World
Coronavirus in Sweden: మీరంతా చావు కోసమే చూస్తున్నారు, సామాజిక దూరం పాటించకపోవడంపై స్వీడన్ ప్రధాని లావ్‌వెన్‌ ఆగ్రహం, 6,830కి చేరిన కోవిడ్ 19 కేసులు
Hazarath Reddyమీరంతా చావు కోసమే ఎదురు చూస్తున్నారు. మిమ్మల్ని ఆ దేవుడు కూడా కాపాడలేడు అంటూ స్వీడన్ ప్రధాని లావ్‌వెన్‌ (Swedish PM Stefan Lofven) దేశ ప్రజలపై విరుచుకుపడ్డారు. దీనికి కారణం లేకపోలేదు. స్వీడన్‌లో కరోనా వైరస్‌ (Coronavirus in Sweden) రోజు రోజుకు విస్తరిస్తున్నప్పటికీ అక్కడి ప్రజలు సామాజిక దూరాన్ని పాటించకుండా రెస్టారెంట్లకు, బీచ్‌లకు వెళుతున్నారు.
New COVID-19 Cases in China: చైనాలో మళ్లీ కరోనా కలకలం, కొత్తగా 39 కేసులు నమోదు, ఒకరు మృతి, ప్రపంచవ్యాప్తంగా 12 లక్షలు దాటిన కరోనా కేసులు
Hazarath Reddyచైనాలోని దక్షిణ ప్రాంతంలో తాజాగా 30 కరోనా పాజిటివ్‌ కేసులు (New COVID-19 Cases in China) నమోదు అయ్యాయని నేషనల్ హెల్త్ కమిషన్‌ అధికారులు ప్రకటించారు. శనివారం నమోదైన 30 కేసుల్లో 25 మంది విదేశాల నుంచి వచ్చినవారని, ఐదుగురు మాత్రం స్థానికులేనని తెలిపారు. దీంతో చైనా మళ్లీ ఒక్కసారిగా కలవరపాటుకు గురయింది.
Diya Jalo India: దీపాల వెలుగుల్లో మెరిసిన ఇండియా, దియా జలావొ గ్రాండ్ సక్సెస్, కరోనాను తరిమికొట్టడానికి ఏకమైన దేశ ప్రజలు, విద్యుత్‌ గ్రిడ్‌కు ఎలాంటి ఇబ్బంది కలగలేదని తెలిపిన కేంద్ర విద్యుత్‌ శాఖ మంత్రి ఆర్‌కే సింగ్‌
Hazarath Reddyదీప కాంతిలో భారతావని (India light lamp) వెలుగులీనింది. కరోనా రక్కసి అంతానికి దేశ ప్రజలంతా ఐక్యంగా దీపాలు చేతబూని ప్రతిజ్ఞ చేశారు. కరోనా వైరస్‌ పై (Coronavirus) జరుగుతున్న పోరాటంలో భాగంగా.. ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ఇచ్చిన పిలుపుకు దేశ వ్యాప్తంగా అధ్బుతమైన రెస్సాన్స్ కన్పించింది. దేశవ్యాప్తంగా ప్రజలు దీపాలు, కొవ్వొత్తులు, మొబైల్‌ టార్చ్‌లు వెలిగించి కరోనా రాక్షసిని అంతమొందించే ఉమ్మడి సంకల్పానికి ఘనంగా సంఘీభావం తెలిపారుసరిగ్గా 9గంటలకు ( 9 PM 9 Minutes) ఇళ్లలోని విద్యుత్తు దీపాలు ఆపివేసి దీపాలు వెలిగించారు.
Trump Urges PM Modi: అమెరికాలో కరోనా మృత్యుఘోష,మోడీ సాయం కోరిన ట్రంప్, హైడ్రాక్సీ క్లోరోక్వీన్‌ మెడిసిన్‌ ఎగుమతి చేయాలని ఇండియాను కోరిన అమెరికా
Hazarath Reddyకరోనా కోరల్లో నుంచి తప్పించుకునేందుకు ట్రంప్‌ భారత సహాయాన్ని (Trump urges PM Modi) కోరారు. మలేరియా నిరోధానికి వాడే హైడ్రాక్సీ క్లోరోక్వీన్‌(hydroxy chloroquine) మెడిసిన్‌ను తమ దేశానికి ఎగుమతి చేయాలని ట్రంప్‌ భారత్‌ ప్రధాని నరేంద్ర మోదీని (Prime Minister Narendra Modi) అభ్యర్థించారు. కోవిడ్-19 బాధితులకు వైద్య చికిత్స అందించేందుకు మలేరియా నియంత్రణకు ఉపయోగించే హైడ్రాక్సీ క్లోరోక్విన్ టాబ్లెట్లను మరింత విరివిగా సరఫరా చేయాలని ప్రధాని మోదీని ట్రంప్ కోరారు.
