ప్రపంచం

US Election Results 2020: అమెరికా అధ్యక్ష పీఠం కైవసం చేసుకునే దిశగా జో బిడెన్, మ్యాజిక్ ఫిగర్‌కు సమీపంలో డెమొక్రాటిక్ అభ్యర్థి, కొనసాగుతున్న కౌంటింగ్, ఎన్నికల ప్రక్రియ అంతా ఫ్రాడ్ అని కోర్టును ఆశ్రయించిన డొనాల్డ్ ట్రంప్ బృందం

Team Latestly

అమెరికాలో మొత్తం ఉన్న 538 ఎలక్ట్రోరల్ ఓట్లకు కనీసం 270 ఓట్లు సాధించిన అభ్యర్థి అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిరోహించడానికి అర్హులు. ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న ట్రంప్ మ్యాజిక్ ఫిగర్ కు చాలా దూరంలో 214 ఓట్లతో ఉండటాన్ని బట్టి చూస్తే ఇక ఆయన వైట్ హౌజ్ ఖాళీ చేయాల్సిందేనని తేలిపోయింది....

US Elections 2020: వివాదాల మధ్య జూనియర్ ట్రంప్ ట్వీటు, మ్యాప్‌లో జమ్ము కశ్మీర్‌, లద్దాఖ్‌ ఇండియా నుంచి అవుట్, మండి పడుతున్న విపక్షాలు, ట్వీటుపై స్పందించిన పలువురు ప్రముఖులు

Hazarath Reddy

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు మరి కొద్ది సేపట్లో (US Elections 2020) వెలువడనున్నాయి. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో జో బైడెన్‌ ముందంజలో కొనసాగుతున్నారు. ఈ పరిస్థితుల్లో జూనియర్‌ డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన ఓ ట్వీట్‌ వివాదాస్పదంగా మారింది. జూనియర్ ట్రంప్ ట్వీటుపై (Donald Trump Jr Tweet) మన దేశంలోని విపక్షాలు మండి పడుతున్నాయి. ట్రంప్‌ తన బుద్ది చూపించుకున్నారు. మనం స్నేహ హస్తం అందిస్తే.. వారు మనల్ని అవమానించారు అంటూ విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

US Presidential Elections: ట్రంప్‌కి షాక్ ఇస్తున్న అమెరికా ఎన్నికల ఫలితాలు, ఎన్నిక‌ల కౌంటింగ్‌లో ఫ్రాడ్ జరుగుతుందని తెలిపిన అమెరికా అధ్యక్షుడు, సుప్రీంకు వెళతామని ప్రకటన

Hazarath Reddy

అమెరికాలో ఎన్నికల ఫలితాలు తుది దశకు చేరుకున్నాయి. ప్రస్తుతం 238 ఎలక్టోరల్‌ ఓట్లు బైడెన్‌కు రాగా, ట్రంప్‌కు 213 ఎలక్టోరల్ ఓట్లు వచ్చాయి. కొద్ది సమయం క్రితం ఇద్దరి మధ్య దాదాపు 80 ఎలక్టోరల్ ఓట్లు వ్యత్యాసం ఉంది. ఇతర న్యూస్ వివరాలను పరిశీలిస్తే.. ప్ర‌స్తుతం ఫాక్స్ న్యూస్ అంచ‌నా ప్ర‌కారం.. బైడెన్ 237, ట్రంప్ 210 ఎల‌క్టోర‌ల్ ఓట్ల‌ను సాధించారు. సీఎన్ఎన్ ప్రకారం బైడెన్ 224, ట్రంప్ 213 ఎల‌క్టోర‌ల్ ఓట్ల‌ను గెలిచారు. గార్డియ‌న్ ప్రకారం బైడెన్ 238, ట్రంప్ 213 ఎల‌క్టోర‌ల్ ఓట్ల‌ను గెలిచారు.

US Election 2020: అమెరికా హీరో ఎవరు..జీరో ఎవరు? వెనుకబడిన ట్రంప్, దూసుకెళ్తున్న బైడెన్, 270 ఎలక్టోర‌ల్ ఓట్లు గెలుచుకున్నవారికే అమెరికా అధ్యక్ష పీఠం

Hazarath Reddy

అధ్యక్షుడిని ఎన్నుకొనేందుకు అమెరికా ప్రజలు కరోనా భయాలను లెక్కచేయకుండా చాలా రాష్ర్టాల్లో మంగళవారం ఉదయం 6 గంటల నుంచే పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లు వందల సంఖ్యలో బారులు తీరారు. రాత్రి 9 గంటల ( భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 7 గంటల వరకు) వరకు పోలింగ్‌ (US election 2020) జరుగుతుంది. ఈసారి భారీగా మెయిల్‌ ఇన్‌ ఓట్లు నమోదవటంతో ఫలితాలు ఆలస్యమయ్యే అవకాశం ఉన్నది.

