తెలంగాణ
Coronavirus in TS: తెలంగాణలో కొత్తగా 205 మందికి కరోనా పాజిటివ్, అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 79 కేసులు
Hazarath Reddyతెలంగాణలో బుధవారం 38,085 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 205 మందికి పాజిటివ్‌ వచ్చినట్లు ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 6,77,546కి చేరిందని తెలిపారు.
Singareni Strike:సింగరేణిలో సమ్మె సైరన్, బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణపై గళమెత్తిన కార్మికులు, నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి
Naresh. VNSసింగరేణి (Singareni )లో సమ్మె(strike) సైరన్ మోగింది. నాలుగు బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణ(commercial mining)కు వ్యతిరేకంగా కార్మికులు విధులను బహిష్కరించారు. మొదటి షిప్ట్‌ నుంచే కార్మికులు విధులకు హాజరుకాలేదు. దీంతో కోల్‌బెల్ట్‌(Coal Blet) వ్యాప్తంగా బొగ్గు ఉత్పత్తి ఎక్కడికక్కడ నిలిచిపోయింది. ఈ సమ్మె(strike) మూడు రోజులపాటు కొనసాగనుంది.
Telangana: తెలంగాణ కాంట్రాక్టు ఉద్యోగులకు గుడ్ న్యూస్, సర్వీసులను క్రమబద్ధీకరించే జీవో 16 అమలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు, ఇంప్లీడ్‌ పిటిషన్‌ కొట్టివేసిన తెలంగాణ అత్యున్నత న్యాయస్థానం
Hazarath Reddyకాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరించేందుకు తెలంగాణ ప్రభుత్వం 2016లో జారీచేసిన జీవో 16ను అమలుచేయాలని హైకోర్టు (High Court) మంగళవారం తీర్పునిచ్చింది. జీవో 16ను సవాల్‌చేస్తూ దాఖలైన ఇంప్లీడ్‌ పిటిషన్‌ కొట్టివేసింది. ఒక రిట్‌ను కొట్టేసిన విషయాన్ని దాచడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది.
Coron in TS: తెలంగాణలో కొత్తగా 203 కరోనా కేసులు, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 87 కొత్త కేసులు నమోదు
Hazarath Reddyతెలంగాణలో కొవిడ్ వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 40,730 కరోనా శాంపిల్స్ పరీక్షించగా, 203 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 87 కొత్త కేసులు నమోదు కాగా, రంగారెడ్డి జిల్లాలో 19, కరీంనగర్ జిల్లాలో 12, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 12 కేసులు గుర్తించారు.
Teenmaar Mallanna joins BJP: బీజేపీలో చేరిన తీన్మార్ మల్లన్న, పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని అందజేసిన పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జి తరుణ్ చుగ్
Hazarath Reddyతీన్మార్ మల్లన్న అలియాన్ చింతపండు నవీన్ బీజేపీలో చేరారు. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జి తరుణ్ చుగ్ సమక్షంలో ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్నకు తరుణ్ ఛుగ్ కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
Parliament Session 2021: మోదీది ఫాసిస్ట్ ప్ర‌భుత్వం, మోదీ ప్ర‌భుత్వంపై ప్ర‌జాక్షేత్రంలోనే తేల్చుకుంటాం, పార్లమెంట్‌ సమావేశాలను బహిష్కరించిన టీఆర్‌ఎస్‌ ఎంపీలు, బీజేపీపై మండిపాటు
Hazarath Reddyధాన్యం సేక‌ర‌ణ‌, విప‌క్ష ఎంపీల స‌స్పెన్ష‌న్ త‌దిత‌ర అంశాల‌పై కేంద్ర ప్ర‌భుత్వ వైఖ‌రికి నిర‌స‌న‌గా టీఆర్ఎస్ పార్ల‌మెంట్ స‌మావేశాల‌ను (Parliament Winter Session) బ‌హిష్క‌రించారు. శీతాకాల స‌మావేశాలు పూర్త‌య్యేవ‌ర‌కు పార్ల‌మెంట్ బ‌హిష్క‌రిస్తున్నామ‌ని (TRS MPs to boycott Parliament's Winter Session) వారు ప్ర‌క‌టించారు.
