World

Donald Trump: ఆస్పత్రిలో చేరిన అమెరికా అధ్యక్షుడు, డొనాల్డ్ ట్రంప్, ఆయన భార్య మెలానియాకి కరోనా, మాస్క్ ధరించకపోవడం వల్లే కరోనా వచ్చిందని తెలిపిన ట్రంప్‌ ప్రత్యర్థి జో బైడెన్‌

Hazarath Reddy

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌(74), ఆయన భార్య మెలానియా ట్రంప్‌నకు కరోనా సోకింది. తామిద్దరికీ కోవిడ్‌ 19 పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని, తక్షణమే ఇరువురం క్వారంటైన్‌ ఆరంభిస్తున్నామని ట్రంప్‌ స్వయంగా ట్వీట్‌ చేశారు. కలిసికట్టుగా తామిద్దరం దీన్ని ఎదుర్కొంటామని ధీమా వ్యక్తం చేశారు. గురువారం సాయంత్రం ట్రంప్‌నకు కరోనా పాజిటివ్‌ అని నిర్ధారణ చేసుకున్నట్లు అధ్యక్షుడి ఆస్థాన వైద్యుడు సీన్‌ కొన్లే చెప్పారు. ప్రస్తుతం ట్రంప్ (Donald Trump), మెలానియా ఇద్దరూ ఆరోగ్యంగానే ఉన్నారని, వైట్‌హౌస్‌లోనే వారి క్వారంటైన్‌ జరుగుతుందని చెప్పారు.

India's COVID19 Update: భారత్‌లో 63 లక్షలు దాటిన కొవిడ్ బాధితుల సంఖ్య, లక్షకు చేరువైన కరోనా మరణాలు, గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 86,821 పాజిటివ్ కేసులు నమోదు

Team Latestly

అక్టోబర్ 15 నుంచి థియేటర్లు, మల్టీప్లెక్స్‌లు, స్విమ్మింగ్ పూల్స్‌కు అనుమతినిచ్చింది. అయితే, కరోనా కట్టడి చర్యల్లో భాగంగా సినిమా థియేటర్లలో, మల్టీప్లెక్స్‌లలో 50 శాతం సీటింగ్‌కు మాత్రమే అనుమతిస్తున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. విద్యా సంస్థలు....

Brain-Eating Amoeba: అమెరికాను వణికిస్తున్న మరో వైరస్, మెదడును తినే అమీబాతో ఆరేళ్ల బాలుడి మృతి, విపత్తు ప్రకటనను జారీ చేసిన టెక్సాస్ ప్రభుత్వం

Hazarath Reddy

కరోనాతో కుదేలయిన అమెరికాకు మరో వైరస్ ముప్పును తెచ్చిపెట్టేందుకు రెడీ అయింది. మెదడును తినే అమీబాను (Brain-Eating Amoeba) ఒకదాన్నిటెక్సాస్ లో స్థానిక నీటి సరఫరా వ్యవస్థలో (local water supply) టెక్సాస్‌ అధికారులు గుర్తించారు. ఈ అమీబా కారణంగా ఇప్పటికే ఓ ఆరేళ్ల బాలుడు మరణించడంతో ప్రభుత్వం (Texas Government) వెంటనే విపత్తు ప్రకటనను జారీ చేసింది. జాక్సన్‌ సరస్సులో నీటిని పరీక్షించిన తర్వాత దానిలో మెదడును తినే అమీబా చేరినట్లు సీడీసీ నిపుణులు వెల్లడించారు.

Coronavirus in India: బీజేపీ నేతలు వెంకయ్యనాయుడు, దగ్గుబాటి పురంధేశ్వరిలకు కరోనా, దేశంలో తాజాగా 80,472 మందికి కోవిడ్-19, 62,25,764కు చేరుకున్న మొత్తం కేసుల సంఖ్య

Hazarath Reddy

దేశ‌వ్యాప్తంగా గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 80,472 క‌రోనా పాజిటివ్ కేసులు (Coronavirus Cases in India) న‌మోద‌య్యాయి. దీంతో దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు న‌మోదైన క‌రోనా కేసుల సంఖ్య 62,25,764కు చేరింది. ఇందులో 9,40,441 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. మ‌రో 51,87,826 మంది బాధితులు క‌రోనా నుంచి కోలుకుని ఇంటికి చేరారు. నిన్న ఉద‌యం నుంచి ఇప్ప‌టివ‌ర‌కు క‌రోనా వ‌ల్ల 1179 మంది మ‌ర‌ణించారు. దీంతో క‌రోనా మృతుల సంఖ్య 97,497కు (Coronavirus deaths in india) చేరింద‌ని కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ శాఖ ప్ర‌క‌టించింది.

