సినిమా

Allu Arjun At Geetha Arts Office: జైలు నుంచి డైరెక్టుగా గీతా ఆర్ట్స్ ఆఫీసుకు అల్లు అర్జున్.. కార్యాలయానికి క్యూకట్టిన పలువురు సినీ ప్రముఖులు

Rudra

జైలు నుంచి విడుదలైన వెంటనే అల్లు అర్జున్ ఇంటికి వెళ్తారని అంతా భావించారు. అయితే, ఆయన ఎస్కార్ట్ వాహనంతో, భారీ భద్రత నడుమ గీతా ఆర్ట్స్ ఆఫీసుకు చేరుకున్నారు.

Allu Arjun Released: అల్లు అర్జున్@ ఖైదీ నంబర్ 7697.. జైలు అధికారులు డిన్నర్ ఆఫర్ చేసినా తీసుకోని పుష్పరాజ్..

Rudra

నిన్న రాత్రంతా చంచల్‌ గూడ జైలులో గడిపి కాసేపటి క్రితమే అల్లు అర్జున్ జైలు నుంచి విడుదల అయ్యారు. హైకోర్టు బెయిల్‌ పత్రాలు ఆన్‌ లైన్‌ లో అప్‌లోడ్‌ కాకపోవడం, ఇతర కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఆలస్యం జరగడంతో శుక్రవారం రాత్రంతా అల్లు అర్జున్‌ జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Allu Arjun Released: చంచల్‌ గూడ జైలు నుంచి ఎట్టకేలకు అల్లు అర్జున్ విడుదల.. మీడియా కంట పడకుండా భారీ ఎస్కార్ట్ మధ్య ప్రిజన్స్ అకాడమీ గేటు నుంచి పుష్పను పంపించిన చంచల్‌ గూడ జైలు అధికారులు (వీడియో)

Rudra

తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయంశమైన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్టు విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.

Bandi Sanjay Reaction on Allu Arjun Arrest: మీ చేత‌గాని త‌నాన్ని క‌ప్పిపుచ్చుకునేందుకు అల్లు అర్జున్ ను అరెస్ట్ చేస్తారా? నిప్పులు చెరిగిన బండి సంజ‌య్

VNS

అల్లు అర్జున్ న‌టించిన `పుష్ఫ-2`(Pushpa-2).. పాన్ ఇండియా సినిమా అని రాష్ట్ర ప్ర‌భుత్వంతోపాటు ప్ర‌పంచ‌మంతా తెలుసున‌ని కేంద్ర మంత్రి బండి సంజ‌య్ తెలిపారు. ఒక సినిమా ఓపెనింగ్ రోజు అగ్ర హీరోలంతా ఆర్టీసీ క్రాస్ రోడ్ కు రావడం 50 ఏళ్లుగా షరా మామూలే కదా అని గుర్తు చేశారు.

Advertisement

Ashwini Vaishnaw Reaction on Allu Arjun arrest: అల్లు అర్జున్ అరెస్ట్ ను త‌ప్పుబ‌ట్టిన రైల్వే మంత్రి అశ్విని వైష్ణ‌వ్, క్రియేటివ్ ఇండ‌స్ట్రీపై గౌర‌వం లేదా? అంటూ ప్ర‌శ్న‌

VNS

అల్లు అర్జున్‌ అరెస్టుపై కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ (Ashwini Vaishnaw) స్పందించారు. క్రియేటివ్‌ ఇండస్ట్రీపై కాంగ్రెస్‌కు గౌరవం లేదని మరోసారి రుజువైందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక యంత్రాంగం వైఫల్యంతోనే సంధ్య థియేటర్‌ వద్ద దుర్ఘటన చోటుచేసుకుందన్నారు.

Ram Gopal Varma Reacts On Allu Arjun Arrest: దేవుడ్ని అరెస్ట్ చేస్తారా? అల్లు అర్జున్ అరెస్ట్ పై రామ్ గోపాల్ వ‌ర్మ నాలుగు ప్ర‌శ్నలు

VNS

అల్లు అర్జున్‌పై నమోదైన కేసును కొట్టివేయాలని, సాధ్యంకాని పక్షంలో మధ్యంతర బెయిల్‌ మంజూరు (Bail For Allu Arjun) చేయాలని అల్లు అర్జున్‌ తరఫు న్యాయవాది హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ఆ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది.

