తెలంగాణ

Allu Arjun: కిమ్స్ ఆసుపత్రికి అల్లు అర్జున్.. శ్రీతేజ్‌ కు పరామర్శ.. హాస్పిటల్ వద్ద బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు

Rudra

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రికి వెళ్ళారు. సంధ్య థియేటర్ తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి అక్కడ చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్‌ ను ఆయన పరామర్శిస్తారు.

Chinese Thread Slits Man's Throat: గొంతు కోసిన ‘చైనా మాంజ’.. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో ఘటన (వీడియో)

Rudra

నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో ఘోరం జరిగింది. బైక్ పై చేపలు పట్టడానికి వెళ్తున్న ఓ వ్యక్తి గొంతుకను ‘చైనా మాంజ’ ఒక్కసారిగా తెగ్గోసింది. దీంతో అతనికి తీవ్ర గాయమయ్యింది. గుర్తించిన స్థానికులు ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి బాధితుడిని తరలించి చికిత్స అందిస్తున్నారు.

Inter Exams Fee: తెలంగాణలో ఇంటర్ పరీక్షల ఫీజు గడువు మూడోసారి పొడిగింపు.. రూ.2,500 అపరాధ రుసుముతో జనవరి 16 వరకు అవకాశం

Rudra

ఈ ఏడాది జరుగనున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల ఫీజు గడువును తెలంగాణ ఇంటర్ బోర్డు మరోసారి పొడిగించింది. ఈ మేరకు తెలంగాణ ఇంటర్ బోర్డు ఓ ప్రకటన విడుదల చేసింది.

Formula-E Car Race: ఫార్ములా ఈ-కారు రేస్‌ కేసులో కేటీఆర్‌ కు హైకోర్టులో ఊరట దక్కేనా?? క్వాష్‌ పిటిషన్‌ పై తీర్పు నేడే.. కోర్టు ఏం చెప్పనుంది? సర్వత్రా ఉత్కంఠ

Rudra

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫార్ములా ఈ-కారు రేస్‌ కేసులో కేటీఆర్‌ కు వేసిన క్వాష్ పిటిషన్ పై హైకోర్టు నేడు తీర్పు వెలువరించనుంది. ఈ తీర్పుతో కేటీఆర్ కు ఊరట లభిస్తుందా అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Advertisement

Car Catches Fire in Ghatkesar: వీడియో ఇదిగో, ఘట్‌కేసర్ వద్ద కారులో మంటలు, బయటకు వచ్చే అవకాశం లేక ఇద్దరు సజీవ దహనం

Hazarath Reddy

హైదరాబాద్‌లోని ఘట్‌కేసర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వరంగల్ నుంచి హైదరాబాద్ వైపు వస్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో చిక్కుకుని ముగ్గురు సజీవదహనం అయ్యారు. మరొకరు కారులోనే మృతి చెందారు. మృ‌తులు ఉప్పల్ వాసులుగా గుర్తించారు.

Formula E Race Case: కేటీఆర్‌కు మరోసారి నోటీసులు జారీ చేసిన ఏసీబీ, ఈ నెల 9వ తేదీన విచారణకు హాజరు కావాలని ఆదేశాలు, నేడు విచారణకు హాజరు కాకుండానే వెనక్కి వెళ్లిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్

Hazarath Reddy

హైదరాబాద్ ఫార్ములా ఈ-కార్ రేసింగ్ కేసులో కేటీఆర్‌కు ఏసీబీ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 9వ తేదీన విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో పేర్కొంది. గచ్చిబౌలి ఓరియన్ విల్లాలో కేటీఆర్‌కు ఏసీబీ అధికారులు నోటీసులు అందించారు. ఏసీబీ ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని సదరు దర్యాప్తు సంస్థ తన తాజా నోటీసుల్లో పేర్కొంది.

