Technology

Dell Layoffs Announced: టెక్ రంగంలో భారీ లేఅప్స్, 12, 500 మంది ఉద్యోగులపై వేటు వేసిన డెల్, ఇంటెల్ భారీ ఉద్యోగాల కోతల తర్వాత రెండవ అతిపెద్ద దెబ్బ

Hazarath Reddy

డెల్ తన గ్లోబల్ వర్క్‌ఫోర్స్‌ను ప్రభావితం చేసే అతిపెద్ద ఉద్యోగ కోత రౌండ్‌లో దాదాపు 12,500 మంది ఉద్యోగులను తొలగించింది. టెక్ దిగ్గజం ఆగస్ట్ 6, 2024న అంతర్గత మెమో ద్వారా ఈ తొలగింపులను ప్రకటించింది, ఇది గ్లోబల్ వర్క్‌ఫోర్స్‌లో 10% ప్రభావం చూపుతుందని సూచించింది.

Manish Tiwary Resigns: అమెజాన్ ఇండియా అధినేత మనీష్ తివారీ రాజీనామా, కొత్త కంపెనీని వెతుకుతున్నట్లుగా వార్తలు

Vikas M

ఈ-కామర్స్ దిగ్గజంలో ఎనిమిదిన్నర సంవత్సరాలు గడిపిన తర్వాత అమెజాన్ ఇండియా అధినేత మనీష్ తివారీ పదవికి రాజీనామా చేసినట్లు పరిణామాలు తెలిసిన వ్యక్తులు మనీకంట్రోల్‌కి తెలిపారు.తివారీ మరో కంపెనీలో కొత్త పాత్రను చేపట్టాలని నిర్ణయించుకున్నారని వారు తెలిపారు.

Job Cuts 2024: డెల్ కంపెనీలో మరోసారి భారీ లేఆప్స్, రేపటి నుండి 12,500 కంటే ఎక్కువ మంది ఉద్యోగులను తీసేస్తున్నట్లుగా వార్తలు

Vikas M

ఇటీవల, టెక్ దిగ్గజం డెల్ తన కొత్త AI-కేంద్రీకృత యూనిట్ కోసం పునర్నిర్మాణ ప్రణాళికలను అమలు చేయడంతో డెల్ తొలగింపులు విక్రయ విభాగంలో వేలాది మంది ఉద్యోగులను దెబ్బతీస్తాయని అనేక నివేదికలు ధృవీకరించాయి. అయితే ప్రభావితమయ్యే ఉద్యోగుల ఖచ్చితమైన సంఖ్య తెలియదు. అయితే, Xలోని అనేక పోస్ట్‌లు సంఖ్యలు 12,500 లేదా అంతకంటే ఎక్కువ ఉండవచ్చని సూచించాయి.

Dark Patterns in Indian Apps: ఈ 52 యాప్స్ వినియోగదారులను తప్పుదారి పట్టిస్తున్నాయి, సంచలన నివేదిక వెలుగులోకి..

Vikas M

స్మార్ట్‌ఫోన్‌లలో ఉపయోగించే కొన్ని యాప్స్ వినియోగదారులను తప్పుదారి పట్టిస్తున్నాయని అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ASCI), ParallelHQ నిర్వహించిన అధ్యయనం తెలిపింది. ఈ అధ్యయనంలో చేర్చబడిన 53 యాప్‌లలో 52 వినియోగదారులను తప్పుదారి పట్టించే రీతిలో ఉన్నాయని వెల్లడించింది.

Advertisement

Cognizant New Centre in Hyd: హైదరాబాద్‌లో కాగ్నిజెంట్ కొత్త సెంటర్, 15 వేల మందికి ఐటీ ఉద్యోగాలు, రాష్ట్ర ప్ర‌భుత్వానికి, కాగ్నిజెంట్ సంస్థ మ‌ధ్య ఒప్పందం

Vikas M

ప్రముఖ ఐటీ దిగ్గజం `కాగ్నిజెంట్` హైదరాబాద్ లో దాదాపు 15 వేల మంది ఉద్యోగులకు పని కల్పించేలా కొత్త సెంటర్ నెలకొల్పనున్నట్లు ప్రకటించింది. 20 వేల మంది ఉద్యోగులు ప‌ని చేసేందుకు వీలుగా ప‌ది ల‌క్ష‌ల చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణంలో ఈ సెంట‌ర్ ఏర్పాటు చేయ‌నున్న‌ది