Tablighi Jamaat Links: 17 రాష్ట్రాలకు పాకిన మర్కజ్‌ మత ప్రకంపనలు, దేశ వ్యాప్తంగా మర్కజ్‌కు సంబంధించి 1023 కేసులు, 22వేల మంది క్వారెంటైన్‌ కేంద్రాలకు, వెల్లడించిన కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ
Hazarath Reddyగత నెలలో ఢిల్లీలో నిర్వహించిన మర్కజ్‌ మత ప్రార్థనలు (Tablighi Jamaat congregation) ఇప్పుడు దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. గడిచిన వారం రోజులుగా దేశంలో నమోదవుతున్న కరోనా పాజిటివ్‌ కేసులు (Coronavirus positive cases), మరణాల మూలాలన్నీ మర్కజ్‌ నుంచే ఉన్నట్లు వైద్యాధికారులు భావిస్తున్నారు. మర్కజ్‌ మత ప్రార్థనలకు(Nizamuddin markaz) వెళ్లిన వారు 17 రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు నివేదికను తయారు చేశారు.
COVID-19 in Delhi: కోవిడ్-19లో కీలక మలుపు, పండంటి బాబుకు జన్మనిచ్చిన పాజిటివ్ మహిళ, పుట్టిన బిడ్డకు నో వైరస్, ఢిల్లీ ఎయిమ్స్‌లో ఘటన
Hazarath Reddyదేశంలో రోజురోజుకీ కొత్త కరోనా కేసులు (Coronavirus Cases) నమోదు అవుతున్నాయి. వైద్యులు, సిబ్బంది కరోనా బాధితులకు చికిత్స అందించేందుకు తమ ప్రాణాలను సైతం లెక్క చేయడం లేదు. 24 గంటల పాటు కరోనా బాధితుల కోసమే పనిచేస్తున్నారు. అయితే ఢిల్లీలో (Delhi) ఓ ఘటన చోటు చేసుకుంది. కోవిడ్ 19 పాజిటివ్ ఉన్న మహిళ ( COVID-19 Positive Woman) పండంటి బాబుకు జన్మనిచ్చింది. ఆ బాబుకు కరోనా నెగిటివ్ అని తేలింది.
US Coronavirus Deaths: కరోనా కోరల్లో అమెరికా, రికార్డు స్థాయి మరణాలు, 2.70 లక్షలకుపైగా కరోనా పాజిటివ్ కేసులు, మృతదేహాలను భద్రపరిచేందుకు లక్ష సంచులు కావాలని ఫెమా ఆర్డర్
Hazarath Reddyకరోనా కోరల్లో చిక్కి అగ్రరాజ్యం అమెరికా (United States Coronavirus) అతలాకుతలమవుతున్నది. కాగా కరోనా మరణాల ( Coronavirus) విషయంలో ఇతర దేశాలు అందుకోలేనంత ఎత్తులోకి అమెరికా (America) చేరుకుంది . గురువారం-శుక్రవారం వరకు 24 గంటల సమయంలో ప్రపంచ రికార్డు స్థాయి మరణాలు (Coronavirus Deaths) సంభవించాయని జాన్స్‌ హాప్కిన్స్‌ యూనివర్శిటీ పేర్కొంది.
