తెలంగాణ

TS Lockdown: తెలంగాణలో పాస్‌పోర్టు సేవలు నిలిపివేత, దీంతో పాటు ఆగిపోయిన రిజిస్ట్రేషన్‌ కార్యకలాపాలు, ప్రజలెవరూ రిజిస్ట్రేషన్ల కోసం రావొద్దని తెలిపిన అధికారులు

Hazarath Reddy

తెలంగాణలో ఈ నెల 12వ తేదీ నుంచి విధించిన లాక్‌డౌన్‌ (TS Lockdown) కారణంగా అన్ని రకాల పాస్‌పోర్టు సేవలను నిలిపివేశారు. ఈ మేరకు హైదరాబాద్‌ ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి దాసరి బాలయ్య ఓ ప్రకటనలో తెలిపారు.

Telangana: ఈ సమయాలు తప్పక గుర్తించుకోవాలి..బస్సులు,మెట్రో రైళ్లు తిరిగే వేళలు, మందుబాబులు మందు కొనుగోలు చేయాల్సిన సమయం, బార్లకు వెళ్లే వారు ఏ సమయంలో వెళ్లాలి, తెలంగాణ లాక్‌డౌన్ నేపథ్యంలో వీటి సమయాల గురించి తెలుసుకోండి

Hazarath Reddy

తెలంగాణలో లాక్‌డౌన్‌ కాలంలోనూ మద్యం విక్రయాలకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. అయితే అన్ని రకాల కార్యకలాపాలకు అనుమతినిచ్చిన ఉదయం 6 గంటల నుంచి 10 గంటల మధ్య మాత్రమే వైన్‌ షాపులు, బార్, రెస్టారెంట్‌లు (iquor-shops-timings) తెరుచుకోవచ్చని స్పష్టం చేసింది.

Lockdown in TS: అత్యవసర ప్రయాణాలకూ ఈ-పాస్ తప్పనిసరి! తెలంగాణలో నేటి నుంచి లాక్‌డౌన్ అమలు, ఉదయం 10 గంటల తర్వాత లాక్‌డౌన్ ఆంక్షలు ప్రారంభం, క్షేత్రస్థాయిలో కఠినంగా అమలు పరచాలని పోలీసు అధికారులకు ఆదేశాలు

Team Latestly

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి లాక్డౌన్ ను క్షేత్రస్థాయిలో కఠినంగా అమలు చేయాలని డిజిపి మహేంధర్ రెడ్డి పోలీసు అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం మినహాయింపులు ప్రకటించిన వాటికి మినహా మిగతా ఎలాంటి కార్యకలాపాలకు అనుమతి లేదని డిజిపి స్పష్టం చేశారు. వివాహాలకు ముందస్తు అనుమతి తీసుకోవాలి...

COVID in TS: తెలంగాణలో క్రమంగా తగ్గుతున్న రోజూవారీ పాజిటివ్ కేసులు, తాజాగా 4,801 కోవిడ్ కేసులు నమోదు, 7 వేల మందికి పైగా రికవరీ, రాష్ట్రంలో 60,136కు తగ్గిన ఉన్న ఆక్టివ్ కేసుల సంఖ్య

Team Latestly

తెలంగాణలో సెకండ్ వేవ్ కరోనా విజృంభన కొనసాగుతోంది. అయితే ప్రతిరోజు నమోదయ్యే కేసుల్లో మాత్రం గణనీయమైన మార్పులేమి లేవు. కేసులు సుమారుగా 5 వేల లోనే ఉంటున్నాయి. మరోవైపు రికవరీల సంఖ్య పెరుగుతుండటం ఊరట కలిగించే విషయం...

Advertisement

Lockdown Guidelines: లాక్‌డౌన్ మార్గదర్శకాలను విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం, లాక్‌డౌన్ నిబంధనలు ఎలా ఉన్నాయి మరియు ఏయే రంగాలకు ప్రభుత్వం మినహాయింపు కల్పించిందో తెలుసుకోండి

Team Latestly

ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు ప్రజల అవసరాల కోసం సడలింపు ఉంటుంది. ఈ 4 గంటల పాటు అన్ని రకాల కార్యకలాపాలకు అనుమతి ఉంటుంది. అన్ని షాపులు తెరుచుకోవచ్చు. ఈ సమయంలో మద్యం షాపులు కూడా తెరుచుకోవచ్చని...

