టెక్నాలజీ

X Down? ఎక్స్ డౌన్.. ట్రై రీలోడింగ్ ఎర్రర్ వస్తుందంటూ సోషల్ మీడియాలో గగ్గోలు పెడుతున్న నెటిజన్లు

Advertisement

టెక్నాలజీசெய்திகள்

Huawei Triple Foldable Phone: ఇది ఫోల్డబుల్‌ ఫోన్ మాత్రమే కాదు...అంతకు మించి! ఈ ఫోన్ ఉంటే ల్యాప్‌టాప్‌ అవసరమే లేదు

VNS

ఫోల్డబుల్ ఫోన్ల గురించి తెలుసు. కీ ప్యాడ్ మొబైల్స్, స్మార్ట్ ఫోన్ల గురించి తెలుసు కానీ...ఇది అంతకు మించి. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా మూడు మడతల్లో వస్తుంది. సాధారణంగా ఒకటి లేదా రెండు మడతల్లో ఫోన్లను చూసి ఉంటారు. ఈ ఫోల్డబుల్ ఫోన్ మాత్రం మూడు మడతలుగా ఓపెన్ చేయొచ్చు.

Cyber Fraud in Hyderabad: హైదరాబాద్‌లో నకిలీ కాల్ సెంటర్ గుట్టు రట్టు, అమెరికా పౌరులను లక్ష్యంగా చేసుకుని లక్షలాది డాలర్లు హాంఫట్,సైబర్ సెక్యూరిటీ బ్యూరో దాడిలో షాకింగ్ విషయాలు వెలుగులోకి..

Hazarath Reddy

హైదరాబాద్లో మరో నకిలీ కాల్సెంటర్ గుట్టు రట్టయింది. కాల్ సెంటర్ పేరుతో మాదాపూర్ కేంద్రంగా అమెరికన్లను మోసం చేస్తున్న నార్త్ ఇండియాకు చెందిన ముఠా సైబర్ మోసాలకు చెక్ పెట్టింది తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో.

EPF withdrawal via UPI: ఇక పీఎఫ్‌ విత్‌డ్రా చేయడం చాలా సులభం, యూపీఐ ద్వారా కూడా విత్‌డ్రా చేసుకునే సౌకర్యాన్ని అందుబాటులోకి తేనున్న కేంద్రం

VNS

ఉద్యోగ భవిష్య నిధి (EPF) నుంచి నగదు విత్‌డ్రా ఇకపై సులభతరం కానుంది. బ్యాంక్‌ ఖాతాల మాదిరిగానే ఈపీఎఫ్‌ నగదును కూడా విత్‌ డ్రా (EPF Withdraw) చేసుకునే సదుపాయం అందుబాటులోకి రానుంది. ఏటీఎంతో పాటు యూపీఐ (UPI) ద్వారా కూడా నగదు ఉపసంహరించుకునే సదుపాయాలు త్వరలో అందుబాటులోకి రాబోతున్నాయి.

Tech Layoffs 2025: టెక్ రంగంలో భారీగా ఉద్యోగాల కోత, 18,397 మందిని తొలగిస్తున్న 74 కంపెనీలు, దూసుకొస్తున్న ఆర్థికమాంద్య భయాలే కారణం

Hazarath Reddy

టెక్ రంగంలో అగ్రగామిగా ఉన్న వివిధ కంపెనీలు 2025లో ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించాయి. టెక్నాలజీ రంగంలో ఉద్యోగాల కోత చాలా మంది ఉద్యోగులను ఆందోళనకు గురిచేస్తోంది, ఎందుకంటే వారు తదుపరి ఉద్యోగాలు కోల్పోతారనే భయంతో ఉన్నారు.

Advertisement

Ola Electric Layoffs: ఆగని లేఆప్స్, ఐదు నెలల్లోనే రెండో రౌండ్‌‌లో 1000 మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్న ఓలా ఎలక్ట్రిక్

Hazarath Reddy

నష్టాలతో సతమతమవుతోన్న కంపెనీ పెరుగుతున్న నష్టాలను తగ్గించుకునే ప్రయత్నాలలో భాగంగా 1,000 మందికి పైగా ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులను తొలగించాలని (Lay off) యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

Samsung Unveils Mid Range Phones: ప్రీమియం ఫోన్లలో ఉండే ఫీచర్లతో మిడ్‌ రేంజ్‌ మొబైల్స్‌, శాంసంగ్ నుంచి వచ్చిన ఈ మూడు మొబైల్స్ నిజంగా గేమ్‌ ఛేంజర్స్‌

