Entertainment

Rajinikanth Political Suspense: అభిమానులతో రజినీకాంత్ రేపు కీలక భేటీ, రాజకీయ ప్రవేశంపై సస్పెన్స్ వీడే అవకాశం, సమావేశానికి అనుమతి కావాలని కోడంబాకం పోలీసులకు లేఖ రాసిన రజనీ ఫ్యాన్స్

Hazarath Reddy

జనీకాంత్ తన అభిమానులతో రేపు సమావేశం (Rajinikanth To Hold Key Meeting With RMM Cadre) కానున్నారు. అభిమానులంతో నవంబర్ 30న రజనీ మక్కల్ మండ్రాం ఆఫీసుకు రావాలని పిలుపునిచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సమావేశంలో రాజకీయాల్లోకి ఎంట్రీపై ఆయన కీలక నిర్ణయం (May End Suspense Over Political Move) తీసుకోనున్నట్లుగా తెలుస్తోంది.

Sushant Death Probe: యూట్యూబ్‌లో తప్పుడు వార్తలు, ఛానల్ యజమానిపై రూ. 500 కోట్ల పరువు నష్టం దావా వేసిన అక్షయ్ కుమార్, సుశాంత్‌ కేసుతో అక్షయ్‌కు సంబంధం ఉందంటూ పలు వీడియోలు

Hazarath Reddy

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసులో (Sushant Death Probe) మరో పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులోకి తనను లాగినందుకు బాలీవుడ్‌ యాక్షన్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ ఓ యూట్యూబర్‌‌కు భారీ షాక్‌ ఇచ్చారు. తనపై అసత్య వార్తాకథనాలను ప్రచారం చేస్తున్న యూట్యూబర్‌పై అక్షయ్‌కుమార్‌ (Bollywood actor Akshay Kumar) రూ.500 కోట్లకు పరువునష్టం దావా దాఖలు చేశాడు.

Salman Khan in Self-Isolation: హోమ్‌ క్వారంటైన్‌లోకి సల్మాన్‌ ఖాన్, వ్యక్తిగత డ్రైవర్‌కి కరోనా పాజిటివ్, సందిగ్ధంలో బిగ్‌బాస్‌ హోస్టింగ్‌ వ్యవహారం

Hazarath Reddy

బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్ హోమ్‌ క్వారంటైన్‌లోకి (Salman Khan in Self-Isolation) వెళ్లాడు.తన వ్యక్తిగత డ్రైవర్‌, ఇద్దరు సిబ్బంది కరోనా వైరస్‌ బారిన పడటంతో తన కుటుంబంతో కలిసి 14 రోజుల పాటు సెల్ఫ్‌ ఐసోలేషన్‌లో ఉండనున్నాడు.

Khushbu Sundar: బీజేపీ నేత ఖుష్బూ సుందర్ కారుకు ప్రమాదం, దేవుడి దయ వల్ల తాను క్షేమంగా బయటపడ్డానంటూ ట్వీట్, వేల్‌ యాత్రలో పాల్గొనేందుకు వెళుతుండగా ప్రమాదం

Hazarath Reddy

తమిళ నటి, ఇటవలే బీజేపీలో చేరిన ఖుష్బూ (Khushbu Sundar) తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆమె ప్రయాణిస్తున్న కారును ట్యాంకర్‌ ఢీకొట్టడంతో ఒకవైపు డోర్‌ పూర్తిగా ధ్వంసమైంది. అయితే, సమయానికి ఎయిర్‌బెలూన్లు తెరుచుకోవడంతో కారులో ఉన్నవారంతా క్షేమంగా బయటపడ్డారు.

