Technology

Anil Ambani: యస్ బ్యాంక్ సంక్షోభం, అనిల్ అంబానీకి ఈడీ సమన్లు, యస్‌ బ్యాంక్‌ నుంచి రూ 12,800 కోట్లు రుణాలు పొందిన రిలయన్స్‌ గ్రూప్‌, నిరర్థక ఆస్తులుగా మారిన రుణాలు

Hazarath Reddy

యస్‌ బ్యాంక్‌ వ్యవహారంలో పారిశ్రామికవేత్త రిలయన్స్ గ్రూపు అధినేత అనిల్‌ అంబానీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. యస్‌ బ్యాంక్‌ కేసులో (Yes Bank crisis) తమ ముందు హాజరు కావాలని అనిల్‌ అంబానీకి (Anil Ambani) ఈడీ సమన్లు జారీ చేసింది. యస్‌ బ్యాంక్‌ నుంచి రిలయన్స్‌ గ్రూప్‌ (Reliance Group) రూ 12,800 కోట్లు రుణాలు పొందింది. ఇవి నిరర్థక ఆస్తులుగా మారడంతో ఈ రుణాలకు సంబంధించి ప్రశ్నించేందుకు అనిల్‌ అంబానీకి ఈడీ సమన్లు జారీ చేసింది. అయితే ఈడీ (Enforcement Directorate) ఎదుట హాజరయ్యేందుకు ఆరోగ్య కారణాల దృష్ట్యా తమకు సమయం కావాలని ఆయన కోరారు.

Apple Stores Closed: కరోనా విశ్వరూపం, ప్రపంచవ్యాప్తంగా ఆపిల్ స్టోర్లు మూసివేత, మార్చి 27 వరకు అన్ని బంద్ చేస్తున్నామని ప్రకటించిన ఆపిల్ సీఈఓ టిమ్ కుక్

Hazarath Reddy

కోవిడ్-19(coronavirus) ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వాలు, ప్రైవేటు సంస్థలు ముందస్తు చర్యలు చేపడుతున్నాయి. ఇందులో భాగంగా స్కూల్స్, కాలేజీలు, షాపింగ్ మాల్స్, సినిమా హాల్స్ మూసేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆపిల్‌ (Apple) యాజమాన్యం కూడా చర్యలు చేపట్టింది. చైనా మినహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ స్టోర్స్‌ను మార్చి 27 వరకు మూసివేస్తున్నట్టు ఆ సంస్థ సీఈవో టిమ్ కుక్ (Apple CEO Tim Cook) ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.

Vodafone Idea’s New Plans: వొడిఫోన్ ఐడియా నుంచి సరికొత్త ప్లాన్స్, అపరిమిత కాల్స్‌ తోపాటు 8జీబీ డేటా, ఎంపిక చేసిన సర్కిల్స్‌లో మాత్రమే అందుబాటులోకి..

Hazarath Reddy

దేశీయ టెలికాం రంగంలో దూసుకుపోతున్న వొడాఫోన్‌ ఐడియా కొత్త ప్రీపెయిడ్‌ప్లాన్లను (Vodafone Idea’s New Plans) లాంచ్‌ చేసింది. రూ. 218, రూ. 248 ల ప్లాన్లను భారతదేశంలో ఎంపిక చేసిన సర్కిల్స్‌లో ప్రవేశపెట్టింది. ఈ ప్యాక్‌లు 28 రోజుల చెల్లుబాటులో ఈ ప్లాన్‌పై అపరిమిత కాల్స్‌ తోపాటు 8జీబీ దాకా డేటాను అందిస్తుంది. దీంతోపాటు వొడాఫోన్ (Vodafone) డబుల్ డేటా ఆఫర్‌తో రూ. 299, రూ. 399, రూ. 599 ప్రీపెయిడ్‌ ప్లాన్లనుకూడా తీసుకొచ్చింది. కంపెనీ వెబ్‌సైట్‌లో (Website) లేదా మై వోడాఫోన్‌ యాప్‌ ద్వారా రీఛార్జ్‌కు అందుబాటులో ఉన్నాయి.