Airtel Net Profit: లాభాల్లో దుమ్మురేపిన భారతీ ఎయిర్‌టెల్‌, ఈ ఏడాది రూ.4160 కోట్లకు పెరిగిన నికర లాభం

Vikas M

ప్రముఖ టెలికాం కంపెనీ భారతీ ఎయిర్‌టెల్‌ (Bharti Airtel) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో (Q1 results) రెండున్నర రెట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. గతేడాది ఇదే సమయంలో నికర లాభం రూ.1612.5 కోట్లు కాగా.. ఈ ఏడాది ఆ మొత్తం రూ.4160 కోట్లకు పెరిగింది.

Samsung Galaxy F14: తొమ్మిది వేలకే శాంసంగ్ 5జీ స్మార్ట్‌ఫోన్, 50 ఎంపీతో ప్రైమరీ కెమరాతో పాటు మిగతా ఫీచర్లు అదుర్స్

Vikas M

దక్షిణ కొరియా ఎల‌క్ట్రానిక్ దిగ్గ‌జం శాంసంగ్ తాజాగా భార‌త‌ మార్కెట్లోకి బ‌డ్జెట్ ఫోన్ ఒక‌టి లాంఛ్ చేసింది. అదే.. శాంసంగ్ గెలాక్సీ ఎఫ్‌14. కేవలం రూ. 8,999కే అందిస్తోంది. ప్రస్తుతం ఈ ఫోన్‌ శాంసంగ్ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులోకి వ‌చ్చింది.

Infineon Layoffs: ఆగని లేఆప్స్, 1400 మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్న జర్మన్ చిప్‌మేకర్ ఇన్ఫినియన్

Vikas M

జర్మనీలోని మ్యూనిచ్ జిల్లాలోని న్యూబిబెర్గ్‌లో ఉన్న గ్లోబల్ సెమీకండక్టర్ల తయారీ సంస్థ ఇన్ఫినియన్ టెక్నాలజీస్ మూడవ త్రైమాసిక ఆదాయ అంచనాలను తప్పిన కారణంగా ప్రపంచవ్యాప్తంగా 1,400 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఇన్ఫినియన్ తొలగింపులు జర్మనీలోని రెజెన్స్‌బర్గ్‌లో పనిచేస్తున్న వ్యక్తులపై ప్రభావం చూపుతాయి

Advertisement

Anand Mahindra: యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ చైర్మన్‌గా ఆనంద్ మహీంద్రా, కీలక నిర్ణయం ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి

Hazarath Reddy

యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ చైర్మన్‌గా ఆనంద్ మహీంద్రా పేరును న్యూయార్క్‌లో ఎన్నారైల సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. సీఎం మాట్లాడుతూ... యువతలో నైపుణ్యతను పెంపొందించడం కోసం తమ ప్రభుత్వం కొత్త యూనివర్సిటీని తీసుకువచ్చిందన్నారు.

BSNL 4G Network Ready: బీఎస్ఎన్ఎల్ 4జీ నెట్ వ‌ర్క్ సిద్ధం, త్వ‌ర‌లోనే ల‌క్ష 4జీ ట‌వర్లు నిర్మిస్తామ‌న్న కేంద్ర‌మంత్రి, అక్టోబ‌ర్ వ‌ర‌కు 80వేల ట‌వ‌ర్ల నిర్మాణం పూర్తి

VNS

కేంద్ర ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) సబ్‌స్క్రైబర్ల పునాది క్రమంగా పెరుగుతున్నదని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. ఇప్పటికే బీఎస్ఎన్ఎల్ నెట్ వర్క్ పరిధిలో 4జీ (BSNL 4G) సేవలు అందుబాటులో ఉన్నాయని, దాన్ని 5జీ లోకి కన్వర్ట్ చేసే ప్రక్రియ ప్రారంభమైందని కేంద్ర టెలికం శాఖ మంత్రి సింధియా శనివారం మీడియాతో చెప్పారు.