TS Lockdown: వైన్‌ షాపుల ఎదుట నో స్టాక్ బోర్డులు, మద్యం షాపులకు పోటెత్తిన మద్యం ప్రియులు, రేపటి నుండి లాక్‌డౌన్ ప్రకటనతో పది రోజులకు సరిపడా మద్యం కొనుగోలు చేస్తున్న మందుబాబులు

Hazarath Reddy

రేపటి నుంచి తెలంగాణలో 10 రోజుల పాటు లాక్‌డౌన్ (TS Lockdown) విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేసిన నేపథ్యంలో (Lockdown Effect) రాజధానిలో మందుబాబులు అప్రమత్తం అయ్యారు. లాక్ డౌన్ కారణంగా మద్యం దుకాణాల వేళలపై స్పష్టత లేకపోవడంతో ముందే జాగ్రత్తపడుతూ, వైన్ షాపులకు పోటెత్తారు. హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా ఏ వైన్ షాపు ముందు చూసినా మందుబాబుల రద్దీ (Long queues at alcohol shops) కనిపించింది.

Lockdown in TS: లాక్‌డౌన్‌పై సీరియస్ అయిన తెలంగాణ హైకోర్టు, రేపటి నుంచి లాక్‌డౌన్‌ అంటే ప్రజల పరిస్థితి ఏంటీ? అంబులెన్స్‌లను సరిహద్దుల్లో ఎందుకు ఆపుతున్నారంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ధర్మాసనం

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టు అత్యవసర విచారణ చేపట్టింది. కోవిడ్‌-19 నిర్ధారణ పరీక్షలు తగ్గిండంపై ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆదేశాలు బేఖాతరు చేస్తే కోర్టు ధిక్కారణ నోటీసులు ఇస్తామని హెచ్చరించింది. సరిహద్దుల్లో అంబులెన్స్‌లను నిలిపివేయవద్దని తెలంగాణకు సర్కార్‌‌ను (Telangana government) హైకోర్టు ఆదేశించింది. సరిహద్దుల్లో అంబులెన్స్‌ నిలిపివేతపై ఆదేశాలేమైనా ఉన్నాయా? అని సూటిగా ప్రశ్నించింది.

Telangana Lockdown: తెలంగాణలో 10 రోజుల పాటు లాక్‌డౌన్, బుధవారం ఉదయం 10 గంటల నుంచి అమల్లోకి, టీకా కొనుగోళ్ల కోసం గ్లోబల్ టెండర్లను పిలవాలని క్యాబినెట్ నిర్ణయం

Hazarath Reddy

Advertisement

Coronavirus Pandemic: కరోనాతో కొడుకు మృతి, తట్టుకోలేక గుండెపోటుతో తల్లిదండ్రులు కన్నుమూత, హైదరాబాద్ కాప్రాలో విషాద ఘటన, ఎన్నో కుటుంబాల్లో ఇలాంటి విషాద ఘటనలే..

Hazarath Reddy

దేశంలో కరోనావైరస్ మహమ్మారి జీవితాలను చిధ్రం చేస్తోంది. కుటుంబాలకు కుటుంబాలే కరోనా దెబ్బకు (Coronavirus Pandemic) కాటికి వెళుతున్నాయి. ఏ కుటుంబంలో చూసినా ఇలాంటి విషాద గాధలే కనిపిస్తున్నాయి.

TSRTC Cargo: టీఎస్ఆర్టీసీ మరో కీలక నిర్ణయం, పార్శిల్‌, కార్గొ స‌ర్వీసుల‌ సేవ‌ల‌ను తాత్కాలికంగా ర‌ద్దు చేస్తున్నట్లు ప్రకటన, ప‌రిస్థితులు కుదుట‌ప‌డిన తరువాతే సేవల పునురుద్ధరణకు అవకాశం

Hazarath Reddy

ఇప్పటికే కరోనా ప్రభావంతో భారీగా ఆదాయాన్ని కోల్పోయిన టీఎస్ఆర్టీసీ (TSRTC) మరో కీలక నిర్ణయం తీసుకుంది. కర్ఫ్యూ నేపథ్యంలో ప్రయాణికులు బస్సులను ఎక్కేందుకు ఆసక్తి చూపకపోవడంతో ప్యాసింజ‌ర్ స‌ర్వీసుల‌ను తగ్గించుకున్న టీఎస్ఆర్టీసీ (Telangana State Road Transport Corporation (TSRTC) తాజాగా పార్శిల్‌, కార్గొ స‌ర్వీసుల‌ సేవ‌ల‌ను (cargo-parcel-service) తాత్కాలికంగా ర‌ద్దు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