GST Council Meet: కొత్త ఫోన్లపై కేంద్రం జీఎస్‌టీ షాక్, మొబైల్ ఫోన్లపై జీఎస్‌టీ రేటును 12 శాతం నుంచి 18 శాతానికి పెంపు, జీఎస్‌టీ కౌన్సిల్‌ సమావేశంలో కేంద్రం కీలక నిర్ణయం

Hazarath Reddy

కొత్తగా స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి కేంద్రం జీఎస్‌టీ రూపంలో భారీ షాక్‌ ఇచ్చింది. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ కౌన్సిల్ (జీఎస్‌టీ కౌన్సిల్) తాజాగా మొబైల్ ఫోన్లపై జీఎస్‌టీ పెంపునకు ( GST Hike on Mobile Phones) ఆమోదం కేంద్రం తెలిపింది.

Advertisement

Bill Gates: మైక్రోసాఫ్ట్‌‌కు బిల్ గేట్స్ రాజీనామా, పూర్తిగా సామాజిక సేవ వైపు బిలియనీర్, 2014లో ఛైర్మెన్ పదవికి రాజీనామా, మిళిందా ఫౌండేషన్ ద్వారా సోషల్ సర్వీస్

Hazarath Reddy

ప్రపంచ కుబేరుడు, మైక్రోసాఫ్ట్‌ ఫౌండర్‌ బిల్‌గేట్స్‌ (Bill Gates) మైక్రోసాఫ్ట్‌నుంచి వైదొలిగారు. ప్రస్తుతం బోర్డు సలహాదారుడిగా ఉన్న ఆయన తన పదవికి రాజీనామా చేశారు. పూర్తిస్థాయిలో సామాజిక సేవలకు పరిమితమవ్వాలనే ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బిల్ గేట్స్ ఇకపై మైక్రోసాఫ్ట్ (Microsoft) సలహాదారుగా కొనసాగనున్నారు. వారెన్ బఫెట్ కంపెనీ నుంచి కూడా ఆయన తప్పుకున్నారు. ఈ విషయాన్ని సంస్థ శుక్రవారం ప్రకటించింది. ఇకపై బిల్ గేట్స్ మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్లకు సాంకేతిక సలహాదారుగా కొనసాగనున్నారు.

Coronavirus Scare In Bengaluru: ఇన్ఫోసిస్‌కు కరోనా ఎఫెక్ట్, బెంగుళూరులో ఇన్ఫోసిస్‌ కార్యాలయం ఖాళీ, ఉద్యోగికి క‌రోనా పాజిటివ్ అని తేలడంతో అందర్నీ బయటకు పంపిన టెక్ గెయింట్

Hazarath Reddy

కరోనా (Coronavirus)దెబ్బకు దేశం కుదేలవుతోంది. ఎక్క చూసినా జనం భయం భయంగా బతుకుతున్నారు. ఇక కంపెనీలో పనిచేసే వారయితే కరోనా కేసు తగలగానే ఆఫీస్ మొత్తాన్ని ఖాళీ చేస్తున్నారు. తాజాగా టెక్ గెయింట్ ఇన్ఫోసిస్ కూడా దీని భారీన చిక్కుకుంది. బెంగుళూరులో (Bengaluru) ఉన్న సాఫ్ట్‌వేర్ కంపెనీ ఇన్ఫోసిస్‌కు (Infosys) చెందిన ఓ బిల్డింగ్‌ను ఖాళీ చేయించారు. ఆ కంపెనీలో ప‌నిచేస్తున్న ఓ ఉద్యోగికి క‌రోనా సోకిన‌ట్లు తేల‌డంతో.. ఆ బిల్డింగ్‌లో ప‌నిచేస్తున్న వారిని బ‌య‌ట‌కు పంపించారు.