CM Revanth Reddy on Allu Arjun Arrest: అల్లు అర్జున్ ఏమైనా ఇండియా పాకిస్తాన్ బార్డర్లో యుద్ధం చేశాడా, అల్లు అర్జున్ అరెస్ట్‌పై స్పందించిన రేవంత్ రెడ్డి, సినిమాలో డబ్బులు పెట్టాడు సంపాదించుకున్నాడని వెల్లడి

Hazarath Reddy

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్‌పై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో ఓ జాతీయ మీడియాతో సీఎం మాట్లాడుతూ.. ‘‘ఓ మహిళ చనిపోయింది. ఆమె కొడుకు ప్రాణాలతో పోరాడుతున్నాడు. ప్రాణం పోయినా కేసు పెట్టొద్దా?. ఘటనపై క్రిమినల్‌ కేసు నమోదైంది.

Rashmika Mandanna: అల్లు అర్జున్‌ అరెస్ట్‌తో గుండె పగిలింది...సంధ్యా థియేటర్ ఘటన దురదృష్టకరం కానీ ఈ ఘటనలో ఒకే వ్యక్తిని నిందించడం సరికాదన్న రష్మికా మందన్నా

Arun Charagonda

అల్లు అర్జున్ అరెస్టుపై నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఎక్స్ వేదికగా స్పందించింది. సంధ్యా థియేటర్ ఘటన దురదృష్టకరం అని...ఈ బాధాకర ఘటన అంశంలో కేవలం ఓ వ్యక్తిని నిందించడం కరెక్ట్ కాదు అని తెలిపింది. అల్లు అర్జున్ ను అరెస్ట్ చేశారంటే నమ్మలేకపోతున్నానని, గుండె పగిలే వార్త ఇదన్నారు.

Advertisement

Allu Arjun Arrest Row: అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసిన తెలంగాణ హైకోర్టు

Hazarath Reddy

అల్లు అర్జున్‌కు హైకోర్టులో కాస్త ఊరట లభించింది. సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన ఘటనలో నిందితుడిగా ఉన్న అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్టు చేశారు. చిక్కడపల్లి పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టి వేయాలని కోరుతూ బన్ని హైకోర్టులో క్వాష్‌ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఉన్నత న్యాయస్థానంలో విచారణ జరిగింది. వాదనలు విన్న హైకోర్టు అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది.

Allu Arjun Arrest Row: అల్లు అర్జున్ అరెస్టు అన్యాయం, ఖండించిన ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, ఈ తరహా కేసులు కోర్టులలో నిలబడ్డ దాఖలాలు లేవని వెల్లడి

Hazarath Reddy

అల్లు అర్జున్ అరెస్టు పై ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ అరెస్టు అన్యాయం, యాక్సిడెంట్‌కు ఒక వ్యక్తిని బాధ్యుడిని చేయడం సరికాదు.. ఈ తరహా కేసులలో ఇరికిస్తే మంచి మేసేజ్ పోదు, నా స్నేహితుడు రేవంత్ రెడ్డికి తెలిసి జరిగిందో, తెలియకుండా జరిగిందో తెలియదు.

Allu Arjun Arrest Row: అల్లు అర్జున్ కేసులో మరో ట్విస్ట్, కీలకంగా మారిన సంధ్య థియేటర్ యాజమాన్యం పర్మిషన్ లేఖ ఇదే..

Hazarath Reddy

సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో సినీ హీరో అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. బన్నీని ఆయన నివాసం నుంచి చిక్కడపల్లి పీఎస్ కు తరలించారు. పీఎస్ లో అల్లు అర్జున్ స్టేట్మెంట్ ను పోలీసులు రికార్డు చేశారు. తాజాగా నాపంల్లి కోర్లు 14 రోజుల జ్యుడిషయల్ రిమాండ్ విధించింది

Varun Dhawan On Allu Arjun Arrest: అల్లు అర్జున్ అరెస్ట్‌ను ఖండించిన బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్, జరిగిన సంఘటనకు ఒక్కరినే బాధ్యుడిని చేయడం సరికాదన్న ధావన్

Arun Charagonda

అల్లు అర్జున్ అరెస్ట్‌ను ఖండించారు బాలీవుడ్ న‌టుడు వ‌రుణ్ ధావ‌న్. అల్లు అర్జున్ అరెస్ట్ దురదృష్టకరం అని...నటుడు ఒక్కరే అన్ని విషయాలు చూసుకోలేరని అభిప్రాయపడ్డారు. జరిగిన ఘటన చాలా దురదృష్టకరని చెప్పారు. కానీ ఈ ఘటనకు ఒక్కళ్లనే బాధ్యులను చేయటం సరికాదన్నారు.

Advertisement

Mohan Babu: హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు, ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను కొట్టేసిన న్యాయస్థానం...మోహన్ బాబు అరెస్టుకు పోలీసులు రంగం సిద్ధం?