Cabinet Meet on Lockdown: తెలంగాణలో లాక్‌డౌన్‌పై భిన్నాభిప్రాయాలు, నేడు నిర్ణయం తీసుకోనున్న రాష్ట్ర కేభినేట్; ఇతర రాష్ట్రాలకు చెందిన కరోనా రోగులతో నిండిపోతున్న ఆసుపత్రులు, సరిహద్దు వద్ద కట్టడి చేస్తున్న టీఎస్ పోలీసులు

Team Latestly

పొరుగు రాష్ట్రాల్లో వేల సంఖ్యలో కేసులు నమోదవుతుండటం, అదే సమయంలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్ ఘర్ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో కోవిడ్ రోగులు వైద్యం కోసం హైదరాబాద్ మరియు తెలంగాణలోని సరిహద్దు జిల్లాల ఆసుపత్రుల్లో చేరుతుండటంతో వారి తోనే తెలంగాణలోని ఆసుపత్రులు...

Corona in Telangana: పొరుగు రాష్ట్రాల కంటే తెలంగాణలో కోవిడ్ తీవ్రత తక్కువే.. రాష్ట్రంలో కొత్తగా 4,826 పాజిటివ్ కేసులు నమోదు, 62,797గా ఉన్న ఆక్టివ్ కేసుల సంఖ్య

Team Latestly

చుట్టూ ఉన్న ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో కోవిడ్ పరిస్థితులు మితంగానే ఉన్నట్లు ఆరోగ్య శాఖ నివేదికల ద్వారా తెలుస్తుంది. గడిచిన ఒక్కరోజులో తెలంగాణ పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్‌లో 22,164 కేసులు, కర్ణాటకలో 47,930, మహారాష్ట్రలో 48,401, అటు తమిళనాడులో 28,897, కేరళలో 35,801 కేసుల చొప్పున నమోదయ్యాయి....

Advertisement

Partial Lockdown: తెలంగాణ సరిహద్దులో ఏపీ అంబులెన్సులు నిలిపివేత, కరోనా పేషెంట్లను తెలంగాణలోకి అనుమతించని పోలీసులు, ప్రభుత్వం ఆదేశాలను అమలు చేస్తున్నామని తెలిపిన తెలంగాణ పోలీసులు

Hazarath Reddy

కరోనా వైరస్ కు చికిత్స కోసం ఆంధ్ర‌ప్ర‌దేశ్ నుంచి తెలంగాణకు వ‌చ్చే క‌రోనా రోగుల‌ వాహనాలను (: Telangana police stop entry of AP Ambulance vehicles) తెలంగాణ పోలీసులు అనుమ‌తించ‌ట్లేదు. ఏపీ సరిహద్దును దాటి వస్తున్న పేషెంట్లను తెలంగాణ పోలీసులు (TS Police) సరిహద్దు వద్దే నిలుపుదల చేస్తున్నారు.

Telangana: తెలంగాణలో డాక్టర్లు, పారా మెడికల్ సిబ్బంది నియామకాలకు సీఎం కేసీఆర్ ఆదేశం, డెలివరీ బాయ్స్‌కు వ్యాక్సినేషన్ చేపట్టాలని కేంద్రానికి సూచన, ఉన్నతస్థాయి సమీక్షలో సీఎం కీలక నిర్ణయాలు

Team Latestly

వరంగల్, అదిలాబాద్ జిల్లాల్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ను తక్షణమే ప్రారంభించాలని, వైద్య సిబ్బందిని నియమించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. కాకతీయ మెడికల్ కాలేజీ ఆవరణలో నిర్మించిన ఎంజిఎం కు చెందిన 250 పడకల సూపర్ స్పెషాలిటీ దవాఖానను, అదిలాబాద్ జిల్లా రిమ్స్ లోని మరో 250 పడకల సూపర్ స్పెషాలిటీ దవాఖానను తక్షణమే ప్రారంభించాలని ...

TS Corona Update: తెలంగాణలో ఆక్సిజన్ అందక ముగ్గురు కరోనా పేషెంట్లు మృతి, రాష్ట్రంలో తాజాగా 4,976 మందికి కరోనా పాజిటివ్, 35 మంది మృతితో 2,739కి చేరుకున్న మరణాల సంఖ్య

Hazarath Reddy

కింగ్‌కోఠి ఆస్పత్రిలో ముగ్గురు కరోనా రోగులు మృతి చెందారు. ఆక్సిజన్ సమయానికి అందక రోగులు చనిపోయారు. జడ్చర్ల నుంచి ఆస్పత్రికి రావాల్సిన ట్యాంకర్ ఆలస్యమైంది. ట్యాంకర్ డ్రైవర్ రూటు మర్చిపోవడంతో సమస్య తలెత్తింది. ఈలోపు ఆక్సిజన్ అందక ముగ్గురు మృత్యువాత పడ్డారు.