Corona Caller Tune: విసిగిస్తోన్న కరోనా కాలర్ ట్యూన్, కాలయాపన తప్ప మరేమి లేదంటూ నెటిజన్ల గగ్గోలు, కాలర్‌ ట్యూన్‌ ఇంగ్లిష్‌లో ఉండటంతో తీవ్ర ఇబ్బందులు

Hazarath Reddy

ఈ మధ్య మీరు గమనించారో లేదో ఎవరికైనా ఫోన్ చేస్తే మూడు సార్లు దగ్గు.. ఆ తర్వాత ఆంగ్లంలో కోవిడ్‌–19 వైరస్‌ గురించి ఉపన్యాసం.. చివరకు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ జారీ చేసిన ప్రకటన అంటూ 30 సెకన్ల పాటు మీకు రింగ్ టోన్ (Corona Caller Tune) వినిపిస్తూ ఉంది. గత రెండ్రోజులుగా రాష్ట్రంలోని అన్ని నెట్‌వర్క్‌ల మొబైల్‌ వినియోగదారులకు కోవిడ్‌ వైరస్‌ (COVID 19) వ్యాప్తి నిరోధం కోసం వస్తున్న కాలర్‌ ట్యూన్‌ ఇది.

Debit and Credit Cards Alert: డెబిట్, క్రెడిట్ కార్డులను వెంటనే వాడండి, లేకుంటే పనిచేయవు, మార్చి 16 నుంచి ఆన్‌లైన్‌ లావాదేవీల కోసం వాడని కార్డులు పనిచేయవన్న ఆర్‌బిఐ

Hazarath Reddy

మీకు డెబిట్‌, క్రెడిట్‌ కార్డులున్నాయా? అయితే వాటిని వెంటనే ఆన్‌లైన్‌ లావాదేవీల కోసం ఉపయోగించండి. లేకపోతే ఇకపై మీరు ఈ కార్డులతో ఆన్‌లైన్‌ లావాదేవీలు చేసే అవకాశం ఉండదు. ఒక్కసారి కూడా ఆన్‌లైన్‌ లావాదేవీల కోసం కార్డులను వినియోగించుకోకపోతే మార్చి 16 నుంచి ఆన్‌లైన్‌, కాంటాక్ట్‌లెస్‌ లావాదేవీలకు ఈ కార్డులు (Credit And Debit Cards Alert) పని చేయవు.

Advertisement

JIo Wireless Data: జియో మరో సంచలన నిర్ణయం, వైర్ లెస్ డేటా ఛార్జీల బాదుడుకు రెడీ, రూ.15 నుంచి రూ.20కి పెంచాలని ట్రాయ్‌కి లేఖ రాసిన రిలయన్స్ జియో

Hazarath Reddy

దేశీయ టెలికాం రంగంలో దూసుకుపోతున్న ప్రముఖ టెలికాం కంపెనీ రిలయన్స్ జియో (Reliance Jio) తన యూజర్లకు మరో బిగ్ షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే ఫ్రీ కాల్స్ ఎత్తేసి కాల్ ఛార్జీలు విపరీతంగా పెంచిన జియో.. ఇప్పుడు వైర్ లెస్ డేటా (JIo Wireless Data) టారిఫ్‌లను పెంచాలని జియో (Jio) నిర్ణయించింది. ప్రస్తుతం రూ. 15గా ఉన్న 1 జీబీ డేటా ధరను రూ. 20కి పెంచాలని యోచిస్తోంది. ఈ మేరకు టెలికాం నియంత్రణ ప్రాధికార సంస్థ ట్రాయ్‌కు జియో లేఖ రాసింది.

