Chiranjeevi Birthday: అన్నకు ప్రేమతో జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్, చిరంజీవి నాకే కాదు ఎంద‌రికో మార్గ‌ద‌ర్శి అంటూ లేఖలో జనసేన అధినేత స్పష్టం

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి బ‌ర్త్ డే (Chiranjeevi Birthday) సంద‌ర్భంగా సోష‌ల్ మీడియాలో శుభాకాంక్ష‌లు వెల్లువెత్తుతున్నాయి.అభిమానులు, కుటుంబ స‌భ్యులు, సెల‌బ్రిటీలు, శ్రేయోభిలాషులు చిరు బ‌ర్త్ డే సంద‌ర్భంగా శుభాకాంక్ష‌లు పంపుతున్నారు.

Megastar Chiranjeevi | Sye Raa Narasimha Reddy | Lucifer Remake | Photo - Twitter

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి బ‌ర్త్ డే (Chiranjeevi Birthday) సంద‌ర్భంగా సోష‌ల్ మీడియాలో శుభాకాంక్ష‌లు వెల్లువెత్తుతున్నాయి.అభిమానులు, కుటుంబ స‌భ్యులు, సెల‌బ్రిటీలు, శ్రేయోభిలాషులు చిరు బ‌ర్త్ డే సంద‌ర్భంగా శుభాకాంక్ష‌లు పంపుతున్నారు. ఇక అన్న‌య్య‌ని ఎంతో ప్రాణంగా ప్రేమించే ప‌వ‌న్ క‌ళ్యాణ్ (Pawan Kalyan) సుదీర్ఘ‌ పోస్ట్ ద్వారా అన్న‌య్య‌పై త‌న‌కున్న ప్రేమని తెలియ‌జేస్తూ బ‌ర్త్ డే శుభాకాంక్ష‌లు (Happy Birthday Chiranjeevi) తెలియ‌జేశాడు.

చిరంజీవి నాకే కాదు ఎంద‌రికో మార్గ‌ద‌ర్శి, ఎంద‌రికో స్పూర్తి ప్ర‌దాత‌, ఎంద‌రికో ఆద‌ర్శ‌ప్రాయుడు. చిరంజీవి గురించి ఎన్ని చెప్పినా కొన్ని మిగిలే ఉంటాయి. త‌మ్ముడిగా పుట్ట‌డం నా అదృష్ట‌మైతే, ఆయ‌న సుగుణాల‌ను చూస్తూ పెర‌గ‌డం మ‌రో అదృష్టం. అన్న‌య్య‌ను ఆరాధించే ల‌క్ష‌లాది మంది అభిమానుల‌లో నేను ఒక‌డిని. ఆయ‌న అస‌మాన్యుడిగా ఎదిగిన సామాన్యుడు.ఎంత ఎదిగిన ఒదిగి ఉండ‌డం ఆయ‌న‌లోని అద్భుత ల‌క్ష‌ణం.

సార్ పడుకునే ముందు ప్రతిరోజూ దిష్టి తీయడం మర్చిపోకండి, బర్త్ డే బ్లాస్టర్ పేరుతో సర్కారువారి పాట టీజర్ విడుదల, ఇఫ్ టైగర్ టేక్స్ రాబిట్ అనే డైలాగ్‌తో మహేష్ ఎంట్రీ

భార‌త సినీ య‌వ‌నిక‌పై త‌న‌కంటూ ప్ర‌త్యేక స్థానం సంపాదించుకున్న చిరు… ఎన్ని అవార్డులు వచ్చినా, చ‌ట్ట స‌భ స‌భ్యునిగా, కేంద్ర‌మంత్రిగా ప‌ద‌వులు అలంక‌రించినా త‌ల ఎగ‌రేయ‌లేదు. రికార్డులు ఎన్ని సృష్టించిన అదే విధేయ‌త‌, అదే విన‌మ్ర‌త‌. అందుకే అంద‌రు ఆయ‌న‌ను సొంత మ‌నిషిలా భావిస్తుంటారు. దానాలు, గుప్త దానాలు ఎన్నో చేసిన ఆయ‌న క‌రోనాతో ప‌నులు లేని వారి కోసం ఎంతో త‌ప‌న ప‌డ్డారు.

Here's Pawan Kalyan Letter

చిరంజీవి మా కుటుంబంలో అన్న‌గా పుట్టి మ‌మ్మ‌ల్ని తండ్రిలా సాకారు. తండ్రి స్థానంలో నిలిచారు. ఆ ప్రేమ మూర్తి పుట్టిన రోజు సంద‌ర్భంగా ప్రేమ పూర్వ‌క జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు. చిరంజీవికి ఆయురాగ్యాల‌తో కూడిన దీర్ఘాయిష్షు ప్ర‌సాదించాల‌ని చిరాయివుతో చిరంజీవిగా బాసిల్లాల‌ని భ‌గ‌వంతుణ్ణి ప్రార్ధిస్తున్నాను అంటూ జనసేన పార్టీ పేరుతో రాసిన లేఖలో ప‌వ‌న్ స్ప‌ష్టం చేశారు.