Advertisement

COVID-19 in India: అక్కడ మళ్లీ లాక్‌డౌన్, కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బ్రిటన్ ప్రభుత్వం కీలక నిర్ణయం, ఇండియాలో తాజాగా 46,963 మందికి కరోనా, 1,22,111 మంది మృత్యువాత

Hazarath Reddy

దేశంలో గడిచిన 24 గంటల్లో 46,963 కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు (COVID-19 in India) నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 81,84,082కు చేరింది. నిన్న ఒక్క రోజే 470 మంది మరణించగా ఇప్పటివరకు మొత్తం 1,22,111 మంది కరోనాతో (Covid Deaths) మృత్యువాతపడ్డారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ (Ministry of Health and Family Welfare) ఆదివారం కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది.

Earthquake in Turkey: సముద్రంలో పెను భూకంపం, టర్కీ, గ్రీస్‌ దేశాలు విలవిల, 17 మంది మృతి, క్షతగాత్రులు 700 మందికి పైగానే, షాక్‌లో మరికొందరు, 7.0 తీవ్రతతో భూకంపం

Hazarath Reddy

టర్కీ, గ్రీస్‌ దేశాల్లో శుక్రవారం భారీ భూకంపం (Earthquake in Turkey) సంభవించింది. టర్కీ తీరప్రాంతం, గ్రీస్‌ దీవి సమోస్‌ మధ్య ఏజియన్‌ సముద్రంలో సంభవించిన ఈ భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 7.0గా నమోదైంది. టర్కీ పశ్చిమ తీరం, గ్రీస్‌ ద్వీపం సామోస్‌ల మధ్య ఏజియన్‌ సముద్రంలో సంభవించిన పెను భూకంపం ధాటికి రెండు దేశాల్లోని తీర ప్రాంత నగరాలు, పట్టణాలు చిగురుటాకుల్లా వణికాయి. ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు పెట్టారు.

VEXAS: మగవారిని మాత్రమే చంపేస్తోన్న కొత్త వ్యాధి, అంతుచిక్కని వ్యాధికి వెక్సాస్ సిండ్రోమ్‌గా నామకరణం చేసిన సైంటిస్టులు, అమెరికాలో పలువురు మృత్యువాత

Hazarath Reddy

ప్రపంచం కోవిడ్ తో అల్లాడుతుంటే మరో కొత్త వ్యాధి కంటి మీద కునుకులేకుండా చేస్తోంది. మగవారిని మాత్రమే ప్రభావితం చేస్తున్న కొత్త ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ ను సైంటిస్టులు కనుగొన్నారు. దీనికి ‘వెక్సాస్ సిండ్రోమ్’గా (VEXAS syndrome) నామకరణం చేశారు. జన్యుపరమైన ఈ వ్యాధితో అమెరికాలో చాలా మంది మగవారు మృతి చెందారు. అయితే దానికి సంబంధించిన కారణాలు ఇప్పటి వరకు తెలియలేదు.

Covid Pandemic: వణికిస్తున్న కరోనా సెకండ్ వేవ్, ఢిల్లీలో మూడవ దశకు కోవిడ్, మళ్లీ లాక్‌డౌన్ దిశగా ప్రపంచంలోని పలు దేశాలు, దేశంలో తాజాగా 48,648 మందికి కరోనా పాజిటివ్‌

Hazarath Reddy

భారత్‌లో గడిచిన 24 గంటల్లో 48,648 మందికి కరోనా పాజిటివ్‌ గా (Coronavirus Cases in India) నిర్థారణ అయింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 80,88,851కి చేరింది. నిన్న ఒక్క రోజే 563 మంది మరణించగా ఇప్పటివరకు మొత్తం 1,21,090 మంది కరోనాతో మృత్యువాతపడ్డారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది.