Vodafone Idea: ఒక జీబీ డేటాకి రూ.35 చెల్లించాల్సిందే, డాట్‌కు లేఖ రాసిన వొడాఫోన్‌ ఐడియా, టెలికాం శాఖకు రూ. 8 వేల కోట్లు చెల్లించిన భార‌తీ ఎయిర్‌టెల్‌

Hazarath Reddy

టెలికాం సంస్థ వొడాఫోన్‌ ఐడియా (Vodafone Idea) సంచలన ప్రతిపాదనలు చేసింది. భారీ నష్టాలకు తోడు ఏజీఆర్‌ బకాయిల చెల్లింపు (AGR dues) వివాదంతో మరింత కుదేలైన ఈ సంస్థ మొబైల్‌ డేటా, కాల్‌ చార్జీలపై కొన్ని సవరణలు చేయాలని కోరుతోంది. డేటా చార్జీలను కనీసం 7 రెట్లు , కాల్‌ చార్జీలను 8 రెట్లు పెంచాలని కోరుతోంది. ఈ మేరకు టెలీకమ్యూనికేషన్స్ విభాగానికి ఒక లేఖ రాసింది.

Google Pay: రూ.3 వేలు పంపిస్తే లక్ష రూపాయలు అకౌంట్లో పడ్డాయి, గూగుల్ పే నుంచి లక్ష రూపాయల స్క్రాచ్ కార్డు, ఊహించని నగదు చూసి షాక్ తిన్న అనంతపురం కుర్రాడు

Hazarath Reddy

ప్రముఖ ఆన్‌లైన్ పేమెంట్ యాప్ గూగుల్ పేలో (Google pay) ఎవరైనా డబ్బులు ట్రాన్సఫర్ చేస్తే రివార్డు (scratch card) కింద మనకు ఎంతో కొంత డబ్బులు వస్తాయనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే చాలామందికి బెటర్ లక్ నెక్స్ట్ టైం అని వస్తుంది. అయితే అనంతపురంలోని ఓ యువకుడికి గూగుల్ పేలో జాక్ పాట్ తగిలింది. గూగుల్‌ పే ద్వారా స్నేహితుడికి నగదు బదిలీ చేసినందుకు ఆ యువకుడికి లక్ష రూపాయల రివార్డు లభించింది.

Hyderabad Police: దేశంలో తొలిసారిగా టిక్‌టాక్, ట్విటర్, వాట్సప్‌పై క్రిమినల్ కేసులు, దేశానికి వ్యతిరేకంగా వీడియోలు వైరల్ చేస్తున్నారని ఫిర్యాదు చేసిన జర్నలిస్ట్, 153 (A) , 121 (A) ,294, 505, రెడ్ విత్ 156(3) కింద కేసులు నమోదు

Hazarath Reddy

దేశంలో తమ ప్లాట్‌ఫామ్‌లపై ద్వేషం, దేశ వ్యతిరేక విషయాలను వ్యాప్తి చేయడానికి వీలు కల్పించారనే ఆరోపణలపై హైదరాబాద్ పోలీసులు (Hyderabad police) మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్ (Twitter), ఫేస్‌బుక్ యాజమాన్యంలోని వాట్సాప్ (Whatsapp), చైనీస్ షార్ట్-వీడియో మేకింగ్ యాప్ టిక్‌టాక్‌ (TikTok) పై క్రిమినల్ కేసు నమోదు చేశారు. నాంపల్లి కోర్టు ఆదేశాల మేరకు దేశంలోనే తొలిసారిగా టిక్‌టాక్, ట్విటర్, వాట్సప్ యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి.