Advertisement

Cat Que Virus: చైనా నుంచి మరో ప్రమాదకర వైరస్, క్యూలెక్స్‌ దోమ ద్వారా క్యాట్‌ క్యూ వైరస్‌, కర్ణాటకలో ఇద్దరికీ సోకిన సీక్యూవీ, జాగ్రత్తగా ఉండాలని ఐసీఎంఆర్ హెచ్చరిక

Hazarath Reddy

వుహాన్‌లో పుట్టిన కరోనా కలకలం రేపుతున్న వేళ.. మరో చైనా వైరస్‌ (another virus from China)నుంచి దేశానికి ఆరోగ్య విపత్తు పొంచి ఉందని భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్‌) హెచ్చరించింది. పందుల్లో ఉండే ‘క్యాట్‌ క్యూ వైరస్‌' (సీక్యూవీ) (Cat Que Virus) దోమల ద్వారా భారత్‌లోకి ప్రవేశించే ప్రమాదం ఉన్నదని సోమవారం హెచ్చరించింది. ఈ వైరస్‌ క్యూలెక్స్‌ దోమ ద్వారా వ్యాప్తి చెందుతుంది.

COVID-19 in India: ఒక్క‌రోజులో 1,039 మంది మృతి, దేశంలో 60 లక్షలు దాటిన కోవిడ్ కేసులు, తాజాగా 82,170 మందికి కరోనా, 95,542కు చేరిన మరణాల సంఖ్య

Hazarath Reddy

దేశంలో గ‌త 24 గంట‌ల్లో అత్య‌ధికంగా రికార్డు స్థాయిలో 82,170 క‌రోనా పాజిటివ్ కేసులు (COVID-19 in India) న‌మోద‌య్యాయి. మరోవైపు ఒక్క‌రోజులోనే 1,039 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 95వేలు దాటాయని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. మొత్తం కేసులు 60,74,703కు (COVID-19 Cases in India) చేరుకున్న‌ట్లు హెల్త్ బులిటెన్ విడుద‌ల చేసింది. ఓ వైపు కోవిడ్ కేసులు పెరుగుతున్నా రిక‌వ‌రీ రేటు కూడా అదే స్థాయిలో గ‌ణ‌నీయంగా పెరుగుతుంది. 95,542కు మరణాల సంఖ్య (COVID-19 Deaths) చేరింది.

Red Wine Explodes in Spain: మందుబాబులు షాకయ్యే వార్త, ఏరులై పారిన రెడ్‌ వైన్‌, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోని చూసి గుండెలు బాదుకుంటున్న మద్యం ప్రియులు

Hazarath Reddy

ఈ వార్తను చూస్తే మద్యం ప్రియులు గుండెలు బాదుకుంటారు.. ఆ సమయంలో అక్కడ ఎందుకు లేము అని నిజంగా ఫీల్ అవుతారు.. అక్కడ రెడ్ వైన్ ఏరులై పారింది. కళ్ల ముందే వరదలా పారుతున్న అక్కడి అధికారులు ఏం చేయలేక నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయారు. వివరాల్లోకెళితే.. స్పెయిన్ యొక్క విల్లమాలియాలోని విటివినోస్ వైనరీలో రెడ్‌వైన్‌ నిల్వ ఉంచిన ట్యాంక్‌ పగిలిపోవడంతో రెడ్‌వైన్‌ వరదలా (Red Wine Explodes in Spain) పారింది. డ్యామ్‌ నుంచి నీళ్లను ఎత్తితే ఎంత వేగంగా పరిగెడుతాయో అచ్చం అలాగే ఆ రెడ్ వైన్ వరదలా పారింది.