TS MInister Koppula Eshwar Covid: కొప్పుల ఈశ్వర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ, హోం క్వారంటైన్‌లో తెలంగాణ మంత్రి, ఆయన కుటుంబ సభ్యులకు కూడా కరోనా పాజిటివ్‌గా నిర్థారణ

Hazarath Reddy

తెలంగాణ మంత్రి కొప్పుల ఈశ్వర్ కు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. తెలంగాణ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఆయన కుటుంబ సభ్యులకు కూడా కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. గత రెండురోజులుగా అస్వస్థతగా ఉండడంతో ఆయన కోవిడ్19 పరీక్షలు చేయించుకున్నారు.

Advertisement

TS Covid Report: తెలంగాణలో తాజాగా 5,186 మందికి కరోనా, ఉస్మానియా జర్నలిజం ప్రొఫెసర్‌ బాలస్వామి కరోనాతో కన్నుమూత, 38 మంది మృతితో 2,704కి చేరుకున్న మొత్తం మరణాల సంఖ్య

Hazarath Reddy

తెలంగాణలో గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో 69,148 కరోనా పరీక్షలు చేపట్టగా 5,186 పాజిటివ్ కేసులు (TS Covid Report) గుర్తించారు. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 904 కొత్త కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 7,994 మంది కరోనా నుంచి కోలుకోగా, 38 మంది మృతి (Covid Deaths) చెందారు.

Putta Madhu Arrested: పెద్ద‌ప‌ల్లి జిల్లా ప‌రిష‌త్ చైర్మ‌న్ పుట్ట మ‌ధు అరెస్ట్, భీమ‌వ‌రంలో అదుపులోకి తీసుకున్న రామ‌గుండం టాస్క్‌ఫోర్స్ పోలీసులు, వామ‌న్ రావు దంప‌తుల హ‌త్య కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న మధు

Hazarath Reddy

పెద్ద‌ప‌ల్లి జిల్లా ప‌రిష‌త్ చైర్మ‌న్ పుట్ట మ‌ధును రామ‌గుండం టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు (Peddapalli zilla parishad chairman Putta Madhu arrested) చేశారు. గ‌త వారం రోజులుగా పుట్ట మ‌ధు అదృశ్య‌మైన సంగ‌తి తెలిసిందే. భీమ‌వ‌రంలో పుట్ట మ‌ధును అరెస్టు (Putta Madhu Arrested) చేసిన పోలీసులు.. పెద్ద‌ప‌ల్లి జిల్లాకు తీసుకొచ్చారు.

TS Covid Update: తెలంగాణలో మూడు ప్రమాదకర వేరియంట్లు, బెల్లంపల్లి ఐసొలేషన్‌ కేంద్రంలో ఊపిరాడక 12 మంది మృతి, రాష్ట్రంలో మరిన్ని ఆంక్షలు అమల్లోకి, తాజాగా 5,559 మందికి కరోనా, మే 15 వరకు రాత్రి కర్ఫ్యూ పొడిగింపు

Hazarath Reddy

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 65,375 కరోనా పరీక్షలు నిర్వహించగా 5,559 మందికి పాజిటివ్ (Telangana logs 5,559 Covid-19 cases) అని వెల్లడైంది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 984 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పలు జిల్లాల్లో రెండంకెల్లోనే కొత్త కేసులు రావడం తాజా బులెటిన్ లో చూడొచ్చు.

Abdullapurmate Road Accident: తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం, సీఐ దంపతులు మృతి, లారీని ఢీకొన్న స్విఫ్ట్‌ కారు, సూర్యాపేట నుండి హైదరాబాద్ వస్తుండగా ప్రమాదం

Hazarath Reddy

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ నగర శివార్లలోని అబ్దుల్లాపూర్‌మేట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (AbdullapurMate Road Accident) చోటుచేసుకుంది. శనివారం తెల్లవారుజామున ఆగి ఉన్న ఓ లారీని స్విఫ్ట్‌ కారు వేగంగా వెళ్లి ఢీకొట్టింది. దీంతో కారు నుజ్జునుజ్జు అయింది. అందులో ప్రయాణిస్తున్న హైదరాబాద్ సుల్తాన్ బజార్ సీఐ ఎస్‌. లక్ష్మణ్ (Sultan Bazar CI Lakshman), ఆయన భార్య ఝాన్సి అక్కడికక్కడే మృతి చెందారు.

Advertisement
Advertisement