తా‌ఇం‌ద్రా‌రెడ్డి ఫలితాలను విడుదల చేశారు. విద్యా‌ర్థులు తమ ఫలి‌తా‌లను www.bse.telangana.gov. in, www.bseresults.telangana.gov.in, లోచూడ‌వచ్చు.

Bonalu Festival: రెండేళ్ల తరువాత బోనమెత్తిన భాగ్యనగరం, నెల రోజులపాటు అంగరంగ వైభవంగా సాగనున్న ఉత్సవాలు, గోల్కొండ జగదాంబిక అమ్మవారికి ప్రథమ పూజ

Hazarath Reddy

తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే ఆషాడం బోనాల సందడి మొదలైంది. నెల రోజులపాటు అంగరంగ వైభవంగా సాగనున్న ఉత్సవాలకు (Bonalu Festival) భాగ్యనగరంలోని ఆలయాలు అందంగా ముస్తాబవుతున్నాయి.

Advertisement
Advertisement