Accidents in China & Pakistan: పాక్‌లో బస్సులో మంటలు చెలరేగి 13 మంది మృతి, చైనా బొగ్గు గనిలో జరిగిన ప్రమాదంలో 16 మంది మరణం, కొనసాగుతున్న సహాయక చర్యలు

Hazarath Reddy

రెండు వేర్వేరు దేశాల్లో జరిగిన ప్రమాదాల్లో 29 మంది మరణించారు. భారత్ కు పొరుగుదేశాలైన పాక్, చైనాలో ఈ రోజు ఘోర ప్రమాదాలు (Major Accidents in China & Pakistan) చోటు చేసుకున్నాయి. దాయాది దేశం పాకిస్తాన్ లో ప్రయాణికులతో వెళ్తున్న బస్సులో మంటలు చెలరేగి (Passenger bus catches fire in Pakistan) 13 మంది మృతి చెందారు.

Advertisement

Coronavirus in India: ఉమాభారతికి కరోనా పాజిటివ్‌, దేశంలో తాజాగా 88,600 కోవిడ్ కేసులు, 50 లక్షలకు చేరువలో రికవరీల సంఖ్య, 94,503కు చేరిన మరణాల సంఖ్య

Hazarath Reddy

భారత్‌లో గత 24 గంటల్లో 88,600 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 5,992,533కు (Coronavirus Outbreak in India) చేరింది. మరోవైపు గడిచిన 24 గంటల్లో 1,124 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 94,503కు చేరుకుందని కేంద్ర ఆరోగ్యశాఖ (Ministry of Health and Family Welfare) తెలిపింది. దేశంలో యాక్టవ్‌ కేసుల సంఖ్య 9,56,402గా ఉంది. ఇక రికవరీల సంఖ్య 49,41,628కు చేరుకుంది. యాక్టివ్‌ కేసులతో పోలిస్తే రికవరీలు 38 లక్షలకు పైగా ఉండటం గమనార్హం. మొత్తం కేసుల్లో యాక్టివ్‌ కేసులు 16,28 శాతం ఉన్నాయి.

Coronavirus Vaccines: ఆశలు రేపుతున్న 10 వ్యాక్సిన్లు ఇవే, నవంబర్ కల్లా వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకురావాలని కంపెనీలపై ఒత్తిడి తెస్తున్న అమెరికా, రేసులో ముందు వరసలో రష్యా వ్యాక్సిన్

Hazarath Reddy

ప్రపంచవ్యాప్తంగా 150 కి పైగా కరోనావైరస్ వ్యాక్సిన్లు (Coronavirus Vaccines) అభివృద్ధి చెందుతున్నాయి. కరోనా వ్యాప్తిని తగ్గించడానికి త్వరగా ఒకదాన్ని మార్కెట్లోకి తీసుకురావాలనే ఆశలు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువగా ఉన్నాయి. US ప్రభుత్వ ఆపరేషన్ వార్ప్ స్పీడ్ చొరవతో సహా, 10 బిలియన్ డాలర్ల ఖర్చుతో, జనవరి 2021 నాటికి 300 మిలియన్ మోతాదుల సురక్షితమైన, సమర్థవంతమైన కరోనావైరస్ వ్యాక్సిన్‌ను ( Dozens of Coronavirus vaccines) అభివృద్ధి చేసి పంపిణీ చేయడమే లక్ష్యంగా అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Kim Jong Un Apologises: కిమ్ నోటి వెంట సారీ మాట, ఉద్యోగిని కాల్చివేసిన ఘటనలో దక్షిణకొరియాకు సారీ చెప్పిన ఉత్తర కొరియా అధ్యక్షుడు

Hazarath Reddy

దక్షిణ కొరియా ఉద్యోగి ఒకరిని ఉత్తర కొరియా దళాలు కాల్చి చంపి, మృతదేహాన్ని తగలబెట్టిన విషయం విదితమే. ఆ వ్యక్తిని ఇరుదేశాల మధ్య వివాదాస్పద సరిహద్దులోని జలాల్లో ఒక చిన్న తెప్పలాంటి దానిపై ప్రయాణిస్తుండగా, గుర్తించి అదుపులోకి తీసుకుని చంపేశాయని (Killing of South Korean Official) నార్త్ కొరియా గురువారం వెల్లడించింది. దీంతో రెండు దేశాల మధ్య మళ్లీ వివాదం మరింతగా ముదిరే సూచనలు కనిపించడంతో ఉత్తర కొరియా అధ్యక్షుడు రంగంలోకి దిగారు.