Advertisement

International Flights: అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధం మరోసారి పొడగింపు, కార్గో విమానాలు మరియు ఇప్పటికే షెడ్యూల్ చేయబడిన సర్వీసులకు నిషేధం వర్తించదని స్పష్టతనిచ్చిన డీజీసీఏ

Team Latestly

ఏవిషేషన్ అథారిటీ గత వారం మాట్లాడుతూ, ఈ శీతాకాలం సీజన్ లో వారానికి 12,983 దేశీయ విమాన సర్వీసులకు అనుమతిని ఇచ్చినట్లు తెలిపింది. కొవిడ్ లేనినాటి పరిస్థితులతో పోల్చితే దాదాపు 55 శాతం సర్వీసులను దేశీయ రూట్లలో నడుపుకునేందుకు అవకాశం కల్పించినట్లు....

BECA Agreement: చైనా, పాకిస్తాన్‌కు చెక్ పెట్టేలా బెకా అగ్రిమెంట్, ఇంతకీ బెకా అంటే ఏమిటీ ? దీని ద్వారా ఇండియాకు కలిగే ప్రయోజనం ఏమిటీ? బీఈసీఏ ఒప్పందంపై పూర్తి సమాచారం

Hazarath Reddy

భార‌త్‌‌, అమెరికా దేశాలు బేసిక్ ఎక్స్‌చేంజ్ అండ్ కోఆప‌రేష‌న్ అగ్రిమెంట్‌(BECA) ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందంలో భాగంగా సైనిక సాంకేతిక అంశంపై రెండు దేశాలు స‌హ‌కారం అందించుకోనున్నాయి. భారత్‌-అమెరికాల మధ్య ప్రారంభమైన 2+2 మంత్రిత్వ స్థాయి చర్చల్లో సమాచార మార్పిడి, సహకార ఒప్పందం (బెకా)పై ఇరు దేశాల నేతలు సంతకాలు (BECA Signed During India-US) చేశారు.

Peshawar Blast: పాకిస్తాన్ పెషావర్‌లో ఉగ్రదాడి, ఏడుగురి మృతి.. 70 మందికి గాయాలు, మదర్సాలో పేలిన బాంబు, విచారణ చేపట్టిన పెషావర్ పోలీసులు

Hazarath Reddy

దాయాది దేశం పాకిస్థాన్‌లోని (Pakistan) పెషావర్‌, దిర్ కాలనీలోని ఓ మదర్సాలో ఈ రోజు ఉదయం భారీ ఉగ్రదాడి (Peshawar Blast) జరిగింది. ఓ శిక్ష‌ణ స్కూల్‌లో జ‌రిగిన పేలుడులో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా, మరో 70 మందికి గాయాలయ్యాయని ( Peshawar Kills 7 Children, Wounds 70) పాక్ మీడియా తెలిపింది. మృతుల్లో నలుగురు 15 నుంచి 25 ఏళ్ల మధ్య వయసు ఉన్న విద్యార్థులు ఉన్నారని వైద్యులు తెలిపారు. గాయాలపాలైన వారిలో ఇద్దరు టీచర్లు ఉన్నట్లు చెప్పారు.

Covid in India: కరోనా నుంచి కోలుకుంటున్న ఇండియా, పెరుగుతున్న డిశ్చార్జ్ కేసులు, తాజాగా 50,129 కోవిడ్ కేసులు, 62,077 మంది డిశ్చార్జ్, యాక్టివ్‌ కేసుల సంఖ్య 6,68,154, మరణాల సంఖ్య 1,18,534

Hazarath Reddy

భారత్‌లో గడిచిన 24 గంటల్లో 50,129 కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 78,64,811కి చేరింది. నిన్న ఒక్క రోజే 578 మంది మరణించగా ఇప్పటివరకు మొత్తం 1,18,534 మంది కరోనాతో (Covid Deaths) మృత్యువాతపడ్డారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం కరోనాపై ( 2020 Coronavirus Pandemic in India) హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. గత 24 గంటల్లో 62,077 మంది కోలుకుని ఆసుపత్రులనుంచి డిశ్చార్జ్‌ అవ్వగా ఇప్పటి వరకు మొత్తం 70,78,123 మంది కోలుకున్నారు.