Advertisement

Tamil Actor Thavasi: తమిళ నటుడికి క్యాన్సర్, ఆర్థికంగా ఆదుకోవాలంటూ ట్విట్టర్‌లో వేడుకున్న కమెడియన్ తవసి, తోచినంత సాయం చేస్తామని స్పందిస్తున్న నెటిజన్లు

Hazarath Reddy

తమిళ సినిమాల్లో కమెడియన్‌గా నటించి ప్రేక్షకుల్ని అలరించిన నటుడు తవసి (Tamil Actor Thavasi) క్యాన్సర్ బారీన పడిన సంగతి విదితమే. కొంత కాలంగా క్యాన్సర్‌ చికిత్స తీసుకుంటున్న తవసి ఆర్థికంగా బాగా చితికిపోయారు. అటు ఆరోగ్యం, ఇటు ఆర్థికంగానూ కుదేలైన తవసి చాలా సన్నబడిపోయారు. గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. తండ్రి చికిత్సకు ఆర్థికంగా తమను ఆదుకోవాలంటూ ఆయన కుమారుడు అరుముగన్‌ కోలీవుడ్‌ పెద్దలను అభ్యర్థించారు.

Varma's Disha Movie Row: వర్మకు తెలంగాణ హైకోర్టు నోటీసులు, దిశ తండ్రి న్యాయవాది ఆరోపణలపై వివరణ ఇవ్వాలన్న ధర్మాసనం, కౌంటర్లు దాఖలు చేయాల్సిందిగా సెన్సార్ బోర్డు, రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు

Hazarath Reddy

కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్, వివాదాలకు మారుపేరైన సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న దిశ ఎన్ కౌంటర్ సినిమాపై (disha Encounter movie) తెలంగా హైకోర్టు వర్మకు నోటీసులు జారీ చేసింది. దిశ ఎన్ కౌంటర్ సినిమా ఆపాలంటూ దిశ తండ్రి దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో (Telangana high court) విచారణ జరిగింది.

Balakrishna on Covid: కరోనాతో కలిసి బతకాల్సిందే, హీరో బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు, సెహరి సినిమా ఫస్ట్‌లుక్‌ విడుదల చేసిన నందమూరి నటసింహం

Hazarath Reddy

కరోనాకు వ్యాక్సిన్‌ రాలేదు... అసలు వ్యాక్సిన్‌ రాదు’ అని అన్నారు. బాలకృష్ణ (Nandamuri Balakrishna) మాట్లాడుతూ కరోనాతో సహ జీవనం చేయాల్సిందేనని అన్నారు. ‘మనం జాగ్రత్తగా ఉండాలి. వ్యాక్సిన్ (#CoronavirusVaccine) వస్తుంది అని అంటున్నారు అది నిజం కాదు. అసలు వాక్సిన్ వచ్చే అవకాశాలు లేవు.

Diwali Celebrations: పండుగ రోజున సంజయ్ దత్‌కి సర్‌ప్రైజ్ ఇచ్చిన మోహన్ లాల్, మున్నాభాయ్ ఇంట్లో దీపావళి వేడుకలకు హాజరు, సంజయ్‌, మాన్యతా నా స్నేహితులు అంటూ ట్వీట్

Hazarath Reddy

మళయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్‌ మున్నాభాయ్ కి సర్ ప్రైజ్ గిఫ్ట్ (Mohanlal -Sanjay Dutt Ring) ఇచ్చారు. నేరుగా వారి ఇంటికి వెళ్లి దీపావళి వేడుకలను జరుపుకున్నారు. బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్‌, ఆయన భార్య మాన్యతా దత్‌ ముంబైలోని తమ ఇంట్లో దీపావళి వేడుకలు జరుపుకోగా ఈ వేడుకలలో మ‌ల‌యాళ మెగాస్టార్ మోహ‌న్ లాల్ (Mohanlal) కూడా భాగం అయ్యారు.

Advertisement

Chiranjeevi Tests Positive for Covid: హీరో చిరంజీవికి కరోనా, సీఎం కేసీఆర్‌ని కలిసిన రెండు రోజుల తర్వాత పాజిటివ్, హోమ్ క్వారంటైన్‌లోకి వెళ్లిన మెగాస్టార్

Hazarath Reddy

తెలుగు సినిమా ఎవర్ గ్రీన్ హీరో మెగాస్టార్‌ చిరంజీవి కరోనావైరస్ బారినపడ్డారు. ఆచార్య సినిమా షూటింగ్‌లో పాల్గొనేందుకు కోవిడ్‌ పరీక్ష చేయించుకోగా ఆయనకు కోవిడ్ పాజిటివ్‌గా (Chiranjeevi Tests Positive for Covid) నిర్ధారణ అయిది. ఈ విషయాన్ని స్వయంగా చిరంజీవి ట్విటర్‌ వేదికగా తెలిపారు.