Arun Charagonda

హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కదురు అయింది. జర్నలిస్ట్ రంజిత్ పై దాడి కేసులో మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేసింది కోర్టు. దీంతో మోహన్ బాబు అరెస్టుకు పోలీసులు రంగం సిద్ధం? చేశారని ప్రచారం జరుగుతోంది. మోహన్ బాబు అరెస్ట్‌ పై ప్రభుత్వంపై జర్నలిస్టులు ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం.

Allu Arjun Arrest Row: అల్లు అర్జున్ కేసులో కీలక మలుపు, కేసు విత్ డ్రా చేసుకుంటానని తెలిపిన మృతురాలు రేవతి భర్త, అల్లు అర్జున్ తప్పు ఏమీ లేదని వెల్లడి

Hazarath Reddy

అల్లు అర్జున్‌పై నమోదైన కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. సంధ్య థియేటర్ ఘటనలో చనిపోయిన రేవతి భర్త భాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ కేసును విత్ డ్రా చేసుకుంటానని తెలిపాడు. అల్లు అర్జున్ ను విడుదల చేయాలని కోరాడు. థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటనతో అల్లు అర్జున్‌కు సంబంధం లేదని పేర్కొన్నాడు

Allu Arjun Remand: అల్లు అర్జున్‌కు షాక్, 14 రోజుల రిమాండ్ విధించిన న్యాయస్థానం, చంచల్‌గూడ జైలుకు తరలించనున్న పోలీసులు

Arun Charagonda

హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌ సంధ్య థియేటర్‌లో జరిగిన ఘటనపై అల్లు అర్జున్‌పై నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ఇక నాంపల్లి కోర్టు బన్నీకి 14 రోజుల రిమాండ్ విధించింది. బన్నీని చంచల్‌గూడ జైలుకు తరలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది . 105, 118(1), రెడ్‌ విత్‌ 3/5 BNS సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. BNS 118(1) కింద ఏడాది నుంచి పదేళ్ల శిక్ష పడే అవకాశం ఉంది.

Allu Arjun With Allu Aravind: నన్ను సన్మాన సభకు తీసుకెళ్లడం లేదు..అరెస్ట్ చేశారు, అల్లు అరవింద్‌తో బన్నీ మాటలు వైరల్..వీడియో ఇదిగో

Arun Charagonda

హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌ సంధ్య థియేటర్‌లో జరిగిన ఘటనపై అల్లు అర్జున్‌పై నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ఇవాళ బన్నీని అరెస్ట్ చేయగా అరెస్ట్ చేసే ముందు అల్లు అరవింద్‌తో మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తనని సన్మాన సభకు తీసుకెళ్లడం లేదు.. అరెస్ట్ చేశారని చెప్పారు బన్నీ.

Advertisement

Allu Arjun Arrest: అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్‌పై విచారణకు కోర్టు గ్రీన్ సిగ్నల్, సాయంత్రం నాలుగు గంటలకు విచారణ, ప్రభుత్వ తరపు లాయర్ వాదనలే కీలకం కానున్నాయా..

Hazarath Reddy

అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్, అరెస్టు నుంచి రక్షణ పిటిషన్ పై విచారణ సాయంత్రం నాలుగు గంటలకు వాయిదా వేసింది హైకోర్టు. ప్రభుత్వ తరపు లాయర్ వాదనలే కీలకం అవుతాయని భావిస్తున్నారు.

Allu Arjun Arrest: చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు అల్లు అర్జున్ మామ, మరీ ఇలా బెడ్ రూం లోకి వచ్చి అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదని బన్ని మండిపాటు, వీడియోలు ఇవిగో..

Hazarath Reddy

చిరంజీవిని పోలీస్ స్టేషన్‌కు రావొద్దని పోలీసులు అభ్యర్థించారు. ప్రస్తుతం పోలీస్ స్టేషన్ వద్దకు నిర్మాత దిల్ రాజు చేరుకున్నారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి చేరుకున్నారు.

Allu Arjun Emotional: అరెస్ట్ సందర్భంగా అల్లు అర్జున్ ఎమోషనల్, భార్య స్నేహకు ధైర్యం చెప్పి పోలీస్ వాహనం ఎక్కిన బన్నీ...వీడియో ఇదిగో

Arun Charagonda

హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఎమోషనల్ అయ్యారు బన్నీ. తన భార్య స్నేహకు ధైర్యం చెప్పారు. భయపడకు.. నాకు ఏమీ కాదు. అరెస్ట్‌కు ముందు తన భార్య స్నేహతో మాట్లాడారు అల్లు అర్జున్. చివరిలో తన భార్యకు ముద్దు ఇచ్చి పోలీసు వాహనం ఎక్కారు.

Allu Arjun Arrest: చిరంజీవిని పోలీస్ స్టేషన్‌కు రావొద్దని కోరిన పోలీసులు, పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్న నిర్మాత దిల్ రాజు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

Advertisement
Advertisement