COVID-19 in Pakistan: పాకిస్తాన్‌లో వివక్ష కుట్ర, సింధ్‌లో హిందువుల ఆకలి కేకలు, 5 లక్షలకు పైగా హిందువులకు రేషన్ నిరాకరించిన అధికారులు
Hazarath Reddyకరాచీలో హిందువుల పట్ల వివక్ష చూపిస్తున్నారు ముస్లింలు. ఇటీవల, రేషన్ మరియు ఇతర నిత్యావసర వస్తువులను అక్కడ ప్రజలకు పంపిణీ చేశారు, కాని హిందువులను ఖాళీ చేతులతో ఇంటికి పంపించారు. సరుకులు ముస్లిం సమాజంలోని ప్రజలకు మాత్రమే ఇస్తున్నారని (Hindus Denied Ration In PAK)అక్కడి హిందువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Nizamuddin Markaz Row: మత పెద్దల నిర్లక్ష్యమే కొంపముంచిందా, మార్చి 23న భవనం ఖాళీ చేయాలంటూ ఢిల్లీ పోలీసుల ఆదేశాలు, సంచలన వీడియో వెలుగులోకి
Hazarath Reddyయావత్ దేశాన్నిఇప్పుడు తీవ్ర ఆందోళనలోకి నెట్టి వేసిన అంశం ఏదైనా ఉందంటే అది ఢిల్లీలో నిజాముద్దీన్ ఏరియాలో జరిగిన కార్యక్రమం (Nizamuddin Markaz Row) అనే చెప్పవచ్చు. విదేశాల నుంచి వచ్చిన వారికి కరోనా వైరస్ (Coronavirus) లక్షణాలు కన్పించడం ఆ వైరస్ అక్కడికి వెళ్లిన వారికి రావడంతో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అయితే దీనికి సంబంధించి ఢిల్లీ పోలీసులు (Delhi Police) మార్చి 23న భవనాన్ని ఖాళీ చేయమన్నట్లుగా వీడియో బయటకొచ్చింది.
'Very, very painful' : వైరస్ ధాటికి అగ్రరాజ్యం అతలాకుతలం, 'చాలా.. చాలా బాధకరం' అంటూ విచారం వ్యక్తం చేసిన ట్రంప్, రెండు వారాల్లో పెరిగే మరణాలపై తీవ్ర ఆందోళన
Vikas Mandaఐరాస ప్రధాన కార్యదర్శి అంటోనియో గుటెరస్ కూడా రానున్న రోజుల్లో ప్రపంచం కనీవినీ ఎరుగని సంక్షోభాన్ని ఎదుర్కోబోతుందని హెచ్చరించారు. కోవిడ్-19పై పోరును ప్రపంచ దేశాలన్నీ మరింత ఉధృతం చేయాలని, రాజకీయాలను పక్కనబెట్టి ఐక్యంగా......
Coronavirus Global Report: ప్రపంచాన కరోనా మృత్యుఘోష, ఇటలీలో 50 మంది డాక్టర్లు బలి, 8 లక్షలకు చేరువలో కోవిడ్-19 కేసులు, 37 వేలకు చేరిన మృతులు, కోలుకుంటున్న ఇటలీ
Hazarath Reddyప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 37,820 మంది కరోనా (Coronaviru) మహమ్మారికి బలైయ్యారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఇక కరోనా వైరస్‌ కేసుల సంఖ్య 8 లక్షలకు దగ్గర్లో ఉంది. వైరస్‌ నిర్థారణ అయినవారిలో మంగళవారం ఉదయం నాటికి 1,65,659 మంది కోలుకున్నారు.
Donated To Fight Coronavirus: కరోనా అంతు చూస్తామంటున్న కార్పోరేట్, సెలబ్రిటీల నుంచి మినిష్టర్ల దాకా.., పీఎం రిలీఫ్ ఫండ్‌కి భారీగా విరాళాలు, ఇప్పటివరకు అందిన మొత్తం లిస్టు ఇదే
Hazarath Reddyదేశంలో కరోనావైరస్ (Coronavirus) మెల్లిగా విస్తరించుకుంటూ పోతున్న నేపథ్యంలో దాన్ని నియంత్రించేందుకు కార్పోరేట్ (Corporates) ప్రపంచం ముందుకు వచ్చింది. సెలబ్రిటీల నుంచి మినిష్టర్ల దాకా అందరూ దాన్ని అంతు చూసేందుకు రెడీ అయ్యారు. ఇండియాలో సోమవారం సాయంత్రానికి 1071 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి, అలాగే 34 మంది మరణించారు. భారతదేశం కరోనావైరస్ వ్యాప్తిపై పోరాడుతూనే ఉండటంతో, ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు (Business Mans) మరియు రాజకీయ నాయకులతో (Political Leaders)సహా అన్ని వర్గాల ప్రజలు దాని నియంత్రణకు భారీగా విరాళాలు (Donated To Fight Coronavirus) అందిస్తున్నారు. భారతదేశంలో కరోనావైరస్‌పై పోరాటానికి ఇప్పటివరకు విరాళాలు ఇచ్చిన వ్యక్తుల జాబితాను ఓ సారి చూద్దాం.