VNS

శాంసంగ్ నుంచి మిడ్‌ రేంజ్‌లో ఏఐ పవరెడ్‌ గెలాక్సీ A56, A36 A26 ఫోన్లు వచ్చేశాయి. ధరలు అంతగా భారీగా లేకుండా, ఫీచర్లు అధికంగా ఉండే ఈ స్మార్ట్‌ఫోన్‌లను శాంసంగ్ ఆదివారం విడుదల చేసింది. ఏఐ సపోర్ట్‌తో, చాలా కాలం పాటు సాఫ్ట్‌వేర్ సపోర్ట్‌ను అందించేలా, స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో శాంసంగ్ తన పట్టును మరింత బలోపేతం చేసుకునేలా వీటిని తీసుకొచ్చింది.

ISRO: మరో ప్రయోగానికి సిద్ధమవుతున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ, స్పేడెక్స్‌ ప్రయోగాలకు మరోసారి రంగం సిద్ధం

VNS

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) ఈ ఏడాది జనవరిలో రెండు ఉపగ్రహాలను సక్సెస్‌ఫుల్‌గా అనుసంధానం చేసిన విషయం తెలిసిందే. స్పేడెక్స్‌ డాకింగ్‌ ప్రక్రియను పూర్తిచేసిన ఇస్రో ఇప్పుడు ఈ ప్రయోగాలను మళ్లీ చేసేందుకు రెడీ అవుతోంది. ఈ నెల 15 నుంచి ఈ ప్రయోగాలు చేపట్టనున్నట్లు తాజాగా ఇస్రో చీఫ్ వీ నారాయణన్‌ (Narayan) చెప్పారు

UPI Transactions: జనవరి నెలలో 1,699 కోట్ల యూపీఐ లావాదేవీలు, దేశవ్యాప్తంగా జరిగే మొత్తం రిటైల్‌ చెల్లింపుల్లో 80 శాతానికిపైగా దీని ద్వారానే..

Hazarath Reddy

యూపీఐ లావాదేవీలు జనవరి 2025లో రికార్డు స్థాయిలో 16.99 బిలియన్(1,699 కోట్లు)లకు చేరుకున్నాయి. వీటి మొత్తం విలువ రూ.23.48 లక్షల కోట్లు దాటింది. దేశవ్యాప్తంగా జరిగే మొత్తం రిటైల్‌ చెల్లింపుల్లో యూపీఐ ద్వారా జరిగే లావాదేవీలే 80 శాతానికిపైగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. 641 బ్యాంకులు, 80 యూపీఐ యాప్‌లు ఈ వ్యవస్థలో భాగస్వామ్యం అయ్యాయి.

Advertisement

Techie Dies by Suicide: వీడియో ఇదిగో, భార్య వేధింపులు తట్టుకోలేక మరో సాప్ట్‌వేర్ ఆత్మహత్య, పెళ్లయిన ఏడాదికే సూసైడ్, దయచేసి మగవాళ్ల గురించి ఎవరైనా మాట్లాడాలని సెల్ఫీ వీడియో

Hazarath Reddy

ఆగ్రాలో జరిగిన ఒక విషాద సంఘటనలో, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS)లో రిక్రూట్‌మెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్న మానవ్ శర్మ ఫిబ్రవరి 24 రాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మరణానికి ముందు, మానవ్ ఒక హృదయ విదారక వీడియోను రికార్డ్ చేశాడు,

Samsung Galaxy M16 5G Specifications: తక్కువ బడ్జెట్‌లో పవర్‌ఫుల్‌ 5G ఫోన్ తెచ్చిన శాంసంగ్, మార్కెట్లోకి గెలాక్సీ M16, గెలాక్సీ M06 5G ఫోన్లు, ధరతో పాటూ పూర్తి వివరాలివిగో..

VNS

శాంసంగ్‌ గెలాక్సీ ఎం 16 5జీ (Samsung Galaxy M16 5G), శాంసంగ్‌ గెలాక్సీ ఎం06 5జీ (Samsung Galaxy M06 5G) ఫోన్లు ఉన్నాయి. ఈ ఫోన్లు రెండు మీడియాటెక్‌ డైమెన్సిటీ (MediaTek Dimensity 6300) చిప్‌సెట్లు, 5000 ఎంఏహెచ్‌ (5,000mAh) సామర్థ్యం గల బ్యాటరీలతో ఉంటాయి.