Aramghar-Zoo Park Flyover: వీడియో ఇదిగో, ఆరాంఘర్‌-జూపార్క్‌ ఫ్లై ఓవర్‌కు మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ పేరు, హైదరాబాద్‌లోనే రెండో అతిపెద్ద ఫ్లై ఓవర్ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

Hazarath Reddy

ఆరాంఘర్- జూ పార్క్ ఫ్లైఓవర్‌ (Aramghar Zoo Park flyover)ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఘనంగా ప్రారంభించారు. రూ.799 కోట్ల జీహెచ్ఎంసీ నిధులతో ఆరాంఘర్ చౌరస్తా నుంచి జూపార్క్ వరకూ 6 లైన్ల ఫ్లైఓవర్‌ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించింది. కాగా ఈ ఫ్లై ఓవర్ కు డాక్టర్ మన్మోహన్ సింగ్ పేరు పెట్టాలని సూచిస్తున్నానని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

Hyderabad: వీడియో ఇదిగో, హైదరాబాద్‌లో బీభత్సం సృష్టించిన చెత్త ఊడ్చే వాహనం, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు, పలు వాహనాలు ధ్వంసం

Hazarath Reddy

హైదరాబాద్ నగరంలోని మల్లాపూర్‌లో గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌(జీహెచ్‌ఎంసీ)కి చెందిన చెత్త ఊడ్చే వాహనం బీభత్సం సృష్టించింది. చెత్త ఊడ్చే వాహనాన్ని డ్రైవర్‌ రోడ్డుపై నిలిపి ఉంచాడు. హ్యాండ్‌ బ్రేక్‌ వేయకపోవడంతో వాహనం ముందుకు కదిలింది.

Advertisement

Telangana New Voter List: తెలంగాణలో సవరించిన ఓటరు జాబితా ఇదిగో, రాష్ట్రంలో మొత్తం 3,35,27,925 మంది ఓటర్లు,శేరిలింగంపల్లిలో అత్యధికంగా 7,65,982 మంది ఓటర్లు

Hazarath Reddy

తెలంగాణలో సవరించిన ఓటరు జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. రాష్ట్రంలో మొత్తం 3,35,27,925 మంది ఓటర్లు ఉన్నారు. 1,66,41,489 మంది పురుష ఓటర్లు... 1,68,67,735 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఈ జాబితా ప్రకారం 2,829 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు.

Mohan Babu: ముందస్తు బెయిల్ కోరుతూ సుప్రీంకోర్టులో మోహన్‌బాబు పిటిషన్, విచారణకు స్వీకరించిన ధర్మాసనం, తదుపరి విచారణ గురువారానికి వాయిదా

Hazarath Reddy

ఆస్తుల విషయంలో ఇటీవల మోహన్‌బాబు ఫ్యామిలీలో వివాదం నెలకొన్న సంగతి విదితమే. ఈ వివాదంలో జరిగిన ఘటనలపై పలు కేసులు నమోదు అయ్యాయి. తాజాగా ఈ కేసుల్లో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు.

Telangana Sankranti Holidays 2025: తెలంగాణలో జనవరి 11 నుంచి జనవరి 17వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు, జనవరి 18న తిరిగి పాఠశాలలు ప్రారంభం

Hazarath Reddy

తెలంగాణ ప్రభుత్వం తాజాగా సంక్రాంతి సెలవులను ప్రకటించింది. జనవరి 11 నుంచి జనవరి 17వ తేదీ వరకు మొత్తం వారం రోజుల పాటు సంక్రాంతి సెలవులు ఇస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. పాఠశాలలు తిరిగి జనవరి 18న అంటే శనివారం తెరుచుకోనున్నాయి.

Formula E Race Case: కోర్టు ఆదేశాలు లేనందునే తాము కేటీఆర్‌ వెంట వచ్చిన లాయర్‌ను అనుమతించలేదు, కేటీఆర్ వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చిన ఏసీబీ

Hazarath Reddy

ఫార్ములా ఈ కార్‌ రేసు కేసులో విచారణకు ఏసీబీ కార్యాలయంకు వచ్చిన మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ వెనుదిరిగారు. తన తరఫు న్యాయవాదిని లోనికి అనుమతించకపోవడంతో ఆయన వెళ్లిపోయారు. వెళ్లే క్రమంలో ఆయన తన లిఖితపూర్వక స్టేట్‌మెంట్‌ను ఏసీబీ డీఎస్పీకి అందజేసి వెనుదిరిగారు