Coronavirus in TS: తెలంగాణలో గడచిన 24 గంటల్లో 195 మందికి పాజిటివ్, జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 78 కొత్త కేసులు నమోదు
Hazarath Reddyతెలంగాణలో గడచిన 24 గంటల్లో 37,108 కరోనా పరీక్షలు నిర్వహించగా, 195 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 78 కొత్త కేసులు నమోదయ్యాయి. కరీంనగర్ జిల్లాలో 14, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 14, రంగారెడ్డి జిల్లాలో 13 కేసులు వెల్లడయ్యాయి.
Telangana: తాగిన మత్తులో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన కూలీ, మహబూబ్‌ నగర్‌ జిల్లాలో విషాద ఘటన, మరో చోట భార్య కాపురానికి రావడంలేదని బావిలో పడి ఆత్మహత్య చేసుకున్న భర్త
Hazarath Reddyవెంకటయ్యకు మతిస్థిమితం సరిగ్గా పనిచేయడం లేదు. దానికి తోడు మద్యానికి బానిస (drinking alcohol) అయ్యాడు. శనివారం రాత్రి తాగిన మైకంలో అర్ధరాత్రి వేళ పక్కన ఉన్న రేకుల షెడ్డు లో ఉరి వేసుకొని ఆత్మహత్య ( insane person committed suicide) చేసుకున్నాడు.
Corona in TS: తెలంగాణలో కొత్తగా 156 మందికి కరోనా, జీహెచ్ఎంసీ పరిధిలో 54 కొత్త కేసులు
Hazarath Reddyతెలంగాణలో గడచిన 24 గంటల్లో 25,693 కరోనా పరీక్షలు నిర్వహించగా, 156 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో 54 కొత్త కేసులు వెల్లడి కాగా, కరీంనగర్ జిల్లాలో 47 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 147 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు.
Disha Rape And Murder Case: దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ ప్రాంతాన్ని పరిశీలించిన సిర్పూర్కర్‌ కమిషన్‌ సభ్యులు, స్థానికుల నుంచి తీవ్ర నిరసన..
Krishnaదిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ పై విచారణ జరుపుతున్న సిర్పూర్కర్‌ కమిషన్‌ ఆదివారం ఎన్ కౌంటర్ జరిగిన స్థలాన్ని పరిశీలించింది. మానవ హక్కుల సంఘాల దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు ఈ కమిషన్‌ను నియమించింది.
Rosaiah Last Rites: ముగిసిన మాజీ సీఎం రోశయ్య అంత్యక్రియలు, అశ్రునయనాల మధ్య ఆయన వీడ్కోలు పలికిన అభిమానులు, హాజరైన నేతలు
Naresh. VNSఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య(Rosaiah) అంత్యక్రియలు ముగిశాయి. కొంపల్లిలోని ఫామ్‌హౌస్‌లో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివిధ పార్టీల నేతలు హాజరయ్యారు. పెద్దసంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. ఏపీ(AP) ప్రభుత్వం తరఫున మంత్రులు బొత్స సత్యనారాయణ(Bosta Sathyanarayana), వెల్లంపల్లి(Vellampally), పేర్నినాని(Perni Nani), బాలినేని(Balineni) హాజరయ్యారు.
Shilpa Chowdary Case Update: చిట్టా విప్పుతున్న శిల్పా చౌదరి, రూ.10 వడ్డీకి ఓ మహిళకు అప్పు ఇచ్చి మోసపోయానన్న శిల్ప, తెరపైకి మరో మహిళా వ్యాపారవేత్త పేరు
Naresh. VNSఅప్పుల పేరుతో సెలబ్రెటీలు, వ్యాపారవేత్తలను కోట్ల రూపాయలు మోసం చేసిందని ఆరోపణలు ఎదుర్కుంటున్న శిల్పాచౌదరి (Shilpa chowdary) కేసులో ఆసక్తికరమైన అంశాలు బయటకు వస్తున్నాయి. శిల్ప వసూలు చేసిన డబ్బులను ఏం చేసిందనే కోణంలో ఇంటరాగేషన్ చేసిన పోలీసులకు(Police) పలు కీలక విషయాలు చెప్పింది.