Advertisement

Sir John Tenniel: జాన్ టెన్నిఎల్ 200వ జయంతి నేడు, ఇలస్ట్రేటర్‌గా, వ్యంగ్య కళాకారుడుగా ఎన్నో విజయాలు, పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేకంగా డూడుల్‌ను రూపొందించిన గూగుల్

Hazarath Reddy

ఇలస్ట్రేటర్ మరియు వ్యంగ్య కళాకారుడు సర్ జాన్ టెన్నియల్ 200 వ జయంతిని (John Tenniel's 200th Birth Anniversary) సంధర్భంగా గూగుల్ ప్రత్యేకంగా గూగుల్ డూడుల్ (Google Doodle) రూపొందించింది. ఫిబ్రవరి 28, 1820 న లండన్లో జన్మించిన సర్ జాన్ టెన్నియల్ (John Tenniel) 1893 లో తన కళాత్మక విజయాల కోసం తన సమయాన్ని కేటాయించాడు. 20 సంవత్సరాల వయస్సులో, టెన్నియల్ ప్రమాదం కారణంగా కుడి కంటిలో దృష్టిని కోల్పోయాడు.

Amazon's Fab Phones Fest: భారీ తగ్గింపులతో అమెజాన్ ఫ్యాబ్‌ ఫోన్స్‌ ఫెస్ట్‌, అత్యంత తక్కువ ధరకే ఫోన్లను సొంతం చేసుకోండి, ఈ నెల 29 వరకు సేల్

Hazarath Reddy

ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ తన వైబ్‌సైట్లో ఫ్యాబ్‌ ఫోన్స్‌ ఫెస్ట్‌ను (Amazon's Fab Phones Fest) మళ్లీ ప్రారంభించింది. నేటి నుంచి 29వ తేదీ వరకు ఈ సేల్‌ కొనసాగనుంది. ఇందులో భారీ ఆఫర్లను కంపెనీ ప్రకటించింది. అలాగే ఐసీఐసీఐ (ICICI), కోటక్‌ మహీంద్రా కార్డుల )Kotak Mahindra) ద్వారా జరిపే కొనుగోళ్లపై ఫోన్లపై 10 శాతం వరకు ఇన్‌స్టంట్‌ డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ 2020 సేల్‌లో ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌లపై 40 శాతం వరకు తగ్గింపును అందిస్తోంది.

WhatsApp’s Hidden Feature: వాట్సాప్‌లో రహస్య ఫీచర్, మీ మెసేజ్ అవతలి వారు చూశారో లేదో ఈజీగా తెలుసుకోవచ్చు, ఎలాగో తెలుసుకోండి

Hazarath Reddy

ఇక బ్లూటిక్‌ ఆప్షన్‌ ఆఫ్‌ చేసిన వ్యక్తి మీ మెసేజ్‌ చదివాడో లేదో తెలుసుకోవాలంటే... మీరు చాటింగ్‌ చేస్తున్న వ్యక్తి బ్లూటిక్స్‌ ఆప్షన్‌ ఆఫ్‌ చేసినట్లైతే.. వారికి ఓ వాయిస్‌ మెసేజ్‌ చేయండి. ఆ వ్యక్తి మీ వాయిస్‌ రికార్డింగ్‌ విన్నట్లయితే వెంటనే బ్లూటిక్స్‌ పడిపోతాయి. అతడు బ్లూటిక్స్‌ ఆప్షన్‌ ఆఫ్‌ చేసినప్పటికి వాయిస్‌ మెసేజ్‌ విన్నప్పుడు మాత్రం బ్లూటిక్స్‌ పడిపోతాయి. ఇది ఒకరకంగా వాట్సాప్‌లోని లోపమని చెప్పొచ్చు. గత సంవత్సరమే ఈ సాంకేతిక లోపం వెలుగులోకి వచ్చింది.

Jio 336 Days Validity Plan: ఒక్కసారి రీఛార్జ్ చేయండి, 336 రోజుల పాటు అపరిమిత ప్రయోజనాలు పొందండి, పాత ప్లాన్ల ప్లేసులోకి కొత్త ప్లాన్ తీసుకువచ్చిన జియో

Hazarath Reddy

Advertisement

The Beast Car: భారత రోడ్లపై అమెరికా ప్రెసిడెంట్ కార్ రయ్ రయ్.. భద్రతలో బెస్ట్ అని చెప్పబడుతున్న 'ది బీస్ట్' కార్ ప్రత్యేకతలు, డొనాల్డ్ ట్రంప్ పర్యటన విశేషాలు తెలుసుకోండి