WHO on Covid Pandemic: కరోనా మరణాలు తీవ్రంగా పెరిగే అవకాశం, ఆందోళన వ్యక్తం చేసిన డబ్ల్యూహెచ్‌ఓ, ప్రపంచదేశాలు సమిష్టి చర్యలు తీసుకోకపోతే మరణాలు 20 లక్షలకు చేరే అవకాశం ఉందని తెలిపిన ప్రపంచ ఆరోగ్య సంస్థ

Hazarath Reddy

ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 మహమ్మారి తీవ్రత రోజు రొజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అధికారులు మరోసారి ప్రపంచ దేశాలను హెచ్చరించారు. ఈ వ్యాధిపై ప్రపంచ దేశాలు సమిష్టి చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో మరణాల సంఖ్య (coronavirus death toll) రెట్టింపు అయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. అలాగే కరోనాను కట్టడి చేసేందుకు వాక్సిన్ అవసరం ఇప్పుడు చాలా ఉందని తెలిపారు. సత్వర చర్యలు, వాక్సిన్ రాని పక్షంలో కరోనా మరణాల తీవ్రత పెరుగుతుందని డబ్ల్యూహెచ్‌ఓ (World Health Organization) పేర్కొంది.

Advertisement

Coronavirus in India: తాజాగా 85,362 కొత్త కేసులు, దేశంలో 59 లక్షలు దాటిన కోవిడ్ కేసులు, 93,379 మంది కరోనాతో మృతి, ప్రపంచవ్యాప్తంగా 3.24 కోట్లను దాటిన కరోనా కేసులు

Hazarath Reddy

భారత్‌లో గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 85,362 కొత్త కేసులు నమోదు కాగా, 1,089 మరణాలు సంభవించాయి. ఇక మహమ్మారి నుంచి కోలుకుని 93,420 మంది డిశ్ఛార్జ్ అయ్యారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 59,03,933 (Coronavirus in India) చేరుకున్నాయి. అలాగే యాక్టివ్‌ కేసులు 9,60,969 ఉండగా, కరోనాకు చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 48,49,584కు చేరింది.

Coronavirus in India: కరోనా తగ్గిపోతోంది, దేశంలో 45 లక్షలు దాటిన డిశ్చార్జ్ కేసులు, తాజాగా 83,347 మందికి కరోనా, 1085 మంది మృతితో 90,020కి చేరిన మరణాల సంఖ్య

Hazarath Reddy

దేశంలో గ‌త 24 గంట‌ల్లో 83,347 పాజిటివ్ కేసులు (Coronavirus in India) న‌మోద‌య్యాయి. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు న‌మోదైన‌ క‌రోనా కేసుల సంఖ్య 56,46,011కు చేరింది. ఇందులో 45,87,614 మంది బాధితులు కోలుకోగా, 9,68,377 మంది చికిత్స పొందుతున్నారు. నిన్న ఉద‌యం నుంచి ఇప్ప‌టివ‌ర‌కు 1085 మంది బాధితులు క‌రోనాతో మ‌ర‌ణించడంతో మొత్తం మృతులు 90,020కి (COVID-19 Deaths) చేరారు. దేశంలో నిన్న 9,53,683 మందికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించామని భార‌తీయ వైద్య ప‌రిశోధ‌నా మండ‌లి ప్ర‌క‌టించింది. దీంతో సెప్టెంబ‌ర్ 22 వ‌ర‌కు మొత్తం 6,62,79,462 న‌మూనాల‌ను ప‌రీక్షించామ‌ని వెల్ల‌డించింది.