YouTuber Local Boy Nani Arrest: యూట్యూబర్ లోకల్ బాయ్ నానికి మార్చి 7 వరకు రిమాండ్ విధించిన కోర్టు, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయడంతో అరెస్ట్

Hazarath Reddy

విశాఖపట్నానికి చెందిన యూట్యూబర్, సోషల్‌మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌ వాసుపల్లి నాని అలియాస్ లోకల్ బాయ్ నానిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి విదితమే.తాజాగా యూట్యూబర్ లోకల్ బాయ్ నానికి మార్చి 7 వరకు రిమాండ్ విధించింది కోర్టు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయడంతో బాధితుడు కుమార్ రెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదుతో కేసు నమోదు అయింది.

Bio Asia 2025: అట్టహాసంగా ప్రారంభమైన బయో ఏషియా-2025 సదస్సు.. హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ప్రత్యేక ఆకర్షణగా హైదరాబాదీల స్మార్ట్ నోట్ బుక్ (లైవ్ వీడియో)

Rudra

ఔషధాలు, లైఫ్‌ సైన్సెస్‌ రంగానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే బయో ఏషియా-2025 వార్షిక సదస్సు కాసేపటి క్రితం హెచ్‌ఐసీసీలో ప్రారంభమైంది.

Advertisement

World's First AI Powered Reusable Smart Notebook: ప్రపంచంలోనే మొట్టమొదటి ఏఐ ఆధారిత పునర్వినియోగ స్మార్ట్‌ నోట్‌ బుక్‌.. అభివృద్ధి చేసిన హైదరాబాదీ టెకీలు.. విశేషాలు చూస్తే, అబ్బురపడాల్సిందే!!

Rudra

యువత తలచుకుంటే అద్భుతాలని ఆవిష్కరిస్తారు అని మరోసారి నిరూపించారు ఓ యువత్రయం. అమెరికాలో నివసిస్తున్న కేసరి సాయికృష్ణ సబ్నివీసు, రఘురాం తటవర్తి.. హైదరాబాద్ లో ఉంటున్న తన స్నేహితుడు సుమన్ బాలబొమ్ముతో కలిసి ప్రపంచంలోనే మొట్టమొదటి ఏఐ ఆధారిత పునర్వినియోగ స్మార్ట్‌ నోట్‌ బుక్‌ ను అభివృద్ధి చేశారు.

New Virus in China: చైనాలో మరోసారి వైరస్ కలకలం, జంతువుల నుంచి మనుషులకు సోకుతున్న వైరస్‌ను గుర్తించిన సైంటిస్టులు

VNS

చైనా(China)లో కొవిడ్‌ మాదిరిగా ఉన్న కొత్త వైరస్‌ను పరిశోధకులు గుర్తించారు. జంతువుల నుంచి మానవులకు సంక్రమించే ముప్పు ఉన్నట్లు భావిస్తున్నారు. గబ్బిలాల్లో గుర్తించిన ఈ కొత్త వైరస్‌ను ‘హెచ్‌కెయూ5- కోవ్‌-2’గా పేర్కొన్నారు. ఇది కొవిడ్‌ 19కి కారణమైన SARS-CoV-2ను పోలి ఉన్నట్లు పరిశోధనల్లో గుర్తించినట్లు హాంకాంగ్‌కు చెందిన ‘సౌత్‌చైనా మార్నింగ్‌ పోస్ట్‌’ పత్రిక తన కథనంలో పేర్కొంది.

PNB Reduced Interest Rates: హోం లోన్‌, కార్‌ లోన్‌ ఉందా? మీకు గుడ్‌న్యూస్‌, ఆర్బీఐ నిర్ణయంతో వడ్డీ రేట్లు తగ్గించిన బ్యాంకు

VNS

ప్రభుత్వ రంగ పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (Punjab National Bank) రిటైల్‌ రుణాలపై వడ్డీ రేట్లను 25 బేసిస్‌ పాయింట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో గృహ, ఆటో, కార్‌, ఎడ్యుకేషన్‌, పర్సనల్‌ లోన్స్‌ ఉన్నాయి. ఆర్‌బీఐ ద్రవ్య విధాన కమిటీ రెపోరేటును 25 బేసిస్‌ పాయింట్ల తగ్గించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పీఎన్‌బీ వడ్డీ రేట్లను సవరించింది

Tesla Showrooms in India: భారత్‌లోకి ఎంట్రీ ఇస్తున్న టెస్లా, ఆ రెండు నగరాల్లో షోరూంలు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు, ఎక్కడెక్కడ తెరవబోతున్నారంటే?