Vikas Manda

బీస్ట్ డ్రైవర్లకు యూఎస్ సీక్రెట్ సర్వీసెస్ తో శిక్షణతో పాటు, అత్యవసర సమయాల్లో ప్రెసెడెంట్ ను కాపాడేందుకు అవసరమయ్యే శిక్షణలు కూడా ఇస్తారు. కారును 180 డిగ్రీలలో ఎలా తిప్పాలి అనేదానిపై శిక్షణ ఇస్తారు. ప్రతిరోజు డ్రైవర్ ఆరోగ్యం, మానసిక స్థితిని పరీక్షించిన తర్వాతే డ్రైవింగ్ కు అనుమతించబడతారు.....

Google Station: పోర్న్ దెబ్బ, యూజర్లకి గూగుల్ షాక్, రైల్వే స్టేషన్లలో ఇకపై ఉచిత వైఫై దొరకదు, దేశ వ్యాప్తంగా ఎత్తివేస్తున్నట్లు ప్రకటించిన గూగుల్

Hazarath Reddy

రైల్వే ప్రయాణికులకు గూగుల్ (Google) చేదు వార్తను అందించింది. రైల్వేస్టేషన్‌లలో (Railway Stations) ఉచిత వైఫై సర్వీసుపై గూగుల్‌ కీలక నిర్ణయం తీసుకుంది. గతేడాది పాట్నాలోని రైల్వే స్టేషన్లలో ఎక్కువమంది గూగుల్ ఉచిత వైఫై సర్వీసును పోర్న్ వీడియోలు (Free porn) చూడటానికి మాత్రమే వినియోగిస్తున్నారని RailTel రిపోర్ట్ చేసింది. యూట్యూబ్, వికీపిడియాలను ఫాలో చేస్తూ వాటినే ఆ వీడియోలనే ఎక్కువగా చూస్తున్నారని తెలిపింది. సర్వీసులకు బదులు దాన్ని వాడటంతో గూగుల్ ఈ దిశగా నిర్ణయం తీసుకోవడంలో ఓ భాగమని చెప్పవచ్చు.

Flipkart Offers: ఫ్లిప్‌కార్ట్‌లో కళ్లు చెదిరే ఆఫర్లు, ఫిబ్రవరి 17 నుంచి ఫ్లిప్‌కార్ట్ మొబైల్స్ బొనాంజా సేల్, డెబిట్, క్రెడిట్ కార్డులపై 10 శాతం తగ్గింపు ధరలు

Hazarath Reddy

ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkar) వినియోగదారులకు శుభవార్తను అందించింది. తక్కువ ధరల్లో స్మార్ట్‌ఫోన్‌ కొనాలని భావిస్తున్న వారికి ’మొబైల్స్ బొనాంజా’ సేల్‌ను (Flipkart Mobile Bonanza Sale) ప్రకటించింది. ఈ సేల్‌ ఫిబ్రవరి 17 న ప్రారంభమై ఫిబ్రవరి 21న ముగియనుంది.

How To Use Disha App: దిశ యాప్ ఎలా వాడాలి, ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి, ఇంటర్నెట్ లేకుండా పనిచేస్తుందా, పూర్తి వివరాలు మీ కోసం

Hazarath Reddy

హిళల భద్రత (Women Safety) కోసం ఏపీ ప్రభుత్వం (AP government) ప్రతిష్టాత్మకంగా తీసుకోచ్చిన దిశ యాప్‌పై (Disha App) ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ యాప్‌ ద్వారా ఫిర్యాదు చేస్తే పోలీసులు స్పందిస్తున్న తీరుపై మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆపదలో ఉన్న మహిళల కోసం రూపొం‍దించిన ఈ యాప్‌ను కేవలం నాలుగు రోజుల్లోనే 50 వేల మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారు.

Advertisement
Advertisement