Ricin poison: ట్రంప్ ఇలాకాలో పాయిజన్ కలకలం, రిసిన్‌ అనే విషంతో కూడిన పార్సిల్‌‌ను వైట్‌హౌస్‌కు పంపిన గుర్తు తెలియని వ్యక్తులు, దర్యాప్తు చేస్తున్న ఎఫ్‌బీఐ, ఆర్‌సిఎంపి సంస్థలు

Hazarath Reddy

కీలకమైన అమెరికా అధ్యక్ష ఎన్నికల ముందు అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (President Donald Trump) మీద గుర్తుతెలియని వ్యక్తులు విష ప్రయోగానికి కుట్రలు పన్నారు. ఈ మేరకు శనివారం రాత్రి అధ్యక్షుడి అధికార నివాసమైన వైట్‌హౌస్‌కు విషంతో కూడిన ఓ పార్సిల్‌ను (Ricin Poison Contained in Envelop) పంపారు. వైట్ హౌస్కు (White House) ఓ కవర్ లో విరుగుడు లేని విషాన్ని పంపారని యు.ఎస్. అధికారులు వెల్లడించారు. ఇది కెనడా నుండి పంపినట్లు సమాచారం.

Brucellosis Disease: చైనాలో మళ్లీ వేల మందికి కొత్త వైరస్, జ్వరం, కీళ్ల నొప్పులు, తలనొప్పి, అవయవాల వాపు, సంతాన సాఫల్యతలకు కారణమవుతున్న బ్రూసిల్లోసిస్‌ బ్యాక్టీరియా, జంతువుల ద్వారా వ్యాప్తి

Hazarath Reddy

చైనాలో కొత్త బ్యాక్టీరియా వ్యాధి వెలుగు చూసింది. జంతువుల ద్వారా బ్రూసిల్లోసిస్‌ బ్యాక్టీరియా (Brucellosis outbreak in China) లాంజౌ నగరంలో తాజాగా బయటకు వచ్చింది. గత సంవత్సరం జంతువుల వ్యాక్సిన్లను తయారుచేసే ప్రభుత్వ యాజమాన్యంలోని బయోఫార్మాస్యూటికల్ ప్లాంట్ (Lanzhou Veterinary Research Institute) నుండి ఈ వైరస్ లీక్ అయింది. దీని ప్రభావంతో వాయువ్య చైనాలో వేలాది మంది బ్రూసిల్లోసిస్‌ బ్యాక్టీరియా వ్యాధిన (Brucellosis Disease) పడ్డారు. 3,245 మందికి బ్రూసెలోసిస్ బారిన పడ్డారని, ఇది తరచుగా సోకిన జంతువులతో లేదా జ్వరాలు, కీళ్ల నొప్పులు మరియు తలనొప్పిని కలిగించే జంతు ఉత్పత్తులతో సన్నిహితంగా ఉండటం వల్ల వస్తుందని లాన్జౌ నగరంలోని ఆరోగ్య అధికారులు తెలిపారు.

Advertisement

COVID-19 Second Wave: రెండవ దశ కరోనా కల్లోలం, యూకేలో రోజు రోజుకు భారీ స్థాయిలో నమోదవుతున్న కోవిడ్ కేసులు, మరోసారి లాక్‌డౌన్‌ విధించే యోచనలో యూకే ప్రభుత్వం

Hazarath Reddy

యూకేలో కరోనా వైరస్ కల్లోలాన్ని రేపుతోంది. సెకండ్‌ వేవ్‌తో (COVID-19 Second Wave) అక్కడ కేసులు రెట్టింపు అయ్యాయి. ఉత్తర ఇంగ్లండ్, లండన్‌లలో రోజుకి 6 వేల కేసులు నమోదు అవుతున్నాయి. ఆస్పత్రి పాలయ్యే కోవిడ్‌–19 రోగుల సంఖ్య ఎక్కువ కావడంతో మరోసారి లాక్‌డౌన్‌ (Second Lockdown) విధించే యోచనలో యూకే ప్రభుత్వం ఉంది. జూలై, ఆగస్టులలో కేసులు బాగా నియంత్రణలోకి వచ్చినప్పటికీ సెప్టెంబర్‌లో కరోనా మళ్లీ భయపెడుతోంది.