UN Praises India's Digital Revolution: భారత్‌లో డిజిటల్ విప్లవంపై ఐక్యరాజ్యసమితి ప్రశంసలు, స్మార్ట్‌ఫోన్ల ద్వారా 80 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని వెల్లడి

Hazarath Reddy

డిజిటల్ రివల్యూషన్ ద్వారా గత ఐదారేళ్లలో భారత ప్రభుత్వం 80 కోట్ల మంది ప్రజలను కేవలం స్మార్ట్‌ఫోన్ల వాడకం ద్వారా పేదరికం నుంచి బయటపడేసిందని (80 crore out of poverty) ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీ (యూఎన్‌జీఏ) అధ్యక్షుడు డెన్నిస్ ఫ్రాన్సిస్ (Dennis Francis) పేర్కొన్నారు

BSNL 5G Service: గుడ్ న్యూస్.. త్వరలో బీఎస్‌ఎన్‌ఎల్ 5G సర్వీసులు, ఏఏ నగరాల్లో తెలుసా?

Arun Charagonda

ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో వినియోగదారులకు తక్కువ ధరలోనే 5జీ సేవలను అందించేందుకు సిద్ధమవుతోంది. ఇందుకు సంబంధించి ... బీఎస్‌ఎన్‌ఎల్‌తో దేశీయ టెలికాం స్టార్టప్ కంపెనీ చర్చలు జరుపుతోంది.

Advertisement

New FASTag Rules: వాహనదారులు అలర్ట్, నేటి నుంచి ఫాస్టాగ్‌ కొత్త నిబంధనలు అమల్లోకి, కేవైసీ ప్రక్రియను పూర్తి చేయకుంటే బ్లాక్‌లిస్టులోకి..

Hazarath Reddy

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఫాస్ట్‌ట్యాగ్ వినియోగదారుల కోసం ఈరోజు (August 1, 2024) నుండి కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకువచ్చింది. కొత్త రూల్స్‌ ప్రకారం మూడు నుంచి ఐదేండ్ల క్రితం జారీచేసిన ట్యాగ్‌లకు ఈ ఏడాది అక్టోబర్‌ 31లోగా తప్పనిసరిగా అప్‌డేట్‌ కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవాలి.

ITR Filing: ఇన్ క‌మ్ ట్యాక్స్ రిట‌ర్న్స్ లో సరికొత్త రికార్డు, ఏకంగా 7 కోట్లు దాటిన ఐటీఆర్ ఫైలింగ్స్

VNS

నేటితో గడువు పూర్తికానుండటంతో.. ఆదాయపు పన్ను రిటర్నులు (ITR filing) దాఖలు చేసేందుకు పన్ను చెల్లింపుదారులు (IT Returns) పోటెత్తారు. జులై 31వ తేదీ ఒక్కరోజే సాయంత్రం ఏడు గంటలవరకు ఏకంగా 50 లక్షల మంది రిటర్నులు దాఖలు చేశారని ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్ ( IT Department) తెలిపింది.

OPPO K12x 5G: ఒప్పో నుంచి ఒప్పో కే12ఎక్స్ 5జీ స్మార్ట్‌ఫోన్, ఎంట్రీ లెవల్ ఫోన్ కావాలనుకునే వారికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ ఇదే..

Vikas M

చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో (Oppo) తన బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ఒప్పో కే12ఎక్స్ 5జీ (Oppo K12x 5G) ఫోన్ ను సోమవారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది.ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌తోపాటు 8 జీబీ ర్యామ్ తో వస్తోంది.

Realme Narzo N61: రూ. 7 వేలకే అదిరిపోయే స్మార్ట్‌ఫోన్, రియల్‌మీ నార్జో ఎన్61ను భారత మార్కెట్లో విడుదల చేసిన చైనీస్ దిగ్గజం

Vikas M

రియల్‌మీ నార్జో ఎన్61 (Realme Narzo N61) ఫోన్‌ను విపణిలోకి తీసుకువస్తున్నట్లు వెల్లడించింది. ఈ ఫోన్ 32-మెగా పిక్సెల్ డ్యుయల్ రేర్ కెమెరా యూనిట్‌తోపాటు ఐపీ54 రేటెడ్ బిల్ట్ ఫర్ డస్ట్ అండ్ స్ప్లాష్ రెసిస్టెన్స్, 6జీబీ ర్యామ్ విత్ ఒక్టాకోర్ యూనిసోక్ ప్రాజెసర్ ఉంటాయి. రెండు స్టోరేజీ వేరియంట్లలో లభిస్తున్న ఈ పోన్ విక్రయాలు ఆగస్టులో ప్రారంభం అవుతాయని కంపెనీ తెలిపింది.