Advertisement

Covid Scare: కరోనాతో ప్రమాదకర పరిస్థితుల్లో కొన్ని దేశాలు, రాబోయే నెలలు ఇంకా డేంజర్, పాఠశాలలను మూసివేయాలని సూచించిన డబ్ల్యూహెచ్ఓ అధ్యక్షుడు టెడ్రోస్

Hazarath Reddy

కోవిడ్ మహమ్మారి (COVID-19 pandemic) ప్రపంచ దేశాలను వణికిస్తోంది. కోవిడ్ వ్యాక్సిన్ (Corona Vaccine) ఇంకా అందుబాటులోకి రాకపోవడంతో అది చెలరేగిపోతోంది. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organization)అధ్యక్షుడు కీలక వ్యాఖ్యలు చేశారు. కోవిడ్‌-19 మహమ్మారిలో (Covid Scare) ప్రపంచం ఇప్పుడు ఒక క్లిష్టమైన దశలో ఉందని ప్రపంచ ఆరోగ్య సం‍స్థ అధ్యక్షుడు టెడ్రోస్ అడానమ్ గెబ్రైసిస్‌ (Tedros Adhanom Ghebreyesus) శుక్రవారం వ్యాఖ్యానించారు. కరోనా మహమ్మారి వల్ల ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ప్రమాదకర పరిస్థితులు ఏర్పడ్డాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు

Coronavirus Outbreak: కరోనా వ్యాక్సిన్ అందరికీ ఉచితంగా వేస్తాం, వెల్లడించిన తమిళనాడు ప్రభుత్వం, ప్రయోజనం ఇవ్వని ప్లాస్మా థెరపీ, ఢిల్లీలో మళ్లీ పెరుగుతున్న కేసులు, దేశంలో 78 లక్షలకు చేరుకున్న కోవిడ్ కేసులు

Hazarath Reddy

దేశంలో తాజాగా 53,370 కొత్త కరోనా కేసులు (Coronavirus Outbreak in India) నమోదు అయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 78,14,682 చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. అదే సమయంలో 650 మంది మరణించడంతో మరణాల సంఖ్య 1,17,956కు (Covid Deaths)చేరుకుందని ఆరోగ్య శాఖ పేర్కొంది. కాగా, దేశంలో 89.78 శాతం కరోనా రోగుల రికవరీ రేటు ఉండగా, మొత్తం కేసులలో యాక్టివ్ కేసుల శాతం 8.71 శాతం ఉంది.

COVID-19 Vaccine: ఒక్క వ్యాక్సిన్ కోసమే రూ. 51 వేల కోట్లు పక్కన పెట్టిన కేంద్ర ప్రభుత్వం, ఒక్కో వ్యక్తికీ సగటున రూ.450-550 వరకు ఖర్చవుతుందని అంచనా

Hazarath Reddy

భారత్‌లో మొత్తం జనాభాకు కరోనా టీకాలు (COVID-19 Vaccine) ఉచితంగా వేయటానికి కేంద్రప్రభుత్వం భారీ మొత్తంలో నిధులను ఇప్పటికే సిద్ధం చేసిందని కేంద్ర ఆర్థికశాఖ వర్గాలు తెలిపాయి. అందరికీ టీకాలు వేయటానికి రూ.51,592 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని లెక్కగట్టి, ఆ మేరకు నిధులను సమీకరించారని వెల్లడించాయి.

Netherlands New Law: వ్యాధి నయం కాని పిల్లల్ని చంపేయండి, కొత్త చట్టాన్ని రూపొందించిన డచ్‌ ప్రభుత్వం, వైద్యరంగంలో తీవ్రమైన చర్చకు దారి తీసిన నెదర్లాండ్స్‌ ప్రభుత్వ నిర్ణయం

Hazarath Reddy

నెదర్లాండ్స్‌ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రపంచంలో ఏ దేశం సాహపం చేయని విధంగా ఈ నిర్ణయం ఉంది. డచ్‌ ప్రభుత్వం తీసుకువస్తున్న కొత్త చట్టం (Netherlands New Law) ప్రకారం తీవ్రమైన జబ్బుకు గురై కోలుకునేందుకు అవకాశం లేని ఒకటి నుంచి 12 ఏండ్ల వయసులోని చిన్నారులను (Terminally Ill Children) నిర్దాక్షిణ్యంగా చంపేయాలని చెబుతోంది. నయం చేయలేని లేదా తీవ్రంగా అనారోగ్యంతో బాధపడుతున్న పిల్లల జీవితాలను అంతం చేయడానికి (Doctors to Help End Lives) నెదర్లాండ్స్ యొక్క డచ్ ప్రభుత్వం ఈ చట్టం సాయంతో వైద్యులకు అనుమతి ఇచ్చింది.