Telangana Paddy Procurement: ముందు చేసుకున్న ఒప్పందానికి తెలంగాణ కట్టుబడి ఉండాలి, ధాన్యం సేక‌ర‌ణ‌పై ఎంపీ కేశవరావు ప్రశ్నకు బదులిచ్చిన పియూష్ గోయల్
Hazarath Reddyకేంద్రమంత్రి పియూష్ గోయల్ స్పష్టమైన సమాధానం (Minister Piyush Goyal Clarified) ఇచ్చారు. వానాకాలం పంటను పూర్తిగా కొంటామని వెల్లడించారు. గతంలో తెలంగాణతో చేసుకున్న ఒప్పందం (ఎంఓయూ) ప్రకారమే ధాన్యం కొనుగోలు ఉంటుందని స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలు అంశంపై తెలంగాణ సీఎం కేసీఆర్ తోనూ చర్చించినట్టు గోయల్ తెలిపారు. ముందు చేసుకున్న ఒప్పందానికి తెలంగాణ కట్టుబడి ఉండాలని హితవు పలికారు
Telangana Shocker: భర్త కళ్ల ముందే అల్లుడితో మేనత్త సెక్స్.. ఆ సీన్ చూస్తూ వీడియోలు తీసిన ఆమె భర్త, అనంతరం వీడియోతో అల్లుడిని బ్లాక్ మెయిల్ చేసిన దంపతులు, హైదరాబాద్‌లో దారుణ ఘటన
Hazarath Reddyహైదరాబాద్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. బాలుడిపై మేనత్త లైంగిక దాడి (Aunty molestation minor boy) చేయడమే కాకుండా డబ్బు కోసం బెదిరింపులకు పాల్పడింది. పద్నాలుగు సంవత్సరాల వయసున్న మేనల్లుడిని స్కూలు నుంచి లాడ్జికి తీసుకువెళ్లి తన కామవాంఛలను తీర్చుకుంది. అనంతరం ఆ దృశ్యాలను వీడియో తీసి బెదిరింపులకు (blackmail with Video in banjara hills) పాల్పడింది.
Telangana: ఫోన్ చేస్తే మాట్లాడని ప్రియురాలు, గొంతు కోసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ప్రియుడు, కామారెడ్డి జిల్లాలో విషాద ఘటన, మరో చోట అదనపు కట్నం వేధింపులకు పుట్టింట్లో ఆత్మహత్య చేసుకున్న నవవధువు
Hazarath Reddyకామారెడ్డి జిల్లాలోని దళితవాడలో విషాదం చోటు చేసుకుంది. ప్రేమించిన అమ్మాయి మాట్లాడటం లేదని ఓ యువకుడు గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నానికి (young man attempted suicide) పాల్పడ్డాడు. గొంతు కోసుకున్న వ్యక్తి నరేష్‌గా గుర్తించారు.
Coronavirus in Telangana: తెలంగాణలో విద్యాలయాల్లో కరోనా కలకలం, బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలలోనే 25 మంది బాలికలకు కరోనా పాజిటివ్‌, రాష్ట్రంలో కొత్తగా 189 మందికి కోవిడ్
Hazarath Reddyతెలంగాణలోని విద్యాలయాల్లో కరోనా కలకలం రేపుతోంది. వేర్వేరు గురుకులాలు, కేజీబీవీల్లో గురువారం 34 మంది విద్యార్థినులు కరోనా (Coronavirus in Telangana) బారినపడ్డారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం ఇంద్రేశంలోని మహత్మ జ్యోతిబాపూలే బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలలోనే 25 మంది బాలికలకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఈ విద్యాసంస్థలో బుధవారం ముగ్గురికి పాజిటివ్‌ వచ్చిన విషయం తెలిసిందే.