Advertisement

JioBharat J1 4G: భారత మార్కెట్లోకి జియో మరో సంచలన 4జీ ఫోన్, రూ. 1799కే జియో భారత్ జే1 4జీ ఫీచర్ ఫోన్, ప్రత్యేకతలేంటో తెలుసుకోండి

Vikas M

దేశీయ మార్కెట్లో రిలయన్స్ జియో బడ్జెట్ ఫ్రెండ్లీ ఫీచర్ ఫోన్ జియో భారత్ జే1 4జీ (JioBharat J1 4G) ఫోన్ ఆవిష్కరించింది. 4జీ కనెక్టివిటీతో వచ్చిన ఎంట్రీ లెవల్ ఫీచర్ ఫోన్ ఇది అని పేర్కొంది. జియో భారత్ ప్లాన్ కు మద్దతుగా బడ్జెట్ ఆఫర్ ఫోన్ ను ఇది అందిస్తోంది. ఇందులో జియో టీవీ, జియో సినిమా, జియో పే వంటి యాప్స్ ప్రీ-ఇన్ స్టల్ చేసింది.

Belated ITR Filing: ఐటీఆర్ ఫైలింగ్ గ‌డువు ముగుస్తోంది, ఆల‌స్యంగా రిట‌ర్న్స్ ఫైల్ చేస్తే ఏమ‌వుతుందో తెలుసా?

VNS

బీలేటెడ్ ఐటీఆర్ ఫైలింగ్ (Belated ITR Filing) చేయడం వల్ల కొన్ని బెనిఫిట్లు కోల్పోతారు పన్ను చెల్లింపుదారులు. దీర్ఘకాలిక పెట్టుబడులు, బిజినెస్ ఇన్ కం, ఇతర మార్గాలో సమకూర్చుకునే నిధులపై నష్టాన్ని తర్వాతీ ఏడాదికి కొనసాగించలేరు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో నూతన ఆదాయం పన్ను విధానాన్ని ఎంచుకునేందుకు అనుమతించరు.

ITR Filing: ఇన్ కమ్ ట్యాక్స్ రిట‌ర్న్స్ దాఖ‌లులో రికార్డుల మోత‌, నిన్న‌టి వ‌ర‌కు 5 కోట్ల‌కు పైగా ఐటీఆర్ ఫైలింగ్స్

VNS

గడువు సమీపిస్తుండడంతో ఆదాయపు పన్ను రిటర్నులు (ITR filing) దాఖలు చేసే వారి రోజురోజుకూ పెరుగుతోంది. ఒక్క జులై 26వ తేదీనే 28 లక్షల మంది పన్ను చెల్లింపుదారులు రిటర్నులు (IT Returns) దాఖలు చేశారని ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్ (IT Department) తెలిపింది. ప్రస్తుత మదింపు సంవత్సరంలో ఇప్పటి వరకు 5 కోట్ల రిటర్నులు దాఖలైనట్లు తెలిపింది.

Jio Freedom Offer: యూజర్లకు జియో గుడ్‌న్యూస్, రూ.2,121లకే ఎయిర్ ఫైబర్ కనెక్షన్, కస్టమర్లకు ఇన్‌స్టలేషన్ ఛార్జీలు రూ.1000 మాఫీ అవుతాయని ప్రకటన

Vikas M

రిలయన్స్ జియో తన ‘ఎయిర్ ఫైబర్’ యూజర్లకు గుడ్‌న్యూస్ చెప్పింది. ‘జియో ఫ్రీడమ్ ఆఫర్’ పేరిట ఇన్‌స్టలేషన్ ఛార్జీలు లేకుండానే కొత్త జియో ఎయిర్‌ ఫైబర్ కనెక్షన్‌ను అందించనున్నట్టు ప్రకటించింది. కొత్త కనెక్షన్‌ను పొందాలనుకునే నూతన యూజర్లకు ఈ ఆఫర్ ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే ఇది పరిమిత కాల ఆఫర్‌.

Advertisement
Advertisement