Russia's Covid Vaccine: రష్యా టీకా తీసుకున్నవారికి జ్వరం, కండరాల నొప్పులు, 21 రోజుల తర్వాత వారి ఆరోగ్య పరిస్థితిని సమీక్షించి రెండో డోసు టీకా , వెల్లడించిన రష్యా ఆరోగ్య శాఖ

Hazarath Reddy

కరోనా కల్లోలం నేపథ్యంలో ఎన్నో ఆశలు పెట్టుకున్న రష్యా కరోనా టీకా (Russia's coronavirus vaccine) స్పుత్నిక్‌ వీ వ్యాక్సిన్‌ భద్రతపై ఇప్పుడు అనేక అనుమానాలు నెలకొన్నాయి. ఈ టీకా డోసులు (Sputnik V COVID-19 vaccine) తీసుకున్న ప్రతీ ఏడుగురు వాలంటీర్లలో ఒకరికి సైడ్‌ ఎఫెక్ట్‌లు వచ్చినట్టుగా రష్యా ఆరోగ్య శాఖ (Russia Health Ministry) వెల్లడించింది. మూడో దశ ప్రయోగాల్లో భాగంగా 40 వేల మందికి టీకా డోసులు ఇవ్వాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. వారిలో ఇప్పటివరకు 300 మందికి వ్యాక్సిన్‌ ఇస్తే వారిలో 14 శాతం మందిలో ఇతర లక్షణాలు కనిపించాయి.

TikTok vs America: ట్రంప్‌పై అమెరికా కోర్టులో టిక్‌టాక్ ఫిర్యాదు, అమెరికా అధ్యక్షుడు తన అధికారాలను దుర్వినియోగం చేశారని కోర్టును ఆశ్రయించిన చైనా యాప్, అగ్రరాజ్యంలో టిక్‌టాక్, వీ చాట్‌‌లపై నిషేధం

Hazarath Reddy

చైనాకు చెందిన టిక్‌టాక్‌, వీచాట్‌ యాప్‌లను నిషేధిస్తున్నట్టు (TikTok Ban) అమెరికా శుక్రవారం ప్రకటించింది. ఆదివారం నుంచి ఈ నిషేధం అమల్లోకి వస్తుందని ఆ దేశ వాణిజ్య విభాగం పేర్కొంది. దేశ భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించింది. జాతీయ భద్రతను కాపాడటానికి చైనా సామాజిక యాప్‌లు టిక్‌ టాక్, వీ చాట్‌ లను నిషేధించామని యూఎస్‌ కామర్స్‌ సెక్రటరీ విల్‌బుర్‌ రాస్‌ తెలిపింది. కాగా దేశ సార్వభౌమాధికారానికి, సమగ్రతకు, దేశ భద్రతకు ముప్పుగా భావించిన భారత్ మొత్తం 224 చైనా యాప్‌లపై నిషేధించిన విషయం తెలిసిందే.

New York Mass Shooting: అగ్రరాజ్యంలో మళ్లీ కాల్పుల మోత, ఇద్దరు మృతి, 8 మందికి గాయాలు, కాల్పులతో దద్దరిల్లిన న్యూయార్క్‌లోని రోచెస్టర్‌ నగరం

Hazarath Reddy

అగ్రరాజ్యం అమెరికా మరోసారి రక్తమోడింది. న్యూయార్క్‌లోని రోచెస్టర్‌లో పెద్ద ఎత్తున కాల్పులు (New York Mass Shooting) చోటుచేసుకున్నాయి. గుర్తు తెలియని దుండుగులు జరిపిన ఈ కాల్పుల్లో ఇద్దరు పౌరులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి రోచెస్టర్‌లో వేర్వేరు ప్రాంతాల్లో కాల్పులు (US mass shooting) జరిగినట్టు గుర్తించారు. అమెరికా కాలమానం ప్రకారం అర్థరాత్రి 12.30కు ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి.

Advertisement
Advertisement