Advertisement

World Telugu Federation Programme: వీడియో ఇదిగో, మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిన మరో నటుడు, తెలంగాణ ముఖ్యమంత్రి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అంటూ ప్రస్తావన

Hazarath Reddy

తెలుగు ప్రపంచ సమాఖ్య కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయి తెలంగాణ ముఖ్యమంత్రి పేరుగా మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పేరును ప్రస్తావించడం ఒక ఆసక్తికర ఘటనగా మారింది. ఈ ఘటనతో సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతోంది

KTR At ACB Office LIVE: ‘ఫార్ములా-ఈ’ కేసులో ఏసీబీ విచారణకు హాజరుకాకుండానే వెనుదిరిగిన కేటీఆర్.. తన లాయర్ ను లోపలికి అనుమతించకపోవడంతోనే.. (లైవ్ వీడియో)

Rudra

ఫార్ములా-ఈ కారు రేసు కేసులో బీఆర్ఎస్ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ విచారణ కోసం ఏసీబీ ఆఫీసుకు వచ్చి అరగంట తర్వాత వెనుదిరిగారు. తనతో తన న్యాయవాదిని లోపలికి అనుమతించకపోవడంతోనే తాను విచారణకు హాజరుకాకుండా వెనక్కి వెళ్తున్నట్టు ఆయన తెలిపారు.

Vikarabad Horror: డాక్టర్ నిర్లక్ష్యం.. నాలుగురోజుల పసికందు మృతి.. వికారాబాద్ లో దారుణం (వీడియోతో)

Rudra

డాక్టర్ నిర్లక్ష్యంతో ఓ నాలుగురోజుల పసికందు మృత్యువాతపడింది. ఈ ఘటన వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి సమయంలో బాబుకు ఎక్కిళ్లు వచ్చినట్టు చిన్నారి తల్లిదండ్రులు చెప్పారు.

KTR At ACB Office LIVE: ‘ఫార్ములా-ఈ’ కేసులో ఏసీబీ విచారణకు కేటీఆర్.. 40 ప్రశ్నలతో సిద్ధమైన అధికారులు.. ఇప్పటికే బీఆర్ఎస్ నేతల హౌజ్ అరెస్ట్ (లైవ్ వీడియో)

Rudra

ఫార్ములా-ఈ కారు రేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో బీఆర్ఎస్ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ను నేడు ఏసీబీ విచారించనుంది.

Advertisement

Formula-E Car Race: ‘ఫార్ములా-ఈ’ కేసులో ఏసీబీ విచారణకు కేటీఆర్.. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సహా వంద మంది బీఆర్ఎస్ నేతల ముందస్తు అరెస్ట్ లు

Rudra

ఫార్ములా-ఈ కారు రేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో బీఆర్ఎస్ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ను నేడు ఏసీబీ విచారించనుంది.

Leopard In Srishailam: శ్రీశైలంలో చిరుత పులి కలకలం.. పాతాళ గంగ మెట్ల దారిలో కనిపించిన మృగం (వీడియో)

Rudra

శ్రీశైలంలో చిరుత పులి కలకలం సృష్టించింది. పాతాళగంగ మెట్ల మార్గంలోని పూజారి సత్యనారాయణ ఇంటి ఆవరణలోకి అర్ధరాత్రి చిరుత వచ్చింది.

Formula-E Car Race: ‘ఫార్ములా-ఈ’ కేసులో నేడు ఏసీబీ విచారణకు కేటీఆర్.. రేపు ఈడీ విచారణ కూడా..

Rudra

ఫార్ములా-ఈ కారు రేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో బీఆర్ఎస్ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ను నేడు ఏసీబీ విచారించనుంది.

Accident In Tirumala: కొండపైకి కాలినడకన వెళ్తున్న భక్తులపైకి దూసుకెళ్లిన అంబులెన్స్.. ఇద్దరు మృతి.. తిరుమలలో ఘటన

Rudra

తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చంద్రగిరి మండలం నరశింగాపురం వద్ద తిరుమల కొండ మీదకు కాలినడకన వెళ్తున్న భక్తులపైకి ఓ 108 అంబులెన్స్ దూసుకెళ్లింది.

Advertisement
Advertisement