VNS

షోరూమ్‌లను (Tesla Showrooms in India) తెరిచేందుకు ప్లాన్‌ చేస్తున్నట్లుగా సమాచారం. ఓ నివేదిక ప్రకారం భారత్‌లో తొలి రెండు షోరూమ్‌లను దేశ రాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబయి నగరాలను ఎంపిక చేసినట్లు నివేదిక పేర్కొంది. గతేడాది కాలం నుంచి టెస్లా భారత్‌లో షోరూం కోసం స్థలాలను పరిశీలించింది.

Advertisement

How Gravity Will Challenge Sunita Williams: భూమిపైకి తిరిగి వచ్చాక సునితా విలియమ్స్‌కు తీవ్ర ఇబ్బందులు తప్పవు, పెన్సిల్ ఎత్తినా వర్కవుట్ చేసినంత అలసట రావడం ఖాయం

VNS

అనుకోని పరిస్థితుల్లో అంతరిక్ష కేంద్రంలో ఉండిపోవాల్సి వచ్చిన ఇద్దరు నాసా (NASA) వ్యోమగాములు సునీతా విలియమ్స్‌ (Sunita williams) బుచ్‌ విల్మోర్‌ (Butch Wilmore) తిరుగు ప్రయాణం దాదాపు ఖరారైంది. ఎనిమిది నెలల ఎదురుచూపుల తర్వాత.. మార్చి 19న వారు భూమి మీదకు బయల్దేరనున్నారు. జీరో గ్రావిటీ నుంచి గురుత్వాకర్షణ (Gravity) కలిగిన వాతావరణంలోకి రానున్న వారికి సమస్యలు తప్పవట.

NASA Astronauts To Return to Earth: ఎట్టకేలకు సునిత విలియమ్స్‌ తిరిగి భూమి మీదకు వచ్చేందుకు రంగం సిద్ధమైంది, 8 నెలల తర్వాత ఆమె భూమిపైకి వచ్చేది ఆ రోజే..

VNS

వారికోసం మార్చి 12న స్పేస్‌ఎక్స్‌కు చెందిన క్రూ-10 అంతరిక్ష నౌకను పంపనున్నారు. నౌకలో కొత్తగా ఐఎస్‌ఎస్‌లోకి రానున్న వ్యోమగాములు వీరి బాధ్యతలు తీసుకోనున్నారు. తర్వాత మార్చి 19న ఆ నౌకలో తిరిగి భూమి మీదకు తాము బయల్దేరనున్నామని విల్మోర్ తెలిపారు.

Gold Price: మరోసారి భారీగా పెరిగిన బంగారం ధర, ఏకంగా తులం రూ. 89వేలకు చేరి సరికొత్త రికార్డ్‌

VNS

పెండ్లిండ్ల సీజన్ కావడంతో బంగారం ధర (Gold Price)రోజురోజుకో కొత్త రికార్డు నెలకొల్పుతున్నది. దేశ రాజధాని ఢిల్లీలో 99.9 శాతం స్వచ్ఛత గల బంగారం ధర శుక్రవారం ఒక్కరోజే రూ.1,300 పెరిగి రూ.89 వేల మార్క్‌ను దాటేసి రూ.89.400 పలికింది. గురువారం ఇదే బంగారం (99.9 స్వచ్చత) తులం ధర రూ.88,100లకు చేరుకుంది.

Techie's Sad Success Story: ఓ చేతికి ప్రమోషన్ లెటర్, మరో చేతికి భార్య నుంచి విడాకుల నోటీస్, ఈ టెకీ స్టోరీ వింటే జీవితంలో ఏం సాధించామనేదానిపై ప్రశ్న వేసుకోవాల్సిందే

Hazarath Reddy

రోజుకు 14 గంటలు పనిచేసే ఒక టెక్ ఎగ్జిక్యూటివ్ ఇటీవల తన నిరంతర ప్రమోషన్ ప్రయత్నంలో తన వివాహాన్ని ఎలా కోల్పోయాడో పంచుకున్నాడు. పేరుతో పాటు ఇతరత్రా వ్యక్తిగత వివరాలు వెల్లడించకుండా తన ఆవేదనను ఈ టెకీ Blind లో షేర్ చేసిన పోస్టులో వివరించాడు.

Advertisement
Advertisement