Advertisement

Coronavirus Outbreak: కరోనాపై షాక్ ఇస్తున్న కొత్త నిజాలు, కోవిడ్‌తో బ్రెయిన్ డ్యామేజ్‌, గుండెపోటు సమస్యలు, ఫిబ్రవరి నాటికి సగం మందికి కరోనా, దేశంలో తాజాగా 46,791కేసులు నమోదు

Hazarath Reddy

వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి 130 కోట్ల దేశ జనాభాలో సగం మందికి కరోనా (Coronavirus Outbreak) సోకే అవకాశమున్నదని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ తెలిపింది.

Covid Second Wave: కరోనా కొత్త నిజాలు, ఫిబ్రవరి నాటికి వైరస్‌ ఖేల్ ఖతం, 9 గంటల పాటు మనిషి చర్మంపై కరోనా, సెకండ్‌ వేవ్‌ను తోసిపుచ్చలేమని తెలిపిన కేంద్రం

Hazarath Reddy

ఇండియాలో కరోనా వైరస్‌ ముమ్మర దశను దాటిందని వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి మహమ్మారి అంతం అవుతుందని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ స్పష్టం చేసింది. ఈ సంధర్భంలో కోవిడ్‌-19 నియంత్రణకు జారీ చేసిన మార్గదర్శకాలను విధింగా పాటించాలని ప్రజలను కోరింది. 2021 ఫిబ్రవరి నాటికి వైరస్‌ తోకముడిచే నాటికి దేశవ్యాప్తంగా ఒక కోటి ఐదు లక్షల మంది మహమ్మారి బారినపడతారని కమిటీ అంచనా వేసింది.

Global Hunger Index 2020: దేశంలో మిన్నంటిన ఆకలి కేకలు, భారత్ కన్నా బెటర్‌గా నిలిచిన పొరుగుదేశాలు, 107 దేశాలకు గానూ 94వ స్థానంలో నిలిచిన ఇండియా, జనాభా పెరుగుదలే కారణమని తెలిపిన జీహెచ్​ఐ

Hazarath Reddy

భారత దేశంలో ఆకలి కేకలు ఇంకా ఆగడం లేదు. పట్టెడన్నం కోసం జానెడు పొట్టలు అల్లాడుతున్నాయి. 2020 సంవత్సరానికి గాను ప్రపంచ ఆకలి సూచీలో (Global Hunger Index 2020) 107 దేశాలకు గాను మన దేశం 94వ స్థానంలో (India Ranks 94th in List of 107 Countries) నిలిచింది. ఆకలి అత్యంత తీవ్రంగా ఉన్న జాబితాలో భారత్‌తో పాటుగా పొరుగునే ఉన్న బంగ్లాదేశ్ (Bangladesh), మయన్మార్, పాకిస్తాన్‌లు (Pakistan) ఉన్నాయి. చైనా, బెలారస్, ఉక్రెయిన్, టర్కీ, క్యూబా, కువైట్‌ వంటి 17 దేశాలు అయిదు లోపు ర్యాంకుల్ని పంచుకొని టాప్‌ ర్యాంకింగ్‌లు సాధించాయి.

India Coronavirus: కరోనాతో బీహార్ ఐజీ మృతి, ఎన్నికల తరహాలో వ్యాక్సిన్లకు సిద్ధం కావాలని ప్రధాని మోదీ పిలుపు, డిసెంబర్‌ నాటికి 30 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులు రెడీ, దేశంలో తాజాగా 61,871 మందికి కోవిడ్-19

Hazarath Reddy

దేశ వ్యాప్తంగా గత 24 గంటల్లో కరోనాబారినపడి మరో 1033 మంది ప్రాణాలు విడిచారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1,14,031 కు (India Coronavirus Deaths) చేరింది. కొత్తగా 61,871 మందికి వైరస్‌ (Coronavirus Outbreak) సోకడంతో మొత్తం కేసుల సంఖ్య 74,94,552 కు (India Coronavirus) చేరింది. దేశంలో ప్రస్తుతం 7,83,311 యాక్టివ్‌ కేసులున్నాయి. వైరస్‌ బాధితుల్లో తాజాగా 72,614 మంది కోలుకున్నారు.

Advertisement
Advertisement