Vijay Bhaskar Reddy Murder Case: రియల్టర్‌ విజయ్‌భాస్కర్‌రెడ్డి హత్య కేసులో కొత్త కోణం, సోదరుడే దారుణంగా కాల్చి చంపేశాడు, మీడియాకు వివరాలను వెల్లడించిన సీనీ అంజనీకుమార్
Hazarath Reddyహైదరాబద్‌లోని తిరుమలగిరి ఠాణా పరిధిలో శవమై కనిపించిన రియల్టర్‌ తోట విజయ్‌భాస్కర్‌రెడ్డి హత్య కేసులో (Vijay Bhaskar Reddy Murder Case) కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఆర్థిక లావాదేవీల నేపథ్యంలోనే వరుసకు సోదరుడయ్యే తోట నరేందర్‌రెడ్డి నాటు తుపాకీతో కాల్చి చంపినట్టు (Alwal Realtor Vijay Bhaskar Reddy Murder) పోలీసులు గుర్తించారు.
Telangana: తెలంగాణలో ఒమిక్రాన్ అలజడి, యూకే నుంచి వచ్చిన మహిళకు కరోనా పాజిటివ్, మాస్క్ ధ‌రించ‌క‌పోతే రూ. 1,000 జ‌రిమానా, ప్ర‌తి ఒక్క‌రూ వ్యాక్సిన్ తీసుకోవాల‌ని కోరిన తెలంగాణ ప్ర‌జారోగ్య సంచాల‌కులు శ్రీనివాస్ రావు
Hazarath Reddyద‌క్షిణాఫ్రికాలో బ‌య‌ట‌ప‌డ్డ ఒమిక్రాన్ వేరియంట్ ఇప్ప‌టికే 24 దేశాల‌కు విస్త‌రించిన నేప‌థ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్త‌మైంది. నిన్న యూకే నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వ‌చ్చిన ఓ 35 ఏండ్ల మ‌హిళ‌కు క‌రోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింద‌ని రాష్ట్ర ప్ర‌జారోగ్య సంచాల‌కులు శ్రీనివాస్ రావు వెల్ల‌డించారు.
Hyderabad: దేశంలో అతి పెద్ద సైబర్ మోసం, రూ. వందల కోట్ల మోసాలకు పాల్పడుతున్న ముఠాలను అరెస్ట్ చేసిన సైబరాబాద్‌ పోలీసులు, మీడియాకు వివరాలు వెల్లడించిన సైబరాబాద్ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర
Hazarath Reddyదేశంలోనే అతిపెద్ద సైబర్‌ మోసం భాగ్యనగరంలో వెలుగు చూసింది. ఎస్‌బీఐ ధనీ బజార్‌, ద లోన్ ఇండియా, లోన్‌ బజార్ పేర్లతో నకిలీ కాల్‌సెంటర్లు ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా రూ.వందల కోట్ల మోసాలకు పాల్పడుతున్న ముఠాలను సైబరాబాద్‌ పోలీసులు (Cyberabad police) అరెస్టు చేశారు. ఈ వివరాలను సైబరాబాద్ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర (Cyberabad CP Stephen Ravindra) మీడియా సమావేశంలో తెలిపారు.
Telangana: ప్రమాణస్వీకారం చేసిన తెలంగాణ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలు, రాజ్యసభ సమావేశాల దృష్ట్యా బండా ప్రకాశ్‌ ప్రమాణ స్వీకారానికి గైర్హాజరు
Hazarath Reddyతెలంగాణలో ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీలుగా (MLC) ఎన్నికైన ఐదుగురు టీఆర్‌ఎస్‌ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. కడియం శ్రీహరి, గుత్తా సుఖేందర్‌రెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్‌రావు, పాడి కౌశిక్‌రెడ్డి, పీ వెంకట్రామిరెడ్డితో శాసన మండలిలోని తన చాంబర్‌లో ప్రొటెం చైర్మన్‌ భూపాల్‌ రెడ్డి ప్రమాణం చేయించారు. కాగా, రాజ్యసభ సమావేశాల దృష్ట్యా బండా ప్రకాశ్‌ ప్రమాణ స్వీకారానికి గైర్హాజరయ్యారు.