COVID-19: నిర్లక్ష్యానికి భారీ మూల్యం, ఒకే కుటుంబంలో 25 మందికి కరోనావైరస్, దేశ వ్యాప్తంగా 1071 పాజిటివ్ కేసులు, 34కు చేరుకున్న కోవిడ్ 19 మరణాలు
Hazarath Reddyఓ కుటుంబంలోని న‌లుగురు వ్య‌క్తులు సౌదీ అరేబియాకు వెళ్లొచ్చినా ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోకుండా నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించడంతో విదేశాల‌కు వెళ్లొచ్చిన వారితో క‌లిపి మొత్తం 25 మంది ఇప్పుడు కరోనావైరస్ వ్యాధి భారీన పడ్డారు. కాగా వారంతా ఇరుకుగా ఉండే ఒకే ఇంట్లో ఉండ‌టంతో అందరికీ క‌రోనా మ‌హ‌మ్మారి సోకిందని అధికారులు తెలిపారు.
Wuhan Deaths Mystery: వుహాన్‌ కరోనా చావుల మిస్టరీ, కరోనా వల్ల వుహాన్‌లో 42 వేల మందికి పైగా మృతి, 3200 మంది చనిపోయారంటూ చైనా అధికారిక ప్రకటన, RFA కథనంలో నిజమెంత ?
Hazarath Reddyచైనాలో 2019లో పుట్టిన కరోనావైరస్ (Coronavirus outbreak in China) ఆ దేశాన్ని 4 నెలల పాటు వణికించిన సంగతి విదితమే. కాగా ఈ వైరస్ దెబ్బకు చైనాలో ప్రజలు పిట్టల్లా రాలిపోయారు. అయితే వైరస్ తీవ్రత ఆ స్థాయిలో ఉన్నప్పటికీ చైనాలో కోవిడ్ 19 కారణంగా వుహాన్ లో (Wuhan) కేవలం 3200మంది మాత్రమే చనిపోయారని ఆ దేశం అధికారికంగా వెల్లడించింది. అయితే ఇది అంతా అవాస్తవమని ((Wuhan Deaths Mystery) RFA సంచలన కథనాన్ని వెలువరించింది.
COVID-19 Death Toll In India: ఇండియాలో 29కు చేరిన మృతులు, 24 గంటల్లో 106 కొత్త కేసులు, పాజిటివ్‌ కేసులు సంఖ్య 979, కోవిడ్‌-19పై హెల్త్‌బులెటిన్‌ విడుదల చేసిన కేంద్ర ఆరోగ్యశాఖ
Hazarath Reddyఇండియాలో చాపకింద నీరులా కరోనా (Coronavirus) విస్తరిస్తోంది. రోజు రొజుకు దేశ వ్యాప్తంగా కోవిడ్ 19 కేసులు పెరుగుతున్నాయి. భారత్‌లో (India) 979 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. గడచిన 24 గంటల్లో కొత్తగా106 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా..ఆరుగురు మరణించారని వెల్లడించింది. దీంతో కోవిడ్‌-19 కారణంగాంఖ ఇప్పటి వరకు దేశంలో మృతిచెందిన వారిసంఖ్య 29కు (COVID-19 Death Toll In India) చేరింది. తాజాగా కోవిడ్‌-19పై (COVID-19) కేంద్ర ఆరోగ్యశాఖ హెల్త్‌బులెటిన్‌ విడుదల చేసింది.
Heartbreaking video: కన్నీళ్లు తెప్పిస్తున్న తండ్రీ కొడుకుల వీడియో, కరోనావైరస్ దెబ్బకు కొడుకును దగ్గరకు తీసుకోలేని నిస్సహాయ డాక్టర్ కథ ఇది, సోషల్ మీడియాలో వైరల్
Hazarath Reddyతండ్రీ కొడుకుల బందాన్ని కరోనావైరస్ (coronavirus pandemic) ఛిన్నాభిన్నం చేస్తోందనే దానికి ఈ వీడియో (Heartbreaking video) ప్రత్యక్ష ఉదాహరణ. కోవిడ్ 19 (COVID19) పేషెంట్లకు ట్రీట్మెంట్ చేస్తున్న ఓ డాక్టర్ (Saudi doctor) ఇంటికి వచ్చిన తరువాత తన కొడుకును చేతుల్లోకి తీసుకోలేక ఏడుస్తూ అలా ఉండిపోయాడు, కొడుకు నాన్నా అంటూ పరిగెత్తుకుంటూ వస్తే.. దగ్గరకు రావద్దు దూరంగా ఉంటూ అంటూ ఏడుస్తూ కూలబడిపోయాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో కన్నీళ్లను తెప్పిస్తోంది.