New Film City in Hyd: తెలంగాణ సీఎంను కలిసిన తెలుగు సినీ హీరోలు, హైదరాబాద్‌లో అంతర్జాతీయ స్థాయిలో ఫిల్మ్ సీటీ, 1500-2000 ఎకరాల స్థలం కేటాయిస్తామని తెలిపిన కేసీఆర్

Hazarath Reddy

కరోనావైరస్, లాక్ డౌన్ ప్రభావంతో తెలుగు చిత్ర పరిశ్రమ తీవ్రంగా నష్టపోయిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావును (CM KCR) ఎంపీ సంతోష్‌ కుమార్‌తో కలిసి ప్రముఖ నటులు చిరంజీవి, నాగార్జున ప్రగతి భవన్‌లో భేటీ అయ్యారు. తెలుగు చిత్ర సీమను ఆదుకోవాలని వారు కోరారు. వరద బాధితులను ఆదుకునేందుకు గతంలో ప్రకటించిన విరాళాలకు సంబంధించిన చెక్కులను ఈ సంధర్భంగా సీఎం కేసీఆర్‌కు వారు అందజేశారు.

Rajasekhar Health Condition: హీరో రాజశేఖర్ ఆరోగ్యంపై స్పందించిన జీవిత, తొందరలోనే డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది, డాక్టర్లు ఆక్సిజ‌న్ సపోర్ట్ తగ్గిస్తూ చికిత్స చేస్తున్నార‌ని తెలిపిన రాజశేఖర్ సతీమణి

Hazarath Reddy

సినీనటుడు రాజశేఖర్‌ ఆరోగ్యంపై ఆయన భార్య జీవితా రాజశేఖర్‌ (Jeevitha Rajasekhar) స్పందించారు. బుధవారం ఆమె మాట్లాడుతూ.. రాజశేఖర్‌ ఆరోగ్యం (Rajasekhar Health Condition) ముందుకన్నా చాలా మెరుగ్గా ఉంది. వైద్యానికి ఆయన సహకరిస్తున్నారు. మొదట చాలా క్రిటికల్‌ స్టేజి వరకు వెళ్లారు. వైద్యులు, మేము కూడా చాలా భయపడ్డాము. డాక్టర్లు అనుక్షణం ఆయనను కనిపెట్టి మెరుగైన వైద్యం అందిస్తున్నారు

Faraaz Khan Passes Away: బాలీవుడ్‌లో మరో విషాదం, మృత్యువుతో పోరాడి ఓడిన ఫరాజ్ ఖాన్, ఛాతీ, మెదడు సంబంధింత ఇన్‌ఫెక్షన్‌తో తిరిగిరాని లోకాలకు చేరిన మెహందీ నటుడు

Hazarath Reddy

బాలీవుడ్ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు ఫరాజ్ ఖాన్ (Faraaz Khan Passes Away) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించి బుధవారం తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్నినటి పూజా భట్ ట్విటర్‌లో షేర్‌ చేశారు.

Advertisement

Drugs Case: డ్రగ్స్ కొనుగోలు చేస్తూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన ప్రముఖ టీవీ నటి, ప్రీతికా చౌహాన్,‌ ఫైజల్‌ని అరెస్ట్ చేసిన ఎన్‌సీబీ అధికారులు

Hazarath Reddy

ప్రముఖ హిందీ సీరియల్స్‌ నటి ప్రీతికా చౌహాన్‌(30) డ్రగ్స్‌ వినియోగం కేసులో (Preetika Chauhan drugs abuse) అరెస్టయ్యారు.నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో(ఎన్‌సీబీ) అధికారులు శనివారం ఆమెతో పాటు మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.