Coronavirus in US: అమెరికాలో కరోనా మృత్యు ఘోష, నెలల పసికందును మింగేసిన కోవిడ్-19, లక్షా 21 వేలకు పైగా కరోనా కేసులు, రెండు వేలు దాటిన మృతులు సంఖ్య
Hazarath Reddyఅగ్రరాజ్యం అమెరికా (America) కరోనా కోరల్లో చిక్కుకుని విలవిలలాడుతోంది. ఆ దేశంలో కరోనా (Coronavirus) విలయతాండవం చేస్తోంది. అమెరికాలో కోవిడ్ 19కు (COVID 19) ఓ ముక్కుపచ్చలరారని చిన్నారి బలైంది. చికాగోకు చెందిన నెలల పసికందు కోవిడ్‌-19 బారినపడి ప్రాణాలు విడిచిందని ఇల్లినాయిస్‌ ఆరోగ్యశాఖ (ఐడీపీహెచ్‌) శనివారం వెల్లడించింది.
COVID-19 in Spain: కరోనా కాటుకు బలైన స్పెయిన్‌ రాణి, పారిస్‌లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచిన మారియా థెరీసా, స్పెయిన్‌లో 73 వేలకు చేరిన కరోనా కేసులు
Hazarath Reddyకరోనా మహమ్మారి కరోనాకు (COVID 19) స్పెయిన్‌ రాణి మారియా థెరీసా (Princess Maria Teresa) బలయ్యారు. ఆమె వయసు 86 ఏళ్లు. ప్రాణాంతక వైరస్‌ బారిన పడిన యువరాణి ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. సోషియాలజీ ప్రొఫెసర్‌గా పనిచేసిన మారియా స్పెయిన్‌ రాజు ఫెలిప్‌-6కు సోదరి. 1933 జులై 28 న ఆమె జన్మించారు. ఫ్రాన్స్‌లో చదువుకున్న మారియా సామాజిక కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషించి ‘రెడ్‌ ప్రిన్సెస్‌’గా పేరు సంపాదించారు.
Coronavirus pandemic: కరోనా ఖేల్ ఖతం అంటున్న అమెరికా, కోవిడ్ 19పై యుద్ధం కోసం 64 దేశాలకు భారీ సహాయం, ఇండియాకు 2.9 మిలియన్‌ డాలర్ల ఆర్థిక సహాయం
Hazarath Reddyప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌(COVID 19)పై పోరులో ప్రపంచ దేశాలకు అండగా ఉండేందుకు అగ్రరాజ్యం అమెరికా (America) ముందుకు వచ్చింది. కరోనా మహమ్మారి సృష్టించిన సంక్షోభంపై పోరాడేందుకు 64 దేశాలకు కలిపి మొత్తంగా 174 మిలియన్‌ డాలర్ల ఆర్థిక సహాయం ప్రకటించింది. ఫిబ్రవరిలో ప్రకటించిన 100 మిలియన్‌ డాలర్ల సహాయానికి శుక్రవారం ప్రకటించిన ప్యాకేజీకి ఇది అదనం అని చెప్పవచ్చు.
Covid-19 Deaths in Italy: ఇటలీలో కరోనా చావు కేకలు, ఒక్క రోజే 1000 మంది మృతి, 9134కు చేరిన మృతుల సంఖ్య, 86 వేల మందికి కోవిడ్-19 పాజిటివ్
Hazarath Reddyయూరప్‌ దేశం ఇటలీపై కరోనావైరస్ (Coronavirus) విలయతాండవం చేస్తోంది. కోవిడ్ 19 ధాటికి ఆ దేశం చిగురటాకులా వణికిపోతోంది. దీని దెబ్బకు శుక్రవారం ఒక్కరోజే దాదాపు 1000 కరోనా మరణాలు (COVID-19 Deaths in Italy) నమోదయ్యాయి. కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 9134కు చేరింది. అదే విధంగా దాదాపు 86 వేల మంది కరోనా పేషెంట్లుగా మారారు.