RGV Missing Official Trailer: వర్మని కిడ్నాప్ చేసిందెవరు? ఆర్జీవీ మిస్సింగ్ సినిమా చూడమంటున్న రామ్ గోపాల్ వర్మ, ట్విట్టర్ వేదికగా RGV Missing ట్రైలర్ విడుదల

Hazarath Reddy

చిత్రసీమలో వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కిస్తోన్న 'ఆర్జీవీ మిస్సింగ్' సినిమా ట్రైలర్‌ (RGV Missing Official Trailer) ఆదివారం విడుదలైంది. రామ్ గోపాల్ వర్మ నిన్న ప్రకటించిన విధంగానే దసరా రోజున చెప్పిన సమయం కంటే ఓ 20 నిమిషాలు ముందే ఆర్జీవీ మిస్సింగ్ ట్రైలర్‌ను (Varmas RGV Missing Official Trailer) విడుదల చేశారు.

#HappyBirthdayPrabhas: 42వ వడిలోకి అడుగుపెట్టిన డార్లింగ్‌ ప్రభాస్‌, ట్విట్టర్లో హోరెత్తుతున్న పుట్టిన రోజు శుభాకాంక్షలు, రాధే శ్యామ్ చిత్రంలో విక్రమాదిత్యగా ప్రభాస్, సినిమా ఫస్ట్ లుక్ విడుదల

Hazarath Reddy

తెలుగు సినిమా రెబల్ స్టార్ డార్లింగ్‌ ప్రభాస్‌ నేడు 42వ పుట్టిన రోజు (Happy birthday Prabhas) జరుపుకుంటున్నారు. ఆయనకు ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి. ఆయన పుట్టిన రోజు కానుకగా ఈ రోజు ప్రభాస్ తాజా చిత్రం రాధే శ్యామ్‌ నుంచి బీట్స్‌ ఆఫ్‌ రాధే శ్యామ్‌’ విడుదల కానుంది. ప్రభాస్ పూర్తి పేరు ఉప్పలపాటి వెంకట సత్యనారాయణ ప్రభాస్‌ రాజు. ఉప్పలపాటి సూర్యనారాయణ రాజు, శివ కుమారి కొడుకు ప్రభాస్‌.

#RamarajuForBheem : 'భూతల్లి చనుబాలు తాగిన మన్యం ముద్దుబిడ్డ, గోండు బెబ్బులి కొమరం భీమ్' వచ్చేశాడు! రామ్ చరణ్ గంభీరమైన గళంతో 'RRR భీమ్' టీజర్ వీడియో రిలీజ్

Team Latestly

ఆదిలాబాద్ అడవుల్లో ఎగసిన జ్వాల కొమరంభీం నిజాం రజాకర్లతో, బ్రిటీష్ వారితో ఏకకాలంలో ద్విముఖ పోరాటం చేశారు. అంతేకాకుండా ఈ విప్లవకారుడు మన్యందొర అల్లూరి సీతారామ రాజును తన అన్నగా భావించి ఆయన ద్వారా స్వాతంత్య్రోద్యమ స్పూర్థి పొందినట్లు చరిత్ర చెబుతుంది. మరి ఇందులో కొమరంభీంగా ఎన్టీఆర్ పాత్ర ఇంట్రొడక్షన్ ఎలా ఉందో ఇక్కడ చూడొచ్చు.

Advertisement

Narthanasala: అందాల నటి సౌందర్య యాక్టింగ్ తెరపైకి, నర్తనశాల సినిమా ఓటీటీని విడుదల చేస్తామని తెలిపిన బాలకృష్ణ, 17 నిమిషాల నిడివి ఉన్న సన్నివేశాలు ప్రేక్షకుల ముందుకు..

Hazarath Reddy

నందమూరి నటసింహం బాలకృష్ణ (Narthanasala, Balakrishna) దర్శకత్వం వహించాలనుకున్న 'నర్తనశాల' సినిమా మధ్యలో ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అర్జునిడిగా బాలయ్య నటించగా, భీముడిగా శ్రీహరి , ధర్మరాజుగా శరత్ కుమార్, అభిమన్యుడిగా ఉదయ్ కిరణ్ నటించారు. ఇక ద్రౌపతిగా అందాలనటి సౌందర్య నటించింది.

Jeevitha Rajasekhar Family Covid 19: జీవిత రాజ‌శేఖ‌ర్ కుటుంబ సభ్యులకు కరోనా, మా ఇద్ద‌రి ఆరోగ్యం బాగానే ఉంది, త్వ‌ర‌లోనే ఇంటికి వెళ్తామంటూ రాజశేఖర్ ట్వీట్

Hazarath Reddy

తెలుగు సినిమా న‌టుడు యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజ‌శేఖ‌ర్ కుటుంబ సభ్యులు క‌రోనా (Jeevitha Rajasekhar Family Covid 19) మహమ్మారి బారిన ప‌డ్డారు. ఈ విష‌యాన్ని స్వ‌యంగా రాజ‌శేఖ‌ర్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. త‌న‌తో పాటు భార్య జీవిత‌, పిల్ల‌లు శివానీ, శివాత్మిక‌ల‌కు క‌రోనా సోకిన విష‌యం నిజ‌మేన‌ని, ప్ర‌స్తుతం ఆస్పత్రి‌లో చికిత్స పొందుతున్న‌ట్లు తెలిపారు. ‘పిల్లలిద్ద‌రూ పూర్తిగా కోలుకున్నారని.. జీవిత,‌ తాను మాత్రం ఇంకా వైద్యుల సంర‌క్ష‌ణ‌లోనే ఉన్న‌ట్లు వెల్ల‌డించారు.ప్ర‌స్తుతం మా ఇద్ద‌రి ఆరోగ్యం బాగానే ఉంది. త్వ‌ర‌లోనే ఇంటికి వెళ్తామంటూ’ ట్వీట్ చేశారు.

Shobha Naidu Passed Away: కూచిపూడి దిగ్గజ నృత్యకారిణి శోభా నాయుడు అనారోగ్యంతో కన్నుమూత, సంతాపం ప్రకటించిన తెలంగాణ మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల ముఖ్య మంత్రులు

Team Latestly

హైదరాబాద్‌లోని 40 ఏళ్ల ప్రస్థానం గల కూచిపుడి ఆర్ట్ అకాడమీకి శోభా నాయుడు ప్రిన్సిపాల్‌గా పనిచేశారు. దేశవిదేశాలకు చెందిన సుమారు 1,500 మందికి పైగా విద్యార్థులకు ఆమె శిక్షణ ఇచ్చారు. కూచిపూడిలో శోభా నాయుడు చేసిన సేవలకు గానూ 2001లో భారత ప్రభుత్వం ఆమెను...

Kapil Dev Biopic '83': క్రిస్టమస్‌కు కపిల్‌ దేవ్‌ బయోపిక్ మూవీ, అక్టోబర్ 15న ప్రధాని మోదీ బయోపిక్ విడుదల, రేసులో మరిన్ని సినిమాలు

Hazarath Reddy

ప్ర‌ధాని మోదీ జీవిత నేప‌థ్యంలో తెర‌కెక్కిన పీఎం న‌రేంద్ర‌మోదీ బ‌యోపిక్‌ని (PM Narendra Modi biopic) అక్టోబ‌ర్ 15న రిలీజ్ చేయ‌బోతున్న‌ట్టు ఇప్ప‌టికే ప్ర‌క‌టించ‌గా, తాజాగా మ‌రి కొన్ని సినిమాలు థియేట‌ర్ లో సంద‌డి చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్టు తెలుస్తోంది. ర‌ణ్‌వీర్ సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో క‌బీర్ సింగ్ తెర‌కెక్కించిన చిత్రం 83 (Kapil Dev Biopic '83) చిత్రాన్ని క్రిస్మ‌స్‌కు విడుద‌ల చేయాల‌ని భావిస్తున్న‌ట్టు స‌మాచారం.

